Blogger Widgets

శనివారం, మార్చి 17, 2012

ఘన వైకుంఠము

శనివారం, మార్చి 17, 2012

అన్నమయ్య వారి రచనలలో ఈ పాటలలో  గొప్పది.  కన్నులెదిటిదే ఘన వైకుంఠము.  ఈ పాట వింటుంటే నాకు అమ్మమ్మ చెప్పిన ఒక విషయము గుర్తువస్తోంది.  అది ఏమిటంటే.  ఒక వ్యక్తికి వైకుంఠము  ఎక్కడుంటుంది అన్న డౌట్ వచ్చింది.  అతని దగ్గరకు ఒక ఋషి వచ్చినప్పుడు ఆవ్యక్తి వైకుంఠము ఎక్కడుంది అని అడిగాడు.  అప్పుడు ఆ ఋషి నీవు గజేంద్రమోక్షము చదవలేదా అని అడిగాడట.  పోనీ ప్రహ్లాదచరిత్ర చదివావా అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి చదివాను అన్నాడు.  అయితే ఆకదలలో భగవంతుడు ఎలావచ్చాడు. భక్తుడు  పిలవగానే భగవంతుడు వచ్చాడు కదా!  కావునా మనకు తెలుస్తూనే వుంది కదా పిలిస్తే పలికేటంత దూరంలోనే  వైకుంఠము వుంది అని.  అప్పుడు ఆవ్యక్తి ఆసమాదానానికి తృప్తి చెందాడు.  ఈ కధ నాకు బాగా ఇష్టము అందుకే ఈ సందర్భములో మీతో పంచుకున్నాను.  ఈ పాట అన్నమయ్య రచించారు.  ఇక్కడ MS సుబ్బలక్ష్మి గారు పాడారు. 
   


కన్నులెదిటిదే ఘన వైకుంఠము | వెన్నుని గొలిచిన విజ్ఞానికిని ||

తలచిన దెల్లా తత్త్వ రహశ్యమె | తెలిసిన యోగికి దిన దినము |
పలికిన దెల్లా పరమ మంత్రములె | ఫలియించిన హరి భక్తునికి ||

పట్టిన దెల్లా బ్రహ్మాత్మకమే | పుట్టును గెలిచిన పుణ్యునికి |
మెట్టిన దెల్లా మిన్నేటి నిధులె | రట్టడి తెగువ మెరయు వానికిని ||

వినినవి యెల్లా వేదాంతములే | ఘనుడగు శరణాగతునికిని |
యెనసిన శ్రీ వేంకటేశుడె యింతా | కొనకెక్కిన నిజకోవిదునికిని ||

3 కామెంట్‌లు:

  1. వైష్ణవీ, చక్కని పాట. అన్నమయ్య పాటలనుండి ఇంకా చాలా నేర్చుకోవచ్చు.నేను పండితుణ్ణి కాను, అయినా కొన్ని విషయాలు చెబుతాను.

    విష్ణువు (తత్సమం)- వెన్నుడు (తద్భవం)
    మెట్టిన దెల్లా మిన్నేటి నిధులె - మిన్నేరు అంటే గంగ అనుకుంటాను. తాతయ్యను అడిగి కనుక్కోగలవు.
    రట్టడి తెగువ మెరయు వానికిని - రట్టడి అంటే రాష్ట్రకూటవంశజుడు అని, వాళ్ళే నేటి రెడ్లు అని వ్యవహారం.
    కొనకెక్కిన నిజకోవిదునికిని - కొనకెక్కిన అంటే పదును తేలిన అనుకుంటాను.

    తెలుగు బాగా రావాలంటే అన్నమయ్య పాట

    రిప్లయితొలగించండి
  2. manchi kirtana.
    btw, ivala annamayya vardhanti :
    listen to this kirtana :
    http://annamacharya-lyrics.blogspot.in/2006/12/105dinamu-dwaadasi-nedu.html

    రిప్లయితొలగించండి
  3. రవి,శ్రావణ్ అన్నయ్య చాలా మంచిగా వివరణ ఇచ్చినందుకు మీకు నా ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)