Blogger Widgets

Saturday, October 20, 2012

ఆరవరోజు దుర్గామాత

Saturday, October 20, 2012

దుర్గామాత


నవరాత్రులలో అమ్మవారు ఈ రోజు దుర్గామాతగా మనకు దర్శనము ఇస్తారు. మహిషాసురుని వధించుటకు అమ్మ అష్టమి రోజు కాళీ మాత దుర్గాదేవిగా కనిపిస్తారు.ఈ దుర్గాఅవతారంలో అమ్మ మహిషాసురినితో భయంకరమైన యుద్దంచేస్తారు.ఈమె అరుణ వర్ణ వస్త్ర దారిఅయి సింహవాహనము కలిగి సర్వఅయుధ దారియై రాక్షసులనుండి మనలను రక్షించుటకు వున్నట్టు దర్శనము ఇస్తున్నది.
ఈమెకి ఎర్రని పుష్పాలు, ఎర్రని అక్షింతలు, ఎర్రని వస్త్రాలు , దనిమ్మ పండ్లు వంటివి సమర్పించి . అమ్మ కరుణ మనపై కురిపించుకోవచ్చు.

శ్రీ దుర్గ అష్టోత్తర శతనామ స్తోత్రం  

దుర్గా శివా మహాలక్ష్మీ-ర్మహాగౌరీ చ చండికా |
సర్వఙ్ఞా సర్వలోకేశీ సర్వకర్మఫలప్రదా || 1 ||
సర్వతీర్థమయీ పుణ్యా దేవయోని-రయోనిజా |
భూమిజా నిర్గుణాధారశక్తిశ్చానీశ్వరీ తథా || 2 ||
నిర్గుణా నిరహంకారా సర్వగర్వవిమర్దినీ |
సర్వలోకప్రియా వాణీ సర్వవిద్యాధిదేవతా || 3 ||
పార్వతీ దేవమాతా చ వనీశా వింధ్యవాసినీ |
తేజోవతీ మహామాతా కోటిసూర్యసమప్రభా || 4 ||
దేవతా వహ్నిరూపా చ సరోజా వర్ణరూపిణీ |
గుణాశ్రయా గుణమధ్యా గుణత్రయవివర్జితా || 5 ||
కర్మఙ్ఞానప్రదా కాంతా సర్వసంహారకారిణీ |
ధర్మఙ్ఞానా ధర్మనిష్టా సర్వకర్మవివర్జితా || 6 ||
కామాక్షీ కామసంహర్త్రీ కామక్రోధవివర్జితా |
శాంకరీ శాంభవీ శాంతా చంద్రసూర్యాగ్నిలోచనా || 7 ||
సుజయా జయభూమిష్ఠా జాహ్నవీ జనపూజితా |
శాస్త్రా శాస్త్రమయా నిత్యా శుభా చంద్రార్ధమస్తకా || 8 ||
భారతీ భ్రామరీ కల్పా కరాళీ కృష్ణపింగళా |
బ్రాహ్మీ నారాయణీ రౌద్రీ చంద్రామృతపరివృతా || 9 ||
జ్యేష్ఠేందిరా మహామాయా జగత్సృష్ట్యాధికారిణీ |
బ్రహ్మాండకోటిసంస్థానా కామినీ కమలాలయా || 10 ||
కాత్యాయనీ కలాతీతా కాలసంహారకారిణీ |
యోగనిష్ఠా యోగగమ్యా యోగధ్యేయా తపస్వినీ || 11 ||
ఙ్ఞానరూపా నిరాకారా భక్తాభీష్టఫలప్రదా |
భూతాత్మికా భూతమాతా భూతేశా భూతధారిణీ || 12 ||
స్వధానారీమధ్యగతా షడాధారాదివర్ధినీ |
మోహితాంశుభవా శుభ్రా సూక్ష్మా మాత్రా నిరాలసా || 13 ||
నిమ్నగా నీలసంకాశా నిత్యానందా హరా పరా |
సర్వఙ్ఞానప్రదానందా సత్యా దుర్లభరూపిణీ || 14 ||
సరస్వతీ సర్వగతా సర్వాభీష్టప్రదాయినీ |
ఇతి శ్రీదుర్గాష్టోత్తర శతనామస్తోత్రం సంపూర్ణమ్ ||నవదుర్గలలో ఆరవరోజు  కాత్యాయిని మాత. "కాత్యాయనీ మాత" భాద్రపదబహుళ చతుర్దశి (ఉత్తరభారత పంచాంగ సంప్రదాయము ననుసరించి ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి) నాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి యింట పుత్రికగా అవతరించినది. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల యందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించెను.

కాత్యాయనీ దేవి అమోఘ ఫలదాయిని. కృష్ణ భగవానుని పడయుటకు గోకులమునందలి గోపికలందఱును యమునాతీరమున ఈమెను పూజించిరి. ఈమె స్వరూపము దివ్యము, భవ్యము. బంగారు వర్ణము గలది. నాలుగు భుజములతో విరాజిల్లుచుండును. ఈమె కుడిచేతిలో ఒకటి అభయ ముద్రను, మఱియొకటి వరముద్రను కలిగియుండును. ఎడమచేతిలో ఒకదానియందు ఖడ్గము, వేఱొకదానియందు పద్మము శోభిల్లుచుండును. ఈమెయు సింహవాహన.

ఈ దేవిని భక్తితో సేవించినవారికి ధర్మార్ధకామమోక్షములనెడి చతుర్విధ పురుషార్ధముల ఫలములు లభించును. రోగములు, శోకములు, సంతాపములు, భయములు దూరమగును. జన్మజన్మాంతర పాపములు నశించును. 
కాత్యాయని దేవి మంత్రం:
చంద్రహాసోజ్వలకరా శార్దులపర వాహనా l 
కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినిll 
ఈనాడు ఈమెకు కేసరి బాత్ నివేదన అర్పిస్తారు .

0 comments:

Post a Comment

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers