Blogger Widgets

మంగళవారం, మార్చి 13, 2012

నాటి రక్త చరిత్ర కు ప్రతీకారం చర్య.

మంగళవారం, మార్చి 13, 2012

జలియన్ వాలాబాగ్
భారతదేశ స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో ఎవరు మరిచిపోని భాధాకరమైన సంఘటన రక్తపు ఏరు ప్రవహించిన విషయం జలయన్ వాలాబాగ్ దురంతము.  నాకు ఈ విషయం గురించి చదువుతుంటే.  నాకళ్లలో నీరు ఉబికి వస్తోంది అంటే నమ్మండి.   
జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారత దేశంలోని అమృత్‌సర్పట్టణంలో ఒక పార్క్ .ఏప్రిల్ 131919 న బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ పార్క్ లో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు మరియు పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000 కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు.   చనిపోయిన వారిలో ఆరు వారాల చిన్న పిల్ల కూడా వుంది.  చనిపోయిన వారిని తీసుకువెళ్ళటానికి కూడా వీలు లేకుండా కర్ఫ్యూ వుంది.  అప్పుడు గాయపడినవారు, చనిపోయిన వారి కుటుంబ సభ్యులు యొక్క మానసిక పరిస్థితి ని తలుచుకుంటే హృదయవిదారకంగా వుంది.  అప్పుడు జరిగిన సంఘటనకి తన ఆఫీసులో బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం అతనికి తిరుగుబాటు విప్లవకారుల సేన ఎదురైనందున కాల్పులు జరుపవలసి వచ్చింది. డయ్యర్‌కు పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓ డ్వయర్ ఇచ్చిన టెలిగ్రాములో "నీ చర్య సరైనదే. దానిని లెఫ్టినెంట్ గవర్నర్ సమర్ధిస్తున్నాడు" అని వ్రాసి ఉంది.  ఇది మరీ ఘోరంగా వారి చర్యను సమర్ధించుకున్నారు కదా.
ఈ ఉదంతంపై విచారణ జరపడానికి 1919లో "హంటర్ కమిషన్" ఏర్పరచారు. ఆ కమిషన్ సమక్షంలో డయ్యర్ - తనకు ఆ మీటింగ్ గురించి 12:40కి తెలిసిందనీ, దానిని నిలపడానికి తానేవిధమైన ప్రయత్నమూ చేయలేదనీ, అక్కడ సమావేశమైన గుంపు గనుక కనిపిస్తే కాల్పులు జరపాలనే ఉద్దేశంతోనే తాను అక్కడికి వెళ్ళాననీ - చెప్పాడు.
"బహుశా కాల్పులు జరుపకుండా గుంపును చెదరగొట్టడం సాధ్యం అయ్యుండవచ్చునని నేను భావిస్తున్నాను. కాని వాళ్ళంతా మళ్ళీ తిరిగివచ్చి నన్ను అవహేళన చేసేవారు. నేను చేతగానివాడినయ్యుండేవాడిని."హంటర్ కమిషన్ సమక్షంలో డయ్యర్ స్పందన తెలియచేసారు.  వారి చర్యను పూర్తిగా సమర్ధించు కున్నాడు డయ్యర్.  గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకువెళ్ళటానికి ఎటువంటి సహాయము చేయలేదు వారు.
అమృత్‌సర్ నుండి ఢిల్లీకి రైలులో ప్రయాణిస్తున్న జవహర్‌లాల్ నెహ్రూ పరదాల అవతల నుండి ఒక మిలిటరీ ఆఫీసర్ గట్టిగా ఇలా మాట్లాడడం విన్నానని తన ఆత్మకథలో వ్రాశాడు - "పట్టణం అంతా నా దయమీద ఆధారపడి ఉంది. దానిని బూడిద చేసేద్దామనుకొన్నాను గాని దయతలచి వదిలేశాను" - ఈ మాటలు అన్న వ్యక్తి స్వయంగ అ డయ్యరే. అదే రైలులో ప్రయాణం చేస్తున్నాడు.
డయ్యర్ 
    లండన్‌లో హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ లో జరిగిన చర్చలో జనరల్‌ డయ్యర్‌ను హీరోగా ప్రస్తుతిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు. కొందరు ఆంగ్లేయులు విమర్శించినా, భారతదేశంలో బ్రిటిష్‌ అధికారాన్ని కాపాడిన వీరుడు డయ్యరేనని బ్రిటన్‌లో అత్యధికులు అతడిని గౌరవించారు. సన్మాన సభలో అతడికి 'పంజాబ్‌ రక్షకుడు' అని అక్షరాలు చెక్కిన వజ్రాలు పొదిగిన ఒక కత్తిని, 28,000 పౌండ్ల సొమ్ముని బహూకరించారు. ఆంగ్ల పత్రికలు, ఆంగ్లో ఇండియన్‌ పత్రికలు డయ్యర్‌ని పొగిడాయి. 
ఈ చర్య  మన భారతీయులకు పుండుమీద కారం జల్లినట్టు అనిపించింది.  
జలియన్‌ వాలాబాగ్‌ మారణకాండ, అనంతర కాలంలో పంజాబ్‌లో జరిగిన అకృత్యాలు యావత్తు జాతినీ చలింపచేశాయి. ఈ ఘటనలు మన జాతీయోద్యమాన్ని బలంగా ప్రభావితం చేశాయి. బ్రిటిష్‌ పాలన పైన భ్రమలున్న మితవాద వర్గంలో అధికులు తమ అభిప్రాయాల్ని మార్చుకున్నారు. 
    పరాయిపాలన నుంచి దేశాన్ని విముక్తి చేయడమొక్కటే పరిష్కారమని భారతీయ నాయకులు నిర్ధారణకి వచ్చారు. విశ్వకవి రవీంద్ర నాధ టాగోర్‌ ఈ దురంతాలకి నిరసనగా 'నైట్‌ హుడ్‌' బిరుదును తిరిగి ఇచ్చేశారు.                     
    జలియన్‌ వాలా బాగ్‌లో చిందిన రక్తం తదనంతరం ఎందరో దేశభక్తులకు స్ఫూర్తిని ప్రేరణని ఇచ్చింది. బాల భగత్‌ సింగ్‌ జలియన్‌వాలా బాగ్‌ను దర్శించి, రక్తంతో తడిసిన గుప్పెడు మట్టిని తెచ్చుకున్నాడు.
 స్వరాజ్య కాంక్ష ఎక్కువైంది.  దానికి ప్రతీకార చర్య చెయ్యాలి అని తిరుగుబాటు దారులు చాలా కృషి చేసారు.  ఆ కృషికి  ప్రతిఫలం గా  21 సంవత్సరాల తర్వాత   మార్చి 13, 1940. సా. 4గం. 30ని.ల సమయం.   లండన్‌ లోని కాక్స్‌టన్‌ హాలులో రాయల్‌ సెంట్రల్‌ ఏసియన్‌ సొసైటీ, ఈస్టిండియా అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన సభ జరుగుతోంది. అప్పుడు ఆ హాలు జనాలు తో పూర్తిగా కిక్కిరిసిపోయి వుంది. ఆనాటి సభకి ముఖ్య అతిధి జిలియన్ వాలాబాగ్ దురంత కారకుడు అత్యంత ప్రముఖుడు  మైకేల్‌ ఓ. డయ్యర్‌   మైకేల్‌ ఓ. డయ్యర్‌ ప్రసంగం ముగిశాక, సభ మధ్యలో కొన్ని నిముషాలు తరువాత. అప్పటి వరకూ సభలో ముందు వరుసలో కూర్చున్న ఒక భారతీయ యువకుడు నెమ్మదిగా తన సీట్లోంచి లేచి నిలబడ్డాడు. తిన్నగా డయ్యర్‌ వున్న  వైపు నడుచుకుంటూ వెళ్లాడు. హటాత్తుగా తనముందు వచ్చి నిలబడిన యువకుడిని చూసి  డయ్యర్‌ ఒక్క సారిగా షాక్ అయ్యాడు.  దృఢంగా ఎత్తుగా ఉన్న ఆ యువకుడి ఆహార్యం, గడ్డం చూడగానే పంజాబీ అని అర్ధం అవుతోంది. అతడి ముఖం నిశ్చలంగా, భావరహితంగా ఉంది. అతడి కళ్లు కనిపించీ కనిపించని తడితో మెరుస్తున్నాయి.  డయ్యర్‌కి అతడెవరో ఎందుకు వచ్చాడో ఎందుకు నిలబడ్డాడోఅస్సలు అర్ధం కాలేదు. ఆలోచించే టైం కూడా డయ్యర్ కు ఆ యువకుడు ఇవ్వలేదు. చేతిలో నల్లని పిస్తోలు ఉంది డయ్యర్‌కి అర్ధమైనట్టు అనిపించింది. అతడి గొంతు తడారి పోయింది. పిస్తోలు నిప్పులు కురిసింది. మైకేల్‌ ఒ. డయ్యర్‌ రక్తం మడుగులో కుప్పకూలాడు.  ఆ యువకుడు పెద్ద పెట్టున నినదించాడు... 
    ''భారత్‌ మాతాకీ జై''
    ''ఇంక్విలాబ్‌ జిందాబాద్‌'' 
  ''భారత్‌ మాతాకీ జై''
    యువకుడి చేతిలో పిస్తోలు నిప్పులు కక్కుతూనే ఉంది. 
    అతడి గుండె పట్టరాని ఉద్వేగంతో ఎగసిపడుతోంది ......అతడి కళ్లు అశ్రువులు వర్షిస్తున్నాయి.... తాను విద్యార్ధిగా ఉన్నపుడు చూసిన దృశ్యం...... విశాలమైన మృత్యు మైదానం.... తన వాళ్లని జంతువుల మాదిరిగా వేటాడుతున్న ఆంగ్లేయ అహంకారం.... నేలని అలికిన నెత్తురు ..... కాళ్ల కింద నలిగిన శిశువులు..... ఛిద్రమైన సజీవ మాంస శకలాలను కుక్కలు పీకుతున్న దృశ్యం... నేలమీద పొట్టని ఆనించి... తలమీద... రైఫిల్‌ మడమ దెబ్బలు తింటూ... దుమ్ములో.... దేకిన అవమానంతో కార్చిన కన్నీరు.... 
    21సంవత్సరాలుగా అతడు ఏడ్వలేదు.  ఈ సంఘటన జరిగిన తరువాత మనసున ఆనందము దుఖము కలసి కంటి నీరు ప్రవహించింది.  21 సంవత్సారులుగా అఆపిన నీరు ప్రవహించింది అన్నట్టు అనిపిస్తోంది. 
ఇంతకీ ఆయువకుడు పేరు తెలుసుకోవాలని మీకు అనిపిస్తోంది కదా అతని పేరు ఉద్ధం సింగ్.

ఉద్ధం సింగ్
    21 సంవత్సరాలు ఉద్ధం సింగ్ మనసు ఎంత భాధపడినదో అర్ధం అవుతోంది మనకు. అతనిలో ప్రతీకారం తీర్చుకోవాలనే కాంక్ష అర్ధం అవుతోంది.  దీని కోసం ఎన్ని రాత్రులు నిద్రపోయాడో, లేదో, తిన్నాడో లేదో కదా.నరాల్లో పంజాబ్‌ దురంతాలకి ప్రతీకారం చేసి తీరవలసిందేనని  నిశ్చయించుకున్నాక , డయ్యర్ల రక్తం కళ్ల చూస్తానని ప్రతిఙ్ఞ చేశాక.పగబట్టిన తాచులా వెదికాడు డయ్యర్లని. వాళ్లు భారత్‌ వదిలి ఇంగ్లడు వచ్చేశారని తెలిసి, ఉన్నత విద్య నెపంతో కుటుంబాన్ని ఒప్పించి, 'ఆశయ సాధన' కోసం తానూ ఇంగ్లండు చేరుకున్నాడు. ఇంగ్లండు చేరినప్పటి నుంచి 3సంవత్సరాలుగా వెయ్యి కళ్లతో వెదికాడు .డయ్యర్ల ఆచూకీ కోసం.  ఆశయ సాధనకి అవసరమైన సాధనాలను సమకూర్చుకున్నాడు.డయ్యర్‌ సభ విషయం తెలియగానే తన ఆశయం తీరే అవకాశం వచ్చిందని పొంగిపోయాడు. రక్తపు మడుగులో కూలిపోయిన డయ్యర్‌ని చూస్తుంటే ఉద్ధం సింగ్‌ మనసులో కట్టలు తెంచుకున్న ఆలోచనలు ఉద్వేగాలు ఎన్నెన్నో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.వేల మంది మరణాలకి, మరణ వేదనలకి, .అవమానాలకి ప్రతీకారం తీర్చుకోగలిగాడు తను ఇంక తానేమైపోయినా పరవాలేదని అనిపించింది అప్పుడు ఉద్ధంసింగ్‌కి. డయ్యర్‌ నెత్తుటి మడుగులో కూలిపోగానే సభ అంతా పెద్దపెట్టున కలకలం రేగింది.
    పట్టుబడిన ఉద్ధం సింగ్‌ని పేరేమిటని అడిగినపుడు, తన పేరు 'రాం మహమ్మద్‌సింగ్‌ అజాద్‌' అని చెప్పి ఆంగ్ల పోలీసుల్ని ఆశ్యర్యపరిచాడు. తన దేశంలోని మూడు మతాలను, వారి మధ్య సమైక్యతతో తాను సాధించ దలచిన ఆశయాన్ని ప్రతిబింబించేలా ఉద్ధం సింగ్‌ తనకు తానే ఆ పేరు పెట్టుకున్నాడు.  ఈ విషయం చదువుతుంటే నాలో ఏదో తెలియని గగుర్పాటు గా అనిపిస్తోంది. సంతోషంగా వుంది.   ప్రతీకారం తీర్చుకున్న ఉద్దం సింగ్ గొప్ప దేసభక్తుడు కదా.   
జై హింద్ 

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)