Blogger Widgets

గురువారం, జులై 19, 2012

మంగళ్ పాండే జయంతి

గురువారం, జులై 19, 2012

రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యంలో తిరుగుబాటు పతాకమును ఎగురవేసిన మంగళ్ పాండే జయంతి నేడు 1827, జూలై19న ఉత్తరప్రదేశ్ లోని బలియా జిల్లా నాగ్వ గ్రామంలో మంగళ్ పాండే జన్మించారు.
బెంగాల్ నేటివ్ ఇన్ ఫాంట్రీలో ఒక సాధారణ సిపాయిగా పనిచేసిన మంగళ్ పాండే 1857ప్రథమ భారత స్వాతంత్ర్య పోరాటాని నాంది పలికాడు. మంగళ్ పాండే 34 వ బ్రిటిష్ బెటాలియన్ లో పనిచేసిన అతిచిన్న వయస్సు గల బ్రాహ్మణ యువకుడు .   మంచి సాహసవంతుడు అయిన  పాండే తన 22వ ఏట ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం బి.ఎన్.ఐలో చేరాడు. 1857, మార్చి 29న కలకత్తాలో బ్రిటీష్ సార్జెంట్ పై మంగళ్ పాండే దాడిచేయడంతో సిపాయిల తిరుగుబాటు మొదలైంది.అప్పట్లో బ్రిటిష్ వారు  పి.53 రైఫిల్ తూటాలో ఆవుకొవ్వు నింపుతున్నారన్న వదంతి మంగళ్ పాండేలో బ్రిటీష్ వారిపై ద్వేషానికి కారణమైంది.   సార్జెంట్ పై దాడిచేసిన మంగళ్ పాండే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అది కాస్త విఫలమవ్వడంతో బ్రిటీష్ సేనలు అదుపులోకి తీసుకున్నాయి. మంగళ్ పాండే చర్యతో పోరాటం మీరట్ కు పాకింది. 1857, ఏప్రిల్8న పాండేను ఆయనకు సహకరించాడన్న ఆరోపణపై సహచర సిపాయిని బ్రిటీష్ ప్రభుత్వం ఉరితీసింది. పాండేపై చర్య తీసుకోమని హేవ్సన్ అనే సైనిక అధికారి ఆదేశించినా సాటి సిపాయిలు వ్యతిరేకించారు. అప్పట్లో ఝాన్సీలక్ష్మి బాయిగారికి కూడా సహకారం అందించారు పాండే గారు.  దీంతో అప్పటినుండి ఉద్యమం మరింత ఎక్కువగా  భారతమంతటా వ్యాపించింది. కాకతాళీయంగా పాండే హీరో అయ్యాడని, భంగు ను సేవించిన మత్తులో బ్రిటీష్ అధికారిపై దాడి చేశాడన్న వాదనలూ ఉన్నాయి. ఏదేమైనా కాలం విసిరిన సవాలును స్వీకరించిన మంగళ్ పాండే ఒక గొప్ప ఉద్యమకారుడు. భారతదేశ  స్వతంత్ర్య చరిత్రలో చిరస్మరణీయుడుగా నిలిచిపోయాడు .  ఇలాంటి వారిని మనం గుర్తు చేసుకోవటం ప్రతీ భారతీయుని కర్తవ్యం.  ఈయన జయంతి సందర్బముగా మంగళ్ పాండే గారికి నివాళ్ళు అర్పిద్దాం మరి.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)