Blogger Widgets

Monday, October 08, 2012

చిప్కో ఉద్యమం@బిష్ణోయిలు

Monday, October 08, 2012

 
చిప్కో ఉద్యమం గురించి ఒక్కమాటలో చెప్పాలంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్ల నరికివేతను అడ్డుకునే ఉద్యమమే ఈ చిప్కో ఉద్యమం.  చెట్లను కౌగిలించుకొని వాటిమీద పూర్తి హక్కులు మావేనని వ్యాపారస్తుల నుంచి వాటిని కాపాడే ఉద్యమమే చిప్కో ఉద్యమం.  దీని గురించి చరిత్రలో చూస్తే  క్రీస్తుశకం 1730 లో జోధ్‌పూర్ రాజు అభయ్‌సింగ్ పెద్ద నిర్మాణం చేపట్టదలచి బికనీర్‌కు సమీపంలో ఉన్న బిష్ణోయి ప్రాంతంలో ఖేజర్లీ అనే  చెట్లు నరుక్కొని తీసుకురమ్మన తన మనుషులకు ఆదేశించాడు. 

బిష్ణోయి అనేది రాజస్థాన్ లోని జోధ్పూర్ దగ్గర వున్నా ఒక చిన్న పల్లెటూరి ప్రాంతం. ఆ ప్రాంతవాసులు అనుసరించేది మతం పేరు బిష్ణోయి మతం. ఈ మతాన్ని స్థాపించినవాడు గురు జాంబేశ్వర్.  ఈయన అనుచరులు ఆయనను విష్ణు అవతారంగా భావిస్తారు. బిష్ణోయి మతస్తులకు ఆయన 29 నియమాలు పెట్టాడు. అందులో చెట్టు, పశుపక్ష్యాదులను కాపాడటం ఒకటి. రాజస్థాన్‌తో పాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానాలలో చాలామంది జాట్ కులస్తులు ఈ మతాన్ని అనుసరిస్తూ వుంటారు . జోధ్‌పూర్ రాజు కొట్టుకురమ్మన్న ఖేజర్లీ చెట్టు వీరికి దైవసమానం.
అభయ్‌సింగ్ మనుషులు వచ్చారని తెలిసి అమృతాదేవి అనే సాధారణ గృహిణి మరియు ఆమె పిల్లలు చెట్లను గట్టిగా హత్తుకొని వారు వచ్చిన వారు చెట్లు నరకకుండా ఆపగలిగింది. వారు  లంచం ఇవ్వటానికి ప్రయత్నించారు.  ఆమె అప్పుడు గట్టిగా వారితో తిరగబడింది. ఆమెకు తోడు వచ్చిన 363 మంది ఆ చెట్లను కౌగిలించుకుని ఉండిపోయారు. చెట్లని రాజు మనుషులు వాటిని కౌగిలించుకుని ఉన్న బిష్ణోయిలతో సహా నరికేశారు. రెండువందల మందికి పైగా చనిపోయారు. దీనికే ‘ఖేజర్లీ విషాదం’ అని పేరు. ఆ దుర్ఘటన జరిగిన స్థలంలో ఇప్పటికీ యేటా ఆ త్యాగమూర్తులకు నివాళి ఘటించే ఆచారం ఉంది. వీళ్లు ఖేజర్లీ చెట్టుతో పాటు కృష్ణజింకను, కొన్ని పక్షులను పవిత్రంగా చూస్తారు.
మనకు తెలిసిన హింది సినిమా హీరో సల్మాన్‌ఖాన్, మన్సూర్ అలీఖాన్ ఆ జింకలను వేటాడినప్పుడు మూడు చెరువుల నీళ్లు తాగారు. అలా తాగించినవారు ఈ బిష్ణోయిలే.  ఇది నా పుస్తకంలో చదివాను నాకు చాలా బాగా నచ్చింది.  అప్పట్లో ప్రజలు అందరు ప్రకృతి లో పశు , పక్షులను, చెట్లను కాపాడటానికి వారు వారి ప్రాణాలను సైతం లెక్కచేయక వాటిని రక్షించారు.  అప్పటి ప్రజలను మనం ఆదర్శంగా తెసుకోవాలి.

0 comments:

Post a Comment

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers