Blogger Widgets

శనివారం, మార్చి 31, 2012

సీతా రాముల కళ్యాణం

శనివారం, మార్చి 31, 2012














Kalyaanam
శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం
ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి
అంటూ మనం శ్రీరామ చంద్రుని జన్మదినోత్సవాన్ని చైత్ర శుధ్ధ నవమి రోజు చేసుకుంటాం. దీని తాత్పర్యము ఏమి అంటే భరత దేశం లో ధర్మ బధ్ధ జీవనానికి ఒక నిలువెత్తు నిర్వచనం గా ,మనిషి ఇలా బ్రతకాలి, అని ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి మానుష్య జన్మకున్న వైశిష్ట్యాన్ని మనకి ఆవిష్కరించిన మర్యాదా పురుషోత్తముడు నా తండ్రి శ్రీ రామచంద్రమూర్తి అని ఈ శ్లోకం అర్ధం.
                
వివాహం: శ్రీ రాముడు జనకుడు ఏర్పాటు చేసిన స్వయంవరములో పాల్గొని శివధనస్సు విరిచినాడు.  అప్పుడు సీత వరమాల శ్రీరాముని మేడలో వేసినది.  జనక మహారాజు విశ్వామిత్ర మహర్షిని సంప్రదించి దశరథమహారాజుకు శ్రీ రాముడు, సీతాదేవి వివాహం విషయం దూతల ద్వారా అయోధ్యకు వర్తమానం పంపిం చాడు. దూతలు మూడురోజుల ప్రయాణం చేసి అయోధ్యకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న దశరథుడు సంతోషించాడు. వశిష్ట వామదేవాదులతో చర్చించి మరునాడే మిథిలానగరానికి వెళ్ళాలని దశరథుడు నిర్ణయించు కున్నాడు. ఆరోజున చతురంగబలాలతో దశరథుడు కౌసల్యాదేవి వశిష్ట వామదేవాదులతో మిథిలానగరానికి వెళ్ళారు. జనకుడు దశరథుడికి స్వాగతం పలికాడు. సీతా దేవి వివాహానికి సన్నాహాలు ప్రారంభించాడు. సీతా రాముల కళ్యాణం   కమనీయంగా జరిపారు. అది శ్రీరాముడు జన్మించిన రోజు, రామునికి వివాహము అయినరోజు మరియు, అయోధ్యలో శ్రీరామునికి రాజ్య పఠాభిషేకము జరిగిన రోజు నవమి.  అందుకే ఈ నవమిని శ్రీరామనవమిగా జరుపుకుంటున్నాము.

శ్రీ రామనామ మంత్రం: 

దశరథనందన శ్రీరామ నమో
అయోధ్య వాసి శ్రీరామ నమో
నీలమేఘశ్యామ శ్రీరమ నమో
జానకీనాథా శ్రీరామ నమో
హనుమత్సేవిత శ్రీరామ నమో
వాలీమర్ధన శ్రీరామ నమో
కోదండపాణి శ్రీరామ నమో
రావణసమ్హార శ్రీరామ నమో
కారుణ్యహృదయా శ్రీరామ నమో
భక్తవత్సల శ్రీరామ నమో

దశరథునికి ప్రియమైన కుమారుడు, నీలమేఘశ్యాముడు , సీతాదేవికి భర్త , భక్తుడైనా హనుమంతుని చేత సేవించబదినవాడు, వాలిని చంపిన వాడు చేతిలో కోదండమును కలిగినవాడు, దశకంఠుదు రావణుని చంపినవాడు , దయాహృదయం కలవాడు , భక్త వత్సలుడు అయిన శ్రీ రాముడుని నమస్కరిస్తున్నాను రామ నామ స్మరణ వల్ల మనసు పవిత్రంగా ఉంటుంది. కస్ట మైన పనులు కూడా సులువుగా చేయగలిగే శక్తి వస్తుంది.


శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||
పరమశివుడు పార్వతీ దేవి తో చెప్పిన ఈ శ్లోకం అందరికీ తెలిసినదే  అయిన శ్రీ రామ రామ రామ అని మూదు సార్లు జపిస్తే శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేసిన ఫలము వస్తుందనేది ఈ శ్లోక భావం.  కావున శ్రీ రామ నవమి రోజున ఈ మంత్రము జపించి శ్రీరాముని కృపకు పాత్రులు అవ్వగలరు.  
బ్లాగ్ మిత్రులందరికి శ్రీ రామనవమి శుభాకాంక్షలు.

3 కామెంట్‌లు:

  1. సాధు శ్రీ వైష్ణవికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు .

    శ్రీరాముని ఘనత నిటుల
    తోరణములు గట్టి చూపి , తోషంబున నీ
    తీరున బ్లాగరులకు నిం
    పార శుభాకాంక్షలు దెలుప , గలుగు శుభముల్

    రిప్లయితొలగించండి
  2. మీకు,మీ కుటుంబసభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  3. More Entertainment, వెంకట రాజారావు గారికి, రాజి గారికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. వెంకట రాజారావుగారు మీ కవితలో శుభాకాంక్షలు తేలిపారు. మీకవిత చాలా బాగుంది. మీకు నా
    ధన్యవాధములు.

    రిప్లయితొలగించండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)