Blogger Widgets

Monday, March 12, 2012

సీతా సమేత రామ శ్రీరామ

Monday, March 12, 2012

నాకు నచ్చే అన్నమయ్య రచించిన పాటలలో శ్రీ రాముని పాటలలో ఇది ఒక పాట. నాకు నచ్చినది మరి మీరు కూడా వినండి సరేనా.
సీతా సమేత రామ శ్రీరామ - రాతి నాతి జేసిన శ్రీరామ రామ
ఆదిత్యకులమునందు నవతరించినరామ - కోదండభంజన రఘుకులరామ
ఆదరించి విశ్వామిత్రు యాగముగాచిన రామ - వేదవేదంతములలో వెలసిన రామ


బలిమి సుగ్రీవుని పాలినిధానమ రామ - యిల మునులకభయమిచ్చిన రామ
జలధి నమ్ము మొనను సాధించిన రామ - అలరు రావణదర్పహరణ రామ

లాలించి విభీషణుని లంకనేలించిన రామ - చాలి శరణాగత రక్షక రామ
మేలిమి శ్రీవేంకటాద్రి మీద వెలసిన రామ - తాలిమితో వెలయు ప్రతాపపు రామ

3 comments:

  1. ~40 kirtanas on rama :
    http://annamacharya-lyrics.blogspot.in/search/label/Deity%3ARama

    ReplyDelete
  2. అందరికీ నచ్చిన పాట . చాలా మంచి పాట . ఎంతో బాగుంది .

    ReplyDelete
  3. ధన్యవాదములు అన్నయ్య. ధన్యవాదములు అంటి మీకు ఈ పాతనచ్చినందుకు.

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers