Blogger Widgets

శనివారం, అక్టోబర్ 29, 2011

నాగులు చవితి

శనివారం, అక్టోబర్ 29, 2011


నమస్తే దేవదేవేశ
నమస్తే ధరణీధర
నమస్తే సర్వ నాగేంద్ర
ఆదిశేష నమో స్తుతే
నాగులు  చవితి  రోజు పుట్టలో పాలు పోసి, చలివిడి, చిమిలి, మరియు వడపప్పు నేవేదిమ్చాలి. 
పాము పుట్ట లో  పాలు పోసేటప్పుడు  ఇలా చేప్పాలి.
నడుము తొక్కితే నావాడు అనుకో
పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో
తోక తొక్కితే తోటి వాడు అనుకో
నా కంట నువ్వుపడకు నీకంట నేను పడకుండా చూడు తండ్రీ.
అని చెప్పాలి.

 ప్రకృతి ని పూజిచటం  మన భారతీయుల సంస్కృతి. 
మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము.అని అర్ధము.

నాగుల చవితి రోజున నాగదేవతలను పూజించేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. పిల్లలుచేత ఇవి చెప్పించటం ఎందుకంటె వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము.
మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసినతరువాత.  బియ్యం రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులుకు ఆహారం ను పెట్టటం అన్నమాట.  ఉదాహరణకు చీమలకు ఆహారం గా పెడుతున్నాం.  పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చేవులకు పెడతారు.  ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని.  ఈరోజు సాధారణంగా ఇంట్లో ఆడవాళు ఉపవాసం వుంటారు. 
ఇది నాగులు చవతి విశిష్టత.
నాగులు చవితి శుభాకాంక్షలు. 

గురువారం, అక్టోబర్ 27, 2011

గోవర్ధన పూజ

గురువారం, అక్టోబర్ 27, 2011


గోవర్ధన పూజ దీపావళి తర్వాత రోజు,శ్రీకృష్ణుడు ఇంద్రున్ని జయించిన రోజుగా పండుగ జరుపుకుంటారు. బృందావనంలో ప్రతి సంవత్సరం ఈ పూజ ఇంద్రుని సంతృప్తి పరచడం కోసం సంరభంగా జరిపేవారు. అయితే మనం గోపాలురం కదా మనం గోవులకు పూజించాలి గాని, ఇంద్రున్ని ఎందుకని తండ్రి నందున్ని మరియు గ్రామవాసుల్ని ప్రశ్నిస్తాడు. దాని వలన ఇంద్రున్ని పూజించడం మానేస్తారు. కోపించిన ఇంద్రుడు ఏడు రోజులు కుండపోతగా రాళ్ల వర్షాన్ని కురిపిస్తాడు. అప్పుడు దిక్కు తోచని ప్రజలు కృష్ణున్ని వేడుకొనగా గోవర్ధన గిరి పర్వతాన్ని   పైకెత్తి దాని క్రింద గోపాలుర్ని మరియు గోవుల్ని రక్షిస్తాడు. ఇంద్రుడు చివరకు ఓటమిని అంగీకరించి కృష్ణున్ని భగవంతునిగా గుర్తిస్తాడు. భాగవత పురాణం ప్రకారం వేద కాలంనాటి బలిదానాల్ని వ్యతిరేకించి కర్మ సిద్ధాంతాన్ని దాని ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేశాడు.  ఈ పర్వతాన్ని దీనిని హిందువులు పవిత్రంగా భావిస్తారు.  ఇది ప్రస్తుతం బృందావనం పట్టణానికి సమీపంలో ఉన్నది.

కృష్ణుని మరియు వైష్ణవ భక్తులు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉన్నారు. చాలా మంది పర్యాటకులు ప్రతి సంవత్సరం ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ కొండ చుట్టూ జపాలు, గానాలు, భజనలు చేస్తూ, గిరి ప్రదక్షిణం చేస్తారు. ఈ గిరి పరిసర ప్రాంతాలలో శ్రీకృష్ణుడు మరియు బలరాముడు బాల లీలలు చాలా విశేషంగా ప్రాముఖ్యత వహించాయి.  
పరమాత్మ అవ్యక్తుడు సర్వవ్యాపకుడు నిరాకారుడు. అలాగే దేవతలుకూడా మనకు కనబడరు. కానీ సూక్ష్మ బుద్ధితో పరీక్షిస్తే ఈ ప్రకృతి (ఆది శక్తి) పరమాత్మ యొక్క ప్రత్యక్షస్వరూపం. కావున ప్రత్యక్షంగా మనకు కనిపించే ప్రకృతిని వదిలివేయుట మంచిది కాదు. మనము వేటిమీద ప్రత్యక్షంగా ఆధారపడి బ్రతుకుతున్నామో వాటినికూడా పూజించి మన కృతజ్ఞతా భావాన్ని సుస్థిరం చేసుకోవాలి.
శ్రీ కృష్ణులు వారు ప్రకృతిని పూజించాలని గోవర్ధని గిరి పూజ తో మనకు తెలియచేసారు.  
మనం ఈ గోవర్ధన గిరి వద్ద నివసిస్తాము. గోసంపదతో బ్రతుకు వారము. కావున గోవర్ధన గిరి పూజ గోమాత పూజ మనకు అత్యంత ప్రధానమ్. అందునా గోవర్ధనగిరి గోవిందుని వక్షఃస్థలం నుండి పుట్టి పులస్త్య మహర్షి అనుగ్రహంచే ఇచటికి వచ్చింది”. పరమాత్ముని అమృతవాక్యాలు విన్న వ్రజవృద్ధుడైన సన్నందుడు “ఓ నందనందన! నీవు జ్ఞానస్వరూపుడవు. నీ మాటలు మాకు శిరోధార్యములు. గోవర్ధనగిరి పూజావిధానము మాకు తెలుపుము” అని అన్నాడు. పరంధాముడు గిరిపూజా విధానం తెలిపినాడు:

“గిరి పాదభాగమును శుభ్రపఱచి గోమయముతో అలుకవలెను. రంగురంగుల ముగ్గులు వేయవలెను. పూజా ద్రవ్యములు శ్రద్ధగా సమకూర్చుకోవలెను. స్నానాది క్రియలొనర్చి భక్తితో శోడషోపచారములతో గోవర్ధనుని పూజించవలెను. అర్ఘ్యపాద్య అభిషేక అలంకరణ పుష్పపూజ దీపారాధన ప్రదక్షిణ నమస్కార స్తోత్ర నైవేద్యాది సేవలు చేసిన పిమ్మట నీరాజనమీయవలెను. విప్రసంతర్పణ గోపూజ అందరికీ అన్నదానం బాగా చేయవలెను. సాష్టాంగ ప్రణామములు చేయవలెను”.

శ్రీ కృష్ణుడు అలా పూజావిధానం తెలిపి “పూజకి వచ్చేముందు మీ కర్తవ్యాలన్నీ నిర్వహించుకుని రండి. ఇంట్లో దైవపూజ మాతాపితపూజ అన్నీ చేసుకుని రండి. వృద్ధులను బాలకులను ఆకలితో వదిలేసి రాకండి. వారికి కావలసిన ఆహారం సమకూర్చండి. ఇంటి వద్ద ఉన్న గోవులకి పశు పక్షాదులకి కుక్కలకి వేటికి కావలసిన ఆహారం వాటికిచ్చి రండి” అని చెప్పాడు.
ప్రాకృతిక వనరులను నాశనం చేయడం స్వార్థబుద్ధితో ప్రకృతిని క్షోభింపచేయడం ఎన్నడూ భారతీయత కాదు. భారతీయులు ప్రకృతిని పరమాత్మ యొక్క ప్రత్యక్ష స్వరూపమని భావించి పూజిస్తారు. ఇదే శ్రీ కృష్ణుడు మనకిచ్చిన సందేశం.

బుధవారం, అక్టోబర్ 26, 2011

Happy Diwali

బుధవారం, అక్టోబర్ 26, 2011


మంగళవారం, అక్టోబర్ 25, 2011

చీకటి వెలుగుల రంగేళీ

మంగళవారం, అక్టోబర్ 25, 2011

చీకటి వెలుగుల రంగేళీ, జీవితమే ఒక దీపావళీ
దీపావళి అంటే మన అందరికి చాలా ఇష్టం . ఐతే చాలామంది లో దీపావళి అంటే దీపాలు వెలిగించటమే కదా!
అని కాని దీపావళి కి చాలా విశిష్టత వుంది . దీపావళి పండుగ చేసుకునే విధానం కుడా వుంది . ఇవి చాలా మందికి తెలిదుపూర్వపు పద్ధతులు మరచి పోయారు రోజుకిస్వీట్స్ కొనుక్కొని వచ్చి వెరైటి వంటలు చేసుకొని , రాత్రి దీపాలు వెలిగించి టపాసు కాల్చుకొని ఎంజాయ్ చేయటమే అనుకుంటున్నారు మనలో చాలామంది.
ఐతే మా అమ్మమ్మ పూర్వపు పద్దతు లు చెప్పింది అవి ఏమిటంటే :
నరకచతుర్దసిని ప్రేతచతుర్దసి అని కుడా అంటారుఎందుకంటే ఇది యమునికి కుడా ప్రీతి కలిగించే రోజు.యముడు పితృత్వం కూడా ఉన్నా దేవుడుసూర్యోదయానికి ముందు,రాత్రి తుదిజాములో నువ్వులనూనెతో తలంతుపోసుకోవాలిఇలా చేయడంలో చాలా విశేషం వుందిటదీపావళి పర్వదినాలలో నువ్వుల నూనెలో లక్ష్మి దేవి ఉంటుందిట. .అలాగే నదులుచెరువులుబావులుకాలువలువంటి అన్ని జలవనరులలోకి గంగాదేవి  రోజుల్లో
ప్రవేశిస్తుంది . నువ్వులనునేల్తో అభ్యంగనస్నానం చెయ్యడం వల్ల దారిద్ర్యం తొలగి గంగాస్నాన ఫలం లభిస్తుందిట . నరక బాధలు తప్పుతాయ . చివరకు సన్యాసులు కుడాచేస్తారుట.
స్నానం కూడా ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యడం కాదుసూర్యోదయానికి ముందు నాలుగు ఘడియల కాలం అరుణోదయం అంటారు .  లోగా చెయ్యాలి.
స్నానం చేసేటప్పుడు ఉత్తరేణి కొమ్మను శిరస్సు మీద తిప్పుతూ  శ్లోకం పాటించాలి .
శీతలోష్ట సమాయుక్త సకంటక దలాన్విత
హరపాప మపామార్గ భ్రామ్యమానః పునః పునః
అపామార్గం అంటే ఉత్తరేణి . ఇలాచేయటం వల్ల నరకం రాదట. నువ్వులనునే , ఉత్తరేను మొదలైనవి ప్రకృతితో మనకు ఎంత ముడిపది వున్నామో తెలుస్తుంది. ప్రక్రుతిసామరస్యంలో మనం జేవించాలని ఇందులో సందేశం. ఇందు వల్ల నరకంబయం అన్నది ఉంటే అది మన భావన ద్వారా ఆ స్థితికి చేరుకున్తామన్నామాట. స్వర్గనరకాలు మనస్సు నందు కల్గేవే. ఇది అంతా మనసుకి శిక్షణ ఇవ్వటమే.
స్నానం తరువాత `యమాయ తర్పయుఆమి, తర్పయామి, తర్పయామి' అంటు మూడుసార్లు నువ్వులతో యమునికి తరపనాలు ఇవ్వాలి.
ఆ తరువాత ఈ శ్లోకం చదవాలి.
యమాయ ధర్మరాజాయ మృత్యువే చాంతకాయచ
వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయచ
ఔదుమ్బరాయ ధర్మాయ నీలాయ పరమేష్టినే
మహొదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః
దీపావళి రోజు మినపాకుతో చేసిన కూరతొ భోజనం చేస్తే మంచిది అని అంటారుట.
దీపదానం:
సాయంకాలం ప్రోదోషసమయంలో నువ్వులనూనెతో దీపాలు పెట్టాలి . విష్ణ్వాలయంలో, శివాలయాలలో, మతాలలో , దీపాలు పెట్టడంతో పాటు నదీతీరాలలో, చేరుగాట్లు, తోటలు, వీధులు, పర్వతాల్పైన చివరకు స్మసానాలల వద్ద కుడా దీపాలు పెట్టాలని పెద్దల శాసనం. దీపావళి రోజున పితృదేవతలు తమతమ సంతానం ఇంటిని దర్సిస్తారట. వారికి మనం పెట్టె దీపాలే దారి చుపిస్తాయట .
దీపావళినాడు మరి ముఖ్యంగా ఐదు ప్రదేశాలలో దీపాలు పెట్టాలిట .అవి:
1) ఇంటిధ్వారం.
2) ధాన్యపుకొట్టు.
౩) బావి.
4) రావిచెట్టు.
5)వంటిల్లు . ఇంట్లో ఆశుచం ( మైల) పాటిస్తున్నాసారే ఈ ఐదు చోట్లా దీపం పెట్టవలసిందే.
ఉల్కాదానం:
యముడు దక్షినదిసగా ఉంటాడు. మగపిల్లలు ఆ దిక్కువైపు నిలబడి దివిటీలు వెలిగించి పితృదేవతలకు దారి చూపించాలి. తర్వాత కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చి ఏదైనా తీపి పదార్ధాలు తినాలి.
లక్ష్మి పూజ :
దీపాలు వెలిగించి వాటిలోకి లక్ష్మి దేవిని ఆహ్వానించి లక్ష్మీపూజ చెయ్యాలి. ఆ తర్వాత బాణసంచా వెలిగించాలి. అర్ధరాత్రి స్త్రీలు అందరు కలసి చేతలు, వాయిద్యాలు మోగించాలి. దారిద్రాన్ని దూరంగా తరిమికొట్టడానికి ఇలా చెయ్యడం ను "అలక్ష్మినిస్సరణం" అని అంటారు. మనం టపాసు పెల్చడంలోని అర్ధం ఇదే.
ఈ టపాసుల వల్ల వర్షాకాలంలో పుట్టిన ఎన్నో క్రిములు కీటకాలు ముక్తి ని పొందుతాయి. కార్తీకమాసం అంతా దీపాలు వెలిగించేది అందుకే.
రోజూ సాయంకాల దీపం వెలిగించిశ్లొకం చదివి తే చాలామంచిధీ.
దీపం జ్యొతిః పరబ్రహ్మ,
దీపం జ్యోతి జనార్దనః
దీపేన హరతే పాపం
సంద్యాదీపం నమోస్తుతే,
సాయంత్రం సంద్యాదీపం వెలిగించీ ధానికి నమస్కారిచుట చాలాపున్యము. దీపం అంటే పరమాత్మ . దీపంకు నమస్కరించుట పరమాత్మకు నమస్కరించుటే అని అమ్మమ్మ చెప్పింది. సరే అమ్మమ్మ చెప్పినవి దీపావళి రోజు పాటిస్తారు కధూ !

సోమవారం, అక్టోబర్ 24, 2011

లక్ష్మి నివాసం

సోమవారం, అక్టోబర్ 24, 2011


ఈరోజు అక్షయతృతియ చాలామంది బంగారం కొనుక్కొని దేవుని దగ్గర పెట్టి పూజ చేస్తారు. ఈరోజు బంగారం కొంటే మంచిది అంటారు. అందరు కోరుకునే లక్ష్మి కొందరి దగ్గర ఎక్కువగా వుంటుంది. మరికొందరికి చేతికి దక్కినట్టే దక్కి జారిపోతుంది. అసలా ఎందుకు జరుగుతోంది దానికి కారణం ఏమిటి?

Lakshmi Pooja
 ధన త్రయోదశి శుభాకాంక్షలు 
ధిమిధిమి ధింధిమి ధింధిమి ధింధిమి! దుందుభినాదసుపార్ణమయే!!
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ! శంఖ నినాద సువాద్యనుతే!1
వేదపురాణేతిహాససుపూజిత! వైదిక మార్గ ప్రదర్శయుతే!!
జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయమాం!!

దీపావళి రోజు సముజ్వల దిపతోరనామద్య వైభవలక్ష్మిని నిలుపుకొని భక్తి శ్రద్దలతో పూజిమ్చుకొనె రోజు . అసలు దీపమే లక్ష్మి. చీకటినుంచి వెలుగులోకి ప్రయాణించడమే జ్ఞానం , అదే సంపద, జ్ఞానము సంపదా బిన్నమైనవి కావు. ఒకటి వుంటే రెండోది ఉన్నట్టే. ఇతరులను వంచించినచో, అవినీతి మార్గాలలోనో ఐశ్వర్యాన్ని సంపాదిస్తే చాలను కుంటారు చాలామంది. అలాంటివారిని లక్ష్మి వరిమ్చిన్నట్టు కనిపించినా అది చంచలం . దయా, సేవాబావం, శ్రమ, వినయం, వివేకం ఉన్నచ్తే లక్ష్మి స్థిరంగా ఉంటంది. లక్ష్మీ కతాక్షసిద్ధిలోని అసలు రహస్యం ఇదే. లక్ష్మీదేవి-----ఆదిలక్ష్మీ, దైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి విద్యాలక్ష్మి, ధనలక్ష్మి అనే అష్టరుపాలలో ఉంటుందని మనకు తెలుసు. వీటిలో `విద్యాలక్ష్మి' అంటే, జ్ఞానం వివేకం వంటి సద్గునసంపద అని కుడా అర్ధం చేసుకోవాలి. అటువంటి లక్ష్మితత్వాన్ని అందరుసంపాదించాలి.మంచి మనసే లక్ష్మి నివాసం యోగ్యమైన ప్రదేశం 
లక్ష్మి ఎక్కడవుంతుందని నారదుడు శ్రీ మహావిష్ణువుని అడుగగా
శ్రీ మహావిష్ణువు లక్ష్మి దేవి ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పారు అవి ఏమిటంటే 

`అఖిల విశ్వం సమస్త ప్రాణులు నా అదీనంలో ఉంటే , నీనేమో నా భక్తుల అదీనంలో ఉంటాను . మీరు నా భక్తులు, కనుక మీకు పరమైస్వర్యాన్ని అందించే ఆచలలక్ష్మిని ప్రసాదిస్తాను. అయితే దానికి మొండు నీను చెప్పబోయే మాటలు వినండి - అమ్తూ.......... లక్ష్మి ఎవరెవరివద్ద ఉంటుందో, ఎవరివద్దవుండదో , వివరించాడు. లక్ష్మిని కోరుకునే వారందరూ తప్పకుండా దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలివి.
భగవద్భాక్తులపై కోపగించే వారి గృహంలో లక్ష్మిదేవే కాదు.శ్రీ హరి కుడా ఉండదు. శంఖద్వని వినిపించని చోటా, తులసిని పూజించని చోట, శంఖరుని అర్చించని చోట , బ్రహ్మవేత్తలకు , అతిధులకు భోజనసత్కారాలు జరగని చోట , లక్ష్మి నివసించదు. ఇల్లు కలకలాడుతు లేని చోట , ఇల్లాలు ఎల్లవేళలా కంటతడి పెట్టిన చోట , విష్ణువును ఆరాధించకుండా ఏకాదశి , జన్మాష్టమి రోజులలో భోజనం చేసేవారి ఇంట లక్ష్మి నివసించదు.

హృదయోమ్లో పవిత్రత లోపించినా, ఇతరులను హింసింస్తున్నా. ఉత్తములను నిమ్దిస్తున్నా లక్ష్మి ఆ ఇంటిలోనుంచి పారిపోతుంది. అనవసరం గా గడ్డిపరకలను తెమ్చినా, చట్లను కులగోట్టినా లక్ష్మి కటాక్షం లోపిస్తుంది. నిరాసావాధులను, సుర్యోదయ సమయంలో భోజనం చేసే వాని, తడి పాదాలతో నిద్రపోయేవారిని , వివస్త్రులై నిద్రపోయేవారిని, తలక్రిందులు గా మాట్లాడేవారిని, తమ తలకు రాసుకున్న నూనెనుఇతరులకు అంటించే వారిని కుడా లక్ష్మి వరించదు..
శ్రీ హరి దివ్యచరిత్ర, గుణ గానం జరిగే చోట, సాలగ్రామం, తులసి, శంఖద్వని ఉన్నచోట , లక్ష్మి వోరాజిల్లుతుంది.
ఇలా శ్రీ హరి లక్ష్మీకటాక్షం ఎలా కలుగుతుందో, ఎలాకలగాదో చెప్పారు.
సంపద మన ఆదీనం లో ఉండాలి కాని, మనం సంపద ఆదీనం లో ఉండకుడదు . ఏకాస్త గర్వించిన, అహంకరిమ్చినా ఐశ్వర్యం జారిపోతుంది. సద్వినియోగమే సంపద పరమార్ధము. అది విస్మరించినా లక్ష్మి వీడిపోతుంది. ఇదే లక్ష్మి కటాక్ష రహస్యం.....

గురువారం, అక్టోబర్ 13, 2011

అట్ల తదియ

గురువారం, అక్టోబర్ 13, 2011


అట్ల తద్దోయ్ – ఆరట్లోయ్
ముద్దపప్పోయ్ -మూడట్లోయ్

అయ్యో మీకు చెప్పడం మరచిపోయా ఈ పాట ఏమిటను కుంటున్నారా ? ఏమి లేదండి నేను చెప్తున్నది అట్ల తదియ పండుగ గురుంచి. అట్ల తదియ ఈ పండుగ ప్రతి సవత్సరం ఆశ్విజ బహుళ తదియ రోజు వస్తుంది. ఈ తదియ రోజు తెలవారుజామునే ఆడవారు చిన్న పెద్ద అన్దరూ నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని , గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, పులుసు, పెరుగు వేసుకొని తెల్ల వారుజామునే భోజనం చేస్తారు.ఆ తరువాత ఆటలే ఆటలు, చెమ్మచెక్కలు, ఉయ్యాలు అడతారు. అన్నట్టు 
ముందురోజే చేతుల నిండా గోరింట పెట్టుకుంటారు. తదియ రోజు చాలా సంతోషం గా ఆడుకుంటారు. ఉయ్యాల పోటీలు పెట్టుకుంటారు. పల్లెల్లో చాలా బాగా జరుపుకుంటారు. పొద్దు ఎక్కాగా తల స్నానం చేసి దేవుడుకి దణ్ణం పెట్టుకొని రోజు అంతా ఉపవాసం వుంటారు. సాయంత్రం చంద్రోదయం అయ్యాక స్నానం చేసి పార్వతి దేవికి పూజచేస్తారు. పూజచేసి చంద్రుడిని దర్శించుకుంటారు .
అట్ల తదియకు ఒక కదా వుంది ఆకధ
ఒక వూర్లో రాజు గారమ్మాయి, వెలమవారి పిల్ల, బ్రాహ్మ్నవారి పిల్లా, కోమటిపిల్ల,నలుగురు వివాహం కాకముందు చిన్నతనంలో నే అట్లాతదియనోము చీద్దమనుకున్నారు తదియనాడు వుపవాసం వున్నారు.రాజుగారంమయి అతిసుకుమారి కనుక సాయింత్రం కాగానే ముఖము వాడి ముఉర్చపోయినది. వీదిలూనుంది అన్నగారు వచ్చి అమ్మా చెల్లెమ్మ ఏది అని అడుగుగా నాయనా అట్లతదియ నోము చేద్దమనుకుని వుపవాసముంది . చంద్రోదయం వరకు వుండలేక మూర్చపొయినధి అని చెప్పింది. అప్పుడు అన్నయ్య ఏమి దారని అలోచించి వెంటనే దురంగావున్న చింత చెట్టుకు అద్దం పెట్టి దానికి ఎదురుగా అగ్గిపెట్టి చెల్లిలిని లేపి అదిగో చంద్రుడు ఉదయించాడు అనిచెప్పగా నిద్రకలనవున్న నిజంగా చెంద్రుదని బావించి ,రాకుమారి ఫలహారంలు చేసెను. కొన్నాళ్ళకు వివాహం చేయగా వయసు మీద పడిన వాడు భర్తగా సంప్రప్తంయ్యేను. నీను అట్లతదియ నోము నోచినా నాకు ఇదేమీ ప్రారబ్దం అని భాద పడుతూ ఒకనాడు రాత్రి అడవికి వెళ్ళిపొయినది.
ఓ అమ్మాయి ఒంటరిగా ఈ అడవిలో ఎక్కడికి పూతున్నావని పార్వతి పరమేస్వరులు మారు వేషములో వచ్చీ అడుగగా నాయనా మీరేమైనా అర్చేవార తీర్చేవారా మీకెందుకు అని చెప్పి నడుస్తోంది. మీము ఆర్చేదము తీర్చేదము నీ సంగతి చెప్పు అని అడిగిరి . ఆచిన్నది వారికి నమస్కరించి వారి స్నేహితులుతో చేసిన నోము గురించి తనకు మాత్రమె ముసలి భర్త లబించాడని నాకు మాత్రమె ముసలి భర్త సంభవించటం నాకు కారణం ఏమి , నా పాపమా? అని తన భాదను వివరించింది.
వారు దానికి చిన్నదానా నీవ్రతం భంగమైనది నీ అన్నగారి వలన జరిగిన చర్య సవివరంగా చెప్పారు. జరిగినదాని నేను ఇప్పుడు ఏమి చేయ్యన్లని వారి అడుగగా మరలా ఆ వ్రతం నిస్తగా చేయ్య్మన్న్నారు. ఆమె తిరిగి రాజ్యాని కి చేరి తదియరోజు ఆ వ్రతం చేసినది. ముసలి భర్త మంచి అందమైన యువకుని గా మారెను. అది చుసి అన్ధరూ కారణమడుగగా జరిగిన వృతాంతం చెప్పెను . ఇది అట్ల తదియ నోము కదా…
ఈ కధ విని అక్షిమ్థలు తలమీద వేసుకొని చంద్రుని చూసి పదకొండు అట్లు వీసి ఒక ముత్తయ్దువకు ఇచ్చి తను నేయివధ్యం పెట్టుకున్న పదకొండు అట్లు తిన్నాలి .
ఇదండి అట్ల తద్ది నోము గురించి.

