Blogger Widgets

Thursday, March 08, 2012

చింతా. రామకృష్ణా రావుగారి సన్మాన చాయా చిత్రాలు.

Thursday, March 08, 2012

ప్రజా పత్రిక వీక్లీ 85 వ వార్షికోత్సవంలో మా తాత గారు చింతా  రామకృష్ణా రావు గారి కి సన్మానం చేసారు.  దానికి గాను తాత గారు వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. వారి మాటలతో పాటు సన్మాన ఛాయాచిత్రాలు ఇక్కడుంచాను.


ప్రజా పత్రిక వీక్లీ 85 వ వార్షికోత్సవంలో అవ్యాజానురాగంతో నన్ను సత్కరించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉండవిల్లి అరుణ కుమార్ గారు, నెల్లూరుకు చెందిన జమీన్ రైతు పత్రికా సంపాదకులు గౌరవనీయులు శ్రీ యన్. డోలేంద్ర ప్రసాద్ గారు, మహామహోపాధ్యాయ శ్రీ విశ్వనాధ గోపాల కృష్ణగారు, జాతీయ బహుమతి గ్రహీత శ్రీ దివాన్ చెరువు శర్మగారు, డా. జాంపండు మాష్టారు, ప్రజా పత్రిక నిర్వాహకులు శ్రీమతి రమాదేవి గారు, గౌరవ నిర్వాహకులు యస్.సుదర్శన్ గారు, ప్రజాపత్రిక కుటుంబ సభ్యులు, మున్నగు  యావన్మందికీ నా హృదయ పూర్వక ధన్యవాదములు తెలియజేసుకొంటున్నాను.

మరి సన్మానానికి సంభందించిన కొన్ని చాయా చిత్రాలు ఇవిగో.తాతగారి  " ఆంధ్రామృతం "  అంతర్జాల పత్రికలో గల రచనలను చూచి, " శ్రీ వేణుగోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము మున్నగు వానిని పఠించి, మీ రచనా పటిమను గుర్తించి జరిపిన సాన్మానమునకు తాతగారు  నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

2 comments:

  1. చాలా సంతోషం వైష్ణవీ.. తాత గారికి మా తరపున కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియచెయ్యి..

    ReplyDelete
  2. చాలా సంతోషం శ్రీ వైష్ణవీ . తాత గారి సన్మానం అంటే మాకే ఇంత ఆనందంగా ఉంది కదా ! మరి నీకిం కెంత ఆనందమో ? కదా ? మీ ఇద్దరికీ శుభా భినందనలు

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers