Blogger Widgets

సోమవారం, ఆగస్టు 08, 2011

నేత్రదానం (Donate Eyes)

సోమవారం, ఆగస్టు 08, 2011


నేత్రదానం గురించి చెప్పాలనుకుంటున్నాను.  మా అమ్మ చాలా రోజులు బట్టి నేత్రదానం చెయ్యాలని అనుకుంటుంది. అయితే దానికి ప్రొసీజర్ తెలియదు. అనుకోకుండా ఈరోజు సరోజిని ఐ హాస్పిటల్ కి వెళ్ళి అన్ని వివరాలు తెలుసుకుని వచ్చింది దానితో పాటు అప్లికేషని కూడా తెచ్చింది.  అయితే అమ్మ తెలుసుకున్న విషయాలు మీకు కూడా తెలియచెయాలి అని నెను అమ్మా అనుకున్నాం అంతే కాదు అప్లికేషన్ కూడా యాడ్ చేస్తున్నా.  సరె అసలు విషయానికి వస్తే.

సర్వేంద్రియాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. అన్ని ఇంద్రియాలకెల్లా కళ్ళే అతి ముఖ్యమైనవి. ఇవి లేకపోతే ప్రపంచం ఓ చీకటి గుయ్యారం. విదాత నిర్లక్ష్యంతో విధి వక్రించి అంధత్వంతో అనేక మంది జీవితాలను నెట్టుకొస్తున్నారు. వీరిలో కొందరికైనా వారి జీవితాలలో వెలుగులు ప్రసాదించాలనే ఉద్దేశం అందరిలో కలగాలని అనుకుంటున్నాను.
చూపు  వున్న ప్రతీ వారికి కంటి విలువ తెలుసు.  మనం అన్నీ చుడగలుగుతున్నాం అంటె కేవలం కళ్ళు వుందటం వల్లే.  శ్రుష్టిలో వున్న అందాలన్నీ చూడగలుగుతున్నాం.  అవే కళ్ళు లెకపోతే మనపరిస్తితి చాలా ఘొరంగా వుంటుంది. రాత్రుల్లు కరంటు పోయినప్పుడు ఎంత ఇబ్బందిగా వుంటుందో అందరికీ తెలుసు.  మనం కొంచెంసేపే ఏమీ చూడకుండా వుండలేము.  ఆ కొంచెం సేపులోనే కరంటు వాడిని తిట్టుకుంటాం కదా కదా మరి అల్లాంటప్పుడు కంటి చూపు లేని వారు ఎంత ఇబ్బంది పడతారో కదా. సరే

కళ్ళు మనిషికి చాల ప్రధానమైనవి. అంధకారమైన జీవితము ఊహించడానికి కూడా సాహసించరు.
ప్రస్తుతం మనదేశంలో 12 లక్షల మందికి కార్నియాలు నల్లగ్రుడ్డు  అవసరం. వీరితోపాటు ప్రతి సంవత్సరం మరో 40 నుంచి 50 వేల మందికి అదనంగా అవసరం వస్తోంది. కంటిలో అన్ని భాగాలు బాగా ఉండి కేవలం నల్లగుడ్డు దెబ్బతిని అంధత్వం వచ్చిన వారికి నేత్రదానం ద్వారా సేకరించిన కార్నియాలు అమర్చుతారు. తర్వాత వారు అందరిలా చూడగలుగుతారు. నేత్రదానం చేయడానికి ఆసక్తి ఉన్న వారు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు ఫోన్‌ చేస్తే వారే అక్కడకు వచ్చి నేత్రాలను సేకరిస్తారు. వాటిని అవసరమైన వారికి శస్త్రచికిత్స ద్వారా ఏర్పాటు చేస్తారు. ఈ విధానం అంతా పైసా ఖర్చులేకుండా ఉచితంగా చేస్తారు. సేకరించిన నేత్రాలు తమ దగ్గర ఉన్న జాబితాలోని వ్యక్తులకు సరిపడకపోతే ఇతర ఐ బ్యాంకులకు పంపిస్తారు.

నేత్రదానం ఎవరు చేయవచ్చు అంటే:  కార్నియా ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయవచ్చు. ఎలాంటి వయో పరిమితి లేదు. కంటి శుక్లాల ఆపరేషన్‌ చేయించుకొన్నవారు, రక్తపోటు ఉన్నవారు, మధుమేహ వ్యాధిగ్రస్థులు, కళ్ళజోడు పెట్టుకొనేవారు, ఉబ్బసం వ్యాధి ఉన్నవారు కూడా చేయవచ్చు.

నేత్రదానం ఎవరు చేయకూడదు అంటే:  హెచ్‌.ఐ.వి., ఎయిడ్స్‌తో జీవిస్తున్న వారు, పచ్చకామెర్లుకు గురైన వారు, రేబీస్‌(కుక్కకాటు వలన) వ్యాధిగ్రస్తులు, బ్లడ్‌ క్యాన్సర్‌ ఉన్నవారు, మెదడువాపు జబ్బు ఉన్న వారు, కార్నియల్‌ మచ్చలు, రెటినోబ్లాస్టోమా ఉన్నవారు నేత్రదానం చేయకూడదు.
నేత్రదానం చేయడానికి ఆసక్తి ఉన్న వారు నిర్ణీత దరఖాస్తులో ప్రమాణ పత్రాన్ని పూర్తిచేసి ఇవ్వాలి. దానిమీద నేత్రదానం చేసే వ్యక్తికి చెందిన ఇద్దరు కుటుంబసభ్యులు సాక్షి సంతకం పెట్టాల్సి ఉంటుంది. వారికి గుర్తింపు కార్డులు అందజేస్తారు.
వ్యక్తి మృతిచెందిన వెంటనే నేత్రదానం చేస్తామని ఆ కుటుంబ సభ్యులు సంబంధిత ఆసుపత్రులకు తెలియజేయాలి.
ఆరు గంటల లోపు నేత్రాలను మృతిచెందిన వ్యక్తి నుంచి తీసుకోవాల్సి ఉంది.
సమాచారం తెలియగానే సంబంధిత ఆసుపత్రుల వైద్యుల బృందం అక్కడికి చేరుకుంటుంది.
అప్పటివరకు మృతుని నల్లగుడ్డు ఎండిపోకుండా చూడాలి. కళ్ళు రెండు మూసి తడిగుడ్డ పెట్టడం మంచిది. తలకింద తలగడపెట్టి తల ఎత్తుగా ఉండేలా చూడాలి. ఫ్యాన్‌ వేయకూడదు. ఏసీ సౌకర్యం ఉంటే ఆ గదిలో ఉంచవచ్చు.
మృతిచెందిన వ్యక్తి నుంచి సేకరించిన కార్నియాలను అవసరమైన వ్యక్తులకు 72 గంటల లోపు ఏర్పాటు చేయాలి. పెద్ద ఆసుపత్రుల్లో సౌకర్యాలు ఉన్నచోట నాలుగు రోజులు వరకు నిల్వ చేయవచ్చు.
వారు ఏమిచెప్పారు అంటే దరఖాస్తు చేయకపోయినా మన ఇంట్లోవాళకు ఎవరైనా చనిపొతే నేత్రదానం చేయాలనుకునేవారు కూడాచేయచ్చు.
మనం చనిపోయాకా ఎందుకూ పనికి రాని కళ్ళను దానం ఇచ్చి వేరే ఇద్దరికి చూపునిచ్చినవారం అవుతాము. దయచేసి నేత్రదానం చేయండి.

Eye Pledge form
Congratulations! on taking the first step in spreading the gift of sight. We can assure you there can be no other cause that is nobler. Please fill out these details below and we will send across this information to the nearest eye bank, which will then provide you with the eye pledge card.
More importantly, please ensure all your family members, near and dear ones are informed about your desire to donate your eyes, because if they do not give their consent, this pledge form will be rendered useless.


Visit to find the list of eye banks in INDIA

3 కామెంట్‌లు:

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)