Blogger Widgets

Saturday, January 12, 2013

బోగి పండగ శుభాకాంక్షలు

Saturday, January 12, 2013

గోదాదేవి గోపిక  నాడు ఆచరించిన వ్రతమును తానూ అనుకరించి వ్రత సమాప్తి చేసి వ్రతఫలమును తానుకూడా పొందినదిశ్రీ కృష్ణసమాగామంమును ఆనాడు గోపికలు పొందినట్లే మన గోదాదేవి తన ప్రియతముడగు శ్రీ రంగానాధుని భర్తగా పొందినది . శ్రీరంగమునుండి రంగనాధుడు వ్రత సమాప్తి సమయమునకు తమ అంతరంగా భక్తులను ఆండాలమ్మ యుండిన శ్రీ విల్లిపుత్తురునకుపంపి ఆమెను శ్రీ రంగమునకు తోడి తెమ్మని ఆజ్ఞాపించెను .అంత భట్తనాదులు వారి శి ష్యులు వల్లభారాయులుతో సహా శ్రీరంగమునకు ఆండాల్లమ్మను తోట్కుని వెళ్ళెను .అచట శ్రీ రంగనాధ స్వామీ అందరి సమక్షములో శ్రీ గోదాదేవినితనలోచేర్చుకున్నారుఅందుచే గోదారంగానాయకుల కళ్యాణ దినమునకు భోగి ఆని పేరు .
భోగము = పరమాత్మ అను భావము  
అది పోందినరోజును భోగి పండుగగా సార్ధకమైనది .
 మూడురోజులు పండుగ చాలా బాగాజరుపుకుంటారుఅసలైతే  నెలరోజులు పండుగ వాతావరణమే వుంటుంది .  చలి ఎక్కువుగాఉంటుంది నెలరోజులు తెలుగువారి లోగిలి చాలా అందముగా ముస్తాబవుతుంది . ప్రతీ ఇంట రంగురంగుల ముగ్గులతో చక్కనివాతావరనముతో ముచ్చట గొల్పుతూ వుంటాయి రంగుల ముగ్గు మద్యలో గొబ్బెమ్మలు ను అలంకరించుతారుసాయంత్రముసమయాలలో పోలాల్లోనుమ్డి బళ్ళు ధాన్యపు బస్తాలతో నిండి వస్తాయిచాలా ఆనందముగా సందడిగా ఉంటుంది .  నెల రోజులు.నెల రోజులుపగటి వేషగాళ్ళుహరిదాసులు ,గంగిరేద్దులువాళ్ళు వస్తూవుంటారు .

 భోగి రోజు తెల్లవారుజాముననే లేచి నలుగు పెట్టుకొని స్నానాలుచేసి భోగి మంటను వెలిగిస్తారు .  భోగి మంట లో పాత కర్రసమానులు వంటివి పనికిరాని వన్ని వేసి చలిని పారగోలుపుతారు పెద్ద పండగకి కొత్త అల్లుళ్ళు అత్తగారింటికి తప్పకుండా వస్తారు.బావా మరదళ్ల ఆటలు అల్లర్లుతో పండుగ చాలా సంతోషకరమైన శోభ తో ఉంటుంది పండుగని రైతుల పండుగ అని కుడా అంటారు.
 పండుగకి ముగ్గులులో గొబ్బెమ్మలు పెడతారు వాటి చుట్టూ పిల్లలు అన్నమాచార్య రచించిన గొబ్బెమ్మల పాటలు పాడతారు.                   

కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు కుల స్వామికిని గొబ్బిళ్ళో

కొండ గొడుగుగా గోవుల గాచిన కొండొక శిశువునకు గొబ్బిళ్ళో

దండగంపు దైత్యుల కెల్లను తల గుండు గండనికి గొబ్బిళ్ళో

పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళో
యేపున కంసుని యిడుమల బెట్టిన గోప బాలునికి గొబ్బిళ్ళో

దండి వైరులను తరిమిన దనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో
వెండిపైడి యగు వేంకట గిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో

అనే పాటలు పాడుతూ వాటి చుట్టూ తిరుగుతారుసాయంత్రము సమయములో చిన్నపిల్లలకు బోగిపల్లును దిస్తితీసి వారి తలమీదపోస్తారుదీనికి పెరంటాల్లను పిలిచి బోగిపళ్ళు పోస్తారు బోగిపల్లలోకి శనగలు , పువ్వులు , అక్షింతలుడబ్బులుచెరుకుగడలు,రేగుపళ్ళు వేసి పిల్లలకు దిష్టితీసి తలమీదవేసి ఆసిర్వాదిస్తారుబొమ్మల కొలువు పెట్టి పేరంటాలకి పసుపుకుంకుమలు ఇచ్చి దీవెనలుతీసుకుంటారు.
 బోగి రోజు నెలరోజులు ధనుర్మాసము వ్రతము చేసిన గోదాదేవి రంగానాధునిని వివాహము చేసుకొని స్వామీ వారిలో ఐక్యముఅయిపోతుందిఅందువలన అప్పటినుండి భోగి రోజు గోదా రంగానాయకులవివాహాలు ఆలయాలలోజరుపుతారు వివాహముచూడటానికి రెండుకళ్ళు చాలని విధముగా చేస్తారుఇలా భోగి పండుగ ముగుస్తుంది

0 comments:

Post a Comment

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers