Blogger Widgets

Sunday, January 25, 2009

నాద బ్రహ్మ త్యాగరాజు

Sunday, January 25, 2009

త్యాగరాజు కర్ణాటకా సంగీత అపర నాద బ్రహ్మ . ఈయనకి త్యాగ బ్రహ్మ అని అందరు అంటారు. పాటలు పాడి భగవంతుని పొందవచ్చని నిరూపించి గొప్ప వాగ్గేయకారుడు. ఈ త్యాగరాజ స్వామీ.
తమిళనాడులోని అగ్రహారము అనే గ్రామములో వైదిక తెలుగు బ్రాహ్మణ కుటుంబములో కాకర్ల వంశమున జన్మించినాడు. కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మల పుణ్యఫలముగా జన్మిచినాడు. త్యాగరాజుకు పద్దేమిది సంవత్సరములకు పార్వతి అను యువతితో వివాహమైనది కొన్ని రోజులకు ఆమె మరణించింది. తరువాత ఆమె చెల్లెలు కమలాబను వివాహముచేసుకొని ఒక పుత్రికను కలిగినారు.
ఈయన గొప్ప రామ భక్తుడు రామునిమీద చాలా పాటలు ఆయన రాసిన పాటలు దాదాపు 800 వరకు రాచి ఉంటారని అంచనా .దాదాపు తెలుగులోని రచనలు సాగాయి. కొన్ని సంస్క్రుతములోను వున్నాయి.
త్యాగరాజు సంస్కృతములో రాసిన జగదానందకారక అనే కీర్తనలో రాముని 108 పేరులు చెప్పారు. ఆయన చాలామంచి కీర్తనలు ప్రజల గుండెల్లో నిలచిపోయి ఉండేటట్లు రచించినారు. ఆయన పాటలలో రాగ, తాళ, శ్రుతి, మొదలగున్నవి వుండేటట్లు చూచుకొని ఒక ఇక సెలవా ప్రకారము శ్రీ రాముని కీర్తిమ్చుతూ రచనలు చేసారు. కీర్తించుతూ పాటల రచనలు చేసారు . ఈయన పాటలలో విశేషముగా పంచరత్నాలు రచించినవి చాలా ప్రజారంజకముగా వుంటాయి.
మనము కొన్ని పాటలు చూద్దాము.
ఘనరాగ పంచరత్నములు లో పేరు తెచ్చుకున్నవి
1) జగదానంద కారక! జయ జానకీ ప్రాణ నాయక!
గగనాధిప! సత్కులజ ! రాజరాజేశ్వర!
సుగుణాకర! సుజన (సేవ్య)
సేవ్య! భవ్య దాయక! సదా సకల 11 జగదానంద 11
ఇంకొ పాట :
దుడుకు గల నన్నే దొర
కొడుకు బ్రోచురా? ఎంతో
కడు దుర్విషయాకృష్ణూండై
మరొకటి
సాధించేనే మనసా!
భోధించిన సన్మార్గ వచనముల
బొంకు జేసి తా బట్టినపట్టు
సమయానికి తగు మాటలాడెనె
ఇంకొటేమో
కన కన రుచిరా కనకవసన !నిన్ను
దిన దినమును మనసున చనువున నిన్ను
పాలుగారు మోమున శ్రీయపార
మహిమ దనరు నున్ను
ఎంతో పేరు గల పాట
ఎందరో మహానుభావులు - లందరికి వందనము 11 ఎం11
దందురు వర్ణుని యంద-చందమును హృదయార
విందమున జూచి బ్రహ్మానంద మనౌభవించులెవా 11ఎం11
ఇంకొకటి
నను పాలింప నడచి వచ్చితిఓ? నా ప్రాణనాధ 11 నను11
వనజనయన మోమునుజూచుట జీవనమనినెనరున మనసుమర్మము దెలిసి 11నను11
సురపతి నీలమణినిభతనువుతో నురమున ముత్యపు
సరులచయముతో కరమున శర కోదండ కాంతితో ధరణి
తనయుతో, త్యాగరార్చిత ! 11నను11
మరొకటి
నగుమోము గనలేని నా జాలి దెలిసి ,, సామజ వరగమన ,, మరుగేలరా,, పట్టి విడువరాదు , వివిధ తత్వాలు వంటివి ఎన్నొ రచించి కీర్తిచినారు త్యాగరాజులవారు. ఇలా చెప్పుకు పోతే చాల్లా వున్నాయి.
ఈయన భారతదెశమంతా ప్రాయణించి అన్ని ప్రదేశాలవారికి రాముని గుణ కీర్థించి చివరికి స్రీ రామునిలో లీనమైనారు.
మనవారు త్యాగరాజు కీర్తనలును గుర్తించి . త్యాగరాజ అరాధనోత్సవాలు జరుపుతున్నారు.
pokpokpokpokbabaibabaibabai

3 comments:

 1. చక్కటి విషయాలు చెప్పారు. చిన్నప్పటినుంచి తమిళ నాడులో ఉన్న తమిళ ప్రభావం లేకుండా పాటలు రాయడమే కాక తమిళులందరూ తన పాటలు నేర్చుకునేలా ప్రభావితం చేయగలిగిన శ్రీమాన్ త్యాగరాజు గారి గొప్పదనం-
  ఏమని పొగడుదు నే..

  ReplyDelete
 2. ఈమాట జాలపత్రికలో త్యాగరాజస్వామి జీవిత విశేషాల గురించిన వ్యాస పరంపర ప్రచురిస్తున్నారు. ఇప్పటిదాకా ప్రచురించిన మూడు భాగాలు ఇవిగో
  మొదటి భాగం
  రెండవ భాగం
  మూడవ భాగం

  ReplyDelete
 3. మాలతీ మాధవం గారు , కొత్తపాళీగార్లకు నా ధన్య వాదములు. మీ వల్ల నాకు తెలియని కొత్త విషయాలు తెలిసాయి . జాల పత్రికలో త్యాగరాజ స్వామివారి గురించి చదువుతుంటే నా ఒళ్ళు గగుర్పొడుస్తోంది. నిజంగ . త్యాగ రాజు గారిని పొగిడే అర్హత మాకు లేదు. మీకు నా ప్రత్యేక ధన్యవాదములు.

  ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers