Blogger Widgets

మంగళవారం, డిసెంబర్ 04, 2012

కార్తీక పురాణం 21వ రోజు

మంగళవారం, డిసెంబర్ 04, 2012

పురంజయుడు కార్తీక ప్రభావము నెరు౦గుట
ఈవిధముగా యుద్దమునకు సిద్దమైవచ్చిన పురంజయునకు, కాంభోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ద జరిగింది. ఆ యుద్దములో రధికుడు రధికునితోను, అశ్వసైనికుడు అశ్వ సైనికునితోను, గజ సైనికుడు గజ సైనికునితోను, పదాతులు పదాతి సైనికులతోను, మల్లులు, మల్ల యుద్ద నిపుణులతోను ఖడ్గ, గద, బాణ, పరశువు మొదలగు ఆయుధాలు ధరించి, ఒండొరులడీకొనుచు హుంకరించుకొనుచు, సింహనాదములు చేసికొనుచు, శూరత్వవీరత్వములను జూపుకోనుచు, భేరీ దుందుభులు వాయించుకొనుచు, శంఖములను పురించుకొనుచు, ఉభయ సైన్యములును విజయకంక్షులై పోరాడిరి. ఆ రణభూమి నెందు చూచినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొ౦డెములు, తొండలు, తలలు, చేతులు, - హాహా కారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాలవలె పడియున్న ఏనుగుల, గుఱ్ఱముల కళేబరాల దృశ్యములే ఆ మహా యుద్దమును వీరత్వముజూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకువెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్దము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంభోజాది భూపాలురసైన్యము చాలా నష్టమై పోయెను. అయినను, మూడు అక్షౌహిణులున్న పురంజయుని సైన్యము నెల్ల అతిసాహసముతో, పట్టుదలతో ఓడించినది. పెద్దసైన్యమునన్నను పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గ మున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారి పోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దు:ఖించుచుండెను ఆసమయములో వశిష్టులు వచ్చి పురంజయుని ఊరడించి "రాజా! మున్నొక సారి నీవద్దకు వచ్చితిని. నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చెస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైననూ సన్మార్గుడవయి వుండుమని హెచ్చరించితిని. అప్పుడు నామాట లానలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తునుడ వైవున్నందుననే యీయుద్దమును ఓడి రాజ్యమును శత్రువుల కప్పగించితిని. ఇప్పటికైనా నామాటలాలకింపుము. జయాపజయాలు దైవాదానములని యెఱ్ఱి ౦గియు, నీవు చింతతో కృంగిపోవుటయేల? శత్రురాజులను యుద్దములో జయించి, నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలెనన్న తలంపుకలదేవి, నాహితోపదేశము నాలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన, స్నానజపాది నిత్యకర్మలాచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి, భగవన్నామస్మరణమును చేయుచు నాట్యము చేయుము. ఇట్లోనర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతియేగాదు, శ్రీమన్నారాయణుని సేవించుటవలన శ్రీ హరి మిక్కిలి సంతోషమొంది నీ శత్రువలను దునుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును. కనుక, రేపు అట్లు చేసిన యెడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్టసహవాసము చేయుట చేతగదానికి అపజయము కలిగినది? గానలెమ్ము. శ్రీహరి నీమదిలో దలచి నేను తెలియజేసినటులచెయు" మని హితోపదేశము చేసెను.


శ్లో// అపవిత్ర: పవిత్ర వానానావ స్దాన్గతోపివా
య: స్మరేతుడరీకాక్షం స బాహ్యాభంతరశుచి||

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)