Blogger Widgets

Thursday, August 13, 2009

స్వైన్ ఫ్లూ నివారణ మార్గాలు

Thursday, August 13, 2009

స్వైన్ ఫ్లూ నివారణ మార్గాలు :- ఒక సెకను పాటు లవంగ నూనె (క్లోవ్ ఆయిల్)ను పీల్చాలి- రోజుకు ఒక లవంగమొగ్గనైనా నమలాలి- ఒకటి నుంచి ఐదు గ్రాముల పచ్చి వెల్లుల్లి రేకలు, లేదా ఉల్లిగడ్డ, అల్లం ముక్కను తినాలి- రెండు గ్రాముల పసుపును వేడి పాలలో కలుపుకొని సేవించాలి- నిమ్మ లాంటి సి విటమిన్ ఎక్కువగా ఉండే పళ్ళను ఎక్కువగా తీసుకోవాలి- నీలగిరి (యుకలిప్టస్) ఆయిల్ చుక్కలను చేతిరుమాళ్ళపైన, మాస్క్ లపైన వేసుకొని వాసన చూస్తూ ఉంటే స్వైన్ ఫ్లూ సోకే ప్రమాదం తక్కువ అవుతుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ ఐవి) సూచించింది- మనలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు తులసి, విటమిన్ సి ఉన్న పదార్థాలు వినియోగిస్తే చాలన్నది ఇప్పటి వరకూ ఉన్న విశ్వాసం. అయితే, నిమ్మకాయ, రాతి ఉసిరికాయ (ఇండియన్ గూస్ బెరి) పొడిని వేడినీటిలో కలుపుకొని సేవిస్తే మరింత సమర్థంగా పనిచేస్తుంది.- తులసి ఆకుకు స్వైన్ ఫ్లూ నుంచి మనలను రక్షించే గుణం ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రాణాంతక స్వైన్ ఫ్లూ మనల్ని సోకకుండా తులసి కాపాడడమే కాకుండా వ్యాధి సోకిన వారిని త్వరగా కోలుకొనేలా చేస్తుందని ఆయుర్వేద వైద్య నిపుణులు వెల్లడించారు. తులసిలో ఉండే 'యాంటీ ఫ్లూ' పదార్థం వల్ల ఇది సాధ్యమని నిర్ధారణ అయిందంటున్నారు. ప్రతి రోజూ రెండు సార్లు ఖాళీ కడుపుతో 20 నుంచి 25 తులసి ఆకులను తింటే స్వైన్ ఫ్లూను నివారిస్తుంది. తులసి ఆకు మనలో రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.స్వైన్ ఫ్లూ మరికొన్ని ముందు జాగ్రత్తలు :- ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడల్లా ముఖానికి మాస్క్ లు వేసుకోవాలి- డెట్టాల్ లాంటి మురికిని తుడిచేసే పదార్థాలతో వీలైనన్ని ఎక్కువసార్లు చేతులు ఇతర శరీర భాగాలను పరిశుభ్రం చేసుకుంటూ ఉండాలి- కాచి వడపోసిన నీటిని మాత్రమే సేవించాలి- చేతులను వీలైనన్ని ఎక్కువసార్లు కడుక్కోవాలి- బయటి ఆహారపదార్థాలను తినకుండా ఉండాలి- నిమ్మ లేదా సి విటమిన్ ఉండే పదార్థాలను అత్యధికంగా తీసుకోవాలి- శరీరం వేడిగా ఉండేలా చూసుకోవాలి. బయటి ప్రదేశాల్లో మల మూత్రాలు విసర్జించకూడదు- మంచినీటిని ఎక్కువగా తాగాలి- రాత్రి పూట తగినంత నిద్రపోవడం తప్పనిసరిస్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలు :- విపరీతంగా జ్వరం వస్తుంది. సాదారణంగా వచ్చే జ్వరంలా ఉండదు. కొన్నిసార్లు అసలు జ్వరమే లేకపోవచ్చు.- దగ్గు వస్తుంది- ముక్కు నుంచి నిరంతరం నీరు కారుతూ ఉండడం, లేదా మూసుకుపోవడం- గొంతులో ఒరుపు వచ్చి నొప్పిగా ఉంటుంది- ఒళ్ళు నొప్పులుంటాయి- తలనొప్పి, విపరీతంగా చలి అనిపిస్తుంది- విపరీతమైన అలసటగా ఉంటుంది- విరేచనాలు, వాంతులు కొన్ని సందర్భాల్లో ఉంటాయి.- న్యూమోనియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లాంటి లక్షణాలు కనిపించినప్పుడు స్వైన్ ఫ్లూ తీవ్రంగా ఉన్నట్లు గుర్తించాలి.స్వైన్ ఫ్లూ బారిన సునాయాసంగా పడే వారు :- ప్రాణాంతక వ్యాధులున్నవారికి స్వైన్ ఫ్లూ త్వరగా సోకే అవకాశం ఉంది- గర్భిణిలు కూడా స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన త్వరగా పడే అవకాశం ఉంది- ఊపిరితిత్తుల వ్యాధులు, ఆస్తమా, కార్డియో వాస్క్యులార్ జబ్బులు, చక్కెర వ్యాధి, ఇమ్యూనో సప్రెషన్ లాంటి రోగాలతో నిత్యం బాధపడే వారికి కూడా స్వైన్ ఫ్లూ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.- పిల్లలు, ఊబకాయంతో బాధపడే పెద్దలకు కూడా స్వైన్ ఫ్లూ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

0 comments:

Post a Comment

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers