Blogger Widgets

సోమవారం, అక్టోబర్ 07, 2013

అమ్మవారు అన్నపూర్ణాదేవిగా

సోమవారం, అక్టోబర్ 07, 2013

దసరా నవరాత్రులలో అమ్మవారు మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా దర్శనము ఇస్తారు. నవదుర్గాలలో చంద్రఘంటాదేవి గా దర్శనము ఇస్తారు.

అన్నపూర్ణ దేవి : 

అన్నం పరబ్రహ్మ స్వరూపం. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అన్నపూర్ణ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆదిభిక్షువైన మహాశివునికి భిక్షపెట్టిన తల్లి అన్నపూర్ణ. ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్ధం ఈ అవతారికలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయశుభాలను అందిస్తుంది. 
అన్నపూర్ణను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్పూర్తి, వాక్శుద్ది, వాక్సిద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. భక్తుని సకలసంపూర్ణునిగా అనుగ్రహిస్తుంది ఈ తల్లి. బుద్ధి ఙ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణభక్తితో తనను కొలిచైన భక్తుల పోషణభారం ఈమె వహిస్తుందని అర్షవాక్యం.  
ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణగా అలంకరిమ్చి, తెల్లని పుష్పాలతో పూజ చెయ్యాలి. " హీం శ్రీం, క్లీం ఓం నమోభగత్యన్నపూర్ణేశి మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి. అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణ చెయ్యాలి.
అన్నపూర్ణ స్తోత్రం 

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాభఖిలఘోరపాపనికరీ ప్రత్యక్షమహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహారవిడంబమానవిలస ద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగురువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

కైలాసాచలకందరాలయకరీ గౌరీ హ్యుమా శాంకరీ
కౌమారీ నిగమార్థ గోచరకరీ హ్యోంకారబీజాక్షరీ
మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

దృశ్యాదృశ్యవిభూతిపావనకరీ బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ
శ్రీవిశ్వేశమనఃప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

ఆదిక్షాంతసమస్తవర్ణనికరీ శంభుప్రియా శాంకరీ
కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రిణయనీ విశ్వేశ్వరీ శ్రీధరీ
స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
నారీ నాలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సుందరీ
వామా స్వాదుపయోధరప్రియకరీ సౌభాగ్యమహేశ్వరీ
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

చంద్రార్కానలకోటికోటిసదృశా చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్నిసమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ
మాలాపుస్తకపాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

క్షత్రత్రాణకరీ సదా శివకరీ మాతా కృపాసాగరీ
సాక్షాన్మోక్షకరీ సదా శివకరీ విశ్వేశ్వర శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతి,
మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః
బాంధవ శ్శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్‌

ఇతిః శ్రీ అన్నపూర్ణాష్టకం సంపూర్ణమ్
చంద్రఘంటాదేవి
ఈ తల్లి తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుటచే ఈమెకు 'చంద్రఘంట' యను పేరు స్థిరపడెను. ఈమె శరీరము బంగారు కాంతి మయము. ఈమె తన పది చేతులలో ఖడ్గము మొదలగు శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించియుండును. ఈమె సింహ వాహన. ఈమె సర్వదా సన్నాహయై యుద్ధముద్రలోనుండును. ఈమె గంటనుండి వెలువడు భయంకరధ్వనులను విన్నంతనే క్రూరులై దైత్య దానవ రాక్షసులు ఎల్లప్పుడు వడగడలాడుచుందురు. కాని భక్తులకును, ఉపాసకులకును ఈమె మిక్కిలి సౌమ్యముగను, ప్రశాంతముగను కన్పట్టుచుండును.
ఈ దేవి ఆరాధన సద్యఃఫలదాయకము. భక్తుల కష్టములను ఈమె అతి శీఘ్రముగా నివారించుచుండును. ఈ సింహవాహనను ఉపాసించువారు సింహ సదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉందురు. ఏవిధమైన భయములును వారిని బాధింపజాలవు.
చంద్రఘంటాదేవి స్తుతి :
ఓం చంద్రఘంట చండి రక్షాకరో  
ఓం భయహరిని  మయ్య  రక్షాకరో
ఓం నవ దుర్గ నమః 
ఓం జగజనని నమః 

అమ్మవారికి దధ్యోదనము, కట్టెపొంగలి నివేదనం చెయ్యాలి.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)