Blogger Widgets

Sunday, September 19, 2010

జగడపు జనవుల జాజర

Sunday, September 19, 2010


జగడపు జనవుల జాజర 

సగినల మంచపు జాజర || మొల్లలు తురుముల ముడిచిన బరువున 

మొల్లపు సరసపు మురిపెమున 
జల్లన పుప్పొడు జారగ పతిపై
చల్లే రతివలు జాజర ||

భారపు కుచముల పైపైగడు సిం - 
గారము నెరపెటి గందవొడి
చేరువ పతిపై చిందగ పడతులు 
సారెకు చల్లేరు జాజర || 

బింకపు కూటమి పెనగేటి చెమటల 
పంకపు పూతల పరిమళము 
వేనటపతిపై వెలదులు నించేరు 
సను మదంబుల జాజర ||


0 comments:

Post a Comment

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers