Blogger Widgets

Wednesday, September 23, 2009

సరస్వతి మాత

Wednesday, September 23, 2009


అయిదవరోజు అమ్మవారు సరస్వతి మాతగా దర్శనము ఇస్తారు. ఈమె కనకాంబర వర్ణినిగా వుంటారు. చదువుకునేవారికి మంచి చదువును ప్రసాధించు తల్లి కావున ఈమెను చదువులు తల్లిగా కూడా అంటారు. తెల్లని వస్త్ర దానిణి చేతిలో వీణ పుస్తకాలు కలిగి వుంటుంది. ఈమెకి పెరుగన్నము నేవేద్యముగా సమర్పిస్తారు.
స్కందమాత
కుమార స్వామి, కార్తికేయుడు, శక్తిధరుడు అని ప్రసిద్ధుడైన స్కందుని తల్లి యైన దుర్గాదేవిని 'స్కందమాత'పేరున నవరాత్రులలో 5వ రోజున ఆరాధింతురు. ఈమె చతుర్భుజ. షణ్ముఖుడైన బాలస్కందుని ఈమెయొడిలో ఒక కుడిచేత పట్టుకొనియుండును. మరియొక కుడిచేత పద్మము ధరించియుండును. ఎడమవైపున ఒకచేత అభయముద్ర, మరొకచేత కమలము ధరించి, 'పద్మాసన' యనబడు ఈమెయు సింహవాహనయే.

స్కందమాతను ఉపాసించుటవలన భక్తుల కోరికలన్నియు నెఱవేఱును. ఈ మర్త్యలోకమునందే వారు పరమ శాంతిని, సుఖములను అనుభవించుదురు. స్కందమాతకొనర్చిన పూజలు బాల స్కందునకు చెందును.ఈ దేవి సూర్య మండల-అధిష్టాత్రి యగుటవలన ఈమెను ఉపాసించువారు దివ్య తేజస్సుతో, స్వచ్ఛకాంతులతో వర్ధిల్లుదురు.

0 comments:

Post a Comment

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers