Blogger Widgets

Thursday, December 15, 2011

తిరుప్పావై ప్రధమ పాశురము

Thursday, December 15, 2011

ఈ ధనుర్మాసం వ్రతం చాలా శ్రేష్టమైనది.  ఈ నెలరోజులు సూర్యోదయానికి మునుపే నిద్ర లేచి భగవంతుని ఆరాధించాలి.
ఈ వ్రతాన్ని త్రేతాయుగంలో భరతుడు ఆచరించాడు.  ద్వాపరయుగంలో గోపికలు శ్రీ కృష్ణుని భర్తగా కోరి ఈ నెలరోజులు కాత్యాయనీదేవి వ్రతం చేస్తారు.  ఈ వ్రతము మనము కూడా చేద్దాం.  అయితే మొదటి రోజు పాశురం గురించి మనం తెలుసుకుందాం   చుక్కలు పెట్టిన పాసురము నాకు విశేష నివేదన స్వామివారికి అర్పించాలి .

*మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
  నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
  శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
  కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్
  ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
  కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
  నారాయణనే నమక్కే పఱైతరువాన్
  పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్
 

తాత్పర్యము:   ఆహా మనము అవలంభించిన వ్రతమునకు మిక్కిలి అనుకూలమైన సమయము వచ్చింది కదా.
ఈ మార్గశిరమాసమును శ్రీ కృష్ణులు వారు  మాసములలో మార్గశిరమాసము తన స్వరూపముగా భగవద్గీతలో చెప్పారు.  మార్గశిరమాసము అనగా మనము అవలంభించిన మార్గమునకు శిరస్సు అని ( అతి ప్రదానమైన సమయము అని భావము)  " వాసుదేవతరుచ్చాయానాతిశీతానఘర్మదా" అంటే శ్రీ కృష్ణుడనే చెట్టు యొక్క నీడ ఎక్కువ చల్లనిదీ కాదు, ఎక్కువ వేడిదీ కాదు అని అర్ధము.  వాసుదేవస్వరూపమైన మార్గశిరమాసము కూడా సమశీతోష్ణముగా వుండు కాలము.  మనము మేలుకొనే సమయము బ్రాహ్మీముహూర్తము మరియు ఈ మార్గశిరమాసములో పైరులు పండి పెరిగి ఉండే కాలము.  అతి మనోహరముగా వుంది వెన్నెలను వెదజల్లు శుక్లపక్షము.  పవిత్రమైన దినము వ్రతము ప్రారంభించమని మనకు కాలమును ప్రకాసించుటలోని భావము.
భాగవత్సమాగమమును కోరి భగవంతుని సంతోషపెట్టుటకై పనులోనర్చునట్టి సమయము సంప్రాప్తించుటచే ఉత్తమోత్తమ సమయము అని ఆహ్లాదమును వెల్లిబుచ్చుట యందలి తాత్పర్యము.  చెలికత్తెలను మేల్కొని స్నానముచేసి, రండని పిలుచునపుడు "  ప్రకృతి మండలము అందనంత అనుభవించువారలారా! అని ఆండాళ్ళు సంబోధించింది.  ఈ పిలుపులో ఒక సుందరమైన భావము కలదు.  పమపదమున నివాసము కంటే గోకుమను ప్రకృతిమండలమున నివసించుటచే భగవంతునితో కలసి మెలసి మహానందము అనుభవించుట మహాభాగ్యముగా లభించును.  అందుచే పరమపదమును ఎవగించుకోనుట సంభోధనలోని సౌందర్యముగా గ్రహింపదగును.0 comments:

Post a Comment

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers