Blogger Widgets

Friday, December 21, 2012

తిరుప్పావై (కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్) 7వ పాశురం

Friday, December 21, 2012

నిన్న ఉత్తిష్ట అను చిన్నగోపికను మేలుకోల్పిరి. మరి నేడు. వేదపఠనముకు ముందు ఎల్లప్పుడూ "శ్రీ గురుభ్యోనమః, హరిః  ఓమ్" అని ప్రారంభిస్తారు.  నిన్న గోపికలు మెల్కొలుపుటతో మన ధనుర్మాసవ్రతం ప్రారంభము అయ్యింది.  అందుకే పక్షులు కిలకిల రవములు, శంఖనాదము, హరి హరి అను వినబడుట లేదా అంటున్నారు.  పక్షులు శ్రీ గురుమూర్తులు.  అందుకే శ్రీ గురుబ్యోన్నమః అన్నట్లు భావించాలి.  తరువాత శంఖము హరి శబ్దము - హరిః ఓం అన్నట్లు భావించాలి. ఇలా వ్రతారంభము చేసి నేడు ఆ శ్రవణము లో వైవిధ్యమును వివరించుచు వేరొక గోపికను నిద్ర మేల్కొల్పుతున్నారు. మరి ఏవిధంగా లేపుతున్నారో చూద్దం. నేడు విశేష పాశురము కావున నేడు పులిహోర ఆరగింపు పెట్టవలెను.కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ పాశురము: 
కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు
పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు
వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్ మత్తినాల్
ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో
నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి
కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్.


கீசு கீசு என்று எங்கும் பாடல் வரிகள்:
கீசு கீசு என்று எங்கும் ஆனை(ச்) சாத்தான் கலந்து
பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய்(ப்) பெண்ணே
காசும் பிறப்பும் கலகலப்ப(க்) கை பேர்த்து
வாச நறும் குழல் ஆய்ச்சியர் மத்தினால்
ஓசை படுத்த தயிரரவம் கேட்டிலையோ
நாயக(ப்) பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி
கேசவனை(ப்) பாடவும் நீ கேட்ட கிடத்தியோ
தேசமுடையாய் திறவேலோர் எம்பாவாய்.

Lyrics of Keesu Keese Enru Engum:
keesu keesu enRu engum aanai(ch) chaaththaan kalandhu
pEsina pEchcharavam kEttilaiyO pEy(p) peNNE
kaasum piRappum kalakalappa(k) kai pErththu
vaasa naRum kuzhal aaychchiyar maththinaal
Osai paduththa thayiraravam kEttilaiyO
naayaga(p) peN piLLaay naaraayaNan moorththi
kEsavanai(p) paadavum nee kEtta kidaththiyO
dhEsamudaiyaay thiRavElOr empaavaai


తాత్పర్యము:
భరద్వాజ పక్షులు తెల్లవారుజామున లేచి అన్నివైపులా మాట్లాడుకుంటున్నాయి.  ఆ ధ్వని నీవు వినలేదా?
ఓ పిచ్చిదానా! పువ్వులతో చుట్టబడిన కేశబంధములు విడిపోవుటచేత సువాసనలు వేదజల్లుచున్న జుట్టుముడులతో ఉన్నగోప వనితలు కవ్వములతో పెరుగు చిలుకునప్పుడు పెరుగు కుండల నుండి వెలువడు మృదంగ గంభీరధ్వని ఆ కాంతల చేతుల గాజుల సవ్వడి మరియు మేడలో ఆభరణముల ధ్వని కలిసి ఆకాశమునకు తగులుచున్నవి.  నీ చెవికి సోకటం లేదా ?  
ఓ నాయకురాలా!  అంతటను వాత్సల్యముతో వ్యాపించి ఉన్న పరమాత్మ మనకు కనబడవలెను అని శరీరము ధరించి కృష్ణుడు అవతరించినాడు.  లోకకంటకులైనవారిని నశింపజేసిన ఆ స్వామిని మేము పెద్దగా కీర్తించుచుండగా నీవు వినియును మేల్కొనవేలా?  నీ తేజస్సును మేము దర్శించి అనుభవించునట్లుగా తలుపులు    తెరువవలేనని మేల్కొల్పుతున్నారు. 

0 comments:

Post a Comment

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers