Blogger Widgets

మంగళవారం, డిసెంబర్ 29, 2009

తిరుప్పావై పదిహేనవ పాశురం

మంగళవారం, డిసెంబర్ 29, 2009

ఆండాళ్ తిరువడిగళేశరణం :
ఇంతవరకు తొమ్మిదిమంది గోపికలని మేల్కొల్పినారు. పడవ గోపికను ఈ పాశురములో మేల్కొల్పుతున్నారు. దీనితో ముందు భాగము పూర్తవుతుంది. దీనిలో ముందుగా భాగావ్ద్భాక్తులను మేల్కొల్పుతారు. తరువాత భగవానుని మేల్కొల్పుతారు. మొదటి పదిహెను పాశురాలలో మొదటి ఐదు పాశురాలుచె ఈ వ్రతము నాకు పుర్వరంగామునుతెలిపి తరువాత పది పాశురాలలో పది మంది గోపికలను మేల్కొల్పినారు . దీనితో భగవద్ ఆలయములో చేరుకొనుటకు అర్హత కలిగెను. 
ఇంతవరకు భగవద్భాక్తుల విషయమున ప్రవర్తింపవలసిన విధనములు నిరూపించి ఈ పాశురములో దాని ఫలమును నిరుపించబడుచున్నది. ఇంతవరకు భాగాత్ప్రాప్తికి చేయవలసిన సాధన క్రమము వివరిచారు గోదామాత. అట్టి సాధన చేయుటచే ఏర్పదవలసిన ప్రధాన లక్షణము అహంకారము తొలగుట. అది పుర్ణంగా తొలగినాడు గాని ఆచార్య సమాస్రయనముస్ మంత్రము లభించి భగవదనుభావము కలుగదు . ఇట్టి పరిపూర్ణ స్తితినంది యున్న గోపిక ఈ నాడు మేల్కొల్ప బడుచున్నది. 






పాశురము : 




Pasuram15-HH.mp3



ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో 
శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్ఱేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుం పోందారో పోందార్ పోంద్-ఎణ్ణిక్కోళ్
వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క
వల్లానై మాయనై ప్పాడ-ఏలోర్ ఎమ్బావా
య్

తాత్పర్యము:
ఈ పాశురము న లోపల ఉన్నా గోపిక కుబయటి గోపికలకు సంవాదము నిబంధింపబడినది. వారి మద్య సంబాషణ ఎలావుందంటే.................
బయటి గోపికలు: ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా ! ఇంకను నిద్ర పోతున్నావా ? అయ్యో ఇది ఏమి ?
లోని గోపిక: పూర్ణులగు గోపికలారా ! చికాకు కలుగునట్లు జిల్లుమని పిలువకండి. నేను ఇదే చెప్పుచున్నాను.
బయటి గోపుకలు: నీవు చాలా నేర్పు కలదానవు. నీమాటలలో నైపుణ్యము కాఠిణ్యము మాకు ముందే తెలియును.
లోని గోపిక : మీరే నేర్పు కలవారు. పోనిండు ! నేనే కఠినురాలను.
బయటి గోపిక : నీకీ ప్రత్యేకత ఏమి? అట్లు ఏకాంతముగా ఎందుకు వుంటావు. వేగముగా బయటకు రా !
లోని గోపిక: అందరు గోపికలు వచ్చినారా. 
బయటి గోపికలు: వచ్చిరి , నీవు వచ్చి లెక్కించుకో .
లోని గోపిక: సరే , నేను వచ్చి నేను ఏమి చెయ్యాలి ?
బయటి గోపికలు: బలిష్టమగు కువయాపీడము అను ఏనుగును చంపినవాడను శతృవుల దర్పమును అణచినవాడను , మాయావి అగు శ్రీ కృష్ణుని కీర్తిని గానము చెయుటకు రమ్ము. 

జై శ్రీ మన్నారాయణ్ 



0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)