Blogger Widgets

శనివారం, నవంబర్ 16, 2013

మత్స్యావతారమూర్తి, కార్తీక వైకుంఠ చతుర్ధశి యొక్క ప్రాముఖ్యత

శనివారం, నవంబర్ 16, 2013

శుక్లపక్ష చతుర్దశి : వైకుంఠ చతుర్ధశి అని కూడా అంటారు.  ఈరోజు కు చాలా విశేషం వుంది .  హిందుమత పురాణ కధలలో విష్ణువు యొక్క మొదటి అవతారం మత్స్యావతారం కదా.  అది ఈ రోజునాడే మత్స్యంగా అవతరించాడని చెప్తారు.    ఈ అవతారం లో విష్ణువు రెండు పనులు చేసినట్లుగా పురాణ గాధ (1) ప్రళయకాలంలో జీవరాసులను నావలో జలనిధిని దాటించడం. (2) వేదాలను కాపాడడం.  

మత్స్యవతారాన్ని గురించి దాశరధి శతకము లోని కంచర్ల గోపన్న రాసిన మంచి పద్యం ఒకటి .


వారిచరావతారమున, వారిధిలో జొరబాఱి క్రోధ వి
స్తారగుడైన యా నిగమ తస్కరవీర నిశాచరేంద్రునిం
జేరి వధించి వేదముల చిక్క్డలించి విరించికిన్ మహా
దారత నిచ్చితీ వెగద దాశరథి కరుణాపయోనిధీ 

భావం : దసరధ పుత్రా! దయానిధీ! రామా! మత్స్యావతారమునందు వేదములనుదొంగలించుకుపోయిన రాక్షసవీరుడగు సోమకాసురుని పట్టుకొనుటకు కోపాతిసయమును పొంది సముద్రము లోపలకు అతివేగముగా ప్రవేసించి వానిని చంపి, వేదముల చిక్కులను తోలగునట్లు చేసి మహాఔదార్యముతో బ్రహ్మకు ఆ వేదములను తిరిగిచ్చిన మత్స్యావతారమూర్తివి నేవే.   
ఒకసారి ఒకానొక సమయం లో నారద మహాముని భూమిపై సంచరించిన తర్వాత వైకుంఠ ధామ్ చేరుకుంన్నాడు. విష్ణువు  నారద మహా ముని పర్యటన వెనుక వున్నకారణం అడిగారు.  నారదుడు సాధారణముగా  ప్రజలుకు  విష్ణువు యొక్క దీవెనలు ఎలా లభిస్తాయి అని అడుగగా.  విష్ణువు వైకుంఠ చతుర్ధశి రోజున అతనికి పూజించే వారికి దీవెనలు తప్పక  చేరుతాయి.  వారికి స్వర్గానికి దారి ఏర్పడుతుంది అని సమాధానమిచ్చారు.
విష్ణువు అప్పుడు జై-విజయ్ లకు వైకుంఠ చతుర్ధశి రోజున స్వర్గ ద్వారాలు తెరవమని కోరాడు. విష్ణు ఈ రోజు పూజించేవారు స్వర్గానికి వెళ్ళండి అని చెప్పారు.  
కార్తీక వైకుంఠ చతుర్ధశి యొక్క ప్రాముఖ్యత:
వైకుంఠవాసుడైన శ్రీమహావిష్ణువు ఈ దినం వైకుంఠంను వదిలి వారణాసి వెళ్ళి పరమశివుడిని పూజించినట్లు కథనం. ఈరోజు పరమశివుడు విష్ణువు ఒకటే అని గుర్తించిన రోజు.  విష్ణువు కాశీలో శివుని వేయి తామర పుష్పాలు తో పూజించుతున్నారు.  అప్పుడు శివుడు విష్ణువుని పరిక్షించాలి అనుకోని ఒక పువ్వును తగ్గించారు.  విష్ణువు 1000 పువ్వులు పూజ చేస్తూవుంటే అందులో ఒక  పువ్వు తగ్గుతుంది.  అప్పుడు విష్ణువు ఆ ఒక్క పువ్వు స్థానంలో ఏమి ఉంచాలా అని ఆలోచించి.  విష్ణువుని భక్తులు కమలనయనుడు అంటారు కదా అని ఆ పువ్వు స్థానంలో తన ఒక కంటిని అందించడానికి సిద్ధం అయ్యి. తన కంటిని తీసి శివుడుకు అర్పించారు.  అప్పుడు శివుడు ఆనందం తో విష్ణువు దగ్గరకు చేరి తను చాలా ప్రసన్నుడు అయ్యానని చెప్పి.  ఆ పరమేశ్వరుడు ఈ రోజున  విష్ణు కు సుదర్శన చక్రమును ఇచ్చాడు. ఈ రోజు, విష్ణువు మరియు శివుని ద్వారా  స్వర్గం యొక్క తలుపులు తెరవడం జరిగింది . ఈ రోజు ఉపవాసం వున్నవ్యక్తికి  స్వర్గంలో అతని స్థానాన్ని సుస్థిరంగా వుంటుంది. ఈనాడు శైవాలయాలకు వెళ్ళి దీపం వెలిగించవలెను. 
ఈరోజు నాడే భీష్మ పితమః  కు  కూడా ఈ రోజు శ్రీ కృష్ణుడు ఉపదేశించినట్లు చెప్తారు.

2 కామెంట్‌లు:

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)