Blogger Widgets

Wednesday, June 13, 2012

Back 2 School.

Wednesday, June 13, 2012


హమ్మయ్య స్కూల్ తెరిచారు అని పెద్దవాళ్ళు అనుకుంటూ వుంటారు.  మాలాంటి పిల్లలేమో అప్పుడే సెలవులు అయిపొయాయీఈఈఈ . అని అనుకుంటారు కదండి.  మరి పెద్దవాళ్ళు అలా అనుకోవటానికి కారణం వుంది .  సమ్మర్ హాలిడేస్ లో మనం  బాగా అల్లరి చేసాం.  చెప్పిన మాట వినకుండా ఎండలో అదేసుకున్నాం.  సమ్మర్ హాలిడేస్ ఇచ్చేముందు మనం ఎన్నో ప్లాన్స్ చేస్తూవుంటాము.  ఏవో చేసేయాలి అని అనుకుంటాము .  ఆకరికి ఏమీ చేయము కదండి.  నేను కూడా అలానే చేసాను అందుకే ఇలా అంటున్నాను.  మొత్తానికి సమ్మర్ అయిపోయింది.  స్కూల్ తెరిచేశారు.  కొత్త స్కూలు, కొత్త క్లాస్సు, కొత్త ఫ్రెండ్స్, కొత్త టీచర్స్, కొత్త డ్రస్సులు, కొత్త బుక్స్, అన్నీ కొత్తే.  పుస్తకాలుకు  అట్టలు వేసుకోవటం ఇవన్నీ తలచుకుంటేనే నాకు బలే సరదాగా, గమ్మత్తుగా,  ఆనందముగా వుంది. మరి మీకు కూడా నాలేనే వుందా.  స్కూల్  కి వెళ్ళగానే మన రోజు prayer తో మొదలు అవుతుంది.  prayer లో ముందుగా వందేమాతరం పాడి తరువాత దేవుని ప్రార్ధించి ఆ తరువాత Indian Pledge చెప్తాము.  తరువాత ఎవరి క్లాస్సేస్ లో వారు క్యూలో వెళ్తాం.  మొదటి బెల్ తో క్లాస్స్లు మొదలు అవుతాయి.  మద్యలో breaks తో క్లాస్లు అయిపోయాక ఆఖరి బెల్ కొట్ట గానే జనగణమన పాట  పాడి జైహింద్  చెప్పి   ఇంటికి వెళ్ళిపోవాలని తొందరలో పెద్దగా అరుచుకుంటూ స్కూల్ బయటికి వచ్చి దూరం వెళ్ళేవాళ్ళు బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాం.  అలారోజు మనరోజులు జరుగుతాయి.  మద్య మద్యలో సండే హాలిడేస్ ను సంతోషంగా గడుపుతూ , ఎగ్జామ్స్ రాస్తూ సంతోషంగా స్కూల్ రోజులు గడుపుతాం,  నాకు బలే exciting గా వుంది ఎప్పుడు ఎప్పుడు తెల్లారుతుందా స్కూల్ కి ఎప్పుడు వెళ్దామా అని.  మరి మీకు.  స్కూల్ కి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా పాటిస్తే బాగుంటుంది అని మా అమ్మ నాకు చెప్పింది.  ఎలాంటి జాగ్రత్తలో చెప్పెసుకుందాం.   స్కూల్ కి నీటుగా యునిఫోరం వేసుకొని, టైం కి వెళ్ళాలి.  స్చూల్లో బుక్స్ అన్నీ జాగ్రత్తగా మనవి మనవి జాగ్రత్తగా వుంచుకోవాలి.  ఎవరితోనూ కొట్లాడుకోకూడదు.  టీచర్ చెప్పే ప్రతీవిషయాని  గుర్తుపెట్టుకోవాలి.  ఎప్పుడు అబ్సేంట్ కాకూడదు.  స్కూల్ నుండి బయటికి ఎవరు పిలిచినా వెళ్ళకూడదు.  మన పరెంత్స్ యొక్క ఫోన్ నెంబర్ ,మరియు స్కూల్  ఫోన్ నెంబర్ మనదగ్గర వుండాలి.  ఇంకా ఇలాంటి జాగ్రత్తలు తెలుసుకొని. ముఖ్యంగా బాగా చదువుకొని మనం మంచి పిల్లలమని అందరు మెచ్చుకునేట ట్టు తయారు అవ్వాలి.  నాలాగే కొత్తగా కొత్త క్లాస్సులోకి వెళ్లినవారికి అందరికి 
All  The Best.  


    

0 comments:

Post a Comment

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers