Blogger Widgets

Monday, April 15, 2013

గురునానక్ దేవ్

Monday, April 15, 2013

గురునానక్ దేవ్ 1469 ఏప్రిల్ 15 న పాకిస్తాన్ లోని నన్కానా సాహిబ్ లో జన్మించాడు. ఇతను పది మంది సిక్కు గురువులలో మొదటి వాడు. ఇతను హిందూ మరియు ఇస్లామియా మత గ్రంథాలు చదివాడు కానీ ఇతను ఈ రెండు మతాలకి భిన్నమైన సిక్కు మతమును స్థాపించాడు. సిక్కు మతం ఏకేశ్వరోపాసక మతము. వీరు ఏక్ ఓంకార్(ఏకైక దేవుడు)ని నమ్మతారు.  సిక్కు మతము గురునానక్ ప్రభోధనల ఆధారంగా యేర్పడిన మతము. ఏకేశ్వరోపాసన వీరి అభిమతము. సిక్కు మతములో దేవుని పేరు "వాహే గురు". వీరి పవిత్ర గ్రంధము గురుగ్రంధ సాహిబ్ లేదా ఆది గ్రంధము లేదా ఆది గ్రంధ్. వీరి పవిత్ర క్షేత్రము అమృత్ సర్ లోని స్వర్ణ మందిరము. ఈ మతాన్ని అవలంబించేవారిని సిక్కులు అని సంబోధిస్తారు. వీరు ప్రధానంగా పంజాబు (భారతదేశం మరియు పాకిస్తాన్) లలో నివసిస్తుంటారు. మరియు ప్రపంచమంతటా వ్యాపించియున్న సమూహం.
శిక్కు మతం, కాలంలో చూస్తే చాలా చిన్నది. దీని వయస్సు లూధర్ మతానికున్న వయస్సు ఎంతో అంత. దీనిని పదిహేనవ శతాబ్దంలో గురునానక్ స్థాపించాడు. గురునానక్ తల్వాండి (ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నది) లో 1469 లో జన్మించాడు. గురునానక్ చిన్నప్పుడు నుండి ఎక్కడో చూస్తుండేవాడు. దేనిని గురించో దీర్ఘంగా ఆలోచిస్తుండేవాడు. అందువల్ల పెరిగి పెద్దవాడయ్యాక గూడా అతడికి ఈ ప్రాపంచిన విషయాలు రుచింవ లేదు. అతడు 1539 లో పరమపదించారు.
శిక్కులకు దేవుడు అమూర్తి సత్యసూత్రం. దీనినే వారు విశ్వసిస్తారు. " ఇది అనేకం కాదు ఒక్కటే" విశ్వాంతర్యామి. పుట్టదు. గిట్టదు. తిరిగి పుట్టడానికి ఇదే వారి ప్రార్థన. మూడవ గురువు ఇలా అన్నాడు

అపూర్వ దేవతలను పూజించావారి
జీవితాలు, నివాసాలు అభిశప్తాలవుతాయి
వారి అన్నం - ప్రతిముద్ద - విషపూరితమవుతుంది
వారి దుస్తులు విషమయాలవుతాయి
వారిజీవితాలు కడగండ్ల పాలవుతాయి
తదనంతర జీవితం నరకం

ఇస్లాం లోని దైవాధీనతా వాదాన్ని బహిరంగంగానె వీరు నిరసించారు. "మీ జాతకాలను నిర్దేసించేది దేవుడు కాదు. మీ భవిష్యత్తును మీరే మలచుకోండి" అన్నాడు గురునానక్. శిక్కు మతం పునర్జన్మలను, కర్మవాదాన్ని అంగీకరిస్తుంది. కాని ఒకడు పునర్జన్మ శృంఖలాలనుంచి బయటపడాలంటే, ముక్తి పొందాలంటె, అతడు మానవుడు కావాలి. మనిషి అయితే (మానవత్వం ఉన్న) మోక్షం లభిస్తుంది. ఒకరు 8,400,000 జీవరూపాలను ఎత్తిన (జైన మతం ప్రకారం) తరువాత మోక్షం లభిస్తుందా. లెక తన వెలుగు దేవుని వెలుగులో మిళితం చేయడంతో ముక్తి లభిస్తుందా అనే విషయం అతడి జీవితం (మానవ జీవితం) నిర్ణయిస్తుంది.
మంత్ర పఠనం చేస్తూ "సత్ నాం, వహ్ గురు" (నిజమైన నామం అద్భుత గురువు) ను జపించడానికి శిక్కుమాంలో మంచి ప్రాముఖ్యం ఉంది. కాని గురువులు కేవలం మానవులు పదవ గురువు ఇలా అన్నాడు.

నేనొక మతాన్ని స్థాపించి, దాని నియమాల
నేర్పరుప నియుక్తుడయ్యాను
నన్నెవడైనా దేవునిగా భావిస్తే
అతడు అశక్తుడవుతాడు, వినాశమవుతాడు

వారి మతంలో మానవ పూజ లేదు., ఏదైనా పూజింపబడితే అది ఒక పుస్తకం. "గ్రంథ సాహిబ్". ప్రత్యేక సమయాలలో దీనిని అట్ట నుంచి అట్ట వరకు చదువుతారు. కొన్ని గృహాలలో నిత్యం ఈ గ్రంథ భాగాలు పారాయణం చేయబడతాయి.

0 comments:

Post a Comment

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers