Blogger Widgets

Saturday, August 03, 2013

స్నేహానికన్న మిన్న

Saturday, August 03, 2013

స్నేహం అంటే చాలా గొప్పబంధం. అలాంటి బంధం గురించి వర్ణించటం ఎవరి తరంకాదు . దానికి హద్దులు , ఎల్లలు వుండవు. మనకు అతి దగ్గర సన్నితులు కేవలం స్నేహితులు మాత్రమే. ఆతరువాతె ఎవరైనా. ఆఖరికి మన అమ్మానాన్నలైనా సరె. స్నేహితులు తరువాత.
స్నేహం అద్భుతమైంది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. స్నేహానికి ఎల్లలు లేవు. అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది. వికాసానికి బాటలు వేస్తుంది. మంచి మిత్రుడు తోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యం ఉంటుంది. కన్నవారితో, కట్టుకున్నవారితో, తోడబుట్టిన వారితో చెప్పుకోలేని విషయాలను మిత్రులతో చెప్పుకోవడం మిత్రత్వం గొప్పదనం. కష్టసుఖాల్లో అండగా ఉండేవారు.. నిస్వార్థంగా సాయం అందించేవారు నిజమైన మిత్రులు.  స్నేహం ఓ మధురమైన అనుభూతి. దీనికి వయసుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలో స్నేహ భావం ఉంటుంది. అటువంటి స్నేహానుభూతిని అనుభవిస్తేనే తెలుస్తుంది. సృష్టిలో నా అనేవారు,బంధువులు లేని వారైన ఉంటారేమే గాని స్నేహితులు లేని వారుండరు. ఇంట్లో చెప్పలేని సమస్యలు, బాధలు సైతం వీరితో ఎటువంటి దాపరికం లేకుండా చెప్పుకొని ఓదార్పు పొందుతాం. అదే స్నేహం.  స్నేహితులతో కలిసి ఉంటే ఎంతో ఆనందం మనతోనే ఉంటుంది.
ప్రతిఏటా ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారం రోజున ప్రపంచమంతా 'ఫ్రెండ్‌షిప్‌ డే ' ను ఘనంగా నిర్వహించుకుంటారు.  ఇక్కడ ఒక మంచి పాట  స్నేహం గురించి. 
  
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా
కడదాకా నీడ లాగ నిను వీడి పోదురా
ఈ గుండెలో పుచేటిది నీ శ్వాసగా నిలిచేటిది
ఈ స్నేహమోకటేనురా ...

తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా...ఓ...
పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్నా
మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిధి రా
ఆ స్నేహామే నీ ఆస్థి రా నీ గౌరవం నిలిపేను రా
సందేహమే లేదు రా ...

త్యాగానికి అర్ధం స్నేహం లోభానికి లొంగదు నేస్తం...ఓ...
ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం
నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహము రా
ద్రువతార లా స్థిరమైనదీ...ఈ జగతిలో విలువైనదీ...
ఈ స్నేహమోకటేనురా ...

స్నేహం గురించి ప్రముఖులు ఏమన్నారో తెలుసుకుందాం.  వారి మాటలను దృష్టిలో పెట్టుకుందాం  మరి.  
Everyone need Friendship

 • స్నేహం పాతబడిన కొద్దీ బాగుంటుంది.- చింగ్‌చౌ
 • శత్రువు ఒక్కడైనా ఎక్కువే. మిత్రులు వంద అయినా తక్కువే - వివేకానందుడు
 • విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు - గౌతమబుద్ధుడు
 • మనిషికి అవసరంలో ఆదుకున్న మిత్రుడికన్నా ప్రియమైనది ఏదీ ఉండదు - గురునానక్
 • కష్టకాలంలోనే మిత్రుడెవరో తెలుస్తుంది - గాంధీ
 • అహంకారి కి మిత్రులుండరు - ఆస్కార్‌వైల్డ్
 • ఇచ్చింది మరిచిపోవడం, పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే స్నేహం - గాంధీ
 • ఎవరితోనైనా స్నేహం చేయడం సులభమే, కానీ ఎక్కువ కాలం నిలుపుకోగలగడమే కష్టం -కార్డినల్‌న్యూమాన్
 • చెడ్డ మిత్రుల కన్నా మిత్రుడు లేక పోవడమే నయం - మార్టిన్ లూథర్‌కింగ్
 • నీ తప్పును, నీ తెలివి తక్కువ పనులను నీ ముందుంచువాడే నిజమైన నీ స్నేహితుడు - బెంజిమన్ ఫ్రాక్లిన్
 • మనిషిని బట్టే అతని స్నేహితుడు ఉంటారు - స్వీడెన్ బర్గ్
 • మాటలకే పరిమితమయ్యే మిత్రుడెపుడు నీ మిత్రుడుగా ఉండలేడు - లియోటాల్‌స్టాయ్
 • మిత్రున్ని మించిన అద్దం లేదు మిత్రుడు లేకుండా ఏ మనిషి సర్వసంపూర్ణుడు కాలేడు - సెయింట్ బెర్నార్డ్ 
 • స్నేహం కన్నా గొప్పది ఈ లోకంలో లేదు - రెవన్థ్ ఛొవ్దరీ

ఇలా ఒక్కొక్కరు మంచి స్నేహితుని గురించి వర్ణించారు.      స్నేహాన్ని అభివర్ణించటం చాలా కష్టం .

ఈరోజు స్నేహితుల దినోత్సవమే కాకుండా ఈరోజుకు ఇంకో ప్రత్యేకత వుంది అది ఏమిటంటే  sister's day. అన్నదమ్ములు మంచి స్నేహితులుగా వుండవచ్చు వుండకపోవచ్చు.  అక్కచెల్లులు  మాత్రము మంచి స్నేహితులుగా వుంటారుట .  
సరే మరి ఈరోజు friendship day  మరియు sister's  day  శుభాకాంక్షలు.

0 comments:

Post a Comment

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers