Blogger Widgets

Friday, September 12, 2008

ఆయన్ని ఎందుకు వెతకటం?

Friday, September 12, 2008

రామ్ ఒక పెద్ద ధనవంతుడు .రామ్ కొంత కాలం తీర్ధ యాత్ర చేద్దామని అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగు తున్నాడు. ఒక చోట ఒక మనిషి పరిచయం అయ్యాడు. ఆతను దొంగతనాలు చేస్తూ బతుకుతున్నాడు. ఆరోజు రామ్ తో ఫ్రెండ్షిప్ చేసి రామ్ ను నమ్మించడానికి ప్రయత్నిచాడు . ఇద్దరూ కలసి ఒక చోట బసచేశారు. రామ్ నిద్రపోతున్నపుడు అతని వస్తువులు అన్ని వెతికాడు. ఏమిదొరకలేదు. విసిగిపోయి ఆమనిషి నిద్రపోయాడు. మార్నింగ్ లేచిన వెంటనే రామ్ తో ఇక్కడ దొంగతెనాలు ఎక్కువ మీ డబ్బూ, దస్కమ్ ఎక్కడైనా జాగ్రత్తగా వుంచారా అని అడిగాడు.
రామ్ చిన్ననవ్వు నవ్వి "నాకు ఆ సంగతి తెలుసు". అన్దుకే నీ దిండు గలేబు లో నా సొమ్ము దాచిపెట్టాను.
అని ఆ సొమ్ము మొత్తాన్ని చూపించాడు రామ్. దొంగ ఫస్ట్ ఆశ్చర్య పోయాడు తరువాత ఏడుపుతో కలిసిన నవ్వు నవ్వాడు. దొంగ మెల్లిగా తప్పుకొని వెళ్ళిపోయాడు .
భగవంతుడు ఆత్మ రూపంలో మనలోనే వున్నా మనం ఆయన్ని వెతుకుతాము.
ఆయన్ని ఎందుకు వెతకడం ????????????????????.

1 comment:

  1. వైష్ణవి నువ్వు చెప్పిన కధ చాలా బాగుంది. నీ కధలో నీతి చాలా నచ్చింది. భగవంతుడు మన లో నే అత్మ లొనే ఉన్నాడు. బాగుంది తల్లి.

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers