Blogger Widgets

శుక్రవారం, ఆగస్టు 31, 2012

రామన్ మెగసెసే పురస్కారం

శుక్రవారం, ఆగస్టు 31, 2012

Ramon Magsaysay - Seventh Philippine President
రామన్ మెగసెసే
రామన్ మెగసెసే పురస్కారం న్యూయార్క్ కి చెందిన రాక్ ఫెల్లర్ సహోదరులు ఫిలిప్పీన్స్ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన ఒక పురస్కారం. ఫిలిప్పీన్స్ దేశపు మాజీ అధ్యక్షుడైన రామన్ మెగసెసే జ్ఞాపకార్థం దీనిని 1957 లో ఏర్పాటు చేశారు. ఇది తరచూ "ఆసియా ఖండపు నోబెల్ బహుమతి"గా అభివర్ణించబడుతుంది. ప్రతి సంవత్సరం రామన్ మెగసెసే ఫౌండేషన్ తమతమ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆసియా దేశపు వ్యక్తులకు ఈ అవార్డును ప్రధానం చేస్తుంటుంది. ఈ బహుమతిని ప్రధానంగా క్రింది ఆరు విభాగాల్లో ప్రకటిస్తారు.  

  • ప్రభుత్వ సేవ
  • ప్రజా సేవ
  • సామాజిక నాయకత్వం
  • జర్నలిజం, సాహిత్యం, సృజనాత్మకత
  • ప్రపంచ శాంతి
  • అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు 
కలవారికి మెగసెసే అవార్డ్ ఇస్తారు అని అందరికి తెలుసు.  అయితే ఆ ఆవార్డ్ ఎవరుపేరుమీద  ఇస్తారు అన్నది నేను చెప్పేస్తాను.  రామన్ మెగసెసే పిలిప్పైన్ ఏడవ ప్రెసిడెంట్ గా పనిచేసారు.  ఈయన ఆగస్టు 31, 1907 న Iba అనే ప్రదేశంలో పిలిప్పైన్స్ లో జన్మించారు.  ఈయన తండ్రి పేరు  Exequiel Magsaysay  మరి తల్లి పేరు  Perfecta de Fierro,  మెగసెసే ఆర్మీలో కూడా పనిచేసారు.  ఈయన మార్చ్ 7, 1957 న Mt.Manunggal, Cebu అనే ప్రదేశములో ప్లైన్ ఆక్సిడెంట్ లో చనిపోయారు.  అప్పటికి మెగసెసే వయసు 50 సంవత్సరములు.  ఈయన మీద అభిమానంతో రామన్ మేగాసేసే పేరుతో ఎంతో విశిష్టమైన అవార్డులు ఇవ్వటం మొదలు పెట్టారు.  రామన్ మెగసెసే జయంతి సందర్బముగా ఆయనగురించి తెలుసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను.

హరికథా పితామహుడు

హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు
 హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు గారు 31 ఆగస్టు 1864 జన్మించారు.  ఈయన పూర్తి పేరు  అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు ప్రముఖ హరికథా కళాకారుడు, సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన. "శ్రీమత్" మరియు "అజ్జాడ" పదాలు కలిపి "శ్రీమదజ్జాడ నారాయణ దాసు" గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం.  ఈయన చిన్నతనం నుండి కూడా ఏకసంథాగ్రాహి.  చిన్న తనంలో కూడా భాగవతం పద్యాలు చాలా బాగా పాడేవారు.  ఈయన అష్టావధాని గా రాణించారు.  తెలుగు, సంస్కృతం, హిందీ, బెంగాలీ, పారశీకం, ఉర్దూ, ఆంగ్లం, అరబ్బీ భాషలన్నింటిలో అనర్గళంగా హరికథను చెప్పగలిగిన హరికథా పితామహుడు. కవిత్వం, సంగీతం, నాట్యం ఈ మూడు ప్రక్రియలకు భక్తిని కలిపి హరికథ కు ప్రాణం వంటిది ఆరోజుల్లో మైకులు లేకుండానే హరికధ చెప్పేవారు.  అయన సౌండ్ కంచు మోగినట్టు గట్టిగా పాడేవారు. దాసుగారు సుమారు 21 హరికధలు స్వర పరచారు అని చెప్పుకోవచ్చు. ఆదిభట్ల నారాయణదాసుగారు  2 జనవరి 1945 న మరణించారు.  ఈరోజు ఆదిభట్ల నారాయణదాసు గారి జన్మదినం సందర్బంగా హరికధ విని ఆయనను గుర్తుచేసుకుందాం.  హరికధ కళాఅభిమానులందరికి హరికధా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసుగారి జయంతి శుభాకాంక్షలు.

గురువారం, ఆగస్టు 30, 2012

అందరి వశమా హరి నెరుగ

గురువారం, ఆగస్టు 30, 2012


అందరి వశమా హరి నెరుగ
కందువగ నొకడు గాని యెరగడు

లలితపు పదికోట్ల నొకడు గాని
కలుగడు శ్రీ హరి గని మనగ
ఒలసి తెలియు పుణ్యులకోట్లలో
ఇలనొకడు గాని యెరగడు హరిని

శ్రుతి చదివిన భూసుర కోట్లలో
గతియును హరినె యొకానొకడు
అతి ఘనులట్టి మహాత్మ కోటిలో
తతి నొకడు గాని తలచడు హరిని

తుదకెక్కిన నిత్యుల కోట్లలో
పొదుగునొకడు తలపున హరిని
గుదిగొను హరి భక్తుల కోట్లలో
వెదకు నొకడు శ్రీ వేంకటపతిని

బుధవారం, ఆగస్టు 29, 2012

నా "భాష" అమ్మపాట పాడినట్టి భాష

బుధవారం, ఆగస్టు 29, 2012


ఉగ్గుపాల నుండి ఉయ్యాలలో నుండి
అమ్మపాట పాడినట్టి భాష
తేనె వంటి మందు వీనులకును విందు
దేశభాషలందు తెలుగులెస్స!
సంస్క్రృతంబులోని చక్కెరపాకంబు
అరవభాషలోని అమృతరాశి
కన్నదంబులోని తేట తెలుగునందు
వేనవేల కవుల వెలుగులో రూపోంది
దేశదేశములలో వాసిగాంచిన భాష
వేయియేండ్ల నుండి విలసిల్లు నా "భాష"
దేశభాషలందు తెలుగు లెస్స,

జాతీయ క్రీడాదినోత్సవ శుభాకాంక్షలు.


ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవము - భారత దేశము. క్రీడా మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి (1905 జననం). భారతదేశపు హాకీ క్రీడను ప్రపంచ దేశాల్లొ చాటాడు. అందుకని ధ్యాన్ చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించి ప్రతీ సంవత్సరం అమలు చేస్తుంది. అందువల్ల క్రీదాభిమానులందరకు జాతీయ క్రీడాదినోత్సవ శుభాకాంక్షలు.
Play A Game

Get Adobe Flash Player



తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు



తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడుగిడుగు వెంకట రామమూర్తి. గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త,హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్దితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమంవల్ల కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది.గిడుగురామ్మూర్తి జయంతి ఆగష్టు 29 నితెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము.  గిడుగు రామమూర్తి పుట్టిన రోజు ఆగష్టు 29 ని తెలుగు భాషా దినోత్సవముగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు  ప్రజలు పాటిస్తున్నారు

విశ్వనాథ సత్యనారాయణ గారు రామమూర్తి పంతులు గారిగురించి ఇలా అన్నారు.  "రామ్మూర్తి పంతులు తెలుగు సరస్వతి నోములపంట".  అని ఇంకా  "రామ్మూర్తి పంతుల వాదాన్ని అర్థం చేసుకోక, దురర్థం కలిగించి తెలుగువాళ్ళు ఎంతో నష్టపోయినారు".
రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలని, తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంధ సంస్థలు అందచేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వినియోగం పెంచడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు.  ప్రపంచంలో తెలుగు భాష ఒక విశిష్టమైన స్థానాన్ని కలిగివుంది.  ప్రపంచీకరణ వలన పిల్లలను ఇంగ్లీషు మాధ్యమములో చదివించటానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతము కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమములో చదువుతున్నారని వినికిడి మరియు లెక్కలు కూడా తెలియ జెప్పుతున్నాయి.  ఇది ఎంతో గొప్ప మార్పుగా చెప్పుకోవచ్చు.  తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు .

ఆదివారం, ఆగస్టు 26, 2012

మదర్ థెరీస జయంతి

ఆదివారం, ఆగస్టు 26, 2012

మదర్ థెరీసాగా పేరు పొందిన ఆగ్నీస్ గోక్షా బొజాక్షువు (ఆగష్టు 261910 – సెప్టెంబరు 51997మాసిడోనియాలో అల్బేనియన్ సంతతికి చెందిన కుటుంబంలో జన్మించింది. ఈమె తన జీవితాన్ని పేద రోగులకు సేవచేయడంలోనే గడిపింది. ఈమె సేవకు గుర్తింపుగా 1979 లో ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారము లభించింది. ఈమెకు తరవాత భారతదేశ ప్రభుత్వం కూడా 1980లో భారతరత్నను ప్రకటించింది.  ఈరోజు మదర్ థెరీస జయంతి సందర్బంగా అందరికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.

నా షో పేరు హరివిల్లు

ఆకాశం లో ఎప్పుడైనా హరివిల్లు వస్తుంది కానీ ఆదివారం మాత్రం ప్రపంచం మొత్తం మీద ఒకేసారి హరివిల్లు వస్తుంది అదే నా షో పేరు హరివిల్లు.  ఆహరివిల్లు కూడా ఉదయం 10:30 నుండి మద్యాహ్నం 12:00  గంటలవరకు వస్తుంది.  అది కూడా ఎక్కడబడితే అక్కడ రాదండి కేవలం  Online Radio Josh Live  లో మాత్రమే  వస్తుంది.  ఇది  కేవలము live ప్రోగ్రాం మాత్రమె కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి.  నా కబుర్లు, పాటలు , కదలు వినటమే కాదండి మీరు నాతో సరదాగా మాట్లాడైవచ్చును.  నాతో మాట్లాడి నాప్రశ్నలకు జవాబులు చెప్పెయవచ్చు.  మరి హరివిల్లు షోను అస్సలు మిస్ అవ్వద్దు.   
మరి నా షోపేరు చెప్పేసాను కదా,  మరి నాతో మాట్లాడాలి అంటే 
Skype id: radiojoshlive
US: 914-214-7574
UK: 20-3286-9594
AUS: 28003-4546
Local Number: 040-4200-2003  
ఈ నెంబర్స్ కాల్ చేసి నాతో మాట్లాడైవచ్చు.  మరి నా షోను మిస్ కాకండి.  ధన్యవాదములు. 

బుధవారం, ఆగస్టు 22, 2012

మాటిమాటికి వ్రేలు మడిచి

బుధవారం, ఆగస్టు 22, 2012


మాటిమాటికి వ్రేలు మడిచి యూరించుచు నూరుగాయలు దినుచుండు నొకడు
ఒకని కంచములోనిదొడిసి చయ్యనమ్రింగి చూడలేదని నోరు చూపు నొకడు
యేగురార్గులు చల్దులెలమి పన్నిదమాడి ఊర్కొని కూర్కొని కుడుచునొక్కడు
యిన్ని యుండగ పంచియిడుట నెచ్చెలితనమనుచు బంతెనగుండులాడునొకడు
కృష్ణు చూడుమనుచు కికురించి పలుమ్రోల మేలిభక్ష్యరాసి మెసగునొకడు
నవ్వునొకడు సఖుల నవ్వించు నొకడు ముచ్చటాడు నొకడు మురియునొకడు 

(పోతన భాగవత పద్యం )


అచ్చపురాల యమునలోపల
ఇచ్చగించి భుజియించితి కృష్ణ

ఊరుగాయలును నొద్దికచద్దులును
నారగింపుచును నందరిలో
సారె బాలుల సరసాల తోడ
కోరి చవులు గొంటివి కృష్ణా

ఆకసంబున కాపుర ముఖ్యులు
నాకలోకపు నాందులును
కైకొని యజ్ఞకర్తయాతడని
జోక గొనియాడఁ జొక్కితి కృష్ణా

పేయలు లేవు పిలువుడనుచు
కోయని నోరఁగూతలును
మాయల బ్రహ్మము మతము మెచ్చుచు
చేయని మాయలు సేసితి కృష్ణా

ఆదివారం, ఆగస్టు 19, 2012

Know U R GK

ఆదివారం, ఆగస్టు 19, 2012

World Photography Day. First photos of The World.

Earliest Known Photograph [1825]


2. The First Photograph Ever Taken “View from the Window at Le Gras” [Circa, 1826]


3. The First Light Picture and Human Potrait Ever Taken [Oct,Nov 1839]

4. The Photo of the first Photographic Studio [1893]


Today World Photography Day, So Happy Photography Day.

ప్రపంచ మానవత్వదినోత్సవ శుభాకాంక్షలు

Today is World Humanitarian Day. This is a good way to show we believe in humanity.
Today is World Humanitarian Day. This is a good way to show we believe in humanity.
నేడు ప్రపంచ మానవత్వ దినోత్సవము.  అందువల్ల మన మానవాళి అందరికి  ప్రపంచ మానవత్వదినోత్సవ శుభాకాంక్షలు

శుక్రవారం, ఆగస్టు 17, 2012

చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ

శుక్రవారం, ఆగస్టు 17, 2012


ప|| చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ |
కూడున్నది పతి చూడి కుడుత నాంచారి ||

చ|| శ్రీమహాలక్ష్మియట సింగారాలకే మరుదు |
కాముని తల్లియట చక్కదనాలకే మరుదు |
సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు |
కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి ||

చ|| కలశాబ్ధి కూతురట గంభీరలకే మరుదు |
తలపలోక మాతయట దయ మరి ఏమరుదు |
జలజనివాసినియట చల్లదనమేమరుదు |
కొలదిమీర ఈ చూడి కుడుత నాంచారి ||

చ|| అమరవందితయట అట్టీ మహిమ ఏమరుదు |
అమృతము చుట్టమట ఆనందాలకేమరుదు |
తమితో శ్రీవేంకటేశు దానె వచ్చి పెండ్లాడె |
కౌమెర వయస్సు ఈ చూడి కుడుత నాంచారి ||

బుధవారం, ఆగస్టు 15, 2012

స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు

బుధవారం, ఆగస్టు 15, 2012

100 సంవత్సరముల విదేశీయుల పాలన నుండి శాశ్వితాముగా విముక్తి పొందిన దినమును మనము స్వాతంత్ర్య దినోత్సవముగా జరుపుకుంటున్నాము.  ఈ సంవత్సరము మనము 66వ స్వాతంత్రయదినోత్సవముగా జరుపుకుంటున్నాము .  ఎందరో మహానుబావులు ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్ర్య భారతదేశానికి మనకు అప్పగించారు.  దీనికి కొంతమంది అహింసా మార్గములో ప్రయత్నించారు.  మరికొందరు హింసా మార్గములో ప్రయత్నించారు. చివరికి 1947 ఆగష్టు 15 న స్వాతంత్ర్యము పొందాం.  అలా త్యాగాలు చేసి సాధించిన భారత మాతకు వందనం తెలుపుతూ.  వారిని గుర్తు చేసుకొని జెండా ఎగురవేసాం కదా.  ఈ స్వాతంత్ర్యదినోత్సవ దిన సందర్భముగా అందరికి నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)