Blogger Widgets

Thursday, February 26, 2009

భగవంతుడు -సర్వవ్యాపకత్వము

Thursday, February 26, 2009

కధ చెబుతాను ఉ కొడతారా.
అనగనగా ...................................
ఉద్దాలక మహర్షి కుమారుడు శ్వేతకేతు .
ఒక రోజు కుమారుడుని ఇలా ప్రశ్నించాడు తండ్రి.
కుమారా! నీవిన్ని రోజులు పరతత్వము బ్రహ్మము . అను విషయములను గురించి అధ్యయనం చేసావు కదా.
ఈ భగవంతుడు అసలు ఎక్కడున్నాడు ? అని అడిగాడు.
వారిద్దరూ ఇలా సంభాషించు కుంటున్నారు.
శ్వేతకేతు: భగవంతుడు సర్వాంతర్యామి అని మా గురువుగారు చెప్పారు.
ఉద్దాలకుడు: కుమారా !సర్వవ్యాపకము అంటే ఏమిటి ?
శ్వేతకేతు: తెలియదు నాన్నగారు.
ఉద్దాలకుడు: కుమారా! నీవు లోపలికి వెళ్లి ఒక పాత్రలో నీరు. కొంచెం ఉప్పు తీసుకుని రా.
(శ్వేతకేతు తండ్రి చెప్పినట్లే చేసాడు)
ఉద్దాలకుడు: కుమారా! ఉప్పును ఆ నీటిలో బాగా కలుపు నోట్లో వేసుకొని చూడు.
(శ్వేతకేతు అలానే చేసాడు)
శ్వేతకేతు: ఉప్పగా వుంది నాన్నగారు.
ఉద్దాలకుడు: పాత్రలో చెయ్యి పెట్టి ఉప్పు ను బయటికి తీయ్యి.
(శ్వేతకేతు నీటిలో చెయ్యి పెట్టి చూసాడు)
శ్వేతకేతు: నీటి లో ఉప్పు కరిగి పోయింది .ఉప్పుగా చిక్కదు .
ఉద్దాలకుడు: నీ కేలా తెలిసింది?
శ్వేతకేతు : పాత్రలోని నీరు ఉప్పగా ఉంది కదా.
ఉద్దాలకుడు: మంచిది. నీవు అనుభవపూర్వకంగా ఉప్పు నీటిలో కలసి పోయిమ్దని తెలుసుకున్నావు. అదేవిధముగా భగవంతుడు ఈ సృష్టిలో లీనమైనాడు.
ఆ సత్యాన్ని అనుభవ పూర్వకంగానే తెలుసుకోవాలి .
ఇదండి కధ. దీనిని మా స్కూల్ ఫంక్షన్ లో డ్రామా కింద వేస్తున్నాము. ఎలావుంది.

Wednesday, February 25, 2009

NATURE'S BEAUTY

Wednesday, February 25, 2009


ఎంత అందమైన ప్రకృతి అనిపిస్తోందా . కంప్యూటర్లో నేనే వేసాను బాగుందా. బాగుంటే బాగుంది అని చెప్పండి. లేకపోతె ఎక్కడ ఎక్కడ ఎలా వుంటే బాగుంటుందో చెప్పండీ . thank u bye .

Saturday, February 21, 2009

सीखो

Saturday, February 21, 2009

सुनो एक बात मेरी
सीखो तुम सब्से बातों बली 1
तीन ब़दर रखे था बापू ने
अप्नी अल्मरी 1
एक था मुँह बम्द किए
सीख देता में " बूरा बोलो " 1
दूसरा था कान ब़ किए
सीख देता ह़मे " बूरा सुनो 1
तीसरा था आँख बंद कीए
सीख देता हमे बुरा ने देखो 1
बापू ने सिखलाई थे बातें
सदा सुखदायी थे तीन उप्देश 1
सुनो , संजे थे तीन उपदेश
अमल मेँ लाओ अपने जीवन में 11

Thursday, February 19, 2009

లక్ష్య నిర్దేశనం :

Thursday, February 19, 2009

లక్ష్యనిర్దేనం :
సుర్యోదయాన్నే పక్షులు రెక్కలు విచ్చుకొని ఆహార సంపాదనకు ఎగిరిపోతాయి. అది వాటి లక్ష్యము . ప్రపంచము ఏమైనా వాటికి అనవసరము. సూర్యుడు సాయంత్రానికి పడమటి దిక్కుకు వాలినా మర్నాటికి పొద్దున్నే తూర్పునకు ఉదయిస్తాడు . లోకానికి వెలుగును ప్రసాదిస్తాడు. అది ఆయన లక్ష్యం. కారు మబ్బులు కమ్మినా, తుపానులే వచ్చినా తన మార్గమునుంచి పక్కకు తప్పుకోడు. మనమూ అలాగనే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. గడిచిన కాలం ఎలా ఉన్నా ముందు ముందున్న అత్యన్నత స్తాయికి చేరాలన్న లక్ష్యాన్ని నిర్దేసించుకోవాలి. లక్ష్యం లేని జీవితం గాలిలో పెట్టిన దీపంలాంటిది. అత్యున్నత స్తాయికి చేరాలన్న కోరిక వున్నంత మాత్రానా కోరిక నెరవేరదు. దానికి తగ్గ కృషి పట్టుదల ఉండాలి. దానికి తగ్గ లక్ష్య్ నిర్దేశం వుండాలి. లక్ష్య నిర్దేశం లేక పొతే జీవితములో ఏమి సాదించలేము.
ఇదంతా మా అమ్మమ్మ నాకు చెప్పింది. నేను డాక్టర్ కావాలన్న లక్ష్యం ఏర్పరచుకున్నాను . ఆ లక్ష్యానికి నాకు ఎన్ని అడ్డంకులు వచ్చినా అవ్వాలని అనుకుంటున్నాను. నేను ఆ దిశ గానే ప్రయత్నిస్తాను.
thanks to అమ్మమ్మ.

Tuesday, February 17, 2009

పిల్లి కూన

Tuesday, February 17, 2009

senyumఇప్పుడే పుట్టింది ఈ పిల్లి కూన . బలేగా వుంది . నేనైతే దీనిని చూసి బలే బలేmenari ఆడు కున్నాను . మీరు చూడండి ఇది నడవటం లేదు . కళ్లు తెరవలేదు. లేవటానికి ట్రై చేసి జారి పోతోంది .
tepuktangantepuktangantepuktangantepuktangantepuktangantepuktangan బలే బలే బాగుంది చిన్నపిల్లి పిల్ల .rosrosros

Sunday, February 15, 2009

Hai Happy friendship week

Sunday, February 15, 2009


minum Hai అందరికి నా హృదయ పూర్వక ఈ friendship week శుభాకాంక్షలు .rosrosros

Friday, February 13, 2009

పొడుపు కధలు విప్పండి

Friday, February 13, 2009

నేను పొడుపు కధలు అడుగుతాను విప్పుతారా ఇదిగో మరి కాచుకోండి .
1)అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు, కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు, అన్నీరెండే కాయలు ఏమిటది ?

2)అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది . మా ఇంటికొచ్చింది . మాహాలక్ష్మిలాగుంది. ఏంటదీ?

౩)అగ్గి అగ్గీ ఛాయా, అమ్మకుంకుమచాయ, బొగ్గు బొగ్గు చాయా, పోలిచాయ కందిపప్పు ఛాయా ,కాలనేమి ఛాయా, కడసారి తాతయ్య కణితి చాయా ఏమిటది .

4) పిఠాపురం చిన్నవాడా, పిట్టల వేటగాడా, బ్రతికిన పిట్టను కొట్టవద్దురా, చచ్చినపిట్టను తేవద్దురా కూరను లేకుండా రాను వద్దురా ఏమికూర చెప్పండి.

5)పచ్చని పెట్టెలో విచ్చుకోనుంది , తెచ్చుకోపోతెను గుచ్చుకుంటుంది ఏమిటది?

తెలిస్తే తొందర గా చెప్పేయండి మరి .

Tuesday, February 10, 2009

మీరు చెప్పండి ........ ఎన్ని SQUARES?

Tuesday, February 10, 2009

అందరికి హాయ్ !
నన్ను సత్య ప్రసాద్ అరిపిరా అంకుల్ అడిగారు .
ఒక ఛెస్ బోర్డు లో ఎన్ని SQUARES ఉంటాయని. మీరు చెప్పండి .......ఎన్ని SQUARES ఉంటాయి.
తెలిసీ చెప్పక పోయారో తల ......................
కాబట్టి చెప్పేయండి. నాకైతే తెలీదు మరి అందుకే చెప్పండి ఓకేనా.
తొందరగా చెప్పండి . I am waiting.

Monday, February 09, 2009

COUNT THE SQUARES

Monday, February 09, 2009


Taka a good look at the figure:  How many square are there in this figure?

Sunday, February 08, 2009

హితోక్తులు నాకు వచ్చాయి .

Sunday, February 08, 2009

హలో ! నిన్న మా తాత నాకు కొన్ని హితోక్తులు చెప్పారు. ఇవి జీవికాలం పనికి వస్తాయని నాకు నేర్పించారు. అవి ఇవే .
చిన్న చిన్న పనులు సక్రమంగా చేయగలిగితే పెద్ద పెద్ద పనులు సమర్దవంతముగా చేయగలము .
నీ మాటలను నువ్వు గౌరవించు కుంటే ప్రపంచము నీ మాటలను గౌరవించుతుంది.
ఒక అబద్ధము కప్పిపుచ్చుకుంటే వంద అబద్ధాలు ఆడాలి, అందుకే అసలు అబద్ధము ఆడకూడదు.
శరీరములో రక్తము ప్రవహిస్తున్నట్లే సమాజంలో ధనం ప్రవహించాలి దానం . ధనము ఏ ఒక్కరి వద్ద పెద్ద మొత్తములో నిలువ ఉన్నా , అది దేశాభివృద్ధి కి తోడ్పడదు.
శరీరంలో రక్తం కొన్ని చోట్ల ఆగితే శరీరానికే ప్రమాదం. ధనం సమాజంలో కొద్ది మంది దగ్గరే దాగితే అది సమాజానికే ముప్పు దేశానికే ప్రమాదము.
కృషితో నాస్తి దుర్భిక్షం .( కృషి వల్ల దుర్భిక్షం ఉండదు.)
సర్వేజనా సుఖినో భవంతు ! (అందరు సుఖముగా ఉందురు గాక.)
యతో ధర్మస్తతో జయం . ( ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం వుంటుంది.)
సత్యం వద ! ధర్మం చర! ( సత్యం పలకండి - ధర్మం ఆచరించండి )

babaiమరి నేను వుంటాను bye .babai

Thursday, February 05, 2009

మహాత్ముల సూక్తి రత్నావళి

Thursday, February 05, 2009

హాయ్ అందరు బాగున్నారా. చాలా రోజులయింది కదండి .అందుకే అడుగుతున్నాను .pokpok
సరే ఈ రోజు కొందరు మహాత్ములు సూక్తులు తెలుసుకుమ్దామంది. ఒకే
తల్లిదండ్రులు తమ సంతానానికి అందించిన దానికి ప్రతిఫలము యి సృష్టిలో లేనే లేదు . అని వాల్మీకి అన్నారు.
మనుషుల్లో గొడవలు రాటానికి ఐదు కారణాలు ఉంటాయి. స్త్రీలు, ఆస్తిపాస్తులు, కటోరమైన వాక్కులు, కులమత ద్వేషాలు, ఎప్పుడో తెలిసో తెలియకో చేసిన అపరాధాలు . అని మహా భారతం లో వ్యాసులు వారు అన్నారు.
మంచి మనషుల మనసు వెన్నలా వుంటుంది .అని తులసి దాసు అన్నారు.
ఈరోజుకి ఇవి చాలు మరో రోజు కొన్ని.
bye

My Blog Lovers