Blogger Widgets

బుధవారం, డిసెంబర్ 12, 2012

కార్తీక పురాణం 29వ రోజు

బుధవారం, డిసెంబర్ 12, 2012

అంబరీషుడు దుర్వాసుని పూజించుట 
ద్వాదశి పారాయణము అత్రిమహాముని అగస్త్యు వారితో యీ విషముగా- సుదర్శన చక్రము అంబరీషునకభయమిచ్చి వుభయులను రక్షించి, భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైనవైనము చెప్పి తిరిగి ఇట్లు నడువనారంభించెను. ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదముల ఫైబడి దండప్రణామములాచరించి, పాదములను కడిగి, ఆ కడిగిన నీళ్లను తన శిరస్సు పైజల్లుకొని, " ఓమునిశ్రేష్టా! నేను సంసార మార్గమందున్న యొక సామాన్య గృహస్తుడను నాశక్తికొలది నేను శ్రీ మన్నారయణుని సేవింతును, ద్వాదశివ్రతము జేసుకోనుచు ప్రజలకు ఎట్టికీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను. నావలన మీకు సంభవించిన కష్టమునకు నన్నుమన్ని౦పుడు. మీయెడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్య మివ్వవలయునని ఆహ్వానిన్చితిని. కాన, నా అతిధ్యమును స్వీకరించినన్నును, నావంశమును పావనము జేసి కృతార్దుని చేయుడు, మీరు దయార్ద్రహృదయులు, ప్రధమ కోపముతో నన్ను శపించనను మరల నాగృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీరాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుధర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీవుపకరమును మరువలేకున్నాను. మహానుభావా! నా మనస్సంతోషమచే మిమ్మెట్లు స్తుతింపవలయునో నానోట పలుకులురాకున్నవి. నా కండ్ల వెంటవచ్చు ఆనందబాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు యెంత సేవచేసినను యింకను ఋణపడియుండును. కాన, ఓ పుణ్యపురుషా! నాకు మరల నరజన్మ రాకుండా వుండేట్లును, సదా, మీ బోటి ముని శ్రేష్ఠులయందును- ఆ శ్రీ మన్నారాయుణుని యందును మనస్సు గల వాడనై యుండునట్లును నన్నశిర్విదించుడని ప్రార్ధించి, సహా ప౦క్తి భోజనమునకు దయచేయుమని ఆహ్వానించెను. ఈ విధముగా తన పాదముల పైబడి ప్రార్ధించుచున్న అంబరీషుని ఆశీర్వదించి " రాజా! ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువుల కైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టి వారు తండ్రితో సమాన మని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు యిష్టుడవు తండ్రితో సమానుడవైనావు. నేను నీకు నమస్కరించినచో నా కంటె చిన్న వాడగుట వలన నీకు ఆయుక్షీణం కలుగును.

అందుచేత నీకు నమస్కరించుటలేదు. నీకోరిక యీస్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్రయేకాదశి వ్రతనిష్టుడవగు నీకు మనస్థాపమును కలుగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తము అనుభావిన్చితిని, నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నివేదిక్కయితివి. నీతో భోజనము చేయుట నాభాగ్యముగాక, మరొకటి యగునా?" అని దుర్వాస మహాముని పలికి, అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష్య పరమాన్నములతో సంతృప్తిగా విందారగంచి, అతని భక్తి ని కడుంగడు ప్రశంసించి, అంబరీషుని దీవించి, సెలవుపొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను. ఈ వ్రుతాంత్త మంతయు కార్తిక శుద్ధ ద్వాదశి దినంబున జరిగినది.
 ఓ అగస్త్యమహాముని! ద్వాదశివ్రత ప్రభావమెంతటి మహాత్మ్యము గలదో గ్రహించితివిగదా! ఆ దినమున విష్ణు మూర్తి క్షీరసాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్నమనస్కుడై చేసిన పుణ్యము యితర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తిక శుద్ధయేకదశి రోజున శుష్కోపవసము౦డి పగలెల్ల హరి నామ సంకీర్తన చే గడిపి ఆరాత్రంతయు పురాణము చదువుతూ, లేక, వింటూజాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీ మన్నారయణుని ప్రీతీ కొరకు దానము లిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయునో అట్టి వాని సర్వ పాపములు యీవ్రత ప్రభావము వలన పటాపంచలైపోవును. ద్వాదశి దినము శ్రీ మన్నానారయుణుకు ప్రీతీకరమైన దినము కనుక ఆనాడు ద్వాదశిఘడియలు తక్కువగా యున్నాను. ఆ ఘడియలు దాటకుండగానే భుజింపవలెను. ఎవరికైతే వైకుంటములో స్థిర నివాస మేర్పరచుకొని వుండాలని కోరిక వుండునో, అట్టివారు ఏకాదశి వ్రతము, ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను. ఏ యొక్కటియు విడువకూడదు. శ్రీహరికి ప్రీతీకరమగు కార్తికశుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కర మైనది. దాని ఫలితము గురించి యెంత మాత్రము సంశయింపకూడదు. మఱ్ఱి చెట్టు విత్తనము చాల చిన్నది. అయినను అదే గొప్ప వృక్ష మైన విధముగా కార్తీక మాసములో నియమాను సారముగ జేసినాయేకొంచము పుణ్య మైనను, అది అవసానకాలమున యమదూతల పలుక నీయకకాపాడును. అందులకే యీ కార్తిక మాస వ్రతము చేసి దేవతలే గాక సమస్త మానవులు తరించిరి. ఈ కథను యెవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్దించి సంతాన ప్రాప్తి కూడా కలుగును- అని అత్రి మహాముని అగస్త్యనకు బోధించిరి.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)