Blogger Widgets

Sunday, January 15, 2012

కనుమపండుగ

Sunday, January 15, 2012


సంక్రాంతి మరుసటి రోజయిన కనుమ పండుగను వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడు వాదోడు ఉన్నందుకుగాను  పశువులకు శుభాకాంక్షలు తెలుపటానికి జరుపుతారు. 
 కొన్ని ప్రదేశాలలో ఎడ్లు పందాలు జరుపుతారు. మరికొన్ని ప్రాంతాలలో కోడి పందాలు కూడా పోటీలు నిర్వహిస్తారు. అయితే ఆ పందాలను నిరవహించేటందుకు వాటిని హింసిస్తారు.  అది మాత్రం బాగోలేదు. ఇలా చేయటం చట్టరీత్యా నేరం. జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. రైతులు ఈ రోజున వారి పొలంలో వనభోజనాలను కూడా నిర్వహిస్తుంటారు.  
కనుమపండుగనాడు మినుము తినాలనేది సామెత. దీనికి గాను గారెలు, ఆవడలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. 
కనుమ మరునాటిని ముక్కనుమ అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు. దక్షిణ భారతదేశం లోని ప్రజలు ఈ పండుగ మూడు రోజులను శ్రద్ధాసక్తులతో జరుపుకుంటారు. కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్ర దేశాన ఆనవాయితీగా వస్తూంది. మాంసా హారులు కాని వారు, గారెలుని తింటారు. అలాగే కనుమ రోజున ప్రయాణాలు కూడా చేయరు.  
కనుమరోజు కాకి కూడా ప్రయాణం చేయదు అంటారు ఇంకో సామెత కూడా వుంది కనుమ రోజు కాకి కూడా నిండా స్నానం చేస్తుందిట. ఈ కనుమరోజు ముత్తైదువలు, ఆడపిల్లలు చాలా అందంగా తయారు అవుతారు. కళ్ళనిండా కాటుక పెట్టుకుంటారు.  కాళ్ళకు పసుపు పారాణి పెట్టుకుంటారు.  అలా కనుమరోజు అందంగా తయారు అయితే కలకాలం అలా నిండుగా వుంటారని అంటారు.  
ఈ మూడురోజులు మనము పూర్తిగా సంతోషం గా గడిపాం కదా.  ఈ రోజు మన ఇంట్లో వుండే పశువులకు పూజ చేసి వాటికి కృతఙ్ఞత తెలుపుకుంటున్నారు.  ఈ నెలరోజులు వాకిట అందమైన ముగ్గులు తో అలంకరిస్తాము కదా.  ఈ కనుమరోజును మాత్రము రధము ముగ్గువేసి ఆరధమును వీదిచివరి వరకు లాగినట్టుగా ముగ్గు వేస్తారు.  దీని అర్ధము సూర్యుడు తన దిశను మార్చుకున్న మొదటిరోజు అని తెలుస్తున్నది.  ఈ కనుమ పండుగను బాగా జరుపుకోవాలి అని తలుస్తున్నాను.  అలాగని పసుపక్షులను భాదించకండి. 

0 comments:

Post a Comment

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers