Blogger Widgets

Tuesday, March 27, 2012

సీతమ్మ మాయమ్మ

Tuesday, March 27, 2012

                                        లలిత రాగం - రూపక తాళం

గాయకులు:  శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ

పల్లవి : సీతమ్మ మాయమ్మ - శ్రీరాముడు మా తండ్రి

అనుపల్లవి : వాతాత్మజ సౌమిత్రి - వైనతేయ రిపు మర్దన
ధాత భరతాదులు సో - దరులు మాకు; ఓ మనస !


చరణము:  పరమేశ వసిష్ఠ పరా - శర నారద శౌనక శుక
సురపతి గౌతమ లంబో - దర గుహ సనకాదులు
ధర నిజ భాగవతా గ్రే - సరు లెవరో వారెల్లను
వర త్యాగరాజునికి - పరమ బాంధవులు; మనస !

1 comment:

  1. ఎందరో ఈ కీర్తనను పాడినా, బాలమురళీకృష్ణగారి పాటలో మాత్రమే సాహిత్యం అర్థవంతంగా ఉందని నా ఉద్దేశ్యం. మీరు సాహిత్యం రాయడంలో పదాలను పాడటానికి వీలుగా విడగొట్టారు కానీ విన్నప్పుడు అంత సులభంగా అర్థమవ్వదని నా భావన.

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers