Blogger Widgets

సోమవారం, ఫిబ్రవరి 13, 2012

జయహో నైటింగేల్ ఆఫ్ ఇండియా

సోమవారం, ఫిబ్రవరి 13, 2012



సరోజినీ నాయుడు ఫిబ్రవరి 13, 1879  న హైదరాబాద్‌లో జన్మించారు. ఈమె తండ్రి పేరు అఘోరనాధ చటోపాధ్యాయ. తల్లి వరదసుందరీదేవీ. తల్లిదండ్రులిద్దరూ విద్యావేత్తలు కావటంవలన విద్యావ్యాప్తికి ఎంతో కృషి చేసేవారు. ఆ రోజుల్లో స్రీ విద్య గురించి అనేక ఆంక్షలుండేవి పెద్ద కుటుంబాల వారెవ్వరూ తమ ఆడపిల్లలను పదవ తరగతి మించి చదివించేవారు కాదు. అటువంటి సమయంలో వారిద్దరూ స్త్రీ విద్య గురించి ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి వారిని పై చదువులు చదివించడానికి ప్రోత్సహించారు.   సరోజినీ దేవిగారు 1891లో జరిగిన మెట్రిక్ పరీక్షలో మొత్తం రాష్ట్రంలో ప్రధమ స్థానం సంపాదించారు, అందరి మన్ననలు పొందారు. నిజాం నవాబు సంతోషించి, ఆమెను విదేశాలకు పంపి చదువు చెప్పించాలని నిర్ణయంచుకొని, ఆమె తండ్రికి ఆ విషయంచెప్పి, ఒప్పించి తాను అనుకున్నది సాధించాడు. సరోజినీదేవికి చిన్నతనం నుంచి కవిత్వమంటే ఎంతో ఇష్టం.  ఈమె భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర సమరయోధురాలు మరియు కవయిత్రి. సరోజినీ దేవి భారత జాతీయ కాంగ్రేసు తొలి మహిళా అధ్యక్షురాలు మరియు స్వతంత్ర భారత దేశపు తొలి మహిళా గవర్నరు కూడా.
నిజాము పాలనలో అప్పటి హైదరాబాదులో స్త్రీల చదువుకు సరైన సౌకర్యాలు లేకపోవడం వలన ఆమె మద్రాసులో చదువుకున్నది. 15 సంవత్సరాల వయసులో ఈమె దక్షిణాదికి చెందిన డా. ముత్యాల గోవిందరాజులు నాయుడు ను కలిసి ప్రేమించింది. చదువు పూర్తయిన తర్వాత 19 సంవత్సరాల వయసులో ఆయనను కులాంతర వివాహము చేసుకున్నది. కులాంతర వివాహములకు సమాజము చాలా వ్యతిరేకముగా ఉన్న ఆ రోజుల్లో సరోజిని గోవిందరాజులు నాయుడును బ్రహ్మో వివాహ చట్టము (1872) ప్రకారము 1898 డిసెంబర్ 2న మద్రాసులోపెళ్ళి చేసుకున్నది. వీరి వివాహాన్ని ప్రముఖులు కందుకూరి వీరేశలింగం పంతులు దగ్గరుండి జరిపించాడు. 
గాంధీజీ ఉప్పుసత్యాగ్రహం ప్రకటించటంతోటే, ఈమె దానిలో పాల్గొనింది. సరోజిని నాయుడు 1925 లో భారతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలిగా ఎన్నికైన మొదటి భారతీయ మహిళ. ఈమె స్త్రీ విమోచన కోసమూ, అస్పృశ్యతా నివారణ కోసమూ, ఆసక్తితో కృషి చేశారు. ఈమె గొప్ప కవయిత్రి. ఈమె అనేక పద్యాలను, ఆంగ్లంలో 'గోల్డెన్ త్రెషోల్డు', 'బర్డ్సు ఆఫ్ టైం', 'ఫెదరర్ ఆఫ్ ది డాన్' అనే గ్రంథాలను రచించారు. ఈమెను 'భారతదేశపు కోకిల' అన్నారు. 1947 లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత ఉత్తరప్రదేశ్ గవర్నరుగా నియమితులైనారు.
ఆమె ఇంగ్లీషులో కవిత్వం రాసింది. ది గోల్డెన్ త్రెషోల్డ్, ది బర్ద్ ఆఫ్ టైం, ది బ్రోకెన్ వింగ్, పాలంక్వైన్ బేరర్స్ ఆమె కవితల్లో కొన్ని.
హైదరాబాదు లోని  గోల్డెన్ త్రెషోల్డ్ అనేపేరుతో గల ఆమె ఇంటిలో హైదరాబాద్ యూనివర్సిటీని నెలకొల్పారు.
1912లో ఆమె గోపాలకృష్ణ గోఖలేని కలిసింది. వారితో మాట్లాడినప్పుడు ఎంతో ఉత్తేజం పొందింది. హిందూ ముస్లిం ల సఖ్యత గురించి ఆయన అభిప్రాయాలను తెలుసుకొని ఎంతో సంతోషించి, తన శేష జీవితాన్ని ఆ అద్భుత కార్యాన్ని నెరవేర్చటం కొరకు అంకితం చేయాలని ఆక్షణంలోనే నిర్ణయించుకుంది. అదే సంవత్సరం మార్చి నెల 22న లక్నోలోనే జరిగిన ముస్లింలీగ్ మహాసభలో పాల్గొనడానికి వెళ్ళింది. ఆనాటి సభలో సరోజినీ నాయుడు ప్రసంగిస్తూ "సోదర సోదరీ మణులారా! ఒక గడ్డపై పుట్టిన మన మధ్యలో మతం అనే అడ్డు గోడ మన ఐక్యమత్యానికి అడ్డువస్తుంది. మన ఆచారవ్యవహారాలు ఒకటే, మనందరి రక్తం ఒకటే, మనం మొదట భారతీయులం. అది అందరూ గుర్తించాలి, అలాగే భగవంతుడనేవాడూ ఒక్కడే ఉంటాడు. అది వారి విశ్వాసాలను బట్టి వుంటుంది. కొందరు "రామ" కొందరు "రహీం" కొందరు "జీసస్" అంటారు. ఇలా పలురకాలుగా ప్రార్ధిస్తుంటారు. ఎవరి విశ్వాసాలు వారివి, ఎవరి ఆచార వ్యవహారాలు వారివి. ఒక మతం వారు మరొక మతం వారిని విమర్శించడానికి ఏమాత్రమూ హక్కులేదు, అది అధర్మం మన మందరం ఒక కుటుంబ సభ్యులుగా ఉందాం, మనపై అధికారం చెలాయిస్తున్న ఆంగ్లేయ రాక్షసులను తిప్పికొడదాం. రండి ఏకం కండి హిందూ ముస్లిం భాయి భాయి" అంటూ అనర్గళంగా ప్రసంగించింది, ఆమె వాగ్ధాటికి ముగ్ఢులై ప్రేక్షకులు "హిందూ ముస్లిం భాయి భాయి" అనే నినాదం మిన్నంటేలా చేశారు. ఆ సమావేశంలో ఆ ప్రసంగం గొప్ప మార్పు తీసుకువచ్చింది. మహమ్మదీయులు ఆనాటి సభలో హిందువులతో కలసి జీవించడానికి, ఆంగ్లేయులను దేశమునుంచి పంపివేయడానికి గట్టినిర్ణయం తీసుకున్నారు. ఆ నాటి నుంచి స్వాతంత్ర్యం పొందే వరకు ఆమె నిర్విరామంగా కృషి చేసింది. 1949 మార్చి 2వ తేదీన అర్ధరాత్రి లక్నోలో కన్నుమూసింది ఆ నారీమణి.  ఈమె జీవితమూ పలువురు నారీమణులకు ఆధార్సాప్రాయము.  భారతీయులు గర్వించదగ్గ గొప్ప ఆదర్శ మహిళా సరోజనీ నాయుడు.
జయహో నైటింగేల్ ఆఫ్ ఇండియా

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)