Blogger Widgets

ఆదివారం, అక్టోబర్ 06, 2013

IPC (ఇండియన్ పీనల్ కోడ్) ఏర్పడి నేటికి 153 సంవత్సరాలు పూర్తి

ఆదివారం, అక్టోబర్ 06, 2013

IPC (ఇండియన్ పీనల్ కోడ్) ఏర్పడి నేటికి 153 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భముగా ఇండియన్ పీనల్ కోడ్ ఎలా ఏర్పడిందో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం.  చరిత్ర లోకి వెళ్ళాలి మరి అదితెలుసుకోవాలి అంటే  :)
ఇండియన్ పీనల్ కోడ్ (భారతీయ శిక్షాస్మృతి) 1860 - 6 అక్టోబర్ 1860 నాడు (1860 లో చేసిన 45 వ చట్టం) మొదలైంది. భారతీయ శిక్షాస్మృతి (Indian Penal Code: IPC) భారత ప్రభుత్వ ధర్మశాస్త్రం. భారతదేశంలో నేరాలు చేసిన వారికి దీనిని అనుసరించే శిక్ష వేస్తారు.  ఇండియన్ పీనల్ కోడ్ జమ్ము, కాశ్మీర్ లో కూడా అమలు లో ఉంది. కానీ, ఈ రాష్ట్రంలో ఇండియన్ పీనల్ కోడ్ అనరు. రన్‌బీర్ పీనల్ కోడ్ (ఆర్.పి.సి) అని పిలుస్తారు.  
ఇండియన్ పీనల్ కోడ్ మొట్ట మొదట 1860 నాటి ఆంగ్లేయుల వలస పాలనలో ఉన్నాయి. 1860 నాటి బ్రిటిష్ ఇండియా చేసిన చట్టం ద్వారా ఇండియన్ పీనల్ కోడ్ అమలులోకి వచ్చింది. మొట్టమొదటి ఇండియన్ పీనల్ కోడ్ rough గా 1860 లో, మొదటి లా కమిషన్ అజమాయిషి లో జరిగింది. మొదటి లా కమిషన్ ఛైర్మన్ లార్డ్ మెకాలే. ఇతడే భారత దేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు. మొదటి ఇండియన్ పీనల్ కోడ్ 1862 సంవత్సరంలో, అమలులోకి వచ్చింది. నాటినుంచి ప్రపంచంలోను, భారతీయ సమాజాలలోను, విద్య పరంగా, వైజ్ఞానికంగా, సముద్రాలలో, సముద్ర గర్భాలలో, రోదసీలోను, ప్రయాణ వాహనాలలోను,న్యాయపరంగా, వైద్యరంగంలోను, ఉద్యోగ రంగంలోను, బాంక్ లావాదేవీలు (ఏ.టి.ఎమ్), సెల్ ఫోన్లు, సైబర్ నేరాలు, కంప్యూటర్ రంగాలలో జరిగిన సమస్తమైన మార్పులను, మన భారతీయ శిక్షాస్మృతి అనేకమైన మార్పులు , చేర్పులకు గురి అవుతూ, నేటి రూపాన్ని పొందింది. 
గృహ హింస సెక్షన్ 498-ఎ ఒక ఉదాహరణ. మన భారతీయ శిక్షాస్మృతి లో 511 సెక్షన్లు ఉన్నాయి. వరకట్నం ఛట్టాలు మరో ఉదాహరణ. వరకట్న సమస్య, యూరప్, అమెరికా దేశాలలో లేదు కాబట్టి , వరకట్న చట్టాలు, శిక్షలు వారి శిక్షా స్మృతి లో లేవు.


లార్డ్ మెకాలే, నాటి ఫ్రెంచి పీనల్ కోడ్, లివింగ్‌స్టోన్స్ కోడ్ ఆఫ్ లూసియానా అనే రెండు ప్రామాణిక గ్రంధాలను ఆదర్శంగా తీసుకుని, మన ఇండియన్ పీనల్ కోడ్ 'rough' ని తయారుచేసాడు. భారతీయుల ప్రామాణిక గ్రంధాలైన మనుస్మృతిని, యాజ్ఞవల్క్య స్మృతిని , నాటి వైదిక పండితుల సలహా, సహాయం కూడా తీసుకున్నాడు. శిక్షల విషయంలో, ఆనాటి పెద్దలు, పండితులు, రాజులు అభిప్రాయాలను కూడా లెక్కలోకి తీసుకున్నాడు. లార్డ్ మెకాలే మహా మేధావి అయినా, తన అభిప్రాయాలకంటే, నాటి భారతదేశ మత, సాంఘిక , సామాజిక వ్యవస్థలకు, ఆఛార వ్యవహారాలకు విలువ ఇచ్చి, వారి అభిప్రాయాలను గౌరవించి, తన మేధస్స్తు తో 'ఇండియన్ పీనల్ కోడ్' rough ని తయారు చేశాడు. 
1860 నాటి ఇండియన్ పీనల్ కోడ్ rough, మూల రూపం, నేటికీ చెక్కు చెదరలేదు. దీనిమీద కొన్ని విమర్శలు ఉన్నప్పటీకీ, ఈ నాటికీ, న్యాయశాస్త్రంలో, దీనికి తిరుగు లేదు.  పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత, ఇండియన్ పీనల్ కోడ్ ని యధాతధంగా పాకిస్తాన్ తన దేశంలో అమలు చేసింది. దాని పేరు పాకిస్తాన్ పీనల్ కోడ్ (పి.పి.సి). బంగ్లాదేశ్కూడా బంగ్లాదేస్ పీనల్ కోడ్ పేరుతో అమలు చేసింది. బ్రిటిష్ వలస దేశాలైన, మియన్మార్ (నాటి బర్మా), శ్రీలంక (నాటి సిలోన్, మలేసియా, సింగపూర్, బ్రూనీ దేశాలు కూడా మన ఇండియన్ పీనల్ కోడ్ ని యధాతధంగా (మక్కికి, మక్కి) అమలు చేస్తున్నాయి.
లార్డ్ మెకాలే తయారుచేశిన 'rough' ని, నాటి ఛీఫ్ జస్టిస్ సర్ బార్నెస్ పీకాక్, కలకతా సుప్రీమ్ కోర్టు న్యాయాధిపతి (ఇతను నాటి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు కూడా) సునిశితంగా, సుదీర్ఘంగా, పరిశీలించి, పరీక్షించారడు. వారి పరిశీలన తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ 6 అక్టోబర్ 1860 నాడు చట్టసభ ఆమోదం పొందింది. దురదృష్టవశాత్తు,ఇండియన్ పీనల్ కోడ్ సృష్టికర్త లార్డ్ మెకాలే తన కృషి, చట్టమై , అమలు జరగటం ఛూడలేదు. కారణం మెకాలే 28 డిసెంబరు 1859 న, తన 59వ ఏట, మరణింఛాడు. ఇతను అవివాహితుడు.
ఇండియన్ పీనల్ కోడ్ 1837 లోనే నాటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ - కౌన్సిల్ కి నివేదించినా, 1860 సంవత్సరం వరకూ అది వెలుగు చూడలేదు. 1830 కి ముందు, భారత దేశంలో, 'ది ఇంగ్లీష్ క్రిమినల్ లా', అనేక చట్ట సవరణలతో, నాటి ప్రెసిడెన్సీ టౌన్ లలో (బొంబాయి, కలకత్తా, మద్రాసు అమలు జరిగేది.
ఈ ఇండియన్ పీనల్ కోడ్ ప్రపంచమే కుగ్రామంగా మారినా, జీవితం వేగవంతమైనా, సమాజాలు మారుతున్నా, ప్రపంచమే మారిపోతున్నా కూడా, 150 సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా, ఉన్నది అంటే, మెకాలే దూరదృష్టి. అతని మేధస్సు అనితర సాధ్యం. మరో పది దేశాలకు కూడా తన గ్రంధం ఆయా దేశాలకు వేదం, బైబిల్, ఖురాను,జెండ్ అవెస్తా అయ్యింది.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)