Blogger Widgets

మంగళవారం, ఏప్రిల్ 30, 2013

ఏలా మత్స్యంబవైతివి?

మంగళవారం, ఏప్రిల్ 30, 2013



పురాణాలలో శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు  ధరించాడు అని వుంది.  విష్ణువు అవతారాలలో మొట్టమొదటి అవతారమే ఈ మత్స్యావతారం.   ఈ అవతారములో రెండు ముఖ్యమైన పనులు చేసారు.  అవి 1 ) ప్రళయకాలంలో జీవరాసులను నావలో జలనిధిని దాటించడం. (2) వేదాలను కాపాడడం. 
పూర్వం వివస్వతుడు అనే సూర్యుని పుత్రుడు సత్యవ్రతుడు. సత్యవ్రతుడనే రాజర్షి మాలానదిలో తర్పణ మర్పిస్తూండగా . అప్పుడు అతని చేతిలోనికి ఒక చేపపిల్ల వచ్చింది. దానిని తిరిగి వదలి పెట్టబోగా అది తనను కాపాడమని కోరింది. సరే అని ఇంటికి తీసికొని వెళ్ళగా అది ఒక్క ఘడియలో చెంబుకంటె పెద్దదయ్యింది. ఇంకా పెద్ద పాత్రలో వేస్తే ఆ పాత్ర కూడా పట్టకుండా పెరిగింది. చెరువులో వేస్తే చెరువు చాలనంత పెరిగింది. నదిలో వేస్తె ఇంకా పెద్దయ్యింది. అప్పుడు రాజు "నీవెవరవు?" అని ఆ చేపను ప్రార్ధించగా ఆ చేప తాను మత్స్యాకృతి దాల్చిన విష్ణువునని చెప్పింది.
"శ్రీ లలనాకుచవీధీ కేళీ పరతంత్రబుద్ధిన్ క్రీడించు శ్రీహరీ! తామసాకృతిన్ ఏలా మత్స్యంబవైతివి?" అని రాజు ప్రశ్నించాడు.

అప్పుడు చేపగా వచ్చిన పరమాత్ముడు అతనితో, " ఇంకొక వారంలో ప్రళయం రానున్నది. నా ఆజ్ఞ ప్రకారం ఒక పెద్ద నావ నీ దగ్గరకు వస్తుంది. దానిలో అన్నిరకాల విత్తనాలు, ఔషదులూ, ఉంచు. సప్తర్షులు సకల జంతువులతో సహా వచ్చి నీ నావ ఎక్కుతారు. ప్రళయంలో ముల్లోకాలూ సముద్రంలో మునిగిపోయి , భయంకరమైన తుపాను వీస్తూ ఉంటుంది. భయపడకు. నా రక్ష వలన మీరు ఆ నావలో తిరుగగలుగుతారు. అంతా చీకటే అయినా సప్తర్షుల తేజస్సు మీకు వెలుగునిచ్చి కాపాడుతుంది. మీ దగ్గరకు ఒక పెద్ద చేప వస్తుంది. దానికి పెద్ద కొమ్ము ఉంటుంది. ఒక పెద్ద పాముతో మీ నావను దాని కొమ్ముకి కట్టు. ఆ చేప , బ్రహ్మ నిద్ర నుంచి లేచి కల్పం ఆరంభం అయ్యే వరకూ మిమ్ములని క్షేమంగా చూసుకుంటుంది" అని చెప్పి అంతర్థానమయ్యాడు. భగవంతుడు చెప్పినట్లుగానే తుపాను వచ్చింది. నావలో రాజర్షి సప్తర్షులతో, సమస్త బీజాలు , ఔషధాలు, జంతుజాలంతోనూ ఉంటుండగా , లక్ష యోజనాల పొడవు గల బంగారు చేప పెద్ద కొమ్ముతో వచ్చింది. దానికి రాజర్షి నమస్కరించి స్తోత్రం చేస్తూ , నావను దాని కొమ్ముకి పద్ద పాముతో కట్టాడు.
బ్రహ్మ మేలుకొన్నాకా ప్రళయం అంతమయింది. అప్పుడు నావలో ఋషులు స్తోత్రం చేస్తుండగా , మత్స్యావతారంలో ఉన్న పరమాత్ముడు వారికి మత్స్యపురాణ సంహితను చెప్పి , " బ్రహ్మ నిద్రలో ఉండగా వేదాలు అతని ముఖం నుండి బయటకు వచ్చాయి. దగ్గరలో ఉన్న హయగ్రీవుడనే రాక్షసుడు వాటిని యెత్తుకుపోతున్నది చూసి నేనీ అవతారంలో వాడిని సంహరించి , వేదాలను బ్రహ్మకు తిరిగి యెచ్చాను" అని వివరించాక , పరమాత్ముడు అంతర్థానమయ్యాడు.  సత్య వ్రతుని కీర్తనలకు సంతోషించి శ్రీమత్స్యావతారమూర్తి అతనికి సాంఖ్యయోగ క్రియను, పురాణ సంహితను ఉపదేశించెను. అందరితోను, మూలబీజములతోను ఉన్న ఆ నావను ప్రళయాంభోనిధిని దాటించెను.
సత్యవ్రతుడు ప్రస్తుతం నడుస్తున్న "వైవస్వత మన్వంతరానికి" అధిపతి అయ్యాడు.    
మత్స్యవతారాన్ని గురించి దాశరధి శతకము లోని కంచర్ల గోపన్న రాసిన మంచి పద్యం ఒకటి .

వారిచరావతారమున, వారిధిలో జొరబాఱి క్రోధ వి
స్తారగుడైన యా నిగమ తస్కరవీర నిశాచరేంద్రునిం
జేరి వధించి వేదముల చిక్క్డలించి విరించికిన్ మహా
దారత నిచ్చితీ వెగద దాశరథి కరుణాపయోనిధీ 

భావం : దసరధ పుత్రా! దయానిధీ! రామా! మత్స్యావతారమునందు వేదములనుదొంగలించుకుపోయిన రాక్షసవీరుడగు సోమకాసురుని పట్టుకొనుటకు కోపాతిసయమును పొంది సముద్రము లోపలకు అతివేగముగా ప్రవేసించి వానిని చంపి, వేదముల చిక్కులను తోలగునట్లు చేసి మహాఔదార్యముతో బ్రహ్మకు ఆ వేదములను తిరిగిచ్చినమత్స్యావతారమూర్తివి నేవే.   

ఈరోజు మత్స్యజయంతి అందుకే ఈ కద ను గుర్తు చేసాను.   శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన మత్స్యజయంతి శుభాకాంక్షలు . 

2 కామెంట్‌లు:



  1. ఇటువంటి కథలే బైబిల్ లోను,(నోవ్హా కథ) గ్రీకు గాథల్లో(అట్లాంటిస్),మెసొపొటేమియా పురాణంలోను ఉన్నవి.చరిత్రకారుల అభిప్రాయ మేమంటే, సుమారుగా 6 వేలసం';క్రితంపెద్దసునామీవంటిది(సముద్రం పొంగి) వచ్చి చాలా దేశాల్లో చాలావిశాల ప్రాంతాలు మునిగిపొయి ఊళ్ళు ,నాగరకతలు ధ్వంసంకాగా, తప్పించుకొన్న కొంతమంది నావల్లో కొత్తప్రదేశాలకి వెళ్ళి మళ్ళీ కొత్త జీవితం,నాగరకత స్థాపించుకొని ఉంటారని సిద్ధాంతీకరిస్తున్నారు.ఆ ముఖ్య సంఘటనే ఈ కథలకు ఆధారం అని నమ్ముతున్నారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Thank u very much కమనీయం uncle. మంచి విషయమును మాకు తెలియచేసారు .

      తొలగించండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)