Blogger Widgets

Saturday, June 09, 2012

నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా

Saturday, June 09, 2012

మన ఇళ్ళల్లో చిన్నప్పుడు అందరు ఈ కధ వినేవుంటారు.  ఈ కధను వినని  వాళ్ళు వుండరు.  ఇంతకీ ఆకధ ఏమిటి అని అనుకుంటున్నారు కదా.  ఆకధ  పేరు చెప్పగానే ఈ కదా అని అనేస్తారు అని నాకు తెలుసు.  నా చిన్నప్పుడు చాలా ఇష్టంగా విన్న కదా ఇది.  అందుకే మీకు కూడా చెప్తున్నాను.  ఆ కధ  ఇదే 
అనగనగా ఒక రాజు గారున్నారు. ఆయనకు ఏడుగురు కొడుకులు. వారు ఒకనాడు వేటకు వెళ్ళారు. ఏడు చేపలు తెచ్చారు. వాటిని ఎండబెట్టారు. వాటిలో ఒకటి ఎండలేదు.
చేపా ! చేపా ! ఎందుకెండలేదంటే, గడ్డిమోపు అడ్డమైందని చెప్పింది.
గడ్డిమోపా ! గడ్డిమోపా ! ఎందుకడ్డమొచ్చావంటే, ఆవు నన్ను మేయలేదంటుంది.
ఆవా ! ఆవా ! ఎందుకు మేయలేదంటే, పాలేరు మేపలేదంటుంది.
పాలేరా ! పాలేరా ! ఎందుకు మేపలేదంటే, అవ్వ బువ్వ పెట్టలేదంటాడు.
అవ్వా ! అవ్వా ! ఎందుకు బువ్వ పెట్టలేదంటే, పిల్లవాడు ఏదుస్తున్నాడంటుంది.
పిల్లవాడా ! పిల్లవాడా ! ఎందుకు ఏడుస్తున్నావంటే, చీమ కుట్టిందంటాడు.
చీమా ! చీమా ! ఎందుకు కుట్టావని అడిగితే,

నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అంటుంది. 


ఈ కధను ప్రతీ చిన్న పిల్లలు అమాయకంగా వింటారు కదండి .   సరే మనం ఈ కధను రివర్స్ లో చెప్పెసుకుమ్దాం.  సరేనా.  మరి మన కధలో నిజం గ్రహించాలి ఒకేనా.  మన కధలో రివర్స్ అన్నం కదా కావునా చీమ దగ్గర నుండే మొదలు పెడదాం.  ఓకే.
ANTS - Animation Training School, Ahmedabad - Ahmedabad 
 
ఒక చీమ  గొప్పగా ఆనందం గా అటుగా వెళ్తోంది.  చీమ  ఏమి సాధించావని అంత గొప్పగా వెళ్తున్నావ్  అని అడగగానే.  ఆ చీమ ఇలాఅంది అవును నేను చాలా సంతోషంగా వున్నాను ఎమ్డుకంటే నా బంగారు పుట్టలో వేలుపెట్టిన  ఒక పిల్లాడిని నేను కుట్టాను అందుకే అంది.  ఆ పిల్లాడు ఏడుస్తున్నాడు అంది.  అయ్యో పాపం చిన్న పిల్లాడును కుట్టి సంతోషిస్తున్నావా.  వాళ్ళ దాడికి తెలిస్తే గమేక్సిన్ వేసి నిన్ను చంపేస్తాడు తెలుసా.  అరే  వాడికి అంత కధలేదు.  వాడికి కొడుకు మీద నిజంగా  ప్రేమే వుంటే ముందు   తన కొడుకు సంగతి చూసికొని పిల్లాడికి పాలు పట్టేవాడు . 
తన కొడుకుకి పాలు పట్టలేదా !!!!  :O  ఎందుకలా????
తన కొడుకు ఏడుస్తున్నాడు అన్న బాధతో ఆ రైతు ఆవును వదలలేదు  ఆ ఆవు గడ్డి మేయలేదు.  పాలివ్వలేదు.
గడ్డి మిగిలింది అనుకుంటున్నావా.  అలా మిగిలిన గడ్డిని సైనికులు పారేసారు.  నిలవ వున్న గడ్డిని పారేస్తారులే అనుకుంటున్నవేమొ అదేమికాదు .  అలాచేయటానికి ఒక  కారణం వుంది.  ముందురోజు రాజుగారి ఏడుగురు కొడుకులు చేపలు తెచ్చి ఎండ పెడితే అవి ఎండకుండా చేసింది గడ్డి అని గడ్డిని పాడుచేసారు.
ఇది రివర్స్ కధ.  దీనిలో నీతి కూడా వుండండి.  వరసగా చెప్పేస్తూ వచ్చింది ఈ చీమ.
చిన్న పిల్లాడు ఏడుస్తూ వుంటే  ఆ రైతు తన కర్తవ్యం మరిచి ఆవుకి మేతవేయలేదు.  అందుకు అతనికి నష్టం జరిగినది.  గడ్డి దుబ్బు అడ్డువస్తే చేపలు ఎండవన్న చిన్న విషయాన్ని కూడా గ్రహించకుండా గడ్డి పాడుచేయటమే కాకుండా మంచి బోజనాన్ని మిస్  అయ్యారు.  ఈ మూర్ఖ రాకుమారులు.  ఆ  రాకుమారుల ఆదేశాన్ని పాటించారు . వారు చేయవలసిన పని ఏమిటి దేశాన్ని కాపాడటం.  వాళ్ళ టైం  ను వృదాచేసారు.  గడ్డి పాడు చేయటానికి ఉపయోగించారు.  వారి చేతకాని తనాన్ని కోపాన్ని గడ్డిమీద చూపించారు.  చీమ  ఆకారాన  ఇలా కూడా అంది అవతలి వారి సామ్రాజ్యంలో అనావసరంగా వేలు పెడితే కుట్టడం తప్పాడు అని.  చూసావా నా కర్తవ్యాన్ని నేను సరిగానే నిర్వర్తించాను అందుకే సగర్వంగా తిరుగుతున్నా అంది చీమ.  ఎవరి పని వారు చేసుకోవాలి కానీ.  తన చేతకాని తనాన్ని వేరేవారి మీదకు నెట్ట కూడదు అని ఉపోద్గాతము తో పాట  పాడుకుంటూ వెళ్లి పోయింది చీమ. ఇదండి  కధ .  మరి మీకు నచ్చిందా.  నచ్చలేదో చెప్పేయండి.   

1 comment:

  1. This is the ultimate self-esteem corrector. Thank you for your post; it is a very important distinction Animation Training in Hyderabad

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers