Blogger Widgets

బుధవారం, నవంబర్ 30, 2011

మార్గశిర లక్ష్మివార వ్రత-కధ

బుధవారం, నవంబర్ 30, 2011

మార్గశిర లక్ష్మివార వ్రతము
మార్గశిర  నెలలో లక్ష్మీ పూజ చేసుకునే అన్ని సమస్యలను పరిష్కరించటానికి మరియు దేవత లక్ష్మీ దేవి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్య తో నివశించాగలరని  భక్తులు నమ్ముతారు.  మార్గశిర లక్ష్మీ పూజ  పూజ విధానం  దీపావళి  లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మి  పూజ వంటి ఇతర లక్ష్మీ వ్రతం వలెనే  అయితే, ఈ దేవత కు సమర్పించే ఆ నైవేద్యం వైవిధ్యమైనది. 
మార్గశిర నెల గురవారం, భక్తులు దేవాలయాలు లోను  లేదా ఇళ్లలో లక్ష్మీ పూజ చెయ్యడానికి ముందు రోజే సిద్ధం చేసుకుంటారు. ఇళ్ళు, శుభ్రం చేసి చక్కగా ఉంచబడిన పండుగ రోజులలో మరియు దేవత లక్ష్మి యొక్క చిత్రం లేదా చిన్న విగ్రహం పూజ ప్రదేశం వద్ద ఉంచుతారు. 
లార్డ్ వినాయక కు  మొదటి పూజలు చేస్తుంటారు. భక్తులు అవరోధాలు లేదా విఘ్నాలు వదిలించుకోవటం కొరకు గణపతి ప్రథమ పూజ చేస్తారు. గణపతి పూజ తర్వాత, దేవత లక్ష్మీ షోడశోపచార  పూజ మరియు అష్టోత్తరం  తో పూజలు మరియు నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం అందింస్తారు. మార్గశిర  లక్ష్మీ పూజ, కథ చదువుకోవాలి.
లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురవారం చేస్తారు. కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో లో వుంటాయి కానీ ఈ లక్ష్మి పూజ పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేయాలి అదే ఇక్కడ విశేషం.

నైవేద్యం  లేదా మార్గశిర  లక్ష్మివార  వ్రతం  సమయంలో దేవత లక్ష్మీ దేవికి ఆహార సమర్పణలు:
1 వ గురువారం - పులగం 
2 వ గురువారం - అట్లు, తిమ్మనం
3 వ గురువారం -  అప్పాలు, పరమాన్నము
4 వ గురువారం - చిత్రాన్నం, గారెలు, 
5 వ గురువారం - పూర్ణం బూరెలు 
మార్గశిర లక్ష్మివార వ్రత కధ:
పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు.  అతనికి సుశీల అను ఒక కూతురు కలదు.  ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకొమ్మని చెప్పుచు కొంచెం బెల్లం యిచ్చేది.  ఆసుశీల  సవతి పిల్లలను ఆడించుచు ఇంటివద్ద సవతితల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహా లక్ష్మి చేసి జిల్లేడు పూలతోను ఆకులతోను పూజచేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నేవైధ్యం పెట్టుచూ ఆదుకునేది సుశీల.  ఇలాకొన్నాళకు సుశీలకు వివాహం అయ్యింది.  అత్తవారింటికి పోవుచూ తానూ తయారు చేసుకున్న లక్ష్మి దేవి మట్టి బొమ్మను తీసుకు వెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు.  ఈమె ఇంట మహదైశ్వైర్యం అనుభవిస్తున్నారు.  పుట్టింటివారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలిసికొని  సుశీల చాలా బాధపడుతుంది.  తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలచి నాయనా!  నీ అక్క ఇంటికి వెళ్లి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించెను.  సుశీలఇంటికి తమ్ముడు వెళ్లి వారి దరిద్రం గురించి చెప్పాడు.  దరిద్రమును తెలుసుకున్న ఒకకర్రను దోలిపింఛి దానినిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది.  ఆచిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్రవదిలి వెళ్ళిపోయాడు.  ఆకర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు.  ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమితెచ్చావు అని అడుగగా ఏమితేలేదు అని చెప్పెను.  మనదరిద్రం ఇంతే అని అనుకున్నారు.  కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగితెలుసుకున్నది.  వారి దరిద్రంలో ఎటువంటి మార్పురాలేదని తెలిసి.  ఒకచేప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకునివెళ్లి తండ్రికి ఇమ్మని చెప్పెను.  సరే అని తీసుకునివెళ్లి మార్గమద్యలో దాహంవేసి ఒక చేరువుగాట్టును చెప్పులు మూట పెట్టి నీరుతాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకునిపోయారు.  జరిగిన విషయం తల్లికి చెప్పాడు.  తల్లి జరిగిన దానికి భాదపడి మనదరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకొనెను.  మరలా కొన్నాళ్ళకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పెను.  అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే వుందని చెప్పెను.  అప్పుడు సుశీల ఒకగుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది.  సరే అని తీసుకువస్తుండగా సాయంసమయంలో ఒకచేరువు వద్దకు వచ్చి దానిని గట్టుమీద వుంచి సాయంసంధ్య వందనం చేస్తూవున్నాడు.  ఇంతలో ఒకబాటసారి పండుబాగుందని పట్టుకుని వెళ్ళిపోయెను.  ఆకుర్రవాడు గట్టుమీదకు వచ్చి పండు వెతగాగా పండులేదు.  ఏమిచేసేది లేక ఇంటికి వెళ్ళాడు.  తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగినది చెప్పెను.  తల్లి విచారించింది.  కొన్నాళ్ళకు.  తల్లి ఇంటిదగ్గర పిల్లలను వుంచి కూతురు దగ్గరకు వెళ్ళెను.  తల్లిని చూసి సుశీల వారిదరిద్రమును తెలుసుకొని చింతిచి  మార్గశిర లక్ష్మివారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది.  అమ్మా ఈరోజు మార్గశిర లక్ష్మివారం నోటిలో ఏమివేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అనిచేప్పెను.  ఆమెకూడా అలాగే నేనేమైనా చిన్నదాననా? ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్ది అన్నంపెట్టి నోటిలో ఒకముద్ద వేసుకున్నది.  కూతురు వచ్చి అమ్మా స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందాం అంది.  అప్పుడు జరిగినది తల్లిచేప్పినది.  ఆవారం కూతురుమాత్రమే చేసుకున్నది.  రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తానును రాసుకున్నది.  ఆవారం కూడా వ్రతం చేయవీలుకాలేదు.  మరుసటి వారం అమ్మా ఈసారైనా జాగ్రత్తగావుండమని చెప్పినది.  పిల్లలకు తలదువ్వుతూ ఆమె తలడువ్వుకొని వ్రతం చేయలేకపోయినది.  కూతురుమాత్రమే చేసుకున్నది.  నాలగవ వారం ఈసారి అయినా చాలజాగ్రత గావుండమని చెప్పి సుశీల తల్లి ఈపని చేయకుండా వుండటానికి ఒకగోతి లో కూర్చోబెట్టినది.  పని అయినతరువాత అమ్మను తెస్సుకుని వచ్చి స్నానం చేస్తే పూజచేసుకుంధం అని పిలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేసారు నేను తోచక అది తిన్నా అని చెప్పింది.  అయ్యో అని తలచి కూతురు పూజచేసుకొని.  ఐదవ వారం మార్గశిర లక్ష్మివారం వ్రతం ఆఖరి వారం .  అప్పుడు సుశీల తల్లిని తనకోగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది.  పూర్నకుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది.  కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్లిపోయినది. ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా....  నీ చిన్నతనం లో నీవు బొమ్మలు తో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది.  అప్పుడు తన తల్లి చేసినదానికి క్షమించమని ప్రార్ధించింది.  మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృస్యము అయ్యినది మహాలక్ష్మి.  సరే అని మొదటివారం పులగం, రెండవ వారం అట్లు, తిమ్మనం,  మూడవ వారం అప్పాలు, పరమాన్నము, నాల్గవ వారం చిత్రాన్నం, గారెలు,  పుష్యమాసం లో మొదటి వారం లో పూర్ణపుకుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది.  కధా అక్షింతలు తలమీద వేసుకున్నారు.  అప్పటినుండి ఆమెకు సకలసంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళెను.  కధలోపమైనను వ్రత లోపము కారాదు.  భక్తి తప్పినను ఫలము తప్పదు.  
వ్రతం సువ్రతమస్తు.

మంగళవారం, నవంబర్ 29, 2011

కనకమహాలక్ష్మి

మంగళవారం, నవంబర్ 29, 2011


కనకమహాలక్ష్మి

మార్ఘ్హశిరమాసంలో మా అమ్మమ్మ చేసే పూజలల్లో చాలా ముఖ్యమైనది మార్ఘ్హశిర లక్ష్మివారం పూజ. అమ్మమ్మ చాలా నిష్టగా చేస్తుంది. సంవత్సరంలో పన్నెండునెలలో మార్గశిరమాసం చాలా శ్రేష్టమైనది. ఆనెలలో వచ్చె ప్రతీ గురువారం పూజచేస్తారు. లక్ష్మీదేవికి ఇష్టమైన వారం. అందరు పూజలు చేస్తారు.

అమ్మవారు ఇక్కడ ఇలవేలుపు దేవత. స్థానిక కథనం  ప్రకారం, సంవత్సరం 1912 లో, దేవత శ్రీ  కనక మహా లక్ష్మి అమ్మవారు యొక్క విగ్రహం స్తాపించారు. ఇది మున్సిపల్ లేన్ నడుమ, రహదారి మధ్యలో నిలబెట్టారు. రహదారిని విశాలం చేయటానికి గాను మున్సిపల్ అధికారులు,, రోడ్ మధ్యనుండి రహదారి ఒక మూలకు అమ్మవారి విగ్రహాన్ని మార్చారు. ఈ సమయంలో కాలం సంవత్సరం 1917 ప్రమాదకరమైన అంటువ్యాధి `పట్టణం లో  ప్లేగు  'వ్యాప్తి చెందింది , మరియు చాలా మంది చనిపోయారు.  విశాఖపట్నం ప్రజలు ఈ సంఘటన కు భయపడ్డారు. ఇంత వినాశనం ఎందువల్ల జరిగిందో ఆలోచించారు అప్పుడు దేవత `శ్రీ కనక మహా లక్ష్మి ', యొక్క విగ్రహం యొక్క బదిలీ వలన అని తెలిసి , రహదారి మధ్యలో, దాని అసలు స్థానం కి అమ్మవారి విగ్రహాన్ని మళ్లీ నిలబెట్టిరి.  `ప్లేగు 'వ్యాధి నయమయ్యింది మరియు సాధారణ పునరుద్ధరించబడింది. గ్రామస్తులు అది దేవత. యొక్క మిరకిల్ కారణంగా బలమైన నమ్మకం కలిగివున్నారు అక్కడి ప్రజలు. అందువలన అప్పుడు నుండి చాలా భక్తి తో సేవలు  ద్వారా దేవత ఆరాధన చేస్తున్నారు  అక్కడ గ్రామీణులు తరువాత. ఇంకా, సమీపంలో ప్రజలు `శ్రీ కనక  మహా లక్ష్మి అమ్మవారు  ను MOTHER OF TRUTH  మరియు ఎల్లప్పుడూ వారి అవసరాలు నెరవేర్చును.  ఆమె భక్తులును  అనుగ్రహించును  అని బలమైన నమ్మకం ఉంది. మహిళా భక్తులు దేవత "సుమంగళి" గా వారిని అనుగ్రహించును  ఆమె పైన విశ్వాసాలను కలిగి ఉన్నాయి. దేవత యొక్క భక్తులు దేవాలయానికి కొత్తగా పుట్టిన తమ పిల్లలు రప్పించి, దేవత యొక్క అడుగుల వద్ద ఉంచి మరియు దీవెనలు కోరుకుంటారు.  అక్కడ ప్రజలే కాకుండా దేశ విదేశాలనుండి ప్రత్యకం వచ్చి అమ్మ దర్సనం చేసుకుంటారు.  మార్గశిర మాసంలో ఇక్కడ ప్రజలు చాలా ఎక్కువగా వచ్చి వారి కోరికలు విన్నవించుకుంటారు.  కోరికలు తీరినవారు మొక్కును తీర్చుకుంటారు.   మార్గశిర లక్ష్మివారం చాలా ప్రసిద్దమైనది.  

సోమవారం, నవంబర్ 21, 2011

పొడుపు కధలు విప్పండి

సోమవారం, నవంబర్ 21, 2011

ఈ పొడుపు కధలకు జవాబులు మీకు తెలుసా అయితే చెప్పండి. 

 అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు
కొమ్మకోమ్మకి కోటి పూలు 
అన్ని పూలకు రెండే కాయలు  
ఏమిటవి చెప్పుకోండి చూద్దాం.
[జ] ఆకాశం, చుక్కలు, సూర్యడు, చంద్రుడు  

అమ్మ కడుపున పడ్డాను 
అంతా సుఖాన వున్నాను 
నీచేదేబ్బలు తిన్నాను 
నిలువునా ఎండిపోయాను
నిప్పుల గుండు తొక్కాను 
గుప్పెడు బూడిదను అయినాను 
అయితే నేను ఎవరు మరి?
[జ]పిడక

చూపులేని కన్ను  సుందరమైన కన్ను 
తోటలేని కన్ను తోట కన్ను  
కన్ను కాని కన్ను కాలకంఠుని  కన్ను 
నా కన్ను కాదు మరి ఎవరి కన్ను?
[జ] నెమలి కన్ను

ఆదివారం, నవంబర్ 20, 2011

తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు

ఆదివారం, నవంబర్ 20, 2011

రామదాసు

మంగళంపల్లి బాలమురళీకృష్ణ
తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు
ప్రక్కతోడుగా భగవతుడు మనచక్రధారియై చెంతనెయుండగ 
ముత్చుసోమకుని మును జంపినయా
మత్స్యమూర్తి మన పక్షముండగను 
సురలకొరకు మందరగిరి మోసిన
కూర్మావతారుని కౄప మనకుండగ 
దురాత్మునా హిరణ్యాక్షు ద్రుంచిన
వరాహమూర్తి మనవాడై యుండగ 
భూమి స్వర్గమును పొందుగ గొలిచిన
వామనుండు మనవాడై యుండగ 
ధరలో క్షత్రియులను దండించిన
పరశురాముడు మనపాలిట నుండగ 
దశగ్రీవు మును దండించినయా
దశరథరాముని దయ మనకుండగ 
ఇలలో యదుకుల మందుదయించిన
బలరాముడు మన బలమైయుండగ 
దుష్టకన్సుని ద్రుంచ్నట్టి
శ్రీకృఇష్ణూ మనపై కౄపతో నుందగ 
కలియుగాంతమున కలిగెడి దైవము
కలికి మనలను కావగ నుండగ 
రామదాసుని గాచెడి శ్రీమ
న్నారాయణు నెరనమ్మి యుండగ .

శనివారం, నవంబర్ 19, 2011

ఝాన్సీ లక్ష్మీబాయి

శనివారం, నవంబర్ 19, 2011


వీర నారి ఝాన్సి లక్ష్మిబాయ్ & ఆమె దత్త పుత్రుడు దామోదర్ 
ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక.  ఆమెను అందరు మనూ అని ముద్దుగా పిలిచేవారు.  ఆమె 1828వ సంవత్సరములో మహారాష్ట్ర కు చెందిన ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో వారణాసి లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే, భాగీరథీబాయి. వీరిది సంప్రదా య బ్రాహ్మణ కుటుంబం.  ఝాన్సీ లక్ష్మీబాయికి నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి పెంపకంలో పెరిగింది. డీ.బీ పరాస్నిస్ అనే చరిత్రకారుడు రాణీ నవంబర్ 191835 వసంవత్సరంలో జన్మించినట్లు  ఆయన తెలియజేసారు.  పరాస్నిస్ ఝాన్సి రాణీగారి జీవిత చరిత్రలో పేర్కొన్నాడు. నిజానికి ఆమె పుట్టిన దినముకు ఎటువంటి  చారిత్రక ఆధారాలు లేకపోవడం వలన నవంబర్ 19 ,1828 తేదీని అమోదించవలిసి వుంది.  దీనికి ఆధారం 1854లో జాన్ లాంగ్ అనే ఆంగ్లేయుడు రాణిని కలవడానికి వెళ్ళినపుడు ఆమె వయసు  26 ఏళ్ళ స్త్రీ .   

 ఆమె తల్లి చనిపోయిన తరువాత బాజీరావు పీష్వా, మోరోపంత్‌ను బీరూర్‌కి పిలిచి ఆశ్రయమిచ్చి      ఆదుకున్నాడు. బాజీరావుకు సంతానం లేకపోవటంతో నానాసాహెబ్ అనే బాలుడిని దత్తత చేసుకున్నాడు. నానాసాహెబ్ ను మన మనూ నానా అన్నయా అని ఎంతో ప్రేమగా పిలిచేది.  నానా కూడా మనూను చెల్లెలిగా ఆదరించారు మరియు అన్ని విషయాలలో సహాయంగా వున్నాడు నానా.  వీరు  విద్యలన్నీ కలిసి నేర్చుకున్నారు. కత్తిసాము, గురప్రు స్వారీ, తుపాకీ పేల్చటం వంటి విద్యలంటే మనూకు చిన్నప్పటి నుండే చాలా ఇష్టం ఎక్కువ. ఖడ్గం ధరించి, కళ్లెం బిగించి స్వారీ చేస్తూ నానాసాహెబ్ వెంట మనూబాయి దూసుకొని పోయేది.

లక్ష్మీబాయికి 13వ ఏటనే 1842లో ఝాన్సీ రాజైన గంగాధరరావు నెవల్కార్ తో వివాహమైంది. దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయ్యింది. మహారాణి అయిన తర్వాత అప్పటి ఆచారాల ప్రకారం ఆమె పేరు లక్ష్మీ బాయి అయింది. 1851లో ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఆ పిల్లవాడు నాలుగు నెలలకే బ్రిటిష్ వారి కుట్ర తో చనిపోయాడు.వాసుదేవ నేవల్కర్ కుమారుడైన దామోదర్ రావు అనే పిల్లవాడిని చనిపోవడానికి కేవలం ఒక్క రోజు ముందుగానే దత్తత తీసుకున్నారు. 1853నవంబర్ 21 వ తేదీన గంగాదార్ మరణించాడు.


 దత్తత తీసుకునే సమయానికి డల్హౌసీ భారత గవర్నర్ జనరల్ గా ఉన్నాడు.  హిందూ సంప్రదాయం ప్రకారం దామోదర్‌రావు రాజు కావాల్సి ఉండగా బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించలేదు. లక్ష్మి బాయి ఈస్ట్ ఇండియా కంపెనీ కి చెందిన ఒక లాయర్ రాబర్ట్ ఎల్లిస్ సలహా తో  లండన్ కోర్టులో దావా వేసింది.కోర్టులో ఎంత వాదించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం కలుగలేదు.  బ్రిటిష్ వారు లో ముఖ్యడు నిల్సన్ అనే అతను కుట్రచేసి లక్ష్మి బాయి  పట్టణం విడిచి వెళ్లాలని ఆదేశించారు. కానీ దానికి ఆమె అంగీకరించలేదు.  దానికి మోసపూరితంగా ఝాన్సి లోకి ప్రవేసించి వారు ఝాన్సి రాజ్యాన్ని ఆదినపచుకున్నారు. 1857లో జరిగిన తిరుగుబాటులో ఝాన్సీ పట్టణం లో విప్లవానికి నాంది పలికింది. విప్లవకారులకు కేంద్రం అయింది. ఆ సమయంలోనే ఆమె సైన్యాన్ని సమీకరించి ఆత్మరక్షణ చేసుకుంది. మహిళలకు కూడా యుద్దవిద్యలు నేర్పించినది.  ఆమె పురుషవేషం తో తన దత్త పుత్రుని వీపుకు కట్టుకొని పక్క రాజ్యాలైన దతీయా, ఓర్చాల దాడిని ఎదుర్కొంది. వారిని కూడా తన విప్లవములోపాలుపంచుకోనేటట్టు చేసి చివరకు బ్రిటిష్ సైన్యం పై ఝాన్సీ ముట్టడించింది. రెండు వారాలు పోరాడి ఆఖరికి 1858, జూన్ 17న గ్వాలియర్ యుద్ధం లో మరణించింది.  ఆమె భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాక 19వ శతాబ్దంలో మహిళా సాధికారతకు ఆదర్శ ప్రాయంగా నిలిచింది ఝాన్సి లక్ష్మి బాయి.
ఆమె ఆనాడు మొదలు పెట్టిన విప్లవ జ్యోతి పెద్దగా మారి చివరకు మనదేశం నుండి విదేశీయులు వదిలి వెళ్ళేవరకు   ఆగలేదు.
నిజంగా ఆమెకు head 's off  చెప్పాలి.

శుక్రవారం, నవంబర్ 18, 2011

HAPPY BIRTHDAY TO MICKEY MOUSE

శుక్రవారం, నవంబర్ 18, 2011

HAPPY BIRTHDAY TO MICKEY MOUSE
హాయ్ ! ప్రపంచంలో ఉన్నపిల్లలందరు గుర్తుపెట్టుకుంటున్న కారక్టర్ MICKEY MOUSE . ఈరోజు MICKEY MOUSE BIRTHDAY. అని అందరుకు తెలుసు.మిక్కి మౌస్ అన్నది అమెరికాలోని animal cartoon character ,Mickey Mouse అన్నది Walt Disney అనే కంపనీ నుండి 1928 వ సంవత్సరం లో తయారు చేయబడింది. ప్రతీ సంవత్సరం నవంబర్ 18th న మిక్కి మౌస్ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.  పిల్లలకి రాముడు తెలియక పోవొచ్చేమో కానీ మిక్కి మౌస్ తెలియని వారుండరు.  Mickey Mouse Club లీడర్ మన MICKEY నే.
మిక్కి మౌస్ మొట్టమొదట " plane crazy " అని May 15 న 1928 లో stage program ఇచ్చారు.   దీనిలో మిక్కీ తన సొంత ఇంట్లో తయారుచేసే  విమానం తను  హీరో, చార్లెస్ Lindberg, మరియు వూ మిన్నీసమానమవటానికి చాలా ప్రయత్నిస్తుంది. దీనిని తయారు చేసినవారు Walt Disney , UbIwerks
డబ్బింగ్ చెప్పినవారిలో ముఖ్యులు Walt Disney (1928-1947), Jemmy MacDonald (1947-77),Wayne Allwine (1977-2009), Bret Iwan(2009) వంటి వారు చాలా కష్టపడి మనకోసం తయారు చేసారు.  మన children 's  day celebrations  జరుపుకుంటున్నాం ఆ మధ్యలోనే మన ఇష్టమైన MICKEY     Mouse  Birth Day celebration జరుపుకోవటం నాకు చాలా సంతోషం గా వుంది.  మరి మీకు?  సరే 
ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన cartoon character MICKEY MOUSE BIRTHDAY ,
కావునా నాతో పాటు మీరు కూడా wishes చెప్పండి మరి.

బుధవారం, నవంబర్ 16, 2011

కృష్ణమ్మా

బుధవారం, నవంబర్ 16, 2011

"వీడేనమ్మ కృష్ణమ్మా వేణువు ఊదే కృష్ణమ్మా
ఆవులు కాసే కృష్ణమ్మా వీడే ముద్దుల కృష్ణమ్మా 
కాళ్ళ గజ్జెలు చూడండి మొలలో గంటలు చూడండి
మేడలో దండలు చూడండి తలలో పించము చూడండి
చదువులనిచ్చేకృష్ణమ్మా సంపదలునిచ్చే కృష్ణమ్మా 
పాపల కాచే కృష్ణమ్మా బాలబందుడీ కృష్ణమ్మ
వీడేనమ్మ కృష్ణమ్మ వేణువు ఊదే కృష్ణమ్మ!"

ఆదివారం, నవంబర్ 13, 2011

బాలల దినోత్సవం శుభాకాంక్షలు

ఆదివారం, నవంబర్ 13, 2011


పిల్లల కు ఒక రోజు వుంది.  ఆ రోజు పిల్లలకు ప్రత్యేకమైన రోజు. ప్రపంచవ్యాప్తముగా బాలల దినోత్సవం ను ప్రతి సంవత్సరం  నవంబర్ 20 న జరుపుకుంటారు.

పండితుడు జవహర్ లాల్ నెహ్రూ - నవంబర్ 14  న పురాణ స్వాతంత్ర్య సమరయోధుడు జన్మించినారు.   నెహ్రు గారి పుట్టిన రోజు  వార్షికోత్సవంను బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాము.  మన చాచా  నెహ్రుగారు స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి ప్రధాన మంత్రి .నెహ్రూ గారికి పిల్లలు అంటే చాలా ప్రేమ.  అందుకే  అతని మీద  ప్రేమ తో  బాలల దినోత్సవంతో నెహ్రు గారి  పుట్టిన రోజు జరుపుకుంటారు.

 రోజు పిల్లల సంక్షేమ మా నిబద్ధత పునరుద్ధరణ మరియు చాచా నెహ్రూ గారి కల  ద్వారా ప్రత్యక్షంగా  వాటిని నేర్పినట్టు  ప్రతి ఒకటి గుర్తుచేస్తుంది.




ఈ రోజు మేము అందరం ఫాన్సీ డ్రస్ షో లో పాల్గొంటాం.  ఆదతాం, పాడతాం, ఫుల్ గా ఎంజాయ్ చేస్తాము.  మేము ఎప్పుడు ఎప్పుడు బాలల దినోత్సవం వస్తుందని ఎదురు చూస్తాము. బాలల దినోత్సవం మేము బాగా జరుపుకుంటాము.   మంచిగా మా టీచర్స్ ఇచ్చే బహుమతులు అందుకుంటాము.
నా స్నేహితులకు అందరికి "Happy Children 's  Day " .    

శనివారం, నవంబర్ 12, 2011

Sree Krishna Game

శనివారం, నవంబర్ 12, 2011

గురువారం, నవంబర్ 10, 2011

చందమామ రావో

గురువారం, నవంబర్ 10, 2011

చందమామ రావో జాబిల్లి రావో
కుందనపు పైడికోర వెన్నపాలు తేవో॥


నగుమోము చక్కనయ్యకు నలువపుట్టించిన తండ్రికి
నిగమములందుండే అప్పకు మా నీలవర్ణునికి
జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిర మగనికి
ముగురికి మొదలైన ఘనునికి మాముద్దుల మురారి బాలునికి॥

తెలిదమ్మి కన్నులమేటికి మంచి తియ్యని మాటల గుమ్మకు
కలికిచేతల కోడెకు మా కతలకారి ఈబిడ్డకు
కులముద్దరించిన పట్టెకు మంచి గుణములు కలిగిన కోడెకు
నిలువెల్ల నిండబొయ్యారికి నవనిధుల చూపుల చూచేసుగుణునకు॥

సురలగాచిన దేవరకు చుంచు గరుడునెక్కిన గబ్బికి
నెరవాది బుద్దుల పెద్దకు మా నీటు చేతల పట్టికి
విరుల వింటివాని అయ్యకు వేవేలురూపుల స్వామికి
సిరిమించునెరవాది జాణకు మా శ్రీ వేంకటనాధునికి॥

ఆదివారం, నవంబర్ 06, 2011

క్షీరాబ్ది ద్వాదశి

ఆదివారం, నవంబర్ 06, 2011

తులసి దామోదరుడు 
కార్త్తికంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక శుక్లపక్ష ద్వాదశి. హరిబోధినీ ద్వాదశి అనీ, యోగీశ్వర ద్వాదశి అని , చినుకు ద్వాదశి, కైశిక ద్వాదశి అనీ అంటారు . ఎల్లప్పుడూ క్షీరసాగరంలో దర్సనం ఇచ్చే  శ్రీమన్నారాయణుడు ఈ ద్వాదశిరోజు శ్రీమహాలక్ష్మీ తో కూడి బృందావనానికి వచ్చి తన ప్రియ భక్తులకు దర్శనమిస్తాడట కావునా ఈ ద్వాదశి ని బృందావన ద్వాదశి అని కూడా అంటారు . బృందావనం అంటే మన ఇంట్లో వుండే  తులసి దగ్గర కు వస్తారు  . ఈరోజు బృందావనంలో శ్రీమహావిష్ణువును అర్చించిన వారికి సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు.  మనం ఎప్పుడు దేవుని దగ్గర దీపం వెలిగించినా విలిగించక పూయిన ఒక్క క్షీరాబ్ధి ద్వాదశి రోజు దేవుని దగ్గర దీపం పెడితే సంవత్సరం మొత్తం దీపం వేలిగించినంత పుణ్యం వస్తుంది అని అంటారు.

దూర్వాస మహర్షి వారి చేత శపించ బడి  వారి సిరిసంపదలను, సామ్రాజ్యాన్ని కోల్పోయి తేజోవిహీనుడైన ఇంద్రుడు, తదితర దేవతలు తాము కోల్పోయిన వైభవాన్ని, తేజస్సును తిరిగి పొందడానికి శ్రీమహావిష్ణువు ఆలోచన తో  రాక్షసులతో కలిసి క్షీరసాగరాన్ని మధనం  ప్రారంభించారు. అలా క్షీర సముద్రాన్ని  మధించినరోజు కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశి అనీ, ఆషాఢశుద్ధ ఏకాదశినాడు యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీహరి నాలుగు నెలల తరువాత కార్తిక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కాంచి తొలిసారిగా మనులకు, దేవతలకు క్షీరసాగరం నుండి దర్శినమిచ్చినది ఈ ద్వాదశినాడే కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశిగా పిలువబడుతున్నదని అనేక  పురాణాలు చెప్తున్నాయి. అలా శ్రీహరి క్షీరసాగరం నుండి దర్శనమిస్తున్నప్పుడు కొన్ని చినుకు  చుక్కలు మునుల మీద, దేవతలమీద చిలకరించబడ్డాయట. అందుకే ‘చినుకు ద్వాదశి’ అని కూడా పిలుస్తారు.
క్షీరసాగర మధనంలో ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మిని విష్ణువు వివాహమాడిన రోజు కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజే. అందుకే పవిత్రమయిన ఈరోజు వీరి కల్యాణం జరిపించడం సర్వశుభప్రదమన్న భావనతో విష్ణుస్వరూపమైన ఉసిరి కొమ్మకు, లక్ష్మీస్వరూపమైన తులసికి వివాహం చేస్తారు. ఈరోజే మోహినీ అవతారంతో శ్రీమహావిష్ణువు అమృతం దేవతలకు పంచి ఇచ్చాడట. అందుకనేఈరోజు విష్ణాలయాల్లో స్వామిని మోహినీరూపంతో అలంకరిస్తారు. సుగంధద్రవ్యాలు కలిపిన క్షీరాన్ని అమృత భావనతో భక్తులకు స్వామి ప్రసాదంగా పంచుతారు.
ఈ క్షీరాబ్ది ద్వాదశినే కైశిక ద్వాదశి అని కూడా అంటారు. 

ఈ ద్వాదశి మీద అన్నమాచార్యులు వారు ఈ పాటను రచించారు .
దినమో ద్వాదశి.

దినము ద్వాదశి నేడు తీర్థదివసము నీకు
జనకుడ అన్నమాచార్యుడ విచ్చేయవే

అనంతగరుడ ముఖ్యులైన సూరిజనులతో
ఘననారదాది భాగవతులతో
దనుజ మర్దనుండైన దైవశిఖామణితోడ
వెనుకొని యారగించ విచ్చేయవే

వైకుంఠాన నుండి యాళువారలలోపల నుండి
లోకపు నిత్యముక్తులలోన నుండి
శ్రీకాంతతోడ నున్న శ్రీవేంకటేశు గూడి
యీకడ నారగించ నింటికి విచ్చేయవే

సంకీర్తనముతోడ సనకాదులెల్ల బాడ 
పొంకపు శ్రీవేంకటాద్రి భూమి నుండి
లంకె శ్రీవేంకటగిరి లక్ష్మీవిభుడు నీవు
                                                                                    నంకెల మాయీంటి విందు లారగించవే

అబ్బురంపు శిశువు


అబ్బురంపు శిశువు ఆకుమీది శిశువు
దొబ్బుడు రోలు శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి

పుట్టు శంఖు చక్రముల బుట్టిన యా శిశువు
పుట్టక తోల్లే మారుపుట్టువైన శిసువు
వొట్టుక పాలువెన్నలు నోలలాడు శిశువు
తొట్టెలలోన శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి

నిండిన బండి తన్నిన చిన్ని శిశువు
అండవారి మదమెల్ల నణచిన శిశువు
కొండలంతేశసురుల గొట్టిన యా శిశువు
దుండగంపు శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి


వెగైన వేంకటగిరి వెలసిన శిశువు
కౌగిటి యిందిర దొలగని ఆ శిశువు
ఆగి పాలజలధిలో నందమైన పెనుబాము
తూగుమంచము శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)