Blogger Widgets

Thursday, May 09, 2013

తెలుగు పదానికి జన్మదినం

Thursday, May 09, 2013


 తెలుగు పదానికి జన్మదినం
ఇది జానపదానికి జ్ఞానపదం
ఏడు స్వరాలే ఏడుకొండలై
వెలసిన కలియుగ విష్ణుపదం
అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
పద కవితా పితామహుడు, శ్రీహరి గాన లోలుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు జయంతి శుభాకాంక్షలు .
అమ్మ తన బిడ్డ అన్నము తినటానికి  మారం చేసినప్పుడు ప్రతీ  ఇంట్లోని అమ్మ   చందమామని చూపిస్తూ , గోరుముద్దలు తినిపిస్తూ  తన  బిడ్డకి  "చందమామరావో జాబిల్లిరావో"  అన్నపాట ను పాడుతుంది.  ఈ పాట  తెలియని తెలుగు లోగిలి వుండదు.  ఇలాంటి  పాటలు రాసిన వారు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అయిన  "పదకవితా పితామహుడు", "సంకీరత్నాచార్యుడు", "పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు"  అను బిరుదాంకితుడు అన్నమయ్య.   నారాయణయ్య కొడుకు నారాయణ సూరి. విద్యావంతుడు. అతని భార్య లక్కమాంబ. ఆమెది తాళ్ళపాక సమీప గ్రామం మాడుపూరు. అక్కడ ఉన్న విష్ణువు కోవెలలో అమె శ్రద్ధగా మాధవుని అర్చించేదట. వారికి చాలా కాలం సంతానం కలుగలేదు. అతడు, అతని భార్య సంతానార్ధులై తిరుమలను దర్శించారట. ఆ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రమాణం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని ఒక  కధ  కలదు. అలా జన్మిచిన వాడే అన్నమయ్య  . సర్వధారి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు (మే 9, 1408) కడప జిల్లా లోని రాజంపేటమండలం తాళ్ళపాక గ్రామములో అన్నమయ్య జన్మించాడు. 8వ యేట అన్నమయ్యకు ఆయన గురువు ఘనవిష్ణు దీక్షనొసగినపుడు అన్నమాచార్య నామం స్థిరపడిపోయింది.
అన్నమయ్య ఇంటిలోతల్లి సంగీతం, తండ్రి పాండిత్యం ఛాయలలో పెరిగాడు. ఉపవీత సంస్కారం పొందిన తరువాత ఇంటి గురుకులంలోనే విద్యాభ్యాసం సాగింది. ఏక సంధాగ్రాహి అయినందున అనతికాలంలో ఉన్నత విద్యావంతుడయ్యాడు. తన పదహారవ యేట అన్నమయ్యకు శ్రీవేంకటేశ్వర దర్శనానుభూతి కలిగింది. అప్పటినుండి అన్నమయ్య అద్భుతమైన కీర్తనలను రచింపసాగాడు.  ఈ పాటరాసింది తెలుగువాగ్గేయకారుడు కలియుగదైవము వేంకటేశ్వరస్వామికి గొప్పభక్తుడు అయిన అన్నమయ్య .  అన్నమయ్య చాలాపాటలు రాసారు పాడారు .స్వామి వారికి మేలుకొలుపు అన్నమయ్య పాడినప్పుడు "మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల మేలుకోవె నా పాలి మించిన నిధానమా "  వంటి మేలుకోలుపు పాటలకు స్వామి వారు నిద్రలేసారు. మళ్ళీ రాత్రి జోల పాటలు అన్నమయ్య రాసిన"జో అచ్యుతానంద జోజో ముకుందా, రావె పరమానంనద , రామ గోవిందా జోజో జోజో"  అన్నపాటకు స్వామి వారు హాయిగా నిద్రపోతారు. అన్నమాచార్యలవారు అనేఅనేక వేలపాటలు రాసారు పాడారు. అయానపాటలవల్లే స్వామి వారికి అంతకీర్తికలిగిందా అనిపించేటట్టు వుంటాయి అన్నమయ్య పాటలు సామాన్యమానవులు కు అర్ధమైయ్యె టంత వీలు గా వుంటాయి. అన్నమయ్యపాటలు స్వామి వారికే కాదు అమ్మవారికి కూడాచాలా ఇష్టం  అమ్మవారిమీదకూడా చాలాపాటలు రాసారు. "క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం"  అన్నపాట అమ్మవారి నీరాజనం ఇచ్చుసమయమున పాడారు. అమ్మను చూసి   చక్కని తల్లికి చాంగుభళా అంటూ పాట చలా బాగుంటుంది.   అంతే కాకు తిరుతిరు జవరాల అన్న పాట,  వుయ్యాల పాటల, తుమ్మెద పాటలు , గొబ్బిళ్ళ పాటలు, జనపదాలు,  శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వుంన్నాయి. అన్నమయ్యరచనలు ఇంచుమించు ముప్పైరెండువేలు పాటలు వుంటాయి.  అన్నమయ్యకు పదకవితాపితామహుడు అన్నబిరుదు కలదు. అన్నమయ్య 32,000 సంకీర్తనలతో పాటు, సంస్క్రత వేంకటాచల మహాత్మ్యం, సంకీర్తనా లక్షణం, ద్విపద రామాయణం, 12 తెలుగు శతకాలు, శృంగార మంజరి, వంటి "నానా ప్రబంధములను" రచించినట్టు చిన్నన్న రచించిన ద్విపద వల్ల తెలుస్తుంది.  
పద కవితా పితామహుడు, శ్రీహరి గాన లోలుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు జయంతి శుభాకాంక్షలు .

0 comments:

Post a Comment

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers