Blogger Widgets

శుక్రవారం, డిసెంబర్ 07, 2012

కార్తీక పురాణం 24వ రోజు

శుక్రవారం, డిసెంబర్ 07, 2012

అంబరిషుని ద్వాదశి వ్రతము 
అత్రి మహాముని మరల అగస్త్యునితో " ఓ కుంభసంభవా! కార్తీక వ్రత ప్రభావము నెంతివిచారించిననూ, యెంత వినిననూ తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరింతును. అలకింపుము. " గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానము చేసిన౦దు వలన ను, సూర్యచంద్రగ్రహణ సమయములందు స్నానాదులోనరించినను యెంత ఫలము కలుగునో శ్రీమన్నారయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీకవ్రతమందు శుద్ధద్వాదశినాడు భక్తి శ్రద్దలతో దనధర్మములుచేయు వారికీని అంతఫలమే కలుగును. ఆద్వాదశి నాడు చేసిన సత్కార్యఫలము యితర దినములలో చేసిన ఫలము కంటె వేయిరెట్లు అధికముకా గలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమెట్లో చెప్పెదను. వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున, పగటి పూట మాత్రమే భుజించి ఆమరునాడు అనగా యెకాదశి రోజున వ్రతమూ చేయక శుష్కో పవాస ముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భుజింప వలయును. దీనికొక యితిహాసము కాలదు. దానిని కూడా వివరించెదను.  సావదనుడవై అలకింపుము"మని యిట్లు చెప్పుచున్నాడు. 
పూర్వము అంబరీషుడనురాజు కాలదు. అతడు పరమ భగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండ వ్రతము చేయుచుండెడివాడు. ఒక ద్వాదశినాడు, ద్వాదశి ఘడియలు స్వల్ప ముగా నుండెను. అందుచే ఆ రోజు పెందల కడనె వ్రతమును ముగించి బ్రాహ్మణా సమారాధన చేయదలచి సిద్దముగా నుండెను. అదే సమయమున కచ్చటకు కోపస్వభావుడగు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి, ద్వాదశి ఘడియలలో పారాయణము చేయవలయునుగాన, తొందరగా స్నానమునకై రమ్మనమని కోరెను. దుర్వాసుడ౦దుల క౦గీకరించి సమీపమున గల నదికి స్నానమున కైవెడలెను. అంబరీషుడు యెంతసేపు వేచి యున్ననూ దుర్వాసుడు రాలేదు. ద్వాదశి ఘడియలు దాటిపోవు చున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లునుకొనెను. " ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనము నాకు రమ్మంటిని . ఆముని నదికి స్నానముకు వెళ్లి యింతవరకు రాలేదు. బ్రాహ్మణునకతిధ్యమిత్తునని మాటయిచ్చి భోజనం పెట్టక పోవుట మహాపాపము. అది గృహస్తునకు ధర్మముగాదు. అయన వచ్చు వరకు ఆగితినా ద్వాదశి ఘడియలు దాటిపొవూ. వ్రతభంగమగును. ఈ ముని మహాకోప స్వభావము గలవాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్నుశపించును. నాకేమియు తోచకున్నది. బ్రాహ్మణా భోజనమతిక్రమించరాదు. ద్వాదశి ఘడియలు మించిపోకూడదు. ఘడియలు దాటి పోయిన పిదప భుజించిన యెడల, హరిభక్తిని వదలిన వాడనగుదను. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్పలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు, భోజనము చేసిన ద్వార్వసునకు కోపము వచ్చును. అదియుగాక, యీ నియమమునునెను అతిక్రమించిన యెడల వెనుకటి జన్మయందు జేసినా పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చితము లేదు.
" అని అలోచించి " బ్రాహ్మణా శాపమునకు భయములేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువేబోగట్ట గలదు. కావుననెను ద్వాదశి ఘడియలలో భోజనము చేయుటయే వుత్తమము. అయినను పెద్దలతో ఆలోచించుటమంచి"దని, సర్వ జ్ఞులైన కొందరు పండితులను గాంచి వారితో యిట్లుచెప్పెను. ఓపండిత శ్రేష్టులారా! నిన్నటి దినమున యేకాదశియగుటం జేసి నేను కటిక వుపవాసము వుంటిని. ఈ దినమున స్వల్పముగా మత్రమే ద్వాదశి ఘదియలున్నవి. ద్వాదశి ఘడియలలోనే భుజించవలసి యున్నది. ఇంతలో నాయింటికి దుర్వాస మహాముని విచ్చేసిరి. అమహామునిని నేను భోజనమునకు ఆహ్వాని౦చితిని. అంధులకాయన అంగీకరించి నదికి స్నానర్ధ మై వెళ్లి ఇంత వరకు రాకుండెను. ఇప్పుడు ద్వాదశిఘడియలు దాటిపోవుచున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశిఘడియలలో భుజింపవచ్చునా? లేక, వ్రతభ౦గమును సమ్మతించి ముని వెచ్చే వరకూ వేచి యుండవలెనా? ఈ రెండిటిలోయేది ముఖ్య మైనదో తెలుపవలసిన"దాని కోరెను. అంతట యా ధర్మజ్ఞులైన పండితులు, ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శప్రతి విమర్శలు చేసికొని, దిర్ఘముగా అలోచించి " మహారాజా! సమస్త ప్రాణి కోటి గర్భకుహరములందు జటరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనముగావించి దేహే౦ద్రియలకు శక్తి నొసంగుచున్నాడు. ప్రాణ వాయువు సహాయముతో జటరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్భాధ- దప్పిక కలుగును. అ తపము చల్లార్చ వలెనన్న అన్నము, నిరు పుచ్చుకొని శాంత పరచవలెను. శరీరమునకు శక్తకలుగ చేయువాడు అగ్నిదేవుడు, దేవతలందరి కంటే అధికుడై దేవ పుజ్యు డైనాడు. ఆయగ్ని దేవునందరు సదా పూజింపవలెను. గృహస్తు, యింటికి వచ్చిన అతిధి కడ జాతి వాడైనాను 'భోజనమిడుదు' నని చెప్పి వనికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేద వేదాంగ విద్యవిశారదుడును, మహతపశ్శలియు, సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపమూ కలుగును. అందువలన ఆయుక్షిణము కలుగును. దుర్వాసునంతటి వానిని అవమానమొనరించిన పాపము సంప్రాప్త మగను" అని విషాదపరచిరి.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)