గురువారం, అక్టోబర్ 06, 2011

Happy Dussehra

గురువారం, అక్టోబర్ 06, 2011


ఆదివారం, అక్టోబర్ 02, 2011

మా తాత గారికి షష్ఠిపూర్తి శుభాకాంక్షలు

ఆదివారం, అక్టోబర్ 02, 2011



మా తాతగారి కి 60 సంవత్సరాలు నిండిన సందర్బంగా  నేను చాలా గొప్పగా శుభాకాంక్షలు చెప్పాలి అనుకున్నాను కానీ నాకు ఎలా చెప్పాలో తెలియలేదు.  మాతాత కు నేను చిన్న poem  అందిస్తున్నాను.  మా తాతగారి గురించి చెప్పాలంటే ఆయన జీవితము లో ఎన్నో ఒడిదొడుకులు  ఎదుర్కొంటూ, మంచి కొడుకుగా,  మంచి ఉపన్యాసకునిగా, మంచి తండ్రిగా, మంచి భర్తగా, మంచి తాతగా, మంచి స్నేహితునిగా , మంచి సాహితీవేత్తగా, కవిగా అన్నిటా successful  గా జీవితాని మా అమ్మమ్మ తో  గడుపుతున్నారు.  తాతా ఇలాంటి  పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని  ఆరోగ్యంగా, ఆనందంగా వుండి మా అందరికీ ఆదర్శప్రాయంగా  మాతో ఎల్లపుడూ  ఇదే హుషారుతో వుండాలి అని ఆ భగవంతుడును కోరుకుంటున్నాను.  
తాతా: "Many  Many  Happy  Returns Of The  Day ".
This is  for  you  with love .
  
A rose for every year, 
many smiles for every tear
Way more of the first than ever of the latter
What’s deep in our hearts is all that really matters
We've learned a lot, yet still a ..........

అలానే  మా తాతగారికి నేమాని రామ జోగి సన్యాసి రావు అవధాని గారు  తాతమీద కొన్ని పద్యాలు రచించారు అవి కూడా.

శ్రీరస్తు                                శుభమస్తు                           అవిఘ్నమస్తు.
ప్రియ సాహితీ మిత్రులు 
చింతా రామ కృష్ణా రావు గారి షష్టి పూర్తి సందర్భంగా అందించుచున్న  
అభినందన పూర్వక శుభాశీస్సులు

శ్రీ చింతాన్వయ రత్న భూషణవరా! శ్రీ రామకృష్ణా! సుధీ!
శ్రీ చంద్రాతపతుల్య కీర్తివిభవా! స్నిగ్ధాంతరంగాంబుజా!
శ్రీ చాంపేయ సుమాభ కాంతికలితా! ప్రేమాంచితాశీస్సుధల్
నా చిత్తంబున గూర్చి మీ కవ పయిన్ వర్షించుచుంటిన్ సఖా! 1.

సరస కవిత్వ తత్త్వ విలసత్ ప్రతిభా విభవాఢ్యుడంచితా
దరమతి సద్గురుండనుచు ధాత్రి చెలంగితివీవు ధర్మ త
త్పరుడు సుధీ నిధానుడని తావక శీలము నెంచగా ధరన్
పరగుము హాయిగా యని సువర్ణ మయాశిషమిత్తు సోదరా! 2.

జనని వేంకట రత్నమ్మ సర్వ శుభద
తండ్రి సన్యాసి రామరావ్ తజ్ఞవరుడు
సతి విజయలక్ష్మి అనుకూలవతియు మరియు
సంతతి మహోన్నతాదర్శ శాలురగుచు 3.

అరువది యేడులు నిండెను
ధరపై నీ జీవితమున తద్దయు సుఖ సం
భరితముగ నితోధికముగ
చిరకాలము తనరు జీవితము మీకు సఖా! 4.

మీ కవ సుఖ శాంతులతో
శ్రీకరముగ తనరుగాక చిరకాలమిలన్
మీ కులము పెంపుగాంచుత
ఓ కళ్యాణ గుణ వైభవోజ్వలమూర్తీ! 5.

మంగళం.                 మహత్.              శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ
                                                                                                                                     ఇట్లు 
నేమాని రామ జోగి సన్యాసి రావు అవధాని.
విశాఖపట్టణం,
ఖర నామ సంవత్సర ఆశ్వియుజ శుద్ధ షష్ఠీ జ్యేష్ఠా నక్షత్ర యుక్త గురు వారము,
(తేదీ.02-10-2011). 

మరి కొంతమంది తాతకు wishes  చెప్పారు వారికి మరియు నేమాని రామ జోగి సన్యాసి రావుగారికి 
నా హృదయపూర్వక ధన్యవాదములు.

శనివారం, అక్టోబర్ 01, 2011

Non-violence day

శనివారం, అక్టోబర్ 01, 2011

International Non-violence day గా 2 అక్టోబర్ , మహాత్మా గాంధీ, భారత స్వాతంత్ర ఉద్యమం మరియు కాని హింసతత్వశాస్త్రం మరియు వ్యూహంలో మార్గదర్శకుడునాయకుడైన పుట్టినరోజు గుర్తు పెట్టబడింది.
ఈ రోజు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారి పుట్టిన రోజు 
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ
జన్మ నామం: మోహన్ దాస్ కరంచంద్ గాంధీ
జననం: అక్టోబరు 2, 1869
పోరుబందరు(గుజరాత్)
మరణం: జనవరి 30, 1948
హత్య చేయబడ్డాడు
వృత్తి :న్యాయవాది
పదవి :మహాత్మ, జాతి పిత
భార్య/భర్త :కస్తూర్బా
సంతానం:హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ
తండ్రి: కరంచంద్ గాంధీ
తల్లి: పుతలీ బాయి
గాంధి గారు చిన్నప్పటి నుండి మంచి మంచి కదలు విని inspire అయ్యేవారు. ఆయనకు చత్రపతి శివాజి, భగవత్ గీత వంటి వి ఆయన జీవితంపై గొప్పప్రభావము చూపించాయి అనటంలో అసత్యము లేదు.
గాంధి గొప్పస్వాతంత్ర సమర యోధుడు. మనభారతీయులందరు చేత పూజలు అందుకుంటున్నారు.ప్రజలు అయనని జాతి పితగా గుర్తించారు. పిల్లలు బాపుజీగా తలుస్తారు.
గాంధి గారు సత్యాగ్రహము, సహాయ నిరాకరణ ఉద్యమము , అహింసా వంటివి ఆయన పాటించేవారు.
గాంధిగారు అహింస అనే అనే అస్త్రముతోనే మనదేశాన్ని పరిపాలించటానికి వచ్చిన బ్రిటిష్ వారిని వారిదేశానికి పారిపోయేలా చేసింది.
గాంధిగారు, నారవస్త్రము , చేతికి కర్ర, కళ్ళకు అద్దాలు, కలిగివుండేవారు.
ఈయన మాట సత్యమేవ జయతే.
ఈరోజు గాంధిగారి పుట్టినరోజు నుNon-violence day గా జరుపుకోవాలి .


ఈ రోజు గాంధి గారి పుట్టినరోజు అని మాత్రమే కాదు ఈ రోజు న భారత రెండవ ప్రధాని లాల్ బహదుర్ శాస్త్రి గారి పుట్టిన రోజు .1904సం.అక్టోబర్ 2వ తేదిన ఉత్తరప్రదేశ్ లోని మొగలాయ్ సరాయ్ గ్రామంలో తండ్రి శారదా ప్రసాద్ రాయ్ శాస్త్రిగారు. గాంధిగారు ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో ను , సత్యాగ్రహము లోను పాల్గొనుటకు ఉత్సాహంగా వుండెవారు . అప్పుడు జైల్లోకూడా స్వాతంత్ర్యము తర్వాత, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ మంత్రివర్గములో గృహ మంత్రిగా పనిచేశాడు.
స్వాతంత్ర భరత దేశానికి నెహ్రు మొదటి ప్రదాని , నెహ్రు తరువాత లాలబహదుర్ శాస్త్రిగారు రెండవ ప్రదాని గా ప్రమాణ స్వీకరము చేసారు.
ఆయన. 1965 యుద్ధంలో పాకిస్తానును కాళ్ళబేరానికి తీసుకువచ్చాడు. తాష్కెంటు లో పాకిస్తానుతో సంధి చర్చలకు వెళ్ళినపుడు 1966 జనవరి 11 న గుండెపోటుతో మరణించాడు. మరణానంతరం ఆయనకు భారతరత్న పురస్కారం లభించింది.

ఈరోజు వారి ఇరువురికీ (గాంధి గారికి, లాల్ బహదూర్ శాస్త్రి గార్లకు మనం  వారిని తలుచుకొని  నివాళి అర్పిద్దాం.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)