Blogger Widgets

మంగళవారం, అక్టోబర్ 30, 2012

అట్ల తదియ

మంగళవారం, అక్టోబర్ 30, 2012



అట్ల తద్దోయ్ - ఆరట్లోయ్                                       ముద్దపప్పోయ్ -మూడట్లోయ్

అట్ల తదియ పండుగ గురుంచి. అట్ల తదియ ఈ పండుగ ప్రతి సవత్సరం ఆశ్విజ బహుళ తదియ రోజు వస్తుంది. ఈ తదియ రోజు తెలవారుజామునే ఆడవారు చిన్న పెద్ద అన్దరూ నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని , గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, పులుసు, పెరుగు వేసుకొని తెల్ల వారుజామునే భోజనం చేస్తారు.ఆ తరువాత ఆటలే ఆటలు, చెమ్మచెక్కలు, ఉయ్యాలు అడతారు. అన్నట్టు ముందురోజే చేతుల నిండా గోరింట పెట్టుకుంటారు. తదియ రోజు చాలా సంతోషం గా ఆడుకుంటారు. ఉయ్యాల పోటీలు పెట్టుకుంటారు. పల్లెల్లో చాలా బాగా జరుపుకుంటారు. పొద్దు ఎక్కాగా తల స్నానం చేసి దేవుడుకి దణ్ణం పెట్టుకొని రోజు అంతా ఉపవాసం వుంటారు. సాయంత్రం చంద్రోదయం అయ్యాక స్నానం చేసి పార్వతి దేవికి పూజచేస్తారు. పూజచేసి చంద్రుడిని దర్శించుకుంటారు . 
ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.
ఒక రాచ చిన్నది తోడి చెలికత్తెలతో కలసి అట్ల తద్దె నోమును నోచుటకు వుపవాసముండెను, మూడు జాములు దాటు సరికి రాచ బిడ్డ సుకుమారి యగుటచే శోషవచ్చి పడిపోయెను. అంతట నామె అన్నలు వచ్చి ఆమె అట్లు పడి పోవుటకు కారణమును తల్లి వలన గ్రహించిరి, వారు తమ చెల్లెలు చంద్రుడు వచ్చు వరకు నుండ లేదని అనుకొని ఒక చింతచెట్టు కొమ్మకు అద్దము కట్టి దానికి యెదుట అరికె కుప్పకు అగ్గిని పెట్టి చెల్లిని లేపి "అడుగో చంద్రుడు వచ్చెను. భోజనమును చేయు" మనిరి. అద్దములో నిప్పు చూచి చంద్రుడే వచ్చెననుకొని, ఆమె భోజనము జేసెను.
కొంతకాలమునకు ఆమెకు యుక్త వయస్సు రాగా నామె అన్నలు పెండ్లి సంబంధములను చూచుచుండిరి. ఎన్ని సంబంధములు వెదకినను ముసలి వరుడే దొరకుటచే, కడకు వారు విసిగి తమ చెల్లెలిని ముసలివానికిచ్చి పెండ్లి చేయ నిశ్చయించిరి. ఆ సంగతి తెలసి ఆ రాచబిడ్డ "అయ్యో! అట్లతద్ది నోము నోచిన వారికి పడుచు మగడు దొరుకునని చెప్పిరి, కాని నాకీ ముసలి మగడేల దాపరించుచున్నాడు!" అని విచారించి, వృద్ధ భర్తను వివాహమాడుట కంగీకరింప లేదు. అన్నలామెనెంతో బలవంతపెట్టి వివాహమును జేయనెంచిరి. కాని ఆమె యందులకు సమ్మతింపక, ఒక నాటి రాత్రి అడివికి పోయి ఒక మర్రిచెట్టు క్రింద తపస్సు చేయుచుండెను.
కొంత కాలమునకు పార్వతి పరమేశ్వరులామెను చూచి "ఓ కన్యామణీ! నీ వేల తపస్సు చేయు చున్నావు? మేము పార్వతీ పరమేశ్వరులము. నీ కష్టమును మాతో చెప్పుము" అనిరి. అంత నామె వారిని అతి భక్తితో  నమస్కరించి తన వివాహ విషయమును చెప్పెను. వారది విని "అమ్మా! నీవు అట్లతద్దె నోము నోచి చంద్ర దర్శనము కాక పూర్వమే భోజనము జేసి యుల్లంఘన చేసితివి. అందుచే నీకు ముసలి మగని సంబంధము వచ్చుచున్నది. కావున నీవు యింటికి పోయి నోము నోచుకుని దీపాల వేళ వరకు వుపవాసముండిన పిమ్మట భోజనము జేయు" మని చెప్పి అదృశ్యమయిరి. అంత నామె తన యింటికి వెళ్ళి జరిగిన విషయమును తల్లి దండ్రులకు చెప్పి యధావిధిని నోము నోచుకొనెను. తరువాత నామెకు చక్కని పడుచు మగనితో  పెండ్లి జరిగెను.
దీనికి వుద్యాపనము
అట్లతద్దెనాడు నోము నోచుకొని, పగటి వేళ భోజనము చేయక, నీరు త్రాగక, వుపవాసముండి, చీకటి పడినంతటనే గౌరీదేవికి పదియట్లు నైవేద్యము పెట్టి, విడిగా పదియట్లను, ఒక తోరమును ముత్తైదువునకు వాయనమియ్యవలెను. అట్లు పది సంవత్సరములు చేసిన పిమ్మట పదేసి అట్లు, కొంత డబ్బును, నల్లపూసలను, లక్క జోడును పదిమంది ముత్తైదువులకు వాయన మియ్యవలెను. పద్ధతి తప్పినను ఫలము తప్పదు, భక్తి తప్పకుండిన ఫలము కలుగును.

కారుణ్యమూర్తి హెన్రీ డ్యూనాంట్‌


''మన నాగరికతకు యుద్ధం ఎలా చేయాలో తెలుసు కాని, శాంతి ఎలాగ సాధించాలో తెలియదు'' అని ఇటాలియన్‌ రచయిత గుల్మిల్మో పెరేరో'' తన పుస్తకంలో ఎంతో భాదను వ్యక్తం చేశారు.  

1895వ సంవత్సరంలో ఫ్రాంకో-సార్డియన్ కూటమికి, ఆస్ట్రియా సామ్రాజ్యవాద సైనిక దళాలకు మధ్య జరిగిన యుద్ధంలో దాదాపు 40 వేలమంది సైనికులు అసువులు బాయగా, వేలాది మంది గాయపడ్డారు. ఈ యుద్ధంలో గాయపడ్డ క్షతగాత్రులను ఆదుకుని, వారికి సేవలందించేందుకు అప్పట్లో స్విట్జర్లాండ్‌కు చెందిన హెన్రీ డునాంట్ అనే వ్యక్తి ముందుకొచ్చాడు.
ఆ సంఘటన తరువాత... తానే ఇలాంటి వారికోసం ఓ సేవాసంస్థను ఎందుకు స్థాపించకూడదని ఆలోచనలో పడ్డాడు హెన్రీ డునాంట్. 
దేశ దేశాల మధ్య యుద్ధాలు, అంతర్యుద్ధాలు, హత్యలు, కలహాలతో సతమతమవుతున్న సమయంలో ఈ ప్రపంచంలో 125 సంవత్సరాల క్రితం ఈ ఉద్యమం ఏర్పడింది.  చిన్న చిన్న విషయాలలోనే  పెద్ద విషయాలు దాగివుంటాయి. అక్కడనుండే గొప్ప  గొప్ప ఉద్యమాలు ఆవిర్భవిస్తాయి అనే విషయాన్ని రుజువు చేసారు  కారుణ్యమూర్తి, కర్తవ్య దీక్షాపరుడు అయిన హెన్రీ డ్యూనాంట్‌ ప్రారంభించిన యుద్ధ క్షతగాత్రుల సహాయ కార్యక్రమం శాఖోపశాఖలుగా విస్తరిల్లింది.  అతని ఆలోచనల ఫలితంగా ఏర్పడిన సంస్థే ఈ రెడ్‌క్రాస్ ఇంటర్నేషనల్ సౌసైటీ. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటైన ఈ సంస్థ ఇప్పుడు దాదాపు అన్నిరకాల సేవా కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
హెన్రీ డ్యూనాంట్‌ (1828-1910) చేసిన ఆ గొప్ప సేవలో నుండే 'రెడ్‌ క్రాస్‌'' జన్మించింది. 1862లో తన ఈ ''చిన్న'' ప్రయోగం గురించి పుస్తకంగా ప్రచురించగానే క్షతగాత్రుల దయనీయస్థితి గురించి యూరప్‌లో ప్రజలు మేల్కొన్నారు. ఈయనే రెడ్ క్రాస్ ను ఏర్పరచారు. డ్యూనాంట్‌ స్విట్జర్‌లాండ్‌ దేశస్థుడు కనుక అతని గౌరవార్థం ఆ దేశపు జండారంగులను తల్లక్రిందులు చేసి తెల్ల జెండాపై ఎర్రక్రాసును రెడ్‌క్రాస్‌ గుర్తుగా ఆ కొత్త జెండాను రూపొందించారు. నోబెల్‌ శాంతి బహుమానం ప్రారంభించగానే 1901లో నోబెల్‌ బహుమతిని డ్యూనాంట్‌కు ఇవ్వడం జరిగింది. అంతేకాక 1963లో రెడ్‌క్రాస్‌ శతజయంతి సందర్భంగా నోబెల్‌ శాంతి బహుమానాన్ని రెడ్‌క్రాస్‌ సొసైటీకి ఇచ్చి గౌరవించారు.  
యుద్ధంలో మరణించడం, క్షతగాత్రులుకావడం వారి కర్మ, నుదిటివ్రాత, అన్నభావం నుండి బయటపడింది. ఏ దేశానికి చెందిన వారైనా, గెలిచినా, ఓడినా ఆ క్షతగాత్రు లకు సేవచేయడం మానవధర్మంగా ఈ రెడ్‌క్రాస్‌ భావిస్తోంది. రెండు ప్రపంచ యుద్ధాలలో ''రెడ్‌క్రాస్‌'' ఎనలేని సేవ చేసింది. జర్మనీలో హిట్లర్‌ యుద్ధంలో 'రెడ్‌క్రాస్‌'' జోక్యాన్ని అంగీకరించకపోవడం వల్ల జర్మన్‌ యుద్ధ శిబిరాలలో 90 శాతం మంది చనిపోయారు. దాన్నిబట్టి హిట్లర్‌ ఎంత కౄరుడో ప్రపంచానికి అర్థమయ్యింది. ఈనాడు వందకుపైగా దేశాలు రెడ్‌క్రాస్‌లో భాగస్వాములయ్యాయి. చివరికి అరేబియా, ఇతర మహ్మదీయ దేశాలు కూడా రెడ్‌క్రాస్‌లో భాగస్వాములయ్యాయి. ఆ ముస్లిం దేశాలలో రెడ్‌క్రాస్‌ గుర్తు తెల్లజెండాపై ఎర్రని చంద్రవంకగా మారింది. ఇరాన్‌లో రెడ్‌క్రాస్‌ ఎర్రని సింహం, సూర్యునిగా రూపొందింది. మానవతా దృష్టితో ప్రారంభమైన ఈ రెడ్‌క్రాస్‌ ఉద్యమంలో స్కూళ్ళు, కాలేజీలు భాగస్వామ్యమయ్యాయి.
పరస్పర అవగాహన, స్నేహం, ప్రపంచ శాంతి, సద్భావం ఈనాడు రెడ్‌క్రాస్‌ లక్ష్యాలుగా మారాయి. యుద్ధం వద్దు, శాంతి కావాలి అన్నది రెడ్‌క్రాస్‌ ఆకాంక్ష. రెడ్‌క్రాస్‌ ఒకనైతిక శక్తి. యుద్ధ మేఘాలు కారుమబ్బులులాగా వస్తూ వుంటే, రెడ్‌క్రాస్‌ చీకట్లో కాంతిరేక లాగా మెరుస్తోంది.  యుద్ధాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తీవ్రంగా నష్టపోయిన వారిని ఆదుకుని వారికి ఆసరాగా నిలవడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థే "రెడ్‌క్రాస్ సొసైటీ". ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇలాంటి సేవా సంస్థలన్నింటిలోకీ అతి పెద్దది.
స్విడ్జర్లాండ్‌ దేశపు జాతీయ జెండాలోని ఎర్రని బ్యాక్‌గ్రౌండ్‌లో తెల్లని క్రాస్‌ ఉంటుంది. దానిని తారుమారు చేసి తెల్లని బ్యాగ్‌డ్రాప్‌లో ఎర్రని క్రాస్‌ను లోగోగా ఏర్పరిచాడు. 8-5-1812న జన్మించిన హెన్రీ డ్యూనెన్ట్‌ గౌరవార్థం ప్రతి సంవత్సరం మే 8న ప్రపంచవ్యాప్తంగా రెడ్‌ క్రాస్‌ దినోత్సవం జరుపుకుంటారు. 1901 లో ఈయనకు నోబెల్‌ బహుమతి లభించింది. నేడు హెన్రీ వర్ధంతి సందర్బంగా ఈ కారుణ్యమూర్తికి  మన బ్లాగ్ ద్వారా నివాళి అందిస్తున్నాను .

సోమవారం, అక్టోబర్ 29, 2012

స్వామి వివేకానంద - సూక్తులు

సోమవారం, అక్టోబర్ 29, 2012


  • మన ఆలోచనలే మనలను తీర్చిదిద్దుతాయి.
  • అజ్ఞానులకు వెలుగుచూపండి. 
  • విద్యావంతులకు మరింత వెలుగుచూపండి.
  • ఆధునిక విద్య పెంచే అహంకారానికి అంతులేకుండా పోతూంది.
  • మీరు పవిత్రులు కండి. అప్పుడు ప్రపంచమంతా పవిత్రంగా కనబడి తీరుతుంది
  • వేదాంత దృక్పధంలో పాపమనేదే లేదు. పొరపాట్లు మాత్రమే ఉన్నాయి.  
  • మీరు పాపాత్ములనీ, ఎందుకూ  పనికిరానివారనీ అనడమే వేదాంతం అది చూసే దృష్టిలోనే పెద్ద పొరపాటు.
  • విగ్రహాన్ని దేవుడని అనవచ్చు. కానీ దైవం విగ్రహమే అని ఆలోచిస్తే, అది పెద్ద పొరపాటు.
  • మతం సిద్ధాంతాలలో,రాద్ధాంతాలలో లేదు. దాని రహస్యమంతా ఆచరణలోనే వుంది. 
  • పవిత్రంగా ఉండటం అంటే  పరులకు మేలు చేయడం- మతమంటే ఇదే.
  • ప్రతి ఒక్కరూ అధికారం కోసమే అర్రులు చాస్తారు. చివరికి మొత్తం వ్యవస్త కుప్పకూలుతుంది.
  • సజీవ దైవాలను సేవించండి. అంధుడు,పేదవాడు, వికలాంగుడు,దుర్బలుడు,కౄరుడు, ఇలా వివిధ రూపాల్లో భగవంతుడు మీ వద్దకు వస్తాడు. వారిలోని భగవంతుని గుర్తించండిచాలు.
  • " నువ్వు దుష్టుడివి " అనవద్దు. " నువ్వు మంచివాడివి ", కానీ"మరింత మెరుగవ్వాలి" అని మాత్రం అనండి.
  • హనుమంతుణ్ణి, జగజ్జననినీ స్మరించండి.మరుక్షణం మీలోని దౌర్బల్యం పిరికితనాలు మటుమాయమవుతాయి.
  • పురాణాలు వర్ణించిన ముప్ఫై మూడు కోట్ల దేవతల్లో విశ్వాసం ఉండీ, మీపై మీకు విశ్వాసం లేకపొతే విముక్తి లేదు.   – స్వామి వివేకానంద.

పలుకు దేనెల తల్లి పవళించెను

పలుకు దేనెల తల్లి పవళించెను
కలికి తనముల విభుని గలసినది గాన

నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదర
పగలైన దాక జెలి పవళించెను
తెగని పరిణతులతో తెల్లవారినదాక
జగదేక పతి మనసు జట్టి గొనె గాన

కొంగు జారిన మెఱుగు గుబ్బ లొలయగ దరుణి
బంగారు మేడపై బవళించెను
చెంగలువ కనుగొనల సింగారములు దొలుగ
అంగజ గురునితోడ నలసినది గాన

మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై
పరవశంబున దరుణి పవళించెను
తిరు వేంకటాచలా ధిపుని కౌగిట గలసి
అరవిరై యూరుల జెమట యంటినది గాన

శనివారం, అక్టోబర్ 27, 2012

కాల్ చేసి నాతో మాట్లాడైవచ్చు.

శనివారం, అక్టోబర్ 27, 2012

ఆకాశం లో ఎప్పుడైనా హరివిల్లు వస్తుంది కానీ ఆదివారం మాత్రం ప్రపంచం మొత్తం మీద ఒకేసారి హరివిల్లు వస్తుంది అదే నా షో పేరు హరివిల్లు. ఆహరివిల్లు కూడా ఉదయం 10:30 నుండి మద్యాహ్నం 12:00 గంటలవరకు వస్తుంది. అది కూడా ఎక్కడబడితే అక్కడ రాదండి కేవలం Online Radio Josh Live లో మాత్రమే వస్తుంది. ఇది కేవలము live ప్రోగ్రాం మాత్రమె కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. నా కబుర్లు, పాటలు , కదలు వినటమే కాదండి మీరు నాతో సరదాగా మాట్లాడైవచ్చును. నాతో మాట్లాడి నాప్రశ్నలకు జవాబులు చెప్పెయవచ్చు. మరి హరివిల్లు షోను అస్సలు మిస్ అవ్వద్దు.
మరి నా షోపేరు చెప్పేసాను కదా, మరి నాతో మాట్లాడాలి అంటే


Skype id: radiojoshlive

US: 914-214-7574

UK: 20-3286-9594

AUS: 28003-4546

Local Number: 040-4200-2003

ఈ నెంబర్స్ కాల్ చేసి నాతో మాట్లాడైవచ్చు. మరి నా షోను మిస్ కాకండి. ధన్యవాదములు.


భూకాంత సౌభాగ్య లక్ష్మి





తగునయ్య హరినీకు దానము దెచ్చుకొనిన
జగములో భూకాంత సౌభాగ్య లక్ష్మి

కిమ్ముల శిశుపాలుని గెలిచి చేకొంటివిగా
సమ్మతించి రుక్మిణి జయలక్ష్మి
అమ్ముమొనను జలధి నడచి లంక సాధించి
కమ్మర జెకొన్న సీత ఘన వీర లక్ష్మి

నరకాసరునడచి నవ్వుతా జేయివేసితివి
సరిగా సత్యభామెపో సంగ్రామలక్ష్మి
హిరణ్యకశిపు గొట్టి యింద్రాదులకు నీచే
వరమిప్పించిన యాకె వరలక్ష్మి

నిండిన వురము మీద నిఖిల సంపదలతో
అండనుండె యాకెపో ఆదిలక్ష్మి
మెండగు శ్రీవేంకటాద్రిమీద నీసరుస నేగే
గండుమీరె కళాలతో కల్యాణ లక్ష్మి

పసిపాపలను , పువ్వులును, చంద్రుని

   











పసిపాపల నవ్వులను, అందమైన పువ్వులును, అందమైన ప్రకృతిని, అందమైన చల్లని వెన్నెలను పంచే చంద్రుని చూసి ఆనందించని వారు వుండరట.  మీరుకూడా ఏకీభావిస్తున్నారా లేదా?

శుక్రవారం, అక్టోబర్ 26, 2012

మహావిష్ణువు నారదుల సంభాషణ.

శుక్రవారం, అక్టోబర్ 26, 2012


ఒకరోజు మహావిష్ణువు నారదుల మధ్యసంభాషణ.
విష్ణువు :-నారదా ! పంచభుతాలలో ఎవరు గొప్పా?
నారదుడు:- భూమి గొప్పది.
విష్ణువు:- భూమండలం లో భూమి ఒక వంతే కదా. మూడు వంతులు నీరే కదా భూమి ఎలా గొప్పది.
నారదుడు:- అయితే జలం గొప్పది.
విష్ణువు:- అంతటి జలాన్ని అగస్యుడు తాగాడు కదా.
నారదుడు:- అయితే అగస్యుడు గొప్పవాడు.
విష్ణువు:- అంత పెద్ద ఆకాశంలో అగస్యుడు నక్షత్రమే కదా.
నారదుడు:- అయితే ఆకాశమే గొప్పది.
విష్ణువు:- అంత ఆకాశాన్ని భగవంతుడు వామన రుపంలో తన పాదంతో కప్పెసాడు కదా.
నారదుడు:- అయితే భగవంతుని పాదం గొప్పది.
విష్ణువు:- భగవంతుని పాదమే గొప్పది అయితే ,మొత్తం భగవంతుని రూపాన్నే భక్తుడు తన హృదయము లో బంధిస్తున్నాడు కదా .
నారదుడు:- అయితే భక్తుఢే గొప్పవాడు.

గురువారం, అక్టోబర్ 25, 2012

అయ్యో యేమరి నే

గురువారం, అక్టోబర్ 25, 2012

GOPAL KRISHNA - (Litho/Print)

అయ్యో యేమరి నే నాఁడాప్పుడేమై వుంటినో

అయ్యడ నీ దాసి నైతే ఆడరింతుగా


అల్లనాడు బాలుడవై ఆవులగాచేవేళ
చిల్లర దూడనైతే చేరి కాతువుగా
వల్లెగా విటుడవై రేపల్లె లో నుండే నాడు
గొల్లెత నయిన నన్ను కూడుకొందువుగా


మేలిమి రామావతారవేళ రాయి రప్ప నైనా
కాలు మోపి బదికించి కాతువుగా
వాలి సుగ్రీవుల వద్ద వానరమై వుండినాను
యేలి నన్ను పనిగొని యీడేర్తువుగా


వారిధిలో మచ్చ కూర్మావతారములైన నాడు
నీరులో జంతువునైనా నీవు గాతువుగా
యీరీతి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టే
మోరతోపున నిన్నాళ్ళు మోసపోతిగా

బుధవారం, అక్టోబర్ 24, 2012

దసరా శుభాకాంక్షలు, జయీభవా విజయీ భవా.

బుధవారం, అక్టోబర్ 24, 2012

నా మిత్రులకు, నా బ్లాగ్ మిత్రులకు,  పాఠకులకు, నాశ్రేయోభిలాషులకు, నా బంధువులకు, అందరికీ దసరా శుభాకాంక్షలు. మీరు చేపట్టే ప్రతీపనిలోను విజయం పొందాలి అని మనసారా కోరుకుంటున్నాను. 

మంగళవారం, అక్టోబర్ 23, 2012

దసరా శుభాకాంక్షలు.

మంగళవారం, అక్టోబర్ 23, 2012


దసరా పండుగను మనము విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ జరుపుకున్నాము. తెలంగాణా లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్య కి స్త్రీలు పట్టు పీతాంబరాలు దరించటం ఆనవాయితీ గా వస్తున్నది . 
విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజుగా వస్తున్నది. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనేరాక్షసుని తో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి. ప్రజలందరూ ఆనందంగా ఈపండుగ జరుపుకుంటున్నారు.  రావణాసురుని దహనం కూడా జరుపుతారు, మరియు దండియా నృత్యం చేస్తారు.  ఈ దసరా బాగా జరుపుకొండి. ఈ దసరా సందర్బముగా అందరికి నా తరుపునా దసరా శుభాకాంక్షలు.  

చివరి రూపము శ్రీ రాజ రాజేశ్వరీ దేవి.

శరన్నవరాత్రి ఉత్సవములలో అమ్మవారి అలంకారములలో చివరి రూపము శ్రీ రాజ రాజేశ్వరీ దేవి. సకల భువన బ్రహ్మాండాలకు అమ్మ ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయములో పూజలందుకుంటుంది.
ఆమ్మను అపరాజితాదేవిగా కూడా భక్తులు పూజించే ఆచారము ఉన్నది. ఈమె స్వప్రాకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుని అంకము అమ్మకు ఆసనము. ఇఛ్ఛా, ఙ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరములుగా అనుగ్రహిస్తుంది. ఆమ్మ యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని రాజరాజేశ్వరీ దేవి ఉద్దెపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రమునకు అమ్మ అథిష్టాన దేవత. 
శ్రీ రాజ రాజేశ్వరీ దేవి స్తోత్రము. 
శ్రీ రాజ రాజేశ్వరీ దండకము.  
శ్రీ మన్మహా దేవురాణీ నతేంద్రాణి రుద్రాణి శర్వాణి కళ్యాణి దాక్షాయణీ శూలపాణీ పృధుశ్రోణి ధూమ్రాక్ష సంహరిణీ పారిజాతాంచిత స్నిగ్దవేనీ లసత్కీర వాణీ భవాటనీ శివా శాంకరీ రాజరాజేశ్వరీ గౌరి శాకంభరీ కాళికం కాళి రాజీవనేత్రీ సుచారిత్రి కళ్యాణగాత్రీ మహాదైత్య జైత్రీనగాధీ శపుత్రీ జగన్మాత లోకైక విఖ్యాత గంధర్వ విద్యాధ రాదిత్య కోటీ ర కోటి స్ఫురద్ద వ్యమాణిక్య దీప ప్రభాత్యుల్ల సత్పాదకంజాత కేయూర హరాంగ దాది జ్వలధ్భూ షణవ్రాత కౌమారి మహేశ్వరీ నరాసింహీ రమా వైష్ణవీ భైరవీ దుర్గ కాత్యాయనీ పార్వతీ నీదు సామర్ధ్య మెన్నంగ బ్రహ్మదులున్ శేషభాషాదులున్ జాల రేనెంత వాడన్ ప్రశంసింపనే తజ్జ గజ్జాల సంరక్షణారంభ సంరంభ కేళీ వినోదంబులన్ గల్గి వర్తింతు వెల్లప్పుడో యాది శక్తీ పరంజ్యోతి నారాయణీ భద్రకాళీ శుక శ్యామలా భ్రామరీ చండికా లక్ష్మి విశ్వేశ్వరీ రాజరాజేశ్వరీ శాశ్వతైశ్వర్య సంధాయినీ యంచు నిన్నెంత యస్సన్నుతుల్సేయు లోకాళికి న్సంత తాఖండ దీర్ఘాయురారోగ్య సౌభాగ్య సంసిద్ద గావింతు వశ్రాంతమున్ రక్తబీజాది దైతేయులన్ ద్రుంచి బృందారక శ్రేణి రక్షింత్షు ఇవీ వెప్పుడున్ నార దాగస్త్య శాండిల్య మాండవ్య మైత్రేయ జాబాలి కణ్వాది మౌనీంద్రు లత్యంత నిష్ఠాగరిష్టాత్ములై హృత్స రోజంబులన్ ధ్యానముల్ సేయుచున్ జంద్ర ఖండావతం సాభ వద్దవ్య రూపంబు బ్రహ్మాండ భాండంబులన్నిండి వల్గొందు నేతత్ప్ర పంచంబు నీ వైవ్ర వర్తింతువీ సూర్యచంద్రాదులున్ భుజలాకాశ వాతాగ్ని జీవాత్మలున్నీవ నీకంటె వేరైన దింతైనయున్ లేదు యుష్మత్కటాక్షార్షు లైనట్టి వారల్కడున్ ధన్యులై మాన్యులై పూజ్యులై గుణ్యు లైయందురీ ధాత్రిలో నేను మూడుండ గర్వాధ రూడుండ దుశ్చిత్తుడన్ మత్తుడన్ జ్ఞాన హీనుండ దీనుండనే జేయు నేరంబుల న్గాచి రక్షింపగా భారమే తల్లి సద్భక్త మందార వల్లీ నమశ్చంద్ర బింబాననోత్కుండలా త్రాత భూమండలా సూచ్య చంద్రోజ్జ్వలా కామదా చండికా నమస్తే నమస్తే నమస్తే.

సిద్ధిధాత్రి :

నవదుర్గలలో అమ్మవారు సిద్దదాత్రిగా దర్సనం ఇస్తారు.
సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లిగనుక సిద్ధి దాత్రి. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను దేవి కృపవలనే పొందెనని దేవీపురాణమున పేర్కొనబడినది. ఈమె పరమశివునిపై దయదలచి, ఆయన శరీరమున అర్ధబాగమై నిలచెను. సిద్ధిధాత్రీదేవి చతుర్భుజ, సింహవాహన. ఈమె కమలముపై ఆసీనురాలై యుండును. ఈమె కుడివైపున ఒకచేతిలో చక్రమును, మఱొకచేతిలో గదను ధరించును. ఎడమవైపున ఒక కరమున శంఖమును, మఱియొక హస్తమున కమలమును దాల్చును. నిష్ఠతో ఈమెను ఆరాధించువారికి సకలసిద్ధులును కరతలామలకము.
ఈమె కృపచే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారమార్ధిక మనోరథములన్నియును సఫలములగును. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తునకు కోరికలెవ్వియును మిగిలియుండవు. అట్టివానికి భగవతీదేవి చరణ సన్నిధియే సర్వస్వమగును. భగవతీమాత యొక్క స్మరణ ధ్యాన పూజాదికముల ప్రభావము వలన ఈ సంసారము నిస్సారమని బోధ పడును. తన్మహత్వమున నిజమైన, పరమానందదాయకమైన అమృతపదము ప్రాప్తించును.

సోమవారం, అక్టోబర్ 22, 2012

తోమ్మేదవరోజు మహిషాసుర మర్ధిని

సోమవారం, అక్టోబర్ 22, 2012


మహిషాసుర మర్ధిని అమ్మవారు నవరాత్రులు తొమ్మిది అవతారాలలో ధర్శనము ఇచ్చారు. అమ్మ దుష్ట శిక్షణకు త్రిమూర్తుల శక్తీ తో సహస్ర బాహువులతో సకలాభారనాలతో మహిషాసురుని వధించుటకు అమ్మ ఉగ్ర రూపము ధరించారు. అప్పుడు మహిశాసురుడును చంపివేసినది.  అప్పుడు ఆమె రౌద్ర రూపాన్ని చూసి దేవతలు అందరు అమెను స్తుతించారు. అలానే శంకారాచార్యులవారు మహిషాసుర మర్ధిని స్తోత్రాన్ని పాడారు అది మంచిగా గుర్తింపు ఉన్న పాట.నవరాత్రుల తరువాత ఈరొజు మహిషాసుర మర్ధిని స్తోత్రము చదువుతారు.
ఇది అమ్మవారి అతి ఉగ్రమైన రూపం. అశ్వయుజశుద్ధనవమి నాడు అమ్మవారు మహిషాసురమర్ధినిగా అవతరించి, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసింది. ధర్మ విజయానికి సంకేతంగా అశ్వయుజ శుద్ధనవమినే "మహార్నవమి"గా భక్తులు ఉత్సవం జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించి, అమ్మ సకల దేవతల అంశలతో మహా శక్తిగాఈ రొజు దర్శనం ఇస్తుంది.
మహిషాసురుడనే రాక్షసుడిను వధించిన అమ్మను ఈ దినాన పూజిస్తే శత్రుభయం తొలగి సకల విజయాలు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకలదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఈ రోజున ప్రత్యేకంగా చండీ సప్తశతి హోమం చెయ్యాలి. అమ్మవారికి "ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహినైస్వాహా" అనే మంత్రాన్ని జపించాలి. 
పూజానంతరం చిత్రాన్నం (పులిహోర), గారెలు, వడపప్పు, పానకం నివేదనం చెయ్యాలి.

అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందనుతే
గిరివర వింధ్య శిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠకుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే
త్రిభువనపోషిణి శంకరతోషిణి కిల్బిషమోషిణి ఘోషరతే
దనుజ నిరోషిణి దితిసుత రోషిణి దుర్మద శోషిణి సింధుసుతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి జగదంబ మదంబ కదంబ వనప్రియ వాసిని హాసరతే
శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే
మధు మధురే మధు కైటభ భంజిని కైటభ భంజిని రాసరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి శతఖండ విఖండిత రుండ వితుండిత శుండ గజాధిపతే
రిపు గజ గండ విదారణ చండ పరాక్రమ శుండ మృగాధిపతే
నిజ భుజ దండ నిపాతిత ఖండ విపాతిత ముండ భటాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి రణ దుర్మద శత్రు వధోదిత దుర్ధర నిర్జర శక్తిభృతే
చతుర విచార ధురీణ మహాశివ దూతకృత ప్రమథాధిపతే
దురిత దురీహ దురాశయ దుర్మతి దానవదూత కృతాంతమతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి శరణాగత వైరి వధూవర వీర వరాభయ దాయకరే
త్రిభువన మస్తక శూల విరోధి శిరోధి కృతామల శూలకరే
దుమిదుమి తామర దుందుభినాద మహో ముఖరీకృత తిగ్మకరే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి నిజ హుంకృతి మాత్ర నిరాకృత ధూమ్ర విలోచన ధూమ్ర శతే
సమర విశోషిత శోణిత బీజ సముద్భవ శోణిత బీజ లతే
శివ శివ శుంభ నిశుంభ మహాహవ తర్పిత భూత పిశాచరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

ధనురను సంగ రణక్షణసంగ పరిస్ఫుర దంగ నటత్కటకే
కనక పిశంగ పృషత్క నిషంగ రసద్భట శృంగ హతావటుకే
కృత చతురంగ బలక్షితి రంగ ఘటద్బహురంగ రటద్బటుకే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

జయ జయ జప్య జయేజయ శబ్ద పరస్తుతి తత్పర విశ్వనుతే
ఝణ ఝణ ఝింజిమి ఝింకృత నూపుర సింజిత మోహిత భూతపతే
నటిత నటార్ధ నటీనట నాయక నాటిత నాట్య సుగానరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి సుమనః సుమనః సుమనః సుమనః సుమనోహర కాంతియుతే
శ్రిత రజనీ రజనీ రజనీ రజనీ రజనీకర వక్త్రవృతే
సునయన విభ్రమర భ్రమర భ్రమర భ్రమర భ్రమరాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

సహిత మహాహవ మల్లమ తల్లిక మల్లిత రల్లక మల్లరతే
విరచిత వల్లిక పల్లిక మల్లిక ఝిల్లిక భిల్లిక వర్గ వృతే
సితకృత పుల్లసముల్ల సితారుణ తల్లజ పల్లవ సల్లలితే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అవిరళ గండ గళన్మద మేదుర మత్త మతంగజ రాజపతే
త్రిభువన భూషణ భూత కళానిధి రూప పయోనిధి రాజసుతే
అయి సుద తీజన లాలసమానస మోహన మన్మథ రాజసుతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

కమల దళామల కోమల కాంతి కళాకలితామల భాలలతే
సకల విలాస కళానిలయక్రమ కేళి చలత్కల హంస కులే
అలికుల సంకుల కువలయ మండల మౌళిమిలద్భకులాలి కులే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

కర మురళీ రవ వీజిత కూజిత లజ్జిత కోకిల మంజుమతే
మిళిత పుళింద మనోహర గుంజిత రంజితశైల నికుంజగతే
నిజగుణ భూత మహాశబరీగణ సద్గుణ సంభృత కేలితలే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

కటితట పీత దుకూల విచిత్ర మయూఖతిరస్కృత చంద్ర రుచే
ప్రణత సురాసుర మౌలిమణిస్ఫుర దంశుల సన్నఖ చంద్ర రుచే
జిత కనకాచల మౌళిపదోర్జిత నిర్భర కుంజర కుంభకుచే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

విజిత సహస్రకరైక సహస్రకరైక సహస్రకరైకనుతే
కృత సురతారక సంగరతారక సంగరతారక సూనుసుతే
సురథ సమాధి సమానసమాధి సమాధిసమాధి సుజాతరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

పదకమలం కరుణానిలయే వరివస్యతి యోనుదినం స శివే
అయి కమలే కమలానిలయే కమలానిలయః స కథం న భవేత్
తవ పదమేవ పరంపదమిత్యనుశీలయతో మమ కిం న శివే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

కనకలసత్కల సింధు జలైరను సించినుతేగుణ రంగభువం
భజతి స కిం న శచీకుచ కుంభ తటీ పరిరంభ సుఖానుభవమ్
తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాసి శివం
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

తవ విమలేందుకులం వదనేందుమలం సకలం నను కూలయతే
కిము పురుహూత పురీందుముఖీ సుముఖీభిరసౌ విముఖీక్రియతే
మమ తు మతం శివనామధనే భవతీ కృపయా కిముత క్రియతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి మయి దీనదయాలుతయా కృపయైవ త్వయా భవితవ్యముమే
అయి జగతో జననీ కృపయాసి యథాసి తథానుమితాసిరతే
యదుచితమత్ర భవత్యురరీ కురుతాదురుతాపమపాకురుతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

నవరాత్రులలో తోమ్మేదవరోజు నవ దుర్గ లలో అమ్మ మహాగౌరి దేవిగా దర్శనము ఇస్తారు.  


సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్య్రంబికే గౌరి నారాయణి నమోస్తుతే;
అనగా అన్ని శుభములను ప్రసాదించే పరమేశ్వరుని సతీ.. సకల కోర్కెలను తీర్చే తల్లి.. ముగురమ్మల మూలపుటమ్మ అయిన ఓ గౌరీదేవీ.. నిన్ను శరణు కోరి ప్రార్థిస్తున్నానమ్మా! ఈ స్తుతి చేస్తూ గౌరీదేవిని ప్రార్థించుట వలన సకల సౌభాగ్యాలు లభిస్తాయని భావిస్తారు. 

అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ

పరిపాలయమాం గౌరి
అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ
పరిపాలయమాం గౌరి
శుభగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి శర్వార్ధ గాత్రి
శుభగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి శర్వార్ధ గాత్రి
సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభా ధవళకీర్తి
సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభా ధవళకీర్తి
చతుర్బాహు సమ్రక్షిత శిక్షిత చతుర్బశాంతర భువన పాలిని
కుంకుమ రాగ శోభిని కుసుమ బాణ సన్శోభిని
మౌన సుహాసిని గాన వినోదిని భగవతి పార్వతి దేవీ

శ్రీహరి ప్రణయాంబురాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాసి
శ్రీహరి ప్రణయాంబురాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాసి
శ్రీపీట సంవర్ధిని ఢోలాసుర మర్ధిని
శ్రీపీట సంవర్ధిని ఢోలాసుర మర్ధిని
ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి
ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి
ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి
సకలభోగ సౌభాగ్యలక్ష్మి శ్రీ మహాలక్ష్మి దేవీ

ఇందువదనే కుందరదనే వీణాపుస్తక ధారినే
ఇందువదనే కుందరదనే వీణాపుస్తక ధారినే
శుకశౌనకాది వ్యాసవాల్మీకి మునిజన పూజిత శుభచరణే
శుకశౌనకాది వ్యాసవాల్మీకి మునిజన పూజిత శుభచరణే
సరస సాహిత్య స్వరస సంగీత స్తనయుగళే
సరస సాహిత్య స్వరస సంగీత స్తనయుగళే
వరదే అక్షర రూపిణే శారదే దేవీ

వింధ్యాచవీ వాసినే యోగసంధ్యా సముద్భాసినే
సిమ్హాస నస్తాయినే దుష్టపరరమ్హక్రియా శాలినే
విష్ణుప్రియే సర్వలోకప్రియే శర్వనామప్రియే ధర్మసమరప్రియే
హే బ్రహ్మచారిణె దుష్కర్మవారిణె
హే విలంబిత కేశ పాశినే
మహిష మర్దన శీల మహిత గర్జన లోల
భయత నర్తన కేళికే కాళికే
దుర్గమాగమదుర్గ వాసినే దుర్గే దేవీ

ఆదివారం, అక్టోబర్ 21, 2012

ఏడవ రోజున మహాశక్తి దుర్గమ్మ

ఆదివారం, అక్టోబర్ 21, 2012

 దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపంగా అమ్మవారు నవరాత్రుల్లో  అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో అమ్మ దుర్గముడనే రాక్షసుని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గారూపం మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవులను ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. అమ్మ నామాన్ని జపిస్తే సకల గ్రహ బాధలు తొలగిపోతాయి. ఆరాధకులకు దుర్గాదేవి శీఘ్ర అనుగ్రహకారిణి. ఎర్రని బట్టలు పెట్టి ఎర్ర అక్షతలు, ఎర్ర పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూక్తం పారాయణ చేయాలి. "ఓం దుం దుర్గాయైనమ:" అనే మంత్రం పఠించాలి. 
Shri Durgashottaraashtanama Stotram
దుర్గాష్టకము
ఉద్వపయతునశ్శక్తి - మాదిశక్తే ద్దరస్మితమ్‌ తత్వం యస్యమాహత్సూక్ష్మం - మానన్దోవేతి సంశయః
జ్ఞాతుర్ఞానం స్వరూపం - స్యాన్నగుణోనాపి చక్రియా యదిస్వ స్య స్వరూపేణ - వైశిష్య్యమనవస్దీతిః
దుర్గే భర్గ సంసర్గే - సర్వభూతాత్మవర్తనే నిర్మమేనిర్మలేనిత్యే - నిత్యానందపదేశివా!
శివాభవాని రుద్రాణి - జీవాత్మపరిశోధినీ! అమ్బా అమ్బిక మాతంగీ - పాహిమాం పాహిమాం శివా
దృశ్యతేవిషయాకారా - గ్రహణే స్మరణే చధీః ప్రజ్ఞావిషయ తాదాత్మ్య - మేవం సాక్షాత్‌ ప్రదృశ్యతే
పరిణామో యథా స్వప్నః - సూక్ష్మస్యస్థూలరూపతః జాగ్రత్‌ ప్రపఞ్చ ఏషస్యా -త్తథేశ్వర మహాచితః
వికృతి స్సర్వ భూతాని - ప్రకృతిర్దుర్గదేవతా
సతః పాదస్తయోరాద్యా - త్రిపాదీణియతేపరా!
భూతానామాత్మనస్సర్గే - సంహృతౌచతథాత్మని ప్రభవే ద్దేవతా శ్రేష్ఠా - సఙ్కల్పానారా యథామతిః
యశ్చాష్టక మిదం పుణ్యం - పాత్రరుత్థాయ మానవః పఠేదనన్యయా భక్త్యా - సర్వాన్కామానవాప్నుయాత్‌

చక్రపొంగలి నివేదన చెయ్యాలి. దుర్గా, లలితా అష్టోత్తరాలు పఠించాలి.
                                                      కాళరాత్రి
నవ దుర్గాలలో ఏడవ రోజు "కాళరాత్రి" శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదురై యుండును. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముచుండును. ఈమె త్రినేత్రములు బ్రహ్మాండములవలె గుండ్రనివి. ఈమె నాశికా శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను వెడలగ్రక్కుచుండును. ఈమె వాహనము గార్దభము. ఈమె తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందఱికిని వరములను ప్రసాదించుచుండును. మఱియొక కుడిచేయి అభయ ముద్రను కలిగియుండును. ఒక ఎడమచేతిలో ఇనపముండ్ల ఆయుధము, మఱొక ఎడమచేతిలో ఖడ్గము ధరించియుండును.కాళరాత్రి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకము - కాని ఈమె ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను "శుభంకరి" అనియు అందురు. కావున భక్తులు ఈమెను చూచి ఏ మాత్రము భయమును గాని, ఆందోళనను గాని పొందనవసరమే లేదు. కాళరాత్రి మాతను స్మరించినంతమాత్రముననే దానవులు, దైత్యులు, రాక్షసులు, భూతప్రేతపిశాచములు భయముతో పారిపోవుట తథ్యము. ఈమె యనుగ్రహమున గ్రహబాధలును తొలగిపోవును. ఈమెను ఉపాసించువారికి అగ్ని, జలము, జంతువులు మొదలగువాటి భయముగాని, శత్రువుల భయముగాని, రాత్రి భయముగాని ఏ మాత్రము ఉండవు. ఈమె కృపచే భక్తులు సర్వధా భయవిముక్తులగుదురు.  



కాళరాత్రి :
'ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరాస్థితా
లంబోష్ఠీ కర్నికాకర్ణీ తైలాచ్చ్యాక్త శరీరిణీ
వామ పాదోల్లి, సల్లోహలితా కంటకా భూషణా
వరమూర్దధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ' 

ఈమెకి నివేదనగా కదంబం అర్పిస్తారు.

ఆకాశం లో ఎప్పుడైనా హరివిల్లు వస్తుంది. మరి ఈ హరివిల్లు !

ఆకాశం లో ఎప్పుడైనా హరివిల్లు వస్తుంది కానీ ప్రతీ  ఆదివారం మాత్రం ప్రపంచం మొత్తం మీద ఒకేసారి హరివిల్లు వస్తుంది అదే నా షో పేరు హరివిల్లు. ఆహరివిల్లు కూడా ఉదయం 10:30 నుండి మద్యాహ్నం 12:00 గంటలవరకు వస్తుంది. అది కూడా ఎక్కడబడితే అక్కడ రాదండి కేవలం Online Radio Josh Live లో మాత్రమే వస్తుంది. ఇది కేవలము live ప్రోగ్రాం మాత్రమె కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. నా కబుర్లు, పాటలు , కదలు వినటమే కాదండి మీరు నాతో సరదాగా మాట్లాడైవచ్చును. నాతో మాట్లాడి నాప్రశ్నలకు జవాబులు చెప్పెయవచ్చు. మరి హరివిల్లు షోను అస్సలు మిస్ అవ్వద్దు. మరి నా షోపేరు చెప్పేసాను కదా, మరి నాతో మాట్లాడాలి అంటే 

Skype id: radiojoshlive

US: 914-214-7574

UK: 20-3286-9594


AUS: 28003-4546


Local Number: 040-4200-2003 

ఈ నెంబర్స్ కాల్ చేసి నాతో మాట్లాడైవచ్చు. మరి నా షోను మిస్ కాకండి. ధన్యవాదములు. 

శనివారం, అక్టోబర్ 20, 2012

బొమ్మల కొలువు చిట్టిబొమ్మల పెండ్లి

శనివారం, అక్టోబర్ 20, 2012


ఈ దసరా పండగకి మా ఇంట్లో  బొమ్మల కొలువులు పెట్టము.  అక్కడ  బొమ్మల పెళ్ళి బొమ్మలు కూడా పెట్టాము  ఆ సందర్బానికి తగ్గ పాట  మీకోసం ఇక్కడ. ఇంకా మా బొమ్మల కొలువు ఎలావుందో చూడండి.


చిట్టిబొమ్మల పెండ్లి చేయవలెనగా

శ్రింగారవాకిళ్ళు సిరితోరణాలు
గాజుపాలికలతో, గాజుకుండలతో
అరటి స్తంభాలతో అమరె పెండ్లరుగు.

చిన్నన్న పెట్టెనే వన్నెచీరల్లు
పెద్దన్న పెట్టెనే పెట్టెల్లసొమ్ము
నూరుదునె బొమ్మ, నీకు నూటొక్కకొమ్ము
పోతునే బొమ్మ, నీకు పెన్నేఱునీళ్ళు

కట్టుదునె బొమ్మ, నీకు కరకంచుచీర
తొడుగుదునే బొమ్మ, నీకు తోపంచురవిక
ఒడిబియ్యం పెడుదునే, ఒడిగిన్నె పెడుదు
అత్తవారింటికీ పోయి రమ్మందు

అత్త చెప్పినమాట వినవె ఓ బొమ్మ
మామచెప్పినపనీ మానకే బొమ్మ
రావాకుచిలకమ్మ ఆడవే పాప
రాజుల్లు నీచేయి చూడవచ్చేరు..

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో

బతుకమ్మ బతుకుని కొలిచే పండుగ. బతుకునిచ్చే తల్లిని శక్తిరూపంగా భావిస్తూ, లక్ష్మీ, గౌరి దేవీలను అభేదిస్తూ, ఆటపాటల ద్వారా పూజిస్తూ, రకరకాల వంటలు నైవేద్యాలుగా సమర్పిస్తూ, మనకున్నంతలో కొత్త బట్టలు, నగలు ధరిస్తూ, ఆడబిడ్డల్ని పండుగకు ఆహ్వానించుకొని జరుపుకునే గొప్ప వేడుక బతుకమ్మ. 


బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో 
బంగారు బతుకమ్మ ఉయ్యాలో !
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో 
బంగారు బతుకమ్మ ఉయ్యాలో !!


ఆనాటి కాలాన ... ఉయ్యాలో! 
ధర్మాంగు డను రాజు ... ఉయ్యాలో! 
ఆరాజు భార్యయు ... ఉయ్యాలో! 
అతి సత్యవతి యంద్రు ... ఉయ్యాలో! 
నూరు నోములు నోమి ... ఉయ్యాలో! 
నూరు మందిని గాంచె ... ఉయ్యాలో!
వారు శూరు లయ్యి ... ఉయ్యాలో!
వైరులచె హత మైరి ... ఉయ్యాలో!


తల్లిదండ్రు లపుడు ... ఉయ్యాలో!
తరగని శోకమున ... ఉయ్యాలో!
ధన ధాన్యములను బాసి ... ఉయ్యాలో!
దాయాదులను బాసి ... ఉయ్యాలో!
వనితతో ఆ రాజు ... ఉయ్యాలో!
వనమందు నివసించె ... ఉయ్యాలో!
కలికి లక్ష్మిని గూర్చి ... ఉయ్యాలో!
జనకోసం బొనరింప ... ఉయ్యాలో! ....
....
ఊరికి ఉత్తరాన ..


ఊరికి ఉత్తరానా ... వలలో 
ఊడాలా మర్రీ ... వలలో 
ఊడల మర్రి కిందా ... వలలో 
ఉత్తముడీ చవికే ... వలలో 
ఉత్తముని చవికేలో ... వలలో 
రత్నాల పందీరీ ... వలలో 
రత్తాల పందిట్లో ... వలలో
ముత్యాలా కొలిమీ ... వలలో


గిద్దెడు ముత్యాలా ... వలలో
గిలకాలా కొలిమీ ... వలలో
అరసోల ముత్యాలా ... వలలో 
అమరీనా కొలిమీ ... వలలో
సోలెడు ముత్యాలా ... వలలో 
చోద్యంపూ కొలిమీ ... వలలో 
తూమెడు ముత్యాలా ... వలలో 
తూగేనే కొలిమీ ... వలలో 
చద్దన్నమూ తీనీ ... వలలో 
సాగించూ కొలిమీ ... వలలో 
పాలన్నము దీనీ ... వలలో 
పట్టేనే కొలిమీ ... వలలో 

శ్రీలక్ష్మి నీ మహిమలు 

1: శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ
2: శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ
1: గౌరమ్మ చిత్రమై తోచునమ్మా
భారతీ దేవివై బ్రహ్మ కిల్లాలివై
2: భారతీ దేవివై బ్రహ్మ కిల్లాలివై


1: పార్వతీ దేవివై పరమేశు రాణివై
పరగ శ్రీలక్ష్మివైయ్యూ గౌరమ్మ
భార్య వైతివి హరికినీ గౌరమ్మ


2: శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ


1: ముక్కోటి దేవతలు సక్కనీ కాంతలు
ఎక్కువగ నిను గొల్చి పెక్కు నోములు నోచి
ఎక్కువా వారయ్యిరీ గౌరమ్మ
ఈలోకమున నుండియూ గౌరమ్మ


2: శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ .... //శ్రీలక్ష్మి//....


చిత్తూ చిత్తూల బొమ్మ 

1: చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
2: చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
1: బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన
2: బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన
1: చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
2: చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
1: బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన
2: బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన


రాగీ బిందె దీస్క రమణీ నీళ్లాకు బోతె ... //రాగీ//
రాములోడు ఎదురాయె నమ్మో ఈ వాడ లోన... //రాము//
ముత్యాల బిందె దీస్క ముదితా నీళ్లాకు బోతె ... //ముత్యాల//
ముద్దు కృష్ణు డెదురాయె నమ్మో ఈ వాడలోన ... //ముద్దు//
వెండీ బిందె దీస్క వెలదీ నీళ్లాకు బోతె ... //వెండి//
వెంకటేశు డెదురాయె నమ్మో ఈ వాడలోన ...//వెంకటేశు//
పగడీ బిందె దీస్క పడతీ నీళ్లాకు బోతె ...//పగడీ//
పరమేశుడెదురాయె నమ్మో ఈ వాడలోన ...//పరమేశు//

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)