Blogger Widgets

Wednesday, July 04, 2012

అల్లూరి సీతారామ రాజు

Wednesday, July 04, 2012

అల్లూరి సీతారామ రాజు మన ఆంద్రప్రదేశంలో జన్మించిన స్వాతంత్ర సమరయోధుడు.  ఈయన దారిలోనే తూర్పుగోదావరి, విశాఖపట్టణం జిల్లాలో అడవుల ప్రదేశంలో మన్యం ప్రజలు విప్లవ దారిలో నడిచాయి.    అల్లూరి సీతామరాజు  4 జూలై 1897 లో పాండ్రంగి అనే ఉరిలో విజయనగరం జిల్లా దగ్గర  వెంకట రామరాజు మరియు సూర్యనారాయణమ్మ లకు జన్మించారు.  వీరికి ఒక తమ్ముడు సత్యనారాయణరాజు మరియు చెల్లి సీతమ్మ కలరు.  మనకు చరిత్రనుండి చూస్తే రక్తపాతం జరగకుండా ఉన్న ఉద్యమాల్లేవు. అంతే కాదు రక్తపాతం జరక్కుండా ఉద్యమాన్ని నడిపించాలని ప్రయత్నించిన ఉద్యమ నాయకులు కూడా వున్నారు.  వారిలో గాంధీజీ మన జాతీయ కథానాయకుడు అని మనకు తెలుసు కదా.  అల్లూరి సీతారామరాజు మన ఊరి విప్లవ నాయకుడు! మన్యంలో కొండదళానికి, తెల్లదండుకి మధ్య అరవెరైండు సార్లు కాల్పులు జరిగినా, అనవసరమైన రక్తపాతం జరగా కూడదు అని మన మన్యం వీరుడు అనేకసార్లు ఆపుచేసాడు. అల్లూరి సీతారామ రాజును  మనము ఆదర్శంగా తీసుకోవాలి. శత్రువుపై నిప్పులు కురిపించిన మన్యం అగ్నికణం అల్లూరి సీతారామరాజు,  ఈయన విప్లవ పోరాట సమయం మొత్తం జీవితకాలం గా మనం చెప్పుకోవచ్చు లెక్కకు వస్తే  అల్లూరి సీతారామరాజు 22 ఆగస్టు 1922 నుంచి 1924 వరకు అని చెప్పుకుంటారు.  అసలు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారికి ఒకలేఖ రాసారు నేను మీకు లొంగిపోతున్నాను అని.  కానీ బ్రిటిష్ వారు రుదర్ ఫర్డ్ అద్యక్షణ తో కాల్చి చంపేశారు.  ఈ వీరుని కద ముగించేసారు .

3 comments:

  1. కొన్ని విషయాలు.

    అల్లూరి సీతారామరాజు అనే పేరు ప్రచారంలో ఉన్నా, ఆయన అసలు పేరు అల్లూరి రామరాజు. ఈ సీత ఆయనపేరులోకి యెలా ప్రవేశించిందో స్పష్టంగ తెలియదు.

    అల్లూరివారికి సీత అంటూ ప్రేయసిగాని భార్యగాని యెవరూ లేరని విన్నాను. ఆయన మీద తీసిన సినిమాలో అలా ఉన్నట్లు చూపించినట్లు విన్నాను. సినిమాను నేను చూడ లేదు.

    అల్లూరి చనిపోయేనాటికింకా పాతికేళ్ళలోపు యువకుడే.

    అల్లూరిని కాల్చి చంపినట్లు ప్రచారంలో ఉన్నది వాస్తవమేకాని, అల్లూరి తప్పించుకున్నాడని చాలామంది విశ్వాసం చూస్తుంటే బహుశ: ఆయన మృతదేహం దొరకలే దనిపిస్తోంది. కాల్చటం కూడా కథనమేనేమో.

    గాంధీజీ అల్లూరివారి విప్లవాన్ని అభినందించలేదు కాబట్టి, అల్లూరి కేవలం తెలుగువాడైన పాపానికి జాతీయ నాయకుని గౌరవాన్ని పొందలేకపోయాడు. ఇది చాలా సిగ్గుపడవలసిన విషయం తెలుగువాళ్ళకి.

    తూర్పుగోదావరిజిల్లా రంపచోడవరం పోలీసు స్టేషను రికార్డుల్లో అల్లూరివారి సంతకం ఉన్నదని విన్నాను. నేనైతే చూడ లేదు.

    ReplyDelete
  2. శ్యామలీయం గారు,

    ఇది చదవండి.

    http://te.wikipedia.org/wiki/%E0%B0%85%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%B8%E0%B1%80%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81

    ReplyDelete
  3. Good Post,
    can find something about him,

    http://sridharchandupatla.blogspot.in/2008/02/blog-post.html,

    Sridhar.

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers