Blogger Widgets

Sunday, June 03, 2012

పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మమ్మ

Sunday, June 03, 2012

ఈరోజు మా ప్రియమైన అమ్మమ్మ పుట్టినరోజు.  నాకు పూర్తిగా బ్లోగ్ పొస్ట్లు పెట్టడానికి సహకరించే మా అమ్మమ్మని మీరు చూడాలి అని నన్ను చాలాసార్లు అడిగారు కదా. ఈరోజు మా అమ్మమ్మ పుట్టినరోజు సంధర్బముగా విషెస్ చెప్పేద్దామా.  సరే 

అమ్మమ్మ పుట్టిన రోజు శుభాకాంక్షలు 


అమ్మకు అమ్మయి ప్రాణము 
నిమ్మన్నా యిచ్చినట్టి ఈ అమ్మమ్మే
ముమ్మాటికి నా దేవత. 
అమ్మమ్మకు మించువార లవని గలరా.

ఆకలి కనుగొని పెట్టును.
లోకోక్తులు చెప్పుచుండు, లోపము బాపున్
లోకంబున అమ్మమ్మే
నాకును మా అమ్మకనగ నారాయణిగా!

అమ్మమ్మ మాట తీయన
అమ్మమ్మయె చేయు వంట అమృతము మాకున్
అమ్మమ్మ చేయు సేవలు
అమ్మమ్మా! చెప్ప వశమె? అగణితమిలలో.

అమ్మమ్మ స్ఫూర్తి గొల్పును.
అమ్మమ్మయె మార్గదర్శి. అనితరమగు ఆ
కమ్మని మనసును కలిగిన
అమ్మమ్మయె నాకు దైవమందును భువిపై


5 comments:

  1. మీ అమ్మమ్మ గారికి నా తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..

    ReplyDelete
  2. mi ammamma ki maa subhakankshalu kudaa cheppammaa..!! nindu nurellu challagaa vundali

    ReplyDelete
  3. mi ammamma ki ma subhakankshalu kuda cheppammaa..!! nindu nurellu challagaa vundali

    ReplyDelete
  4. అమ్మమ్మ ప్రేమను పద్య భావ కవితా వస్తువులతో పొంగించి పంచిన మా వైష్ణవికి ఆశీస్సులతో దీవన సేసలు

    ReplyDelete
  5. Thank you very much to sai and cheppaalamte and sOmArka Uncle.

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers