Blogger Widgets

Saturday, February 11, 2012

పానుగంటి వారు

Saturday, February 11, 2012


పానుగంటి లక్ష్మీ నరసింహరావు ఫిబ్రవరి 11 ,1865 న జన్మించారు.  రాజమండ్రి తాలూకా సీతానగరంలో జన్మించాడు. వీరి తల్లిదండ్రులు రత్నమాంబ మరియు వేంకటరమణయ్య. తండ్రి రాజమండ్రిలో పేరుపొందిన ఆయుర్వేద వైద్యులు. లక్ష్మీ నరసింహరావు గొప్ప తెలుగు సాహితీవేత్త. సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి ఎనలేని కీర్తిని సంపాదించారు. ఈయన రచయితగా మంచి పేరు సంపాదించుకున్నారు. లక్ష్మి నరసింహారావు గారిని జనులందరు  'కవిశేఖరుడ'నీ, 'అభినవ కాళిదాసు' అనీ, 'ఆంధ్ర ఎడిసన్' అనీ, 'ఆంధ్ర షేక్ స్పియర్' అనీ బిరుదులను ఇచ్చి సత్కరించారు.
మా అమ్మమ్మ వాళ్ళ ఊరు లక్ష్మీనరసాపురం జమిందారిణి రావు చెల్లయమ్మ గారి దివానుగా చేరారు. ఆరు సంవత్సరాల తర్వాత అభిప్రాయభేధాల మూలంగా ఉద్యోగం మానివేశారు. తరువాత ఉర్లాము సంస్థానం లోను, బళ్ళారి జిల్లాలోని ఆనెగొంది సంస్థానంలోను దివానుగా కొంతకాలం పనిచేశారు.
పిఠాపురం మహారాజా శ్రీ సూర్యారావు బహదూరు వారికి మైనారిటీ తీరగా రాజ్యాధికారం చేపట్టిన తర్వాత పంతులుగారిని 1915-16 మధ్య 'నాటక కవి'గా తమ ఆస్థానంలో నియమించారు. వీరి కోరికపై అనేక నాటకాలు వ్రాసారు. వాటి నన్నింటిని మహారాజుగారే అచ్చువేయించారు.
సుమారు ఇరవై సంవత్సరాలు వీరికి జీవితం సుఖంగా జరిగింది. ఆ రోజుల్లో దివాణం తరువాత వ్యయానికి వీరి గృహమే అనేవారు. ఆధునిక శ్రీనాధునిగా జీవించారు. వాణి సంఘములో చురుకైన సభ్యునిగా ఉండేవాడు.
ఉద్యోగాల వలన మరియు రచనల వలన వీరు విశేషంగా డబ్బు గడించినా దానిని నిలువచేయడంలో శ్రద్ధ కనపరచలేదు. ఆధునిక శ్రీనాధుని వలెనే అనుభవించినన్నాళ్ళూ బాగా అనుభవించి, తుది రోజులలో పేదరికానికి ఋణబాధకు లోనయ్యారు. మహారాజావారు బాగా పోషించినా, పంతులుగారికి తుదిదశలో వైషమ్యాలేర్పడి, తమదగ్గర ఏనాడో చేసిన ఋణం కొరకు వారికి ఇచ్చే నూటపదహారు రూపాయల గౌరవ వేతనం వేతనంలో కొంతభాగం తగ్గించడానికి ఉత్తర్వులు జారీచేశారు. వృద్ధాప్యంలో వీరు అటు ఇటు తిరిగి సంపాదించలేకపోయారు. చేతికి అందివచ్చిన కుమారులు ఉన్నా వారిని ఉద్యోగాలకు పంపలేకపోయారు. 
కవి శేఖరుని దుస్థితి గురించి పానుగంటి వ్రాసిన లేఖను ఆంధ్రపత్రికలో యర్రవల్లి లక్ష్మీనారాయణ ప్రచురించాడు - నాకెవరును దానధర్మము చేయనక్కరలేదు. తగ్గింపు ధరలకు నూటయాభై సెట్ల పుస్తకాలు యాభై మంది కొని, నా మానుషమును కాపాడినను, నాకు సివిలు ఖైదు తప్పును.  
1933 నుండి శారీరకంగా, మానసికంగా వీరి ఆరోగ్యం చెడిపోయింది. 1935 లో పిఠాపురంలో సప్తరిపూర్త్వుత్సవాలు పురజనులు సన్మానించారు. పరిస్థితులు మారి, తీవ్ర మనస్తాపంతో ఈయన అక్టోబరు 7న, 1940లో మరణించాడు. పానుగంటి వారు చివరి పరిస్తితిలో ఆయన పడిన మానసిక వేదన, పేదరికము చాలా బాధకలిగిస్తున్నది.  ఈ మహాకవికి మన తెలుగు ప్రజలు తరుపున నివాళ్ళు అందిస్తున్నాను.

3 comments:

 1. చిట్టి బంగారు,
  మంచి విషయం రాశావమ్మా.. అప్పట్లో మనసాహిత్యలోకం లో చతుర్ముఖ నరసిన్ హాలు అని నలుగురు ఉండేవారట. వాళ్ళల్లో ఒకరు పానుగంటివారు మరొకరు చిలకమర్తి వారు. మిగిలిన ఇద్దరూ ఎవరో నాకూ తెలియదు. :(
  ఇలానే మన సాహిత్యం లోని గొప్పవాళ్ళ గురించి తెలుసుకుని నలుగురికి చెబుతూ ఉండూ..

  -కార్తీక్.

  ReplyDelete
 2. చాలా బాగా రాశావు వైష్ణవి. నీ మూలంగా ఆ మహనీయుని మరో సారి స్మరించుకునే అవకాశం కలిగింది.నీ నుంచి ఇంకా మంచి మంచి టపాలు రావాలని ఆశిస్తున్నాను.

  ReplyDelete
 3. కార్తీక్, శంకర్ అంకుల్స్ మీకు నా పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదములు.

  ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers