Blogger Widgets

మంగళవారం, డిసెంబర్ 27, 2011

తిరుప్పావై త్రయోదస పాశురము

మంగళవారం, డిసెంబర్ 27, 2011

వెనుకటి పాశురమున గోపికలును మేల్కొలుపుచు కృష్ణ సంకీర్తనం మాని శ్రీ రామ చంద్రుని గుణగణాలను సంకీర్తనం చేస్తూ శ్రీరాముడు మనోభిరాముడని గోపికలు అంటున్నారు.  దానిని విని నందవ్రాజమున సంచలనం ఏర్పడింది.  మధురలో పుట్టి శ్రీకృష్ణుడు గోపవంసమున చేరి తాను కూడా గోపాలుడే అనునట్లు కలసిమెలసి ఉంది వారిని కాపాడుచుండగా అలాంటి కృష్ణుని విడిచి రాముని కీర్తించుట ఏమి అన్యాయము? అప్పుడు అయోధ్యలో ప్రజలు రాముడు, రాముడు, రాముడని యనుచుండెడి వారు.  కానీ ఇతర ప్రస్తావనే లేదు కదా ! నందవ్రజమున మాత్రం కృష్ణుని తప్ప అన్యుని కీర్తించుట ఏమి హేతువు? శ్రీ రాముడా! మనోభిరాముడా.  రామునికంటే కృష్ణుడే సౌందర్యవంతుడు గదా అని ఇలా అనవద్దని కోపికలు వివాదంలో పడిరి.  రాముని కీర్తిమ్చినవారు రాముడుకు కృష్ణునికి పోలికలు చెప్పి ఇద్దరు ఒక్కరే అని నిరూపించి గెలిచినారు.  అప్పుడు ఇద్దరినీ కీర్తించుదుము అనుకొన్నారు.  ఈ పాసురములో మేల్కొల్పబడుచున్న గోపిక నేత్ర సౌందర్యమున విశిష్టస్థానం కలది.  తన నేత్ర సౌందర్యము వుండటం వల్ల ఆ కృష్ణుడు వేదక్కొని రాక ఎలా వుందగలడు అని భావించి ఆమె దైర్యముగా ఇంటిలోనే పరుండివున్నది.  ఇక్క నేత్రము అనగా ఙ్ఞానము.  ఙ్ఞానము కల చోటకు కృష్ణుడు తప్పక వచ్చును కదా అది ఆమె భావం.  అలాంటి గోపికను నేడు ఎలా మేల్కొల్పుచున్నారో చూద్దాం.   
పాశురము:
  పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై 
పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై
కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్
పిళ్ళైగళ్ ఎల్లారుం పావైక్కళం పుక్కార్
వెళ్ళి యెరుందు వియారం ఉఱంగిత్తు
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పోదరి క్కణ్ణినాయ్
కుళ్ళ కుళిర క్కుడైందు నీరాడాదే
పళ్ళి క్కిడత్తియో పావాయ్! నీ నన్నాళాల్
కళ్ళం తవిరుందు కలంద్-ఏలోర్ ఎంబావాయ్




తాత్పర్యము :


పక్షి శరీరమున ఆవేశించిన బకాసురుని నోరుచీల్చి తన్ను కాపాడుకొని మనను కాపాడిన శ్రీ కృష్ణుని, దుష్ట రాక్షసుడగు రావణుని పది తలలను హేలగా చిగుళ్ళు త్రుపినట్లు త్రుంపి పారవేసిన శ్రీ రాముని గానముచేయుచూ  పోయి మనతోడి పిల్లలందరును వ్రత క్షేత్రమును చేరినారు. లోపల ఉన్న తుమ్మెదగల తామరపూలను పోలిన కన్నులు కలదానా !
లేడిచూపులు వంటి చూపులు కలదానా ! శుక్రుడు ఉదయించుచున్నాడు . గురుడు అస్తమించుచున్నాడు . పక్షులు కిలకిల కూయుచున్నవి . కృష్ణ విరహ తాపము తీరునట్లు చల్లగా అవగాహన మొనర్చి స్నాన మోనర్పక పాన్పుపై ఏల పడుకున్నావు. ఓ సుకుమార స్వభావురాలా! ఈ మంచి రోజున నీవు నీకపటమును వీడిచి మాతో కలసి ఆనందము అనుభవింపుము.


విశేషార్ధం:
పుళ్ళిన్ వాయ్ కీండానై:
అసురావేశము కలిగిన కొంగనోటిని చీల్చిన వానిని ముందుగా గోపికలు శ్రీ కృష్ణుని కీర్తించుచున్నారు.  భాగవత్ప్రాప్తికి భగవంతుడే ఉపాయం అని నిశ్చయము కల్గుటకు దంభము, అహంకారము, ప్రదానమైన శత్రువులు.  ఆ రెండిటిని తొలగించి తానే ఉపాయం అని చెప్పుటకు బకాసుర వధ వృత్తాంతము కీర్తిస్తున్నారు. తరువాత రావణవధ వృత్తాంతం ప్రస్తావిస్తునారు.  వారు అంతకుముందే రాముడు కృష్ణుడు ఒకటే అని వారి కీర్తిని కీర్తిస్తున్నారు. ముందుగా కృష్ణుని తరువాత రాముని వృత్తాంతమును కీర్తింస్తున్నారు.
ప్పొల్లావరక్కనై  కిళ్ళి క్కళైందానై :
దుష్ఠరాక్షసుని గిల్లి పారవేసిన వానిని కీర్తించుచున్నారు. తమకు పరిచయమున్న కృష్ణుని వృత్తాంతము కీర్తిచి తరువాత తమతో సజాతీయయగు సీతాదేవిని విడచియుండలేక ఎంతో వ్యధ చెందిన సౌజన్యమూర్తి యని శ్రీ రాముని కీర్తిస్తున్నారు. శరీరమును ఆత్మను విడదీసినట్లు తల్లిని తండ్రిని ఒకచోట వుండనీక వారికి ఎడబాటు కల్గించిన నిక్రుష్టుడు  రావణుడు.  సర్వేశ్వరుని నుండి లక్ష్మిని విడదీయగాలిగిన రాక్షసుడు వేరొకడు లేదు అందుచే దుష్టరాక్షసుడు అంటున్నారు.  అలా అనగానే దుష్టరాక్షసుడు అనగానే స్పురించేది రావణునిపీరు మాత్రమె.  వారు పేరు కూడా చెప్పటంలేదు. అలాంటి వారిద్దరిని కీర్తిస్తున్నారు గోపికలు.
కీర్-త్తిమై పాడి ప్పోయ్:
కీర్తినిపాడి కొనుచూపోయి,  గోపికలు వ్రతము చేసే స్థలమునకు చేరిరి.  కీర్తనే ఆధారంగా చేసుకొని వ్రాతముచేయుతకు గోపికలు ముందుకు సాగుతున్నారు.
పిళ్ళైగళ్ ఎల్లారుం పావైక్కళం పుక్కార్:
పిల్లలందరును వ్రతముచేయు క్షేత్రమునకు చేరినారు.  కృష్ణుని పొందుటకు నిర్ణయించబడిన స్థలమునకు ముందుగానే పోయిరి.  నీవును మేల్కొని రమ్ము అని లోనున్న గోపికను ఆహ్వానించిరి.  ఆమె యొక్క కృష్ణ సమాగామునందు ఆతురత గల గోపికలు ఆగలేక ముందుగానే వెళ్ళిపోయారు.  కానీ వారు వెళ్ళుట తెల్లవారుటకు గుర్తు అవునా! కావునా వేరే గుర్తు చెప్పండి అనగా తెల్లవారినది అనుటకు వేరే గుర్తు చెప్తున్నారు. 
వెళ్ళి యెరుందు వియారం ఉఱంగిత్తు:
శుక్రుడు ఉదయించుచున్నాడు . గురుడు అస్తమించుచున్నాడు. గొల్లవారుఅగుటచే వీరు నక్షత్రములను బట్టియే వారికి తెల్లవారుట గుర్తిస్తారు.  శుక్రుడు ను ఙ్ఞానాముగా, గురుడును అఙ్ఞానముగా వీరు తలంతురు. అదే చెప్పిరి లోన వున్నా కోపిక మీరు సంతతము కృష్ణ పరమాత్మ సంస్లేషమునే కోరినవారాగుటచే మీకు తెల్లారినట్టు అనిపిస్తోంది. నక్షిత్రాలన్ని మీకు శుక్రుడుగా, గురుడుగానే కన్పిస్తున్నాయి.  అందుచే నమ్మదగిన ప్రాభాతిక చిహ్నము కాదు అని లేవకుడా పడుకున్నది.  అప్పుడు వేరొక గుర్తులు చెప్పుచున్నారు గోపికలు.
 పుళ్ళుం శిలమ్బిన కాణ్ :
పక్షులు ధ్వని చేయుచున్నవి.  వెనుక 6 , 7  పాసురములో పక్షులుగురిమ్చి వచ్చింది మళ్లీ ఇక్కడ కూడా పక్షుల కిలకిల రవములు పేర్కొనబడినది.  పక్షులు అనగా ఆచార్యులని మనం ఇదివరకే అనుకున్నాం.  భగవంతుని అనుభవించమని నిస్తులగు ఙ్ఞానులు మేల్కొల్పును అవి వేల్లుబుచ్చే పలుకులే మొదటి కాలం.  ఆ భగవద్ అనుభవం నీవు ఒకదానివె అనుభవించుట తగదు అంటున్నారు.  కానీ ఈమె వీరి మాటలును లెక్కచేయక మాటాడక పడుకుమ్డెను.  అలా పడుకోనుటకు ఆమె నేత్ర సౌందర్య గర్వమే అని ఆమె నేత్ర సౌందర్యమును ప్రసంసిస్తున్నారు.
పోదరి క్కణ్ణినాయ్:
తామరపూలు మద్య తుమ్మెద ఉన్నట్లు ఒప్ప్చున్న కన్నులున్నదానా!  తామరపువ్వుతో పోటీపడు కనులుకలదానా! ఇటు అటు సంచరించు లేడి కళ్ళను పోలు కనులు కలది అనుతచే మౌనము స్పురించును.  ఇలా పరిపూర్ణ బ్రహ్మనుభావమున మునిగియున్న ఈమెను నేడు మేల్కొల్పుచున్నారు.
కుళ్ళ కుళిర క్కుడైందు నీరాడాదే పళ్ళి క్కిడత్తియో:
చల్లగా చల్ల్బడునట్లు మునిగి స్నానము చేయక పానుపు పై పడుకొని ఉంటావా? భక్తులగు మాతో భాగావదనుభావం పొందుటకు మాతో రావా?  మాతో కలిసి గుణానుభవ మొనర్చి భాగవత్సార శ్లేష మొనర్చాలి అని అర్ధిస్తున్నారు.
పావాయ్!:
సుకుమారమైన స్త్రీ త్వము కలదానా నీవు కృష్ణుని తో కూడి ఉండి మమ్ములను అనుగ్రహించు.
నీ నన్నాళాల్:
మంచి రోజులు కదా.  ఈ గోపికలు లోపలున్న గోపిక యోగ్యతా గుర్తించి భగవదనుభవ యోగ్యతా కలిగి ఏకాంతముగా నీవిట్లుండుట.  ఆ కృష్ణుని మనసునకు కూడా భాద కలిగించును మాతో వచ్చి వానిని అనుభవించు.
కళ్ళమ్ తవిరుందు కలన్దు:
కపటమును వీడి కలువు. కృష్ణుని అనుభావస్తున్నట్టు భావించి వీరు నీవు ఆడుతున్న నాటకాలు చాలు ఇక రా అని అంటున్నారు.  ఇలా ఈ పాసురమున గల అన్ని సన్నివేసమును బట్టి, సంబోధనమును బట్టి పెరియాళ్వారు ఈ పాసురమున ప్రబోధించినట్టు తెలుస్తోంది.
జై శ్రీమన్నారాయణ్

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)