Blogger Widgets

Friday, August 09, 2013

రంగుల ముగ్గులు ముంగిట నిలిచి రమ్మని పిలిచినవీ

Friday, August 09, 2013

శ్రావణమాసము సందర్భముగా అందులోను శుక్రవారము అందరి ఇళ్ళలోనూ పండగ వాతావరణము నెలకొన్నది.  శ్రీ మహాలక్ష్మి దేవిని ఆహ్వానము పలుకుతున్నారు.  మరి ఇక్కడ పాటలో మహా లక్ష్మి దేవిని ఎలా ఆహ్వానించలో వుంది వినండి మరి. శ్రావణ మాస మొదటి శుక్రవారము శుభాకాంక్షలు. 
రంగుల ముగ్గులు ముంగిట నిలిచి రమ్మని పిలిచినవీ
వాకిట నిలిచిన తోరణమాలలు స్వాగతమొసగినవీ

రంగుల ముగ్గులు ముంగిట నిలిచి రమ్మని పిలిచినవీ
వాకిట నిలిచిన తోరణ మాలలు స్వాగతమొసగినవీ
పావన శ్రావణమాసము వచ్చెను శ్రీ వరలక్ష్మి రావే
తరగని సిరులను నరులకు నొసగే కరుణామయి నీవే

శ్రీ వరలక్ష్మి రావే సిరిసంపదలీవే
శ్రీ వరలక్ష్మి రావే సిరిసంపదలీవే

శుక్రవారము శుభలగ్నమున వేకువనే విచ్చేసీ
ప్రతిఇంటిలోని పసుపు పీటపై పసిడికాంతితో నిలిచీ
అంగనలకు మాంగళ్యభాగ్యము అందించే శుభదాయనీ
సర్వాభిష్ట ప్రదాయనీ జనులకాచు జయకారిణీ

శ్రీ వరలక్ష్మి రావే సిరిసంపదలీవే
శ్రీ వరలక్ష్మి రావే సిరిసంపదలీవే

నోములునోచే కోమలాంగులకు కామితముల తీర్చీ
సౌభాగ్యమును సంతోషమును సమకూర్చి పాలించీ
పసుపుకుంకుమల పరీమళములు బ్రతుకున పండించీ
నొసటి బొట్టుకు నూరెళ్ళ ఆయువు ఒసగీదీవించీ

శ్రీ వరలక్ష్మి రావే సిరిసంపదలీవే
శ్రీ వరలక్ష్మి రావే సిరిసంపదలీవే

చెలులుకొలవగా సింహాసనమును కొలువుతీరినావా
వైకుంఠమును వదలివసుధకు వచ్చి బ్రోచినావా 
నాలుగుచేతులతో నానావిధముల సంపదలిచ్చేవా
వానకాలపు మబ్బులాగున వరములజల్లులకురిపేవా

శ్రీ వరలక్ష్మి రావే సిరిసంపదలీవే
శ్రీ వరలక్ష్మి రావే సిరిసంపదలీవే

రంగుల ముగ్గులు ముంగిట నిలిచి రమ్మనిపిలిచినవీ
వాకిట నిలిచిన తోరణమాలలు స్వాగతమొసగినవీ 
పావన శ్రావణమాసము వచ్చెను శ్రీ వరలక్ష్మి రావే
తరగని సిరులను నరులకునొసగే కరుణామయి నీవే

శ్రీ వరలక్ష్మి రావే సిరిసంపదలీవే
శ్రీ వరలక్ష్మి రావే సిరిసంపదలీవే

1 comment:

  1. AMONG THE FESTIVALS I LIKE VARALAKSHMI VRATHAM WHICH COMES IN SRAVANA MASAM.
    WISH YOU THE SAME.
    THANKS FOR PRENSENTING THIS SONG.

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers