Blogger Widgets

సోమవారం, డిసెంబర్ 03, 2012

కార్తీక పురాణం 20వ రోజు

సోమవారం, డిసెంబర్ 03, 2012

పురంజయుడు దురాచారుడాగుట:
జనక మహారాజు, చతుర్మాస్య వ్రతప్రభావము వినిన పిమ్మట వశిష్టునితో " గురువర్యా! కార్తీకమాస మహాత్మ్యమును యింకను వినవలయునునెడి కోరిక కల్గుచున్నది. ఈ వ్రత మహాత్మ్యమునందింకను విశేషములు గలవా! యను సంశయము గూడా కలుగుచున్నది. ఐనా సంశయ నివారణ కొరకు మరిన్ని వుదాహరణలు వినిపించి నన్ను కృతార్దునిగాజేయు" డనెను. అ మాటలకు వశిష్టులవారు మందహాసముతో " ఓ రాజా! కార్తీకమాస మహాత్మ్యము గురించి అగస్త్యమహాముని, అత్రిమునికి జరిగిన ప్రసంగ మొకటి కలదు. దానిని వివరించెదరు ఆలకించు" మని అ కథా విధానమును యిట్లు వివరించిరి. పూర్వమొకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి" ఓ అత్రిమహామునీ! నీవు విష్ణువు అంశయందు బుట్టినావు. కార్తీకమహాత్మ్యమును నీకు ఆ ములాగ్రమున తెలియును, కాన దానిని నాకు వివరింపుము" అని కోరెను. అంత "ఓ అత్రి మహామునీ! నీవు విష్ణువు అంశయందు బుట్టినావు. కార్తీకమాస మహాత్మ్యము నీకు ఆ మూలాగ్రముగా తెలియును, కాన దానిని నాకు వివరింపుము " అని కోరెను. అంత అత్రిమహముని "కుంభసంభవా! నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రితికరముగుటచే నుత్తమమయినది. కార్తీకమాసముతో సమానముగ మాసము. వేదముతో సమానమగు శాస్త్రము. ఆరోగ్యసంపదకు సాటియగు సంపదలేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటెవేరు దేవుడులేడు. ఏ మానవుడైనను కార్తీకమాసమును నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను గలుగు ఫలితము అపారము. ఇందుకొక యితిహాసము వినుము. త్రేతాయుగామును పురంజయుడను సూర్యవంశపురాజు అయోధ్యానగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివిపట్టభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి యాపదలు రాకుండ పాలించుచుండెను. అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశచేతను, రాజ్యాధికార గర్వముచెతను జ్ఞానహినుడై దుష్ట బుద్ది గలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహణ మాన్యములు లాగుకొని, పరమలోభియై, చొరులను జేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగమువాటా తీసికోనుచు ప్రజలను భితావహులను చేయుచుండెను. ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్ట్య ములు నలుదిక్కులా వ్యాపించెను. ఈవార్త కాంభోజరాజును నాయకునిగా చేసుకోని రధ, గజ, తురగ, పదాతి సైన్య బలా న్వితులైర హస్యమార్గము వెంటవచ్చి అయోధ్య నగరమును ముట్టడించి, నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్భ౦ధముచేసి యుద్దమునకు సిద్దపడిరి.
అయోధ్యా నగరమును ముట్టడి౦చిన సంగతిని చారులవలన తెలిసికోనిన పురంజయుడు తానుకూడా సర్వ సన్నద్దుడై యుండెను. అయినను యెదుటిపక్షము వారధి కబలాన్వితులుగా నుండుటయితాను బలహినుడుగా నుండుటయు విచారించియే మాత్రము భితిచెందక శాస్త్రసమన్విత మైన రథమెక్కి సైన్యాధపతులను పూరికొల్పి, చతురంగబల సమేతమైన సైన్యముతో యుద్ద సన్నద్దుడైన వారిని యెదుర్కొన భేరి మ్రోగించి, సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హు౦కరించి శత్రు సైన్యములు పైబడెను.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)