Blogger Widgets

Wednesday, December 10, 2008

మాసానాం మార్గశీర్షం - లక్ష్మీ హృదయకమలం ముగ్గు

Wednesday, December 10, 2008

మార్గ శిర మాసం వైష్ణవ మాసం అని కుడా అంటారు. "మాసానాం మార్గశీర్షోహం " అని మాసాలలో మార్గశీర్షమాసాన్ని నేనే అని భగవగీత లో శ్రీ క్రిష్ణులవారు అర్జునితో విభూతి యోగములో వివరించారు. అంటే అన్ని మాసాలలోని మార్గశిర మాసం లో శ్రీ కృష్ణ పరమాత్మ ఒక వ్రుక్షచాయ. ఇది గ్రీష్మత్ప్తులకు చల్లగాను, శీతపీడితులకు వెచ్చగాను ఉంటుంది. అలాగే విష్ణు స్వరుపమగు మార్గశీర్ష మాసంకుడా, అతిశీతలం కాక అతి వేడి కాకుండా సమ శీతోష్ణముగా ఉంటుంది. సంవత్సరంను ఒకరోజుగా భావిచినచో మార్గశిరమాసాన్నిబ్రహ్మ ముహార్థముగా చెప్పుకొనవచ్చు.
అనగా తెల్లవారుజాము చాలామంచిదని తెలుసు . మార్గ శిరం సత్వ గుణము ను పెంచి భగవదనుభుతిని కలుగ చేస్తుంది.
లోకమంతా పైరులతో పచ్చగా వెలయు కాలం మార్గశిర్షం . మార్గశిర్శమో ! క్షేత్రములో సస్యములు పంది భారంతో వంగి మనోహరంగా ఉంటుంది.
అల్లా వున్నప్పుడు ప్రజలు సంతోషముగా వుందురు. ఈ నెల ప్రారంభం నుండిఇళ్ళల్లొ ఆడవారు మార్గశిర లక్ష్మి వారపూజలు ప్రత్యెకంగా లక్ష్మివారం రోజు చేయటం ప్రారంభించి పుష్యమాసం మొధటి లక్ష్మి వారం వరకు చాలానియమ నిస్టలతో పూజలు చేస్తారు. ఆ రోజు లక్ష్మేహ్రుదయకమలం ముగ్గు పెట్టి లక్ష్మి ని ఆహ్వానించి పూజచెస్తారు. ఈమెని కనక మహాలక్ష్మి గా కొలుస్తారు .
చంద్ర మానాన్ని బట్టి మార్గశిరమని , సూర్య మానాన్ని బట్టి ధనుర్మాసమని ఏర్పడ్డయి . ఈ రెండూ ఒకటె.
ఈ మాసంలొ తెల్లవారుజామున లెచి మార్గశిర స్నానాలు చేసి తమలో వున్న ఙ్ నాన్ని మెలుకొల్పుదురు. ఆద్యాతంక చింతన కలిగి వుంధురు .
ఇక మార్గశిర మాసంలొ ఒక రహస్యమున్నది. మార్గముని నిర్ధెశించునధి. అని అర్ధము. భగవానుని పొంధు దారి అన్న మాట.
ధనుర్మాసంలొ గోధాదేవిని శ్రీ కౄషులను పూజించుధురు .ఆ అమ్మవారు పాడిన 30 పాశురాల తిరుప్పావై ని ఈ నెల పాడుధురు . దీనిని ధనుర్మాస వ్రతముగా కన్నెపిల్లలు చెయుధురు. తమకి మంచి జరుగునని భావించి ఆధ్యత్మికద్రుక్పధముతొ మెలగుధురు. . ఈ నెలరోజులూ వైష్ణవ ఆలయాలు చాలా వినసొంపుగా లయబద్ధముగా తిరుప్పవై చధువుతారు. ఆలయాలన్నీ ఆద్యాత్మికంగా వుంటాయి . సాయంకాల సమయంలొ విష్ణుసహస్ర పారాయణములతొ నెలరోజులూ సంధడిగా గడుపుధురు.
ఈ వ్రతాలు గురించి మిగతావి మరొసారి చెప్పుకుంధాము సరేన మరి.

2 comments:

  1. ఆంధ్రప్రదేశ్ లో మార్గశిరమాసం ప్ర్రారంభమయిన దాదాపు పదిహేను రోజుల తర్వాత తమిళనాడులో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం డిసెంబర్ నెల 16 వతేదీన ధనుర్మాసం ప్రారంభమవుతుంది.

    ReplyDelete
  2. ధనుర్మాసం మొదలు కాబోతోంది. నేను ఆవ్రతము చేస్తాను. నేను తిరుప్పావై నేర్చుకుంటున్నాను కూడా. అది తమిళములో నే వుంది . నాకు పూర్తిగా వచ్చిన తరువాత నా బ్లాగుద్వారా అందరికీ అందిచాలని ఉంధి. అంతా శ్రీ కౄష్ణుని కౄపతో జరగాలని అశిస్తున్నానుమరి.

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers