Blogger Widgets

Thursday, September 27, 2012

భగత్ సింగ్ గొప్ప ఉద్యమకారుడు

Thursday, September 27, 2012

Bhagat Singhఈ రోజు ప్రముఖ భారత స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ పుట్టిన రోజు. సెప్టెంబర్ 27th 1907 లో ప్రస్తుత పాకిస్తాను లోని లాయల్ జిల్లా బంగాగ్రామంలో జన్మించారు. భగత్ సింగ్ తల్లి తండ్రులు విద్యావతి,కిషన్ సింగ్. వీరు సర్దార్ కుటుంబము.భగత్ సింగ్ కుటుంబంలోని వారందరు స్వాతంత్రపోరటయోదులే. భగత్ సింగ్ పుట్టిన రోజు నాడు వారందరూ జైలు నుండి విడుదల అయ్యారు. అప్పుడు వారి కుటుంబము పండగ చేసుకుని ఆసందర్బములోని భగత్ సింగ్ అని నామకరణము చేసారు.


భగత్ సింగ్ ఉద్యమాలలో చాలా ఉత్సాహంగా పాల్గొనేవారు.అసెంబ్లీపై బాంబు విసిరేసిన సంఘటనకి కాస్త ముందుగా తన సహచరుడు సుఖ్‌దేవ్‌కు రాసిన లేఖలో భగత్ సింగ్ " నాకూ ఆశలూ, ఆంక్షలూ ఉన్నాయి. ఆనందమైన జీవనం గడపాలని ఉంది. అయితే అవసరమొచ్చినప్పుడు వీటన్నిటినీ త్యజించగలను. ఇదే అసలైన బలిదానం."

భగత్ సింగ్ చాలా గొప్ప దేశభక్తుడు. ఎలాఅంటే జిలియన్ వాలాబాగ్ ఉదంతంజరిగినప్పుడు ఆ ప్రదేశము అంతా రక్తముతో తడిసినది. భగత్ సింగ్ ఆ ఘటన జరిగినప్పుడు చిన్నవయసు అప్పుడు భగత్ సింగ్ అక్కడ భూమికి ముద్దుపెట్టుకొని ఆ మట్టిని ఇంటిదగ్గర పెట్టుకున్నాడు. అంత దేశభక్తికలవాడు.అతని ఉద్యమాలు భారత స్వాతంత్ర ఉద్యమం.

అయన ప్రద్దాన సంస్ఠలు నజవాన్ భారత్ సభ,కీర్తికిసాన్ పార్టి, హిందుస్తాన్ సోసలిస్ట్ రిపబ్లికన్ అసోషియెషన్. మొదలగున్నవి ప్రద్దాన సంస్తలు.

భగత్ సింగ్ ముఖ్యమైన కొటేషన్ ఇన్క్విలాబ్ జిందాభాద్.
బాంబ్ కేసులో, భగత్ సింగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.. వాళ్ళు దీని మీద విచారణ జరుపుతున్న సమయంలోనే, పోలీసు అధికారిని చంపిన సంగతి కూడా బయటపడింది.. దాంతో, ఆయనతో పాటు ఆయన స్నేహితులైన రాజగురు, సుఖదేవ్ కి కూడా మరణశిక్ష పడింది..

కానీ జైల్లో ఉన్నప్పుడు కూడా, భగత్ సింగ్ ఉద్యమాలని చేయడం ఆపలేదు.. బ్రిటీష్ ఖైదీలకి, భారతీయ ఖైదీలకి చూపిస్తున్న అసమానతలని పారద్రోలడానికి, 63 రోజుల పాటు, నిరాహార దీక్ష చేశారు.. దానితో ఆయన పేరు భారత దేశం మొత్తం మారుమ్రోగింది.. (అంతకుముందు వరకూ ఆయన కేవలం పంజాబ్ ప్రాంత వరకు మాత్రమే పరిమితమయ్యారు)

చివరికి మార్చ్23, 1931న రాజ గురు, సుఖదేవ్ తో సహా భగత్ సింగ్ ని ఉరి తీశారు…. అలా ఒక విప్లవకారుని ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది..

Wednesday, September 26, 2012

నిజము పకోడీ!

Wednesday, September 26, 2012చిలకమర్తి లక్ష్మీనరసింహం(1867 - 1946) ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20 వశతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకడు. ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయం. ఈ నాటకంలో టంగుటూరి ప్రకాశం పంతులు అర్జునుడి వేషం వేశేవాడు.
చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి జన్మదినము సందర్బముగా తెలుగు సాహిత్య అబిమానులకు శుభాకాంక్షలు.
వారికి సరదాగా ఈ పకోడీలు అందుకొండి మరి.
ఓ సాయంకాలం స్నేహితులంతా కూర్చున్నాక పకోడీలు తెప్పించారు. అక్కడే వున్న చిలకమర్తివారిని వారి స్నేహితులు పద్యాలు చెప్పమని కోరారు.

"కవులకు అక్షర లక్షలిచ్చెడి కాలము గతించినది. పద్యమునకు పకోడినిచ్చెడి దుర్దినములు వచ్చినవి" అని హాస్యోక్తులు విసరి ఆయన పకోడిపై చెప్పిన పద్యాలలో కొన్ని:

వనితల పలుకుల యందున
ననిమిష లోకమున నున్న దమృత మటంచున్
జనులనుటె గాని లేదట
కనుగొన నీయందమృతము గలదు పకోడీ!

ఆ కమ్మదనము నారుచి
యా కరకర యా ఘుమఘుమ మా పొంకములా
రాకలు పోకలు వడుపులు
నీకే దగు నెందు లేవు నిజము పకోడీ!

కోడిని దినుటకు సెలవున్
వేడిరి మును బ్రాహ్మణులును వేధ నతండున్
కోడి వలదా బదులుగ ప
కోడిం దినుమనుచు జెప్పె కూర్మి పకోడీ!


Saturday, September 22, 2012

ఆదివారం రేడియో జోష్ లో హరివిల్లు వస్తుంది

Saturday, September 22, 2012

ఆకాశం లో ఎప్పుడైనా హరివిల్లు వస్తుంది కానీ ఆదివారం మాత్రం ప్రపంచం మొత్తం మీద ఒకేసారి హరివిల్లు వస్తుంది అదే నా షో పేరు హరివిల్లు. ఆహరివిల్లు కూడా ఉదయం 10:30 నుండి మద్యాహ్నం 12:00 గంటలవరకు వస్తుం
ది. అది కూడా ఎక్కడబడితే అక్కడ రాదండి కేవలం Online Radio Josh Live లో మాత్రమే వస్తుంది. ఇది కేవలము live ప్రోగ్రాం మాత్రమె కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. నా కబుర్లు, పాటలు , కదలు వినటమే కాదండి మీరు నాతో సరదాగా మాట్లాడైవచ్చును. నాతో మాట్లాడి నాప్రశ్నలకు జవాబులు చెప్పెయవచ్చు. మరి హరివిల్లు షోను అస్సలు మిస్ అవ్వద్దు. 
మరి నా షోపేరు చెప్పేసాను కదా, మరి నాతో మాట్లాడాలి అంటే

Radio Josh Live 

Skype id: radiojoshlive

US: 914-214-7574

UK: 20-3286-9594

AUS: 28003-4546

Local Number: 040-4200-2003 

ఈ నెంబర్స్ కాల్ చేసి నాతో మాట్లాడైవచ్చు. మరి నా షోను మిస్ కాకండి. ధన్యవాదములు.

How Smart U R ??


Just do it. Don't cheat! Because of you did, this test would be no fun. We promise that there are no tricks to this test.

Read the sentence below:
          
FINISHED FILES ARE THE
RESULT OF YEARS OF SCIENTIFIC
STUDY COMBINED WITH THE
EXPERIENCE OF YEARS

Now count the F's in that sentence. But here is a small condition.  that is count them ONLY ONCE.   Do not go back and count them again.

Friday, September 21, 2012

గురజాడ వారి అడుగుజాడ.

Friday, September 21, 2012

దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నది ఎవరో తెలుసా గురజాడ అప్పారావు గారు. 
ఈరోజు అనగా సెప్టెంబర్ 21st న గురజాడ అప్పారావుగారి పుట్టినరోజు . గురజాడ అప్పారావుగారు 1862 september 21st న విశాఖపట్టణం జిల్లా లో యలమంచలి తాలూక లో సర్వసిద్ధి రాయవరం అన్న వూరిలో తండ్రి వెంకట రామదాసు , తల్లి కౌసల్యమ్మలకు జన్మిచినారు.
గురజాడ అప్పారావుగారు తెలుగు సాహిత్యమ్ మీద చాలా కృషిచేసారు.
అప్పారావుగారు అన్నారు ఆధునిక మహిళ భారత దేశ చరిత్రను పునర్నిర్మ్స్తుంది అని అన్నారు.
ఆయన రచనలు మామూలు వాడుక భాషలోనే రాసేవారు. ఆయన పుత్తడిబొమ్మ పూర్ణమ్మ అనే నాటకం మంచి పేరు తెచ్చుకుంది.కన్యాశుల్కము ఆయన రచనలలో మంచి పేరు తెచ్చుకుంది.

తాంబూలాలు ఇచ్చేసాము తన్నుకు చావండి 
డామిట్! కథ అడ్డంగా తిరిగింది
పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్‌
గురజాడ అప్పారావు గురించి వినని వారు వుంటారేమో గానీ, కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన ఈ వాక్యాలు వినని తెలుగు వారు వుండరు. ఈనాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి.
అప్పారావుగారి గేయాలలో మనలో దేశభక్తిని పెంచుటకు దేశభక్తి పాట రాసారు అందులో ఒకటి

దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్‌
గట్టిమేల్‌ తలపెట్టవోయి
పాడి పంటలు పొంగిపొర్లె
దారిలో నువు పాటు పడవోయి
తిండి కలిగితే కండ కలుగును
కండ కలవాడేను మనిషోయి
యీసురోమని మనుషులుంటే
దేశమేగతి బాగుఅగునోయ్‌
జల్దుకుని కళలన్ని నేర్చుకు
దేశి సరకులు నింపవోయ్‌
దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్‌
పూని ఏదైనాను ఒక మేల్‌
కూర్చి జనులకు చూపవోయ్‌
చెట్టపట్టాల్‌ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయ్‌
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్‌
సొంత లాభం కొంత మానుకు
పొరుగు వానికి తోడుపడవోయ్‌
దేశమంటే మట్టి కాదోయ్‌
దేశమంటే మనుషులోయ్‌
అప్పారావుగారి రచనలలో కన్యక, ముత్యాలసరాలు , సారంగదార, సుభద్ర ఇంకా చాలా రచనలు వున్నాయి.  ఈరోజు అప్పారావుగారి 150 వ జన్మదినం సందర్భంగా సాహిత్యప్రియులందరికి శుభాకాంక్షలు.  అప్పారావుగారికి నివాళి అర్పిస్తున్నాము.

Thursday, September 20, 2012

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి

Thursday, September 20, 2012గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి
గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి
గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి 


{ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి }  chorus

గానచతురాయ గానప్రాణాయ గానాంతరాత్మనే
గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే
గురుపూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే
గురువిక్రమాయ గుల్హ్యప్రవరాయ గురవే గుణ గురవే
గురుదైత్య కళక్షేత్రే గురుధర్మ సదారాధ్యాయ 
గురుపుత్రపరిత్రాత్రే గురుపాఖండ ఖండకాయా

గీతసారాయ గీతతత్వాయ గీతగోత్రాయ ధీమహి
గూఢగుల్ఫాయ గంధమత్తాయ గోజయప్రదాయా ధీమహి
గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి 


{ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి }  chorus

{గంధర్వరాజాయా గంధాయా గంధర్వ గాన శ్రవణప్రనైమే
గాఢఅనురాగాయ గ్రంధాయా గీతాయ గ్రంధార్థ తన్మైయే 
గురిలే...గుణవతే ..గణపతయే..  }  chorus
 
గ్రంధ గీతాయ గ్రంధ గేయాయ గ్రంధాంతరాత్మనే
గీతలీనాయ గీతాశ్రయాయ గీతవాద్యపఠవే
గేయచరితాయ గాయ గవరాయ గంధర్వప్రీకృతే
గాయకాధీన విగ్రహాయ గంగాజల ప్రణయవతే 
గౌరీ స్తనందనాయ గౌరీ హృదయ నందనాయ 
గౌరభాను సుఖాయ గౌరీ గణేశ్వరాయ

గౌరి ప్రణయాయ గౌరి ప్రవణాయ గౌరభావాయ ధీమహి
ఓ సహస్త్రాయా గోవర్ధనాయ గోపగోపాయ ధీమహి 
గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి 


{ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి } chorus

Tuesday, September 18, 2012

వరసిద్ధి వినాయక వ్రతవిదాన ప్రత్యేక కార్యక్రమము మీ రేడియోజోష్ లో

Tuesday, September 18, 2012

చిత్ర కవితావతంసులు - జ్యోతిశ్శాస్త్ర వేత్త -  విశ్రాంత తెలుగు ఉపన్యాసకులు (Rtd. Telugu lecturer)   
శ్రీ చింతా రామ కృష్ణా రావు గారి చే
ఈ గణపతి నవరాత్రులు సందర్భంగా 
ఉపన్యాసాంశము.
గణపతి నవరాత్రులు ఉత్సవ ప్రాశస్త్యము 
వరసిద్ధి  వినాయక వ్రతవిదాన వివరణ. 
ప్రత్యేక కార్యక్రమము మీ రేడియోజోష్ లో
సమయం: ఉదయం గం 7:00 నుండి గం 10:00 వరకు 
మళ్ళీతిరిగి 
సాయంత్రము గం 6:00  నుండి గం 8:00 వరకు.

వినాయకుని ఆకారం లో ఎంత గొప్ప జ్ణానం


Jai Ganesha
వినాయకుని  ఆకారంలో  మనం నేర్చుకోవలసినవి  ఇమిడివున్నాయి  కావాలంటే  మీరే  చూడండి.
వినాయకుని తొండంఓంకారాన్ని పోలి వుంటుంది.
ఏనుకు తల జ్ణానానికి , యోగ మునకు గుర్తు.
మానవశరీరము మాయ కు ప్రకృతికి సంకేతము.
చేతిలో పరసు అజ్ణానాన్ని పారద్రోలేది.
మరోచేతిలో కత్తి విఘ్నాలను పోగొట్టే సాధనం.
విరిగిన దంతం త్యాగానికి గుర్తు.
మాల జ్ణానాన్ని సంపాదించేది.
పెద్దచేవులు అందరి మాటలు జాగ్రత్తగా వినాలి.
బొజ్జమీద నాగబందం శక్తికి,కుండలినికి గుర్తులు.
ఎలుక వాహనం అన్ని జీవులను సమానంగా ప్రేమించగలగాలి.
                                చూసారా మరి వినాయకుని ఆకారం లో ఎంత గొప్ప జ్ణానం దాగివుందో.


Ganesh : Ganesha was born when the eternal couple contemplated on AUM. If you view Lord Ganesha sideways, then you will see the symbol AUM in sanskrit.
!! Om Sri Ganeshaya Namah !!  
విఘ్ననాయకుని రూపం ఇల 

శిరస్సు - విశ్వ విజ్ఞానాన్ని మేధస్సున గ్రహిస్తుంది 
కళ్ళు - విశ్వాన్ని ఆకాశంలా కరుణతో తిలకిస్తుంది 
చెవులు - విశ్వంలో ప్రతి సూక్ష్మ శబ్దాన్ని గమనిస్తుంది 
తొండం - శ్వాసను గమనిస్తూనే ఎరుకతో ధ్యానిస్తుంది 
దంతం - అజ్ఞానం కష్టమైనా వదిలించుకో 
నోరు - ఎవరు ఎంత దూరమున్నా ఆదుకో 
శరీర దేహము - విశ్వ విజ్ఞానాన్ని ఎంతైనా స్వీకరించండి 
ఎలుక - ప్రతి జీవికి ఒకే శ్వాస ఒకే ప్రాణమే 
సంపూర్ణ రూపము గురువుగా భోదిస్తూనే ఉంటుంది 

శ్రీ వినాయక పూజఅవిఘ్నమస్తు
వినాయకుడు ఎన్నో ప్రత్యేకతలు ఉన్న దేముడుపిల్లల దేముడుచదువుల దేముడుకుడుము యిస్తే వరాలు ఇచ్చే భోళామూర్తిగరిక పూజలకే సంబరపడే మంచి దేముడువినాయక చవితి వచ్చే కాలంలో నేలతల్లి తొలకరితో పులకరించి పచ్చపచ్చగా ఉంటుందికొత్త మోసులతోగరికపచ్చలతో డొంకలు తివాచీ పరిచినట్లు ఉంటాయిపున్నాగలుగన్నేరులు పూజ కోసమే అన్నట్టు విచ్చుకుంటాయివినాయకుణ్ణి అర్చించే 21 రకాల పత్రిలోనూ ఔషధ గుణాలు ఉన్నాయి.

వాటిని ఎరుక పరచడానికివాటిని స్మరించి తద్వారా విఘ్నేశ్వరుని స్తుతించడానికి  సంప్రదాయం వచ్చిందిఆటంకాలు రాకుండా కార్యసాఫల్యం కలిగిస్తాడనీవిద్యాబుద్ధులు ఇస్తాడనీ విశ్వసించి పూజిస్తారుపూలుపత్రి సేకరించడంవాటిని నేస్తాలతో పంచుకోవడంమారకాలు వేసుకోవడం అదంతా పండుగలో పూజలో భాగమేపూజ తరువాత తొమ్మిది రోజులు ఉత్సవాలు జరిపివినాయకుని జల నిమజ్జనం చేయడం మన ఆచారంకొలిచిన వారికి కొంగు బంగారమై వినాయకుడు అందరికీ సకల శుభములూ చేకూర్చాలని కోరుతూ...
శ్రీ వినాయక పూజ


శ్రీ వినాయక పూజా విధానము
శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పము
ముందుగా బొట్టుపెట్టుకునినమస్కరించుకుని విధంగా ప్రార్థించుకోవాలి.
ప్రార్థన:
శ్లో॥ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం 
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే 
అయం ముహూర్తస్సుముహూర్తోస్తు 
శ్లో॥ తదేవలగ్నంసుదినం తదేవతారాబలం చంద్రబలం తదేవ 
విద్యాబలం దైవబలం తదేవలక్ష్మీపతేతేంఘ్రి యుగంస్మరామి 
సుముహూర్తోస్తు 
శ్లో॥ లాభస్తేషాంజయస్తేషాంకుతస్తేషాం పరాభవః 
యేషామిందీవర శ్యామో హృదయస్థో జనార్దనః 
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం 
సుమఖ శ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః,
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః 
దూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః,
వక్రతుండ శ్శూర్పకర్ణోహేరంబః స్కంధ పూర్వజః 
అష్టావష్టౌ  నామాని యః పఠేచ్ఛ­ృణుయాదపి 
విద్యారంభే వివాహేచ ప్రవేశ నిర్గమేతథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్యనజాయతే।
అభీప్సితార్థ సిద్ధ్యర్థంపూజితో యస్సురైరపి,
సర్వవిఘ్నచ్ఛి దేతస్మై గణాధిపతయే నమః  
(నమస్కరించుకుని ఆచమనము - ప్రాణాయామము చేసి  విధంగా సంకల్పము చెప్పుకోవాలి)

సంకల్పం:

ఓం  మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థంశుభేశోభనే ముహూర్తే అద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరేకలియుగేప్రథమపాదేజంబూద్వీపేభరతవర్షేభరతఖండేమేరోర్దక్షిణ దిగ్భాగేశ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే (శ్రీశైలానికి  దిక్కులో వుంటే  దిక్కు పేరు చెప్పుకోవాలి), అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ ఖర నామ సంవత్సరేదక్షిణాయనేవర్షర్తౌభాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ బృహస్పతివాసర యుక్తాయాంశుభనక్షత్రశుభయోగశుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాంశుభతిథౌశ్రీమాన్ ....గోత్రః .... నామధేయఃశ్రీమతః ....గోత్రస్య ....నామధేయస్య (పూజ చేసే వారు గోత్రంపేరు చెప్పుకోవాలి.
పూజకు కూర్చున్న చిన్నారుల పేర్లు కూడా చెప్పాలిధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థయిర్య విజయాయు రారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థంధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థంఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థంమనోవాంఛాఫల సిద్ధ్యర్థంసమస్త దురితోపశాంత్యర్థంసమస్త మంగళావాప్త్యర్థంవర్షేవర్షేప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్థీ ముద్దిశ్యశ్రీ వరసిద్ధి వినాయకదేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే
(అంటూ కుడిచేతి మధ్యవేలితో నీళ్ళు ముట్టుకోవాలి)
ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం గణాధిపతి పూజాం కరిష్యే 
తదంగ కలశపూజాం కరిష్యే 
కలశపూజ:
కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య  తస్యోపరి హస్తం నిధాయ (కలశంలో గంధంపుష్పాలుఅక్షతలు వుంచి దానిని చేతితో తాకుతూ  మంత్రం చదవాలి)
కలశస్య ముఖే రుద్రః కంఠే విష్ణుసమాశ్రితః
మూలే తత్రస్థితో బ్రహ్మామధ్యే మాతృగణాస్మ­ృతాః,
కుక్షౌతుసాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః
అంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః  ఆయాంతు దేవపూజార్థం దురితక్షయకారకాః (మన వద్ద వున్న నీటిపాత్ర చుట్టూ గంధం రాసి బొట్లు పెట్టి అందులో తమలపాకు వుంచుకోవాలి.
 శ్లోకం చదువుతూ ఆకును నీటిలో సవ్య పద్ధతిలో తిప్పాలి)
శ్లో  గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు 
తమలపాకుతో కలశంలోని నీటిని పూజాద్రవ్యముల మీదాదైవము మీదాతమమీదా కొద్దిగా చిలకరించుకోవాలిఅనంతరం పసుపు గణపతిని పూజించాలి.విఘ్నేశ్వర పూజ

గణానాంత్వాం గణపతిగ్ం హవామహేకవిం కవీనా ముపమశ్రవస్తమం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ్యస్పత్యః ఆనశృణ్వన్నూతిభిస్సీద సాదనం॥
శ్రీ మహాగణాధిపతయే నమః 
ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే (మధ్య వేలితో నీటిని తాకాలి)

ధ్యానం :

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అనే శ్లోకం చదువుతూ పూవులూ అక్షతలూ కలిపి పసుపు గణపతి పాదాల చెంత వుంచాలిపూజను దేవుని పాదాల వద్ద మాత్రమే చేయాలిశిరసుపైన పూలు కానీ అక్షతలు కానీ చల్లరాదు)
ధ్యాయామి ధ్యానం సమర్పయామిఆవాహయామి ఆవాహనం సమర్పయామిహస్తయోః అర్ఘ్యం సమర్పయామిపాదయోః పాద్యం సమర్పయామి (అని చెబుతూ ఉద్ధరిణతో నీటిని పసుపు గణపతికి చూపించి  నీటిని చిన్న పళ్ళెం లేదా పాత్రలో వేయాలిపసుపు గణపతిని గంధంఅక్షతలుపసుపుకుంకుమపూలతో పూజించాలిఅగరు వత్తులు వెలిగించిబెల్లం లేదా పండు నైవేద్యం పెట్టి శోడశోపచార పూజ చేయాలియధాభాగం గుడం నివేదయామి  శ్రీ మహాగణాధిపతి స్సుప్రసన్నోసుప్రీతోవరదోభవతు  శ్రీ గణాధిపతి ప్రసాదం శిరసాగృహ్ణామి అంటూ పూజ చేసిన అక్షతలు రెండు తీసుకొని తలపై వుంచుకోవాలి.
మరలా ఆచమనం చేసి పైన సూచించిన విధంగా సంకల్పం చెప్పుకోవాలి.
అథ శ్రీ వరసిద్ధి వినాయక పూజాం కరిష్యేతదంగ ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యేఅంటూ కుడిచేతి మధ్య వేలితో నీటిని తాకాలి.
శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్ఠ :
(విగ్రహంపై పువ్వుతో కొంచెం పంచామృతాలను చిలకరించిఓం ఆంహ్రీంక్రోం యంరంలంవం శంషంసంహం - ఇత్యాద్యేన ప్రాణప్రతిష్ఠాపనం కృత్వానమస్క­ృత్వా (నమస్కారం చేస్తూ ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
శ్లో  స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకం
తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు॥
అవాహితోభవస్థాపితోభవసుప్రసన్నోభవఅవకుంఠితోభవవరదోభవప్రసీదప్రసీదప్రసీద (అంటూ వినాయకుడి విగ్రహం పాదాల వద్ద అక్షతలు లేక పూలు వేయాలి)
షోడశోపచార పూజ :
భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్
విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే 
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం
పాశాంకుశధరం దేవం ధ్యాయే త్సిద్ధి వినాయకమ్ 
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం
భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం 
ద్యాయే ద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం
చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం 
శ్రీ గణాధిపతయే నమః ధ్యాయామి॥ (వినాయకుడి
విగ్రహం పాదాల వద్ద పూలుఅక్షతలు వేసి నమస్కరించాలి)

అత్రాగచ్ఛ జగద్వన్ద్య సురరాజార్చితేశ్వర

అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ.
ఆవాహయామి॥ (మరల అక్షతలు వేయాలి)
మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితమ్
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్
ఆసనం సమర్పయామి  (అక్షతలు లేదా పూలు వేయాలి)
గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన
గృహాణార్ఘ్యం మయాదత్తం గన్ధపుష్పాక్షతైర్యుతమ్
అర్ఘ్యం సమర్పయామి॥ (ఉద్ధరిణతో నీరును స్వామికి చూపించి పక్కన వుంచుకున్న పాత్రలో వేయాలి)
గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక
భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన
పాద్యం సమర్పయామి॥ (మరలా కొంచె నీటిని స్వామికి చూపించి స్వామి పాదాల ముందుంచాలి)
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత
గృహాణాచమనందేవ తుభ్యందత్తం మయా ప్రభో
ఆచమనీయం సమర్పయామి॥ (కొంచె నీటిని స్వామికి చూపించి పాత్రలో వేయాలి)
దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే-
మధుపర్కం సమర్పయామి॥ (స్వామికి మధుపర్కాన్ని సమర్పించాలి.

స్నానం

పంచామృతైర్దేవ గృహాణ గణనాయక
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణపూజిత
పంచామృత స్నానం సమర్పయామి॥ (ఆవుపాలుపెరుగునెయ్యిపంచదారతేనెలు స్వామి విగ్రహంపై చల్లాలికొబ్బరికాయ కొట్టి  నీటిని స్వామిపై చల్లాలి)
గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైరమలైర్జలైః
స్నానం కురుష్వభగవన్వుమాపుత్ర నమోస్తుతే
శుద్ధోదక స్నానం సమర్పయామి॥ (కొంచెం నీటిని స్వామిపై చల్లాలి)
రక్తవస్త్రద్వయంచారు దేవయోగ్యంచ మంగళం
శుభప్రద గృహాణత్వం లమ్బోదర హరాత్మజ
వస్త్రయుగ్మం సమర్పయామి॥ (స్వామికి వస్త్రాలు లేదా ఇంట్లో పూజ చేసుకొనేట్లయితే పత్తికి పసుపుకుంకుమ రాసి దానిని వస్త్రంగా ఇవ్వవచ్చు)

రాజితం బ్రహ్మసూత్రంచ కాంచనం చోత్తరీయకమ్

గృహాణదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక
ఉపవీతం సమర్పయామి॥ (యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి)
చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం
విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్
గంధం సమర్పయామి॥ (కొంచెం గంధాన్ని స్వామికి అలంకరించాలి)
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్
శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే
అక్షతాన్ సమర్పయామి॥ (స్వామికి అక్షతలు సమర్పించాలి)
సుగన్ధాని  పుష్పాణి జాతీకుంద ముఖాని 
యేకవింశతి పత్రాణిసంగృహాణ నమోస్తుతే
పుష్పాణి పూజయామి॥ (స్వామిని పూలతో పూజించాలి)

అథ అంగపూజ

గణేశాయ నమః పాదౌపూజయామి॥ ఏకదంతాయ నమః గుల్ఫౌపూజయామిశూర్పకర్ణాయ నమః జానునీ పూజయామివిఘ్నరాజాయ నమః జంఫౌ పూజయామిఆఖువాహనాయ నమః ఊరూం పూజయామిహేరంబాయ నమః కటిం పూజయామిలంబోదరాయ నమః ఉదరం పూజయామిగణనాథాయనమః నాభిం పూజయామిగణేశాయ నమః హృదయం పూజయామిస్థూలకంఠాయ నమః కంఠం పూజయామిస్కందాగ్రజాయనమః స్కందౌపూజయామిపాశహస్తాయ నమః హస్తౌపూజయామిగజవక్త్రాయ నమః వక్త్రంపూజయామివిఘ్నహంత్రే నమః నేత్రే పూజయామిశూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామిఫాలచంద్రాయ నమః లలాటం పూజయామిసర్వేశ్వరాయ నమః శిరఃపూజయామివిఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి॥

అథ ఏకవింశతి పత్ర పూజ
(ఒక్కొక్క నామం చదువుతూ బ్రాకెట్లో పేర్కొన్న పత్రాలు తీసుకుని స్వామిని పూజించాలి)

ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి (మాచిపత్రి)
ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి (వాకుడాకు)
ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి (మారేడు)
ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి (గరికె)
ఓం హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి (ఉమ్మెత్త)
ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి (రేగి)
ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి (ఉత్తరేణు)
ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి (తులసి)
ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి (మామిడి)
ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి (గన్నేరు)
ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి (విష్ణుక్రాంతం)
ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి (దానిమ్మ)
ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి (దేవదారు)
ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి (మరువం)
ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి (వావిలి)
ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి (జాజి)
ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి (గండకీ)
ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి (జమ్మి)
ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి (రావి)
ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి (మద్ది)
ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి (తెల్లజిల్లేడు)
ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతపత్రాణి పూజయామి.

పూజకు కావలసిన సామగ్రి

పసుపుకుంకుమగంధంఅగరువత్తులుకర్పూరంతమలపాకులువక్కలుపూలుపూలదండలుఅరటిపండ్లుకొబ్బరి కాయలుబెల్లం లేదా పంచదారపంచామృతాలుతోరముదీపారాధన కుందులునెయ్యిలేక నూనెదీపారాధన వత్తులువినాయకుడి ప్రతిమ, 21 రకాల ఆకులుఉండ్రాళ్ళుపాయసంభక్ష్యాలు.

చిన్నారి దేవుళ్ళ పండుగ

వినాయక పూజా విధానం చిన్నారులను అమితంగా ఆకర్షిస్తుందివారికి పూజా విధానంమన ఆచార సంప్రదాయాలు నేర్పేందుకు ఇది చక్కని అవకాశంవివిధ రకాల ఆకులతో దేవుడ్ని పూజించడం ద్వారా వారికి ప్రకృతి ప్రాధాన్యతను వివరించే వీలుందిచిన్నారులకు వీలుంటే రోజూ వేసుకొనే దుస్తులకు భిన్నమైన బట్టలు వేస్తే వారికి వినాయకచవితి పట్ల మరింత ఆసక్తి పెరుగుతుందిఒకటిమూడుఐదు లేక తొమ్మిది ముడులతో తోరాన్ని తయారు చేసిపూజలో వుంచి దానిని పిల్లలుపెద్దలు అందరూ ధరించవచ్చు.

పూజా సన్నాహం

వినాయక చవితి రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకొని మామిడి ఆకుల తోరణం కట్టుకోవాలివాకిళ్ళను అలంకరించు కోవాలికుటుంబ సభ్యులంతా తలంటుకొని స్నానం చేయాలిదేవుని గది వుంటే అందులో లేదా పరిశుభ్రమైన ప్రదేశంలో ఒక పీటవేసిదానిపై మనం తెచ్చుకున్న వినాయకుడి విగ్రహాన్ని వుంచాలితెచ్చిన పూజా సామాగ్రిని కూడా అందుబాటులో వుంచుకోవాలివినాయకుడికి ఉండ్రాళ్ళు చాలా ఇష్టంమిగిలిన భక్ష్యాలున్నా లేకున్నా వీటిని తప్పని సరిగా తయారు చేసుకోవాలి.
వినాయకుడి విగ్రహం ఎదుట పీటపై కొంచెం బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రను వుంచాలిదానికి పసుపు రాసి బొట్లు పెట్టాలిదానిలో కొన్ని అక్షతలుపూలు వేసి దానిపై మామిడి ఆకులు వుంచి ఆపై కొబ్బరికాయతో కలశం ఏర్పాటు చేసుకోవాలి తరువాత పసుపు ముద్దతో చిట్టి పసుపు గణపతిని తయారు చేసుకోవాలిపూజకు ముందు ఒక గ్లాసులో చెంచా లేదా ఉద్ధరిణ వుంచుకొని పక్కన మరో చిన్న ప్లేటు పెట్టుకోవాలిపూజ చేస్తున్నప్పుడు చేతికి పసుపుకుంకుమలు అవుతాయి కాబట్టి చేతికింద ఒక శుభ్రమైన గుడ్డను వుంచుకుంటే బాగుంటుంది.
శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి
( క్రింది నామాలు చదువుతూ స్వామిని పూలతోగానిఅక్షతలతో గాని పూజించాలిఒకరు నామాలు చదువుతుండగా మిగిలిన వారు ఓం అనుకుంటూ పూజ చేయాలి.)

 • ఓం గజాననాయ నమః
 • ఓం గణాధ్యక్షాయ నమః
 • ఓం విఘ్నరాజాయ నమః
 • ఓం వినాయకాయ నమః
 • ఓం దైవమాతురాయ నమః
 • ఓం ద్విముఖాయ నమః
 • ఓం ప్రముఖాయ నమః
 • ఓం సుముఖాయ నమః
 • ఓం కృతినే నమః
 • ఓం సుప్రదీపాయ నమః
 • ఓం సుఖనిథయే నమః
 • ఓం సురాధ్యక్షాయ నమః
 • ఓం సురారిఘ్నాయ నమః
 • ఓం మహాగణపతయే నమః
 • ఓం మాన్యాయ నమః
 • ఓం మహాకాలాయ నమః
 • ఓం మహాబలాయ నమః
 • ఓం హేరంబాయ నమః,
 • ఓం లంబజఠరాయ నమః,
 • ఓం హ్రస్వగ్రీవాయ నమః,
 • ఓం మహోదరాయ నమః,
 • ఓం మదోత్కటాయ నమః,
 • ఓం మహావీరాయ నమః,
 • ఓం మంత్రిణే నమః,
 • ఓం మంగళస్వరాయ నమః,
 • ఓం ప్రమధాయ నమః,
 • ఓం ప్రథమాయ నమః,
 • ఓం ప్రాజ్ఞాయ నమః,
 • ఓం విఘ్నకర్త్రే నమః,
 • ఓం విఘ్నహంత్రే నమః,
 • ఓం విశ్వనేత్రే నమః,
 • ఓం విరాట్పతయే నమః,
 • ఓం శ్రీపతయే నమః,
 • ఓంవాక్పతయే నమః,
 • ఓం శృంగారిణే నమః,
 • ఓం ఆశ్రితవత్సలాయ నమః,
 • ఓం శివప్రియాయ నమః,
 • ఓం శీఘ్రకారిణే నమః,
 • ఓం శాశ్వతాయ నమః,
 • ఓం బలాయ నమః,
 • ఓం బలోత్థితాయ నమః,
 • ఓం భవాత్మజాయ నమః,
 • ఓం పురాణపురుషాయ నమః,
 • ఓం పూష్ణే నమః,
 • ఓం పుష్కరోత్షిప్తవారిణే నమః,
 • ఓం అగ్రగణ్యాయ నమః,
 • ఓం అగ్రపూజ్యాయ నమః,
 • ఓం అగ్రగామినే నమః,
 • ఓం మంత్రకృతే నమః,
 • ఓం చామీకరప్రభాయ నమః,
 • ఓం సర్వస్మై నమః,
 • ఓం సర్వోపాస్యాయ నమః,
 • ఓం సర్వకర్త్రే నమః,
 • ఓం సర్వనేత్రే నమః,
 • ఓం సర్వసిద్ధిప్రదాయ నమః,
 • ఓం సర్వసిద్ధియే నమః,
 • ఓం పంచహస్తాయ నమః,
 • ఓం పార్వతీనందనాయ నమః,
 • ఓం ప్రభవే నమః,
 • ఓం కుమారగురవే నమః,
 • ఓం అక్ష్యోభ్యాయ నమః,
 • ఓం కుంజరాసుర భంజనాయ నమః,
 • ఓం ప్రమోదాయ నమః,
 • ఓం మోదకప్రియాయ నమః,
 • ఓం కాంతిమతే నమః,
 • ఓం ధృతిమతే నమః,
 • ఓం కామినే నమః,
 • ఓం కపిత్థవనప్రియాయ నమః,
 • ఓం బ్రహ్మచారిణే నమః,
 • ఓం బ్రహ్మరూపిణే నమః,
 • ఓం బ్రహ్మవిద్యాదిదానభువే నమః,
 • ఓం జిష్ణవే నమః,
 • ఓం విష్ణుప్రియాయ నమః,
 • ఓం భక్తజీవితాయ నమః,
 • ఓం జితమన్మథాయ నమః,
 • ఓం ఐశ్వర్యకారణాయ నమః,
 • ఓం జ్యాయసే నమః,
 • ఓం యక్షకిన్నర సేవితాయ నమః,
 • ఓం గంగాసుతాయ నమః,
 • ఓం గణాధీశాయ నమః,
 • ఓం గంభీరనినదాయ నమః,
 • ఓం వటవే నమః,
 • ఓం అభీష్టవరదాయ నమః,
 • ఓం జ్యోతిషే నమః,
 • ఓం భక్తనిథయే నమః,
 • ఓం భావగమ్యాయ నమః,
 • ఓం మంగళప్రదాయ నమః,
 • ఓం అవ్యక్తాయ నమః,
 • ఓం అప్రాకృత పరాక్రమాయ నమః,
 • ఓం సత్యధర్మిణే నమః,
 • ఓం సఖయే నమః,
 • ఓం సరసాంబునిథయే నమః,
 • ఓం మహేశాయ నమః,
 • ఓం దివ్యాంగాయ నమః,
 • ఓం మణికింకిణీ మేఖలాయ నమః,
 • ఓం సమస్త దేవతామూర్తయే నమః,
 • ఓం సహిష్ణవే నమః,
 • ఓం సతతోత్థితాయ నమః,
 • ఓం విఘాతకారిణే నమః,
 • ఓం విశ్వగ్ధ­ృశే నమః,
 • ఓం విశ్వరక్షాకృతే నమః,
 • ఓం కళ్యాణగురవే నమః,
 • ఓం ఉన్మత్తవేషాయ నమః,
 • ఓం పరాజితే నమః,
 • ఓం సమస్త జగదాధారాయ నమః,
 • ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః,
 • ఓం ఆక్రాంత చిదచిత్ప్రభవే నమః,
 • ఓం విఘ్నేశ్వరాయ నమః,
 • ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః
        అష్టోత్తర శతనామార్చనం
            సమర్పయామి.

ధూపం

శ్లో॥ దశాంగం గుగ్గులోపేతం సుగన్ధిం సుమనోహరమ్
ఉమాసుత నమస్తుభ్యం గృహాణవరదోభవ
ధూపమాఘ్రపయామి॥
(అగరబత్తి వెలిగించి  ధూపాన్ని స్వామికి చూపించి పక్కన వున్న స్టాండులో కానిఅరటి పండుకు కానీ గుచ్చాలి.)

దీపం

సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోతితం మయా
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే
దీపం దర్శయామి॥ (దీపాన్ని స్వామికి చూపించాలి)

నైవేద్యం

(కొబ్బరి కాయలు ఇంకా వుంటే వాటిని తలా ఒకటి కొట్టి నైవేద్యం పెట్టాలిఅంతకు ముందు స్నానం సమయంలో కొట్టిన కొబ్బరికాయనుపిండి వంటలుపానకంవడపప్పుకుడుములుఉండ్రాళ్ళుఅరటిపండ్లు మొదలైన వాటిని స్వామి ముందుంచాలి)
సుగంధాన్ సుకృతాం శ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్,
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గ్యైః ప్రకల్పితాన్।
భక్ష్యంభోజ్యంచ లేహ్యం  చోష్యం పానీయ
మేవచ ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక-
మహానైవేద్యం సమర్పయామి॥ అంటూ ఆకుతో  పదార్థాలన్నింటిపైన కొద్దిగా నీరు చల్లాలి తరువాత స్వామికి నైవేద్యం పెట్టాలి.

తాంబూలం

పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతమ్,
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్
తాంబూలం సమర్పయామి.
(తమలపాకులువక్కపండుదక్షిణతో కూడిన తాంబూలాన్ని వినాయకుడి విగ్రహం ముందు వుంచి నమస్కరించాలి.)

నీరాజనం

సదానందద విఘ్నేశ పుష్కలాని ధనాని ,
భూమ్యాం స్థితాని భగవన్ స్వీకురుష్వ వినాయక
సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి॥
ఘృతవర్తి సహస్రైశ్చ
కర్పూరశకలైస్తథా నీరాజనం మయాదత్తం
గృహాణవరదోభవ నీరాజనం సమర్పయామి॥
(కర్పూరం వెలిగించి స్వామికి హారతి ఇచ్చి తరువాత హారతి పాత్రపై కొంచెం నీటిని వుంచి కళ్ళకు అద్దుకోవాలి)

మంత్రపుష్పం

(పుష్పంఅక్షతలు తీసుకొని నిలుచొని  శ్లోకాన్ని పఠించాలి)
సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపా
ధూమకేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః
వక్రతుండః మహాకాయ కోటిసూర్య సమప్రభ
అవిఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా
్ఙ(అక్షతలుపూలు స్వామి పాదాల వద్ద వుంచాలి)

ప్రదక్షిణ

శ్లో॥ యానికానిచ పాపాని జన్మాన్తరకృతానిచ।
తాని తాని ప్రణశ్యన్తి ప్రదక్షిణ పదేపదే 
పాపో హం పాపకర్మాహం పాపాత్మా పాపసమ్భవః 
త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల॥
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ 
తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష గణాధిప 
ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి 
(ప్రదక్షిణ చేసి నమస్కరించాలిసాష్టాంగ ప్రణామం చేయడం సంప్రదాయం)

 తరువాత మరలా కూర్చొనికొన్ని అక్షతలు చేతిలోకి తీసుకోవాలికొంచెం నీటిని అక్షతలపై వేసుకొని  శ్లోకం చెప్పుకోవాలి.

యస్యస్మ­ృత్యాచ నామోఖ్య తపః పూజా క్రియాదిషు
న్యూనం సంపూర్ణం తాం యాతి సద్వో వందే తం గణాధిపం
మంత్రహీనం క్రియాహీనం శక్తిహీనం మహప్రభో
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే
అనయా ధ్యానమావాహనాది షోడషోపచార పూజయాచఅష్టోత్తర నామార్చనయాచఅవసరమహా నివేదన యాచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతార్పణమస్తుశ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు ... అంటూ అక్షతలునీటిని పళ్ళెంలో వదలాలి నీటినిపంచామృతాలుకొబ్బరి నీళ్ళను కలిపి తీర్థంగా తీసుకోవాలిపూజ చేసిన అక్షతలను పిల్లల శిరస్సుపై వుంచాలిపెద్దలు కూడా  అక్షతలు శిరసుపై ధరించాలి.
శ్రీ వినాయకవ్రతకథ
(వ్రతకథ చెప్పుకొనే ముందు కొన్ని అక్షతలు చేతిలో వుంచుకోవాలి.  కథ పూర్తయిన తరువాత  అక్షతలను శిరసుపై వేసుకోవాలి)
పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరిసంపదలన్నీ పోగొట్టుకున్నాడుభార్యతోనుతమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడుఅక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహామునిని దర్శించినమస్కరించి "అయ్యామేము రాజ్యాధికారముసమస్త వస్తు వాహనములను పోగొట్టుకున్నాము కష్టాలన్నీ తీరిపూర్వవైభవము పొందేలా ఏదయినా సులభమైన వ్రతాన్ని చెప్పవలసింది'' అని ప్రార్థించాడుఅంత సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయిసమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు.
"ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించితండ్రీమానవులు  వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొందిసమస్త కోరికలూ తీరిసకల శుభాలనువిజయాలనువైభవాలనూ పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడుఅందుకు శివుడునాయనాసర్వసంపత్కరముఉత్తమముఆయుష్కామ్యార్థ సిద్ధిప్రదమూ అయిన వినాయక వ్రతమనేదొకటుందిదీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి రోజు ఉదయమే నిద్రలేచిస్నానం చేసినిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తిమేరకు బంగారంతో గానివెండితోగానిలేదా కనీసం మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మను చేసితమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించిఅష్టదళ పద్మాన్ని ఏర్పరచాలిఅందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి.
అనంతరం శ్వేతగంధాక్షతలుపుష్పాలుపత్రాలతో పూజించిధూపదీపాలనువెలగనేరేడుచెరకు మొదలైన ఫలములనురకమునకు ఇరవై ఒకటి చొప్పున నివేదించాలినృత్యగీతవాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించియథాశక్తి వేదవిదులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులను ఇవ్వాలిబంధుజనంతో కలిసి భక్ష్యభోజ్యాదులతో భోజనం చేయాలిమరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునః పూజ చేయాలివిప్రులను దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలిఈవిధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యములూ సిద్ధిస్తాయిఅన్ని వ్రతములలోకీ అత్యుత్తమమైన  వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవ ముని గంధర్వాదులందరిచేతా ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు.
కనుక ధర్మరాజా నువ్వు కూడా  వ్రతాన్ని ఆచరించినట్లయితేనీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావుగతంలో విదర్భ యువరాణి దమయంతి  వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడ గలిగిందిశ్రీకృష్ణుడంతటివాడు  వ్రతం చేయడం వల్లనే శ్యమంతకమణితో బాటుగా జాంబవతీ సత్యభామలనే ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు.
పూర్వకాలమున గజముఖుడయిన గజాననుడు అనేరాక్షసుడు ఒకడు శివుని గూర్చి తపస్సు చేశాడుఅతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకొమ్మన్నాడుఅంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించిస్వామీ నీవు నాయుదరమందే నివసించాలి అని కోరాడుదాంతో భక్తసులభుడగు శివుడు అతడి కుక్షియందుండిపోయాడుజగన్మాత పార్వతి భర్తను వెదుకుతూ ఆయన గజాసురుని కడుపులో వున్నాడని తెలుసుకున్నదిఆయనను దక్కించుకొనే ఉపాయం కోసం విష్ణువును ప్రార్థించినదిఅంత శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడుగజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు.
నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించారుబ్రహ్మాదిదేవత లందరిచే తలకొక వాయిద్యమును ధరింపజేశాడుమహావిష్ణువు తానును చిరు గంటలుసన్నాయిలు ధరించాడుగజాసుర పురానికి వెళ్ళి జగన్మోహనంబుగా గంగిరెద్దును ఆడించుచుండగా గజాసురుడది వినివారిని పిలిపించి తన భవనము ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడుబ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూతధారియగు నాహరి చిత్రవిచిత్రముగా గంగిరెద్దు నాడించాడుగజాసురుడు పరమానందభరితుడై "ఏమి కావాలో కోరుకోండి.... ఇస్తాను'' అన్నాడుఅంతట శ్రీహరి గజాసురుని సమీపించి "ఇది శివుని వాహనమగు నందిశివుని కనుగొనుటకు వచ్చిందిశివుడ్ని అప్పగించు'' అని కోరాడు మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు.
వచ్చినవాడు రాక్షసాంతకుడగు శ్రీహరి అని తెలుసుకున్నాడుతనకు మరణం నిశ్చయమనుకున్నాడుతన గర్భంలో వున్న పరమేశ్వరుడ్ని ఉద్దేశించి "స్వామీనా శిరస్సు త్రిలోక పూజ్యముగ చేసినా చర్మము నీవు ధరించు'' అని ప్రార్థించాడుతన గర్భంలో వున్న శివుడ్ని తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారము తెలియజేశాడుఅంత శ్రీహరి నందిని ప్రేరేపించగానంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించాడుమహేశ్వరుడు గజాసుర గర్భమునుండి బయటకు వచ్చాడువిష్ణుమూర్తిని స్తుతించాడు. 'దుష్టాత్ములకు ఇటువంటి వరమును ఇవ్వరాదు - ఇచ్చినచో పామునకు పాలుపోసినట్లవుతుందని సూచించాడుబ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠమునకు వెళ్ళగాశివుడు నందినెక్కి కైలాసమునకు వెళ్ళాడు.
వినాయకోత్పత్తి
కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించిందిస్వాగతం చెప్పేందుకు స్నానా లంకార ప్రయత్నములో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినదిఅది చూడముచ్చటైన బాలుడుగా కనిపించిందిదానికి ప్రాణం పోయాలనిపించితన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో  ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది దివ్యసుందరుని వాకిట్లో వుంచిఎవరినీ లోనికి రానివ్వరాదని చెప్పి లోపలకు వెళ్ళింది.
శివుడు తిరిగి వచ్చాడువాకిట్లో వున్న బాలుడు పరమశివుడ్ని అభ్యంతర మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడుతన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడురౌద్రంతో  బాలుని శిరచ్ఛేదము చేసిలోపలికి వెళ్ళాడుజరిగిన దానిని విని పార్వతి విలపించిందిశివుడు కూడా చింతించాడువెంటనే తన వద్దనున్న గజాసురుని శిరమును  బాలుని మొండెమునకు అతికించి  శిరమునకు శాశ్వతత్వమునుత్రిలోక పూజ్యతను కలిగించాడుగణేశుడు గజాననుడైశివపార్వతుల ముద్దుల పట్టియైనాడు తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు.
విఘ్నేశాధిపత్యం
ఒకనాడు దేవతలుమునులుమానవులుపరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారుగజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆధిపత్యము తనకు ఇమ్మని కోరాడుగజాననుడు మరుగుజ్జువాడుఅనర్హుడుఅసమర్థుడు కాబట్టి ఆధిపత్యము తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు.
అందుకు శివుడు తన కుమారుల నుద్దేశించి "మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర  దులన్నింటిలో స్నానములు చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి  ఆధిపత్యం లభిస్తుంద''ని చెప్పాడుఅంత కుమారస్వామి చురుకుగాసులువుగా సాగివెళ్ళాడుగజాననుడు అచేతనుడయ్యాడుమందగమనుడైన తాను ముల్లోకాల్లోని నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమనితరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడువినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడునారములు అనగా జలములు.
జలములన్నియూ నారాయణుని అధీనములుఅనగా నారాయణ మంత్రం అధీనంలో వుంటాయివినాయకుడు  మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు మంత్ర ప్రభావమున ప్రతితీర్థ స్నానమందును కుమారస్వామికన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడుఇలా మూడుకోట్ల యాభై లక్షల నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసమునకు వెళ్ళాడుతండ్రి సమీపమున ఉన్న గజాననుని చూచి నమస్కరించి "తండ్రీఅన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగానుక్షమించండి  ఆధిపత్యం అన్నగారికే ఇమ్మ''ని ప్రార్థించాడు.
చంద్రుని పరిహాసం
అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితినాడు గజాననుకి విఘ్నేశాధిపత్యం ఇచ్చాడుఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కుడుములుఅపూపములు మున్నగు పిండి వంటలుటెంకాయలుతేనెఅరటిపండ్లుపానకంవడపప్పు మొదలగునవి సమర్పించిపూజించగావిఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి కొన్ని భక్షించికొన్ని వాహనమునకిచ్చికొన్ని చేత ధరించి మందగమనమున సూర్యాస్తమయ వేళకు కైలాసముకు వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు.
ఉదరం భూమికానిన చేతులు భూమికానక ఇబ్బంది పడుచుండగాశివుని శిరమందున్న చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి వికటముగా నవ్వాడుఅంత రాజదృష్టి సోకిన రాలుగూడ నుగ్గవుతాయి అనే సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలిఅందున్న కుడుములన్నీ  ప్రదేశంలో పడ్డాయిఅతడు మృతి చెందాడుఅంత పార్వతి శోకించుచూ చంద్రుని చూచి "పాపాత్ముడానీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసినవారు పాపాత్ములై నీలాపనిందల పొందుదురుగాక'' యని శపించింది.
ఋషిపత్నులకు నీలాపనిందలు
 సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణము చేస్తున్నారుఅగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించిశాప భయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడుఅగ్ని భార్యయైన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపము దక్క మిగిలిన ఋషిపత్నుల రూపము ధరించి పతికి ప్రియము చేసేందుకు ప్రయత్నించిందిఅగ్నిదేవునితో నున్నవారు తమ భార్యలేయని శంకించిఋషులు తమ భార్యలను విడనాడారుపార్వతీ శాపానంతరం ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వీరికి  నీలాపనింద కలిగింది.
దేవతలుమునులు ఋషిపత్నులకు వచ్చిన ఆపదను పరమేశ్వరునికి తెలుపగాఅతడు సర్వజ్ఞుండగుటచే అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధాన పరిచాడుఅంత బ్రహ్మ కైలాసమునకు వచ్చాడుమహేశ్వరుల సేవించిమృతుండై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించాడుపార్వతీపరమేశ్వరులు సంతోషించారుఅంత దేవాదులు " పార్వతీనీ శాపము వల్ల ముల్లోకాలకు కీడువాటిల్లింది కాబట్టి శాపాన్ని ఉపసంహరించుకోవా''లని ప్రార్థించారుతనయుడు మరల బతకడంతో పార్వతి చాలా సంతోషించిందికుమారుని చేరదీసి ముద్దాడింది. " రోజున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వాడో  రోజున చంద్రుని చూడరాదు'' అని శాపాన్ని సడలించిందిఅంత బ్రహ్మాదులు భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రము చంద్రుని చూడక జాగరూకులై సుఖంబుగ నుండిరిఇలా కొంతకాలము గడచె.
శమంతకోపాఖ్యానం
ద్వాపరయుగమున నారదుడు ద్వారకావాసియగు శ్రీకృష్ణుని దర్శించిస్తుతించాడుమాటల సందర్భంగా స్వామీసాయంకాలమయిందినేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుని చూడరాదుఇక సెలవు అని పూర్వవృత్తాంతమంతయూ శ్రీకృష్ణునికి చెప్పి నారదుడు స్వర్గలోకమునకు వెళ్ళాడుఅంతట కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుడ్ని ఎవరూ చూడరాదని పట్టణంలో చాటించాడుక్షీరప్రియుడగు శ్రీకృష్ణుడు నాటి రాత్రి తాను ఆకాశం వంక చూడక గోష్టమునకు పోయి పాలుపిదుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబమును చూశాడు. "ఆహాఇక నాకెట్టి అపనింద రానున్నదో'' అని అనుకున్నాడుకొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్య వరముచే శమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడుశ్రీకృష్ణుడు మర్యాద చేసి  మణిని మన రాజుకిమ్మని అడిగాడు.
"రోజుకు ఎనిమిది బారువుల బంగారమిచ్చు దానిని  ఆప్తునకైన నెవ్వరు ఇవ్వ''రనిన సత్రాజిత్తు తిరస్కరించాడుఅంత ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు  శమంతక మణిని కంఠమున ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడుఒక సింహం  మణిని మాంసఖండమని భ్రమించి అతడిని చంపి  మణిని తీసుకుపోతుండగా ఒక భల్లూకం  సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆటవస్తువుగ ఇచ్చిందిమరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి వినికృష్ణుడుమణి ఇవ్వలేదని నా సోదరుని చంపి రత్నం అపహరించాడని పట్టణమున చాటించాడుఅది కృష్ణుడు విని చవితి నాడు పాలల్లో చంద్రబింబమును చూచిన దోష ఫలమని అనుకున్నాడుదానిని బాపుకొనుటకై బంధు సమేతుడై అరణ్యమునకు పోయి వెదుకగా ఒకచోట ప్రసేనుని కళేబరముసింహం కాలిజాడలుపిదప ఎలుగుబంటి అడుగులు కనిపించాయి దారిన పోవుచుండగా ఒక పర్వత గుహ ద్వారంబును చూచి పరివారమును అక్కడ విడిచి కృష్ణుడు గుహలోపలికి వెళ్ళాడుఅచట బాలిక ఉయ్యాలపై కట్టిన మణిని శ్రీకృష్ణుడు చూశాడుదానిని తీసుకొని వెనక్కు వస్తుండగా బాలిక ఏడవడం ప్రారంభించింది.
అంత జాంబవంతుడు ఆవేశంగా వచ్చి శ్రీకృష్ణుని పైబడి అరచుచుగోళ్ళతో గుచ్చుతూకోరలతో కొరుకుతూ ఘోరముగ యుద్ధము చేసెనుకృష్ణుడు వానిని బడద్రోసి వృక్షములురాళ్ళతోనుతుదకు ముష్టిఘాతములతోను రాత్రింబవళ్ళు తెలియక ఇరవై ఎనిమిది రోజులు యుద్ధము చేసెనుక్రమంగా జాంబవంతుని బలం క్షీణించింది.
తననే ఓడిస్తున్న వ్యక్తి రావణ హంతకుడగు శ్రీరాముడే అని తెలుసుకున్నాడుఅంజలి ఘటించి "దేవాధిదేవాఆర్తజనపోషాభక్తజనరక్షా నిన్ను శ్రీరామచంద్రునిగా తెలిసికొంటిని కాలమున నాయందలి వాత్సల్యముచే వరం కోరుకొమ్మనగానా బుద్ధి మాంద్యమున మీతో ద్వంద్వ యుద్ధం జేయవలెనని కోరుకున్నానుభవిష్యత్తులో నీ కోరిక నెరవేరుతుందని మీరు సెలవిచ్చితిరిఅది మొదలు మీ నామస్మరణ చేయుచూ అనేక యుగములు గడిపానుఇపుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చారునాకు ఇక జీవితేచ్ఛ లేదు.
నా అపరాధములు క్షమించి కాపాడుమునీ కన్న వేరు దిక్కులేదు'' అంటూ భీతిచే పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరమంతయూ తన హస్తములచే నిమిరి భయం పోగొట్టి ఇలా అన్నాడుశమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చిందిఅపనింద బాపుకొనుటకు ఇటు వచ్చానుకాబట్టి మణిని ఇవ్వమని కోరాడుజాంబవంతుడు శ్రీకృష్ణునికి మణి సహితముగ తన కుమార్తెనగు జాంబవతిని కానుకగా ఇచ్చాడుఅంత తన ఆలస్యమునకు పరితపించు బంధుమిత్ర సైన్యంబులకు ఆనందం కలిగించి కన్యారత్నంతోనుమణితోను శ్రీకృష్ణుడు పురం చేరుకున్నాడుసత్రాజిత్తును రప్పించి పిన్న పెద్దలను ఒకచోట చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పాడుశమంతకమణి సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడుదాంతో సత్రాజిత్తు "అయ్యోలేనిపోని నింద మోపి దోషమునకు పాల్పడితి''నని విచారించి "మణి సహితముగ తన కూతురగు సత్యభామను భార్యగా సమర్పించితప్పు క్షమింపు''మని వేడుకున్నాడు.
శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణి వలదని తిరిగి ఇచ్చాడుశ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతీ సత్యభామలను పరిణయమాడాడుఅంత దేవాదులుమునులు స్తుతించి "మీరు సమర్థులు గనుక నీలాపనింద బాపుకొంటిరి మాకేమి గతి'' యని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై "భాద్రపద శుద్ధ చతుర్థిని ప్రమాదవశంబున చంద్రదర్శనమయ్యెనేని ఆనాడు గణపతిని యధావిధి పూజించి  శమంతక మణి కథను విని అక్షతలు శిరంబున దాల్చువారు నీలాపనిందలు పొందకుందురుగాక'' అని చెప్పాడుఅంత దేవాదులు సంతోషించితమ ఇళ్ళకు వెళ్ళి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి యందు దేవతలుమహర్షులుమానవులు తమతమ శక్తి కొలది గణపతిని పూజించి అభీష్టసిద్ధి పొందుతూ సుఖసంతోషాలతో వున్నారు.

సర్వేజనాః సుఖినోభవంతు 

My Blog Lovers