Blogger Widgets

Saturday, October 12, 2013

అమ్మవారు దుర్గతినివారిణిగా

Saturday, October 12, 2013

ఈరోజు బాలా త్రిపురసుందరిగా కూడా పూజిస్తారు.  చిన్న చిన్న పిల్లలకు పూజలు చేయటం విశేషముగా కనిపిస్తుంది.
దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపంగా అమ్మవారు నవరాత్రుల్లో  అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో అమ్మ దుర్గముడనే రాక్షసుని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గారూపం మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవులను ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. అమ్మ నామాన్ని జపిస్తే సకల గ్రహ బాధలు తొలగిపోతాయి. ఆరాధకులకు దుర్గాదేవి శీఘ్ర అనుగ్రహకారిణి. ఎర్రని బట్టలు పెట్టి ఎర్ర అక్షతలు, ఎర్ర పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూక్తం పారాయణ చేయాలి. "ఓం దుం దుర్గాయైనమ:" అనే మంత్రం పఠించాలి. 

నవరాత్రులలోనవ దుర్గ లలో అమ్మ మహాగౌరి దేవిగా దర్శనము ఇస్తారు.  
సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్య్రంబికే గౌరి నారాయణి నమోస్తుతే;
అనగా అన్ని శుభములను ప్రసాదించే పరమేశ్వరుని సతీ. సకల కోర్కెలను తీర్చే తల్లి.. ముగురమ్మల మూలపుటమ్మ అయిన ఓ గౌరీదేవీ.. నిన్ను శరణు కోరి ప్రార్థిస్తున్నానమ్మా! ఈ స్తుతి చేస్తూ గౌరీదేవిని ప్రార్థించుట వలన సకల సౌభాగ్యాలు లభిస్తాయని భావిస్తారు. 

0 comments:

Post a Comment

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers