Blogger Widgets

సోమవారం, డిసెంబర్ 14, 2009

తిరుప్పావై మొదటి పాశురం

సోమవారం, డిసెంబర్ 14, 2009

నారాయణ తత్వము
గోపికలు ఈ వ్రతము చేయుటకు అనుకూల కాలము మనకు లభిమ్చిందే అని ఆ కాలమును ముందుగా పోగాడుచున్నారు.
వ్రతము ఎవరు చేయుటకు తగినవారో నిర్ణయించుకున్నారు. ఈ వ్రతము చేసి తాము పొందదగిన ఫలమేమో , దానిని పోదిమ్చు సాధనమేమో స్మరించుచు ఈ మొదటి పాటలో అనంధించుచున్నారు.
మన గోపికలు మరియు గోదాదేవి.


పాశురము:

మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్
ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్
.

Pasuram01-HH.mp3
తాత్పర్యము :- ఓహో ! మార్గశీర్షమాసము, వెన్నెల నిండిన మంచి రోజు . ఓ అందమైన ఆభరణములు గల పడచులారా ! ఐశ్వర్యముతో నిండిన వ్రేపల్లెలొ సంపదలతో తులతూగు చున్న ఓ బాలికలారా! ఈ మార్గశీర్ష స్నానము చేయవలెనన్నా సంకల్పమున్నచొ రండు. ముందు నడువుడు. వాడియగు వేలాయుధమును దాల్చి కృష్ణునకు ఏవిధమగు ఆపద రాకుండా కాపాడుచున్న శ్రీ నంద గోపుల కుమారుడును , అందములగు కన్నులతో అలరుచున్న యశొద యొక్క బాలసిమ్హమును, నీలమేఘశ్యాముడును, ఎఱ్ఱని తామరలనుపోలు కన్నులు కలవాడును, సూర్యుని వలే ప్రకాశమును , చంద్రునివలె ఆహ్లాదమును ఈయజాలిన దివ్యముఖమండలము కలవాడును అయిన నారాయణుడే, అతనినే తప్ప వేరొకనిని అర్ధించనిమనకే , మనమాపేక్షెంచు వ్రత సాధనమగు `పరా అను వాద్యమును ఈయనున్నాడు. మనమీ వ్రతము చీయుటను చూచి లోకులందరు సమోషించునత్లు మీరందరు వచ్చి ఈ వ్రతములొ చేరుడు.

2 కామెంట్‌లు:

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)