Blogger Widgets

Monday, July 22, 2013

గురుపౌర్ణమి /వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు.

Monday, July 22, 2013


ఓం గురుబ్రహ్మ గురుర్విఘ్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరబ్రహ్మతస్మై శ్రీ గురవేనమః||

తాత్పర్యము: గురువు బ్రహ్మ, విష్ణు, శివ లక్షణములు కలవాడు. అట్టి సాక్షాత్‌ పరబ్రహ్మ స్వరూపుడైన గురుదేవులకు నమస్కరిస్తున్నాను.

ఈరోజు గురుపూర్ణిమ.   వ్యాసుని పుట్టిన దినమును మనము గురుపూర్ణిమగా జరుపుకుంటున్నాము.  ఈరోజు  గురువులను (Teachers) , పెద్దవారిని పూజించేరోజు.  గురుపూర్ణిమను వ్యాసుని పుట్టిన దినము రోజు జరుపుకుంటున్నాముకావున దీనిని వ్యాస పూర్ణమ అని కూడా అంటారు.  హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు.  శ్రీ మహావిష్ణువుని అవతారంగా వ్యసుని గురించి చెప్తారు.  ఈయన పేరు  కృష్ణద్వైపాయనుడు 

శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం
సూత్ర భాష్యకృతౌ వందే భగవంతౌపునః పునః 

వ్యాస పూర్ణిమ నాడు ఈ శ్లోకాన్ని పఠించాలి.అంతే కాదు,విష్ణావతారంగా భావించే వ్యాసుడ్ని పూజించి విష్ణుపురాణం దాన మివ్వడం మంచిదని పురాణాలు చెబుతున్నాయి. సోమకాసురుడు వేదాలను ఎత్తుకెళ్ళి సముద్రంలో దాచేసాడుట.అప్పుడు శ్రీ మహా విష్ణువు మత్స్యావతారం లో ఆ వేదాలను తిసుకు వచ్చాడు.అలా వచ్చిన వేదాలు అన్నీ ఒకదానితో ఒకటి కలిసి పోయి గజిబిజి గా ఉన్నాయట.అప్పుడు వ్యాస మహర్షి వాటిని విడదీసి విభజించి నాలుగు వేదాలుగా లోకానికి అందించాడని పురాణాలు చెబుతున్నాయి. వ్యాస పూర్ణిమ నాడు వ్యాసభగవానుడిని, గురు పరంపరనూ పూజించాలి.వేదాలను  నాలుగు బాగాలుగా చేసాడుకావునా ఈయనికి వేదవ్యాసుడని పేరు వచ్చింది.

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే|
నమో వై బ్రహ్మనిధ్యే వాసిష్ఠాయ నమోనమ:||

వ్యాస మహర్షి జన్మ తిధి అయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమ ను గురు పూర్ణిమగా జరుపుకుంటాం.లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మ తిధిని గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైంది. భారత భాగవతాలు,అష్టాదశ పురాణాలు,ఉప పురాణాలు అందించిన మహానుభావులు వ్యాస భగవానుడు.

నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే
పుల్లార విన్దాయత పత్రనేత్ర|
యేన త్వయా భారత తైలపూర్ణ:
ప్రజ్వాలిలో జ్ఞానమయ: ప్రదీప:||

విశాల బుద్ధిగల వ్యాస మహర్షీ! వికసించిన పద్మ దళముల వంటి నేత్రములుగల వాడా! మహాభారతమనే తైలముచే నింపబడిన జ్ఞానదీపము నీచే వెలిగించబడింది. అట్టి నీకు నా నమస్కారములు.
మనకు  మంచి చెప్పే ప్రతీవారు గురువులే.  ఈరోజు పెద్దవారి ఆశిర్వాధములు మనము తీసుకోవాలి.   ఈరోజు షిరిడి సాయిబాబాగారికి, దత్త్తాత్రయుని వారికి ప్రత్యేక దినముగా పూజిస్తారు.

పూర్వము నారదుడు వైశంపాయనుడికి "ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టత వివరించినట్లుగా బ్రహ్మండ పురాణంలోనూ "స్వధర్మసింధూ" అనే గ్రంధములోను వివంగా చెప్పబడి యున్నది. దీనిని బట్టి వ్యాసులవారి యొక్క జన్మ ఆషాఢ శుద్ధపాడ్యమి అని విదితమవుచున్నది.

ఇంకా గురువు తత్వాన్ని  దత్త్తాత్రయులవారు మనకు చాలా విషయాలలో చెప్తారు.  అందులో నాకు అర్ధం అయినవి మీకు చెప్తాను.  దత్త్తాత్రయులు వారు అన్నారు మనకు 24 మంది గురువులువున్నారు అని చెప్పారు.  మనకు వరసగా తన గురువులు గురించి చెప్పారు.   
మొదటి గురువు:  భూమి.  
రెండవ గురువు:  వాయువు
మూడవ గురువు: ఆకాశము 
నాల్గవ గురువు: అగ్ని 
ఐదవ గురువు:  సూర్యుడు 
ఆరవ గురువు:  పావురము
ఏడవ గురువు: కొండచిలువ 
ఎనిమిదవ గురువు: సముద్రము 
తొమ్మిదవ గురువు : మిడత 
పదవ గురువు: ఏనుగు 
పదకొండవ గురువు: చీమ 
పన్నెండవ గురువు: చేప 
పదమూదవ గురువు: పింగళ  అనే వెశ్య
పదునాల్గవ గురువు: శరకారుడు 
పదిహేనవ గురువు:  ఒక బాలుడు  
పదహారవ గురువు: చంద్రుడు 
పదహేడవ గురువు: తేనెటీగ 
పద్దెనిమిదవ గురువు: లేడి 
పంతొమ్మిదవ గురువు: గ్రద్ద 
ఇరవైవ గురువు: కన్య 
ఇరవైవోకటివ గురువు: సర్పము 
ఇరవై రెండవ గురువు: సాలెపురుగు 
ఇరవై మూడవ గురువు: భ్రమరకీటకము 
ఇరవై నాల్గవ గురువు: జలము 


ఇలా తనగురువులు గురుంచి చెప్పారు.  మనకు  ప్రతీజీవి ఒక గురవే అని చెప్పారు దత్తాత్రయులవారు.  వీటినుండి ఏమి నేర్చుకోవాలో తరువాత తెలుసుకుందాం.

ఈనాటి గురుపూర్ణిమ / వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు.

0 comments:

Post a Comment

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers