Blogger Widgets

గురువారం, జూన్ 07, 2012

శివతాండవం + డాక్టర్ నటరాజ రామకృష్ణ

గురువారం, జూన్ 07, 2012

                           

ఇలాంటి సాంప్రదాయక మైన నృత్యాన్ని (శివతాండవం వంటివి ) చూడాలి అంటే మనకు ఇప్పుడు animations  తప్ప వేరే మార్గము లేదు.  ఎందుకంటే  ఇలాంటి నృత్యాలు అంతరించి పోతున్నాయి అనిపిస్తోంది.  ఈ  నృత్యం చూస్తుంటే నాకు ఇదే మనుషులు చేస్తే ఎంత బాగుంటుందో  అనిపించింది. మనం  ఇలాంటి నృత్యాలను అబివృద్ది పరుచుటకు ప్రయత్నిస్తే బాగుంటుంది.  సరే ఈ రోజు మనము సాంప్రదాయ  నృత్య కళాకారుడు అయిన  డాక్టర్  నటరాజ  రామకృష్ణ  గారి వర్ధంతి.  ఈరోజు ఆయన వర్ధంతి సందర్బముగా ఆయనికి నివాళ్ళు అర్పిస్తున్నాం.   ఈ రోజు ఆయన గురించి తెలుసుకుందాం.


డాక్టర్ నటరాజ రామకృష్ణ 
Nataraja Ramakrishna
డాక్టర్ నటరాజ రామకృష్ణ (1933 - 2011) ఆంధ్రనాట్యము, పేరిణి శివతాండవము, నవజనార్ధనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు.ఆజన్మ బ్రహ్మచారి . ఈయన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాడు. ఆంధ్రనాట్యము ఒక పురాతన లాస్య నర్తనం. పదవ శతాబ్దంలోని కాకతీయ సామ్రాజ్య కాలంలో, మగవారు నాట్యం చేసే పేరిణీ శివతాండవం ఉండేది. ప్రబంధ నాట్య సాంప్రదాయానికి సంబంధించిన నవజనార్ధనం గత 400 ఏళ్ళుగా తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం లోని కుంతీమాధవ మందిరం లో ప్రదర్శింపబడుతోంది. జూన్ 7, 2011 వ తేదీన హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మరణించాడు. ఈయనకి చాలా అవార్డులువచ్చాయి.  నటరాజ , భారత కళాప్రపూర్ణ, భారతకళా సవ్యసాచి,  కళాప్రపూర్ణ, కళాసరస్వతి, దక్షిణ భారతపు ఉత్తమ నాట్యాచార్యుడు, ఉత్తమ పరిశోధకుడు, ఆస్థాన నాట్యాచార్యుడు, ఆస్థాన నాట్యాచార్యుడు, అరుదైన పురస్కారం, శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం, రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ అవార్డ్,  పద్మశ్రీ, కళాసాగర్ అవార్డ్, విశిష్ట పురస్కారం లు అందుకున్నారు.  

1 కామెంట్‌:

  1. మీ animation picture బాగున్నది.కాని ఇప్పుడు కూడా బాగా సంప్రదాయ బద్ధంగా శివతాండవం నృత్యం చేసే వారు ఉన్నారు.'నవపారిజాతం ',పేరిణి 'వంటి మరుగునపడిపోతున్న నృత్య రీతులను ఆయన మళ్ళీ ప్రచారంలోకి తీసుకొని వచ్చారు.నాకు తెలిసిన ప్రత్యేక విషయం ; మా క్లాస్మేట్ డాక్టర్ చలపతిరావు ఆయన శిష్యుడు.మా కాలేజి ఫంక్షన్స్ లో ' మొక్కజొన్నతోట లో ' అనే జానపదనృత్యం చేస్తూ ఉండే వాడు. మా అమ్మాయి వాళ్ళ బృందం ఒకసారి హైద్రాబాద్లొ చేసిన
    నృత్య ప్రదర్శనకు హాజరై ఆశీర్వదించారు.ఆయన వ్రాసిన పుస్తకం కూడా ఒకటి నా దగ్గర ఉంది.గొప్ప ఆంధ్ర నృత్య కళాకారుడు,గురువు, ఐన ఆయన గురించి ప్రస్తావించినందుకు మీకు నా అభినందనలు.

    రిప్లయితొలగించండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